హైపర్‌టెన్షన్ అర్థం ఏంటీ?
రక్తపోటు రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది:
- గుండె ద్వారా సరఫరా చేయబడే రక్తం మొత్తం.
- ధమనుల్లో రక్త ప్రవాహానికి ప్రతిఘటనలు ఏర్పడటం.
అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ రెండు ప్యారామీటర్స్‌లో లెక్కిస్తారు:
1. సిస్టాలిక్ ప్రెజర్: గుండె కొట్టుకున్నప్పుడు ధమనుల్లో ఒత్తిడి ద్వారా కొలవడం.
2. డయాస్టలిక్ ప్రెజర్: ప్రతీ హృదయ స్పందన మధ్య ధమనులపై ఒత్తిడిని కొలవడం.
అధిక రక్తపోటుతో ప్రమాదాలు
హైపర్‌టెన్షన్‌తో అనేక ప్రమాదాలు ఉంటాయి. వ్యక్తికీ వ్యక్తికి మధ్య ఇవి వేర్వేరుగా ఉంటాయి.
1. వయస్సు
సాధారణంగా 64 ఏళ్ల వయస్సు వరకు పురుషుల్లో హై బీపీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మహిళల్లో అయితే 65 ఏళ్లు పైబడ్డవారిలో ఎక్కువగా అధిక రక్తపోటు లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంది.
2. జాతి
ఆఫ్రికా ప్రాంత ప్రజల్లో అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది.
3. కుటుంబ చరిత్ర
అధిక రక్తపోటు ప్రధానంగా జన్యుపరమైనది.
4. స్థూలకాయం
అధిక బరువు ఉండటం కూడా అధిక రక్తపోటు రిస్కును పెంచుతుంది.
5. శారీరక శ్రమ లేకపోవడం
శారీరక శ్రమ లేని వ్యక్తుల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఫలితంగా వారికి అధిక రక్తపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
6. పొగాకు వినియోగం
తరచూ పొగ త్రాగేవారిలో హైపర్‌టెన్షన్ రిస్క్ ఎక్కువ.
7. హై సోడియం డైట్
ఎక్కువగా సోడియం(ఉప్పు) తీసుకోవడం కూడా బ్లడ్ ప్రెజర్ పెరగడానికి కారణం.
8. లో పొటాషియం డైట్
పొటాషియం సోడియంను బ్యాలెన్స్ చేస్తుంది. పొటాషియం సరిగ్గా తీసుకోకపోతే సోడియం బ్యాలెన్స్ కాదు. ఫలితంగా అకస్మాత్తుగా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
9. ఆల్కహాల్ వినియోగం
ఎక్కువగా మద్యం తాగేవారిలో హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశం ఉంది.
10. ఒత్తిడి
ఒత్తిడి స్థాయి అధికంగా ఉన్నవారిలో కూడా రక్తపోటు పెరుగుతుంది.
11. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు
స్లీప్ ఆప్నియా, కిడ్నీ జబ్బు లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో కూడా హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశం ఉంది.
అధిక రక్తపోటు నిర్ధారణ
అధిక రక్తపోటుకు చికిత్స హైపర్‌టెన్షన్ నిర్ధారణపై ఆధారపడి ఉంటుంది. సిస్టాలిక్, డయాస్టాలిక్ ప్రెజర్ ద్వారా మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ (mm Hg) నెంబర్లను తెలుసుకొని బ్లడ్ ప్రెజర్ రీడింగ్ లెక్కిస్తారు. 120/80 mm Hg లేదా అంతకన్నా తక్కువగా ఉంటే సాధారణ రీడింగ్‌గా పరిగణిస్తారు. చికిత్స ఈ కింది విధంగా ఉంటుంది:
- ఎలివేటెడ్ బ్లడ్ ప్రెజర్ లేదా సిస్టాలిక్ ప్రెజర్ 120 నుంచి 129 mm Hg ఉంటుంది. డయాస్టలిక్ 80 mm Hg కన్నా తక్కువగా ఉంటుంది.
- స్టేజ్ 1 హైపర్‌టెన్షన్ అంటే సిస్టాలిక్ రీడింగ్ 130 నుంచి 139 mm Hg మధ్య, డయాస్టలిక్ 80 నుంచి 89 mm Hg మధ్య ఉంటుంది.
- స్టేజ్ 2 హైపర్‌టెన్షన్ అంటే సిస్టాలిక్ ప్రెజర్ 140 mm Hg కన్నా ఎక్కువ, డయాస్టలిక్ 90 mm Hg కన్నా ఎక్కువగా ఉంటుంది.
అధిక రక్తపోటుకు కారణాలు
అధిక రక్తపోటు కారణాలు, లక్షణాలు పలు రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- వయస్సు: హైపర్‌టెన్షన్ రక్తనాళాల్లో ఫ్లెక్సిబిలిటీ కోల్పోవడం, ఇతర వయస్సు సంబంధిత కారణాల వల్ల అధిక రక్తపోటు లక్షణాలు కనిపిస్తాయి.
- జెండర్: హైపర్ టెన్షన్ సాధారణంగా 65 ఏళ్ల లోపు పురుషుల్లో, 60 ఏళ్లు దాటిన మహిళల్లో వస్తుంది.
