This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

పసిబిడ్డల ఎదుగుదల: పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశలు (గ్రోత్ స్పర్ట్స్) ఎప్పుడు వస్తాయి (Baby Growth: When do Growth Spurts Occur in Babies in Telugu) ?

Written by - Nayana MukkamalaLast updated: Dec 17, 