- జాతి: ఆఫ్రికా ప్రాంతానికి చెందిన శ్వేతవర్ణ ప్రజల కన్నా లాటినోస్, ఏషియన్స్‌కు అధికరక్తపోటు తక్కువ.
- కిడ్నీ జబ్బు: కిడ్నీ జబ్బు ఎలక్ట్రోలైట్, ఫ్లూయిడ్ వాల్యూమ్స్‌పై ప్రభావం చూపి హైపర్‌టెన్షన్‌కు దారితీస్తుంది.
- మధుమేహం: మధుమేహం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
- హార్మోన్ పరిస్థితులు: థైరాయిడ్ లేదా అడ్రెనలైన్ హార్మోన్స్, వాటి హెచ్చుతగ్గుల వల్ల కూడా హైపర్‌టెన్షన్ వస్తుంది.
- స్లీప్ ఆప్నియా: దీనికి సరైన సంబంధం లేకపోయినా స్లీప్ ఆప్నియా కూడా హై బీపీ లక్షణాలకు కారణమని అంటుంటారు.
- మెడికేషన్: కార్టికాస్టెరాయిడ్స్ లేదా గర్భనిరోధక మాత్రలు కూడా హైపర్‌టెన్షన్‌కు కారణం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర థైరాయిడిటిస్: కారణాలు, లక్షణాలు & చికిత్సలు
హైపర్‌టెన్షన్ సంకేతాలు, లక్షణాలు
అధిక రక్తపోటు ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు:
- ముక్కు నుంచి రక్తం కారడం: ధమనులపై తీవ్రంగా ఒత్తిడి కలగడం వల్ల ఇలా జరుగుతుంది.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఎర్రబడ్డ రక్తనాళాల కారణంగా ఈ సమస్య వస్తుంది. అధిక రక్తపోటుకు ఇది సంకేతం.
- తీవ్రమైన తలనొప్పి: రక్త పోటు పెరిగి తలలోని కండరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ఫలితంగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది.
- అలసట: ఒక్కోసారి అధిక రక్తపోటు తీవ్రమైన అలసట, దిక్కుతోచని స్థితికి కారణం అవుతుంది.
- కంటిచూపు కోల్పోవడం: కొందరిలో అధిక రక్తపోటు కంటి చూపు కోల్పోవడానికి కారణం అవుతుంది.
- మూత్రంలో రక్తం: మూత్రంలో రక్తం కనిపించడం కూడా అధిక రక్తపోటు వల్లే.
- అసాధారణ హృదయ స్పందనలు: ధమనుల గోడలపై ఒత్తిడి కారణంగా హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
- ఛాతీలో కొట్టుకోవడం: ఛాతీ, మెడ, చెవుల్లో కొట్టుకున్నట్టు అనిపించినా అది రక్తపోటు వల్లే కావొచ్చు.
అధిక రక్తపోటు వల్ల సమస్యలు
హైపర్‌టెన్షన్‌ను నియంత్రించకపోతే పలు రకాల పరిస్థితులకు దారితీయవచ్చు:
- స్ట్రోక్
- హార్ట్ ఎటాక్
- రక్తనాళాలు ఉబ్బడం
- గుండె ఆగిపోవడం
- కిడ్నీలోని రక్తనాళాలు బలహీనపడటం
- మెటబాలిక్ సిండ్రోమ్
- దిక్కుతోచకపోవడం
- జ్ఞాపకశక్తి మందగించడం
రక్తపోటుకు చికిత్స
రక్తపోటును నివారించడం సాధ్యమే. రక్తపోటును నిర్ధారిస్తే, హైపర్‌టెన్షన్‌కు చికిత్స చేయడం చాలా సులువు.
- బరువు పెరగడం తగ్గించాలి: అధికంగా బరువుగా ఉండటం లేదా ఊబకాయంతో ఉండటం లేదా నడుము దగ్గర కొవ్వు ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
- తరచూ వ్యాయామం: రక్తపోటుతో బాధపడుతున్నట్టైతే ఇది తప్పనిసరి. రక్తపోటును నివారించడం కోసం ఇది ఉపయోగపడుతుంది.
- హైపర్‌టెన్షన్ డైట్ ఫాలో కావడం : పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో డైట్ రూపొందించుకోవడం.(Follow a diet rich in vegetables, fruits, and whole grains.)
- సోడియం తగ్గించడం: అధికంగా సోడియం తీసుకుంటే రక్తపోటుకు దారితీస్తుంది. అందుకే సోడియం తగ్గించుకోవాలి.
- ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయడం : హైపర్‌టెన్షన్ నియంత్రణలో ఆల్కహాల్ శతృవులాంటిది. ఆల్కహాల్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
- ధూమపానాన్ని ఆపెయ్యడం: ఆల్కహాల్ లాగానే పొగ తాగడం కూడా అన్ని రకాలుగా ప్రమాదకరం.
- మంచి నిద్ర : మంచిగా నిద్రపోవడం రక్తపోటును తగ్గిస్తుంది.
- ఒత్తిడి తగ్గించుకోవడం : మానసిక ఒత్తిడితో హైపర్‌టెన్షన్ పెరుగుతుంది.
- బీపీ మానిటర్ చేయడం : తరచూ ఇంట్లో లేదా వైద్యుల దగ్గర బీపీ చెక్ చేయిస్తూ ఉండాలి.
- సాయం పొందడం : ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం పొందాలి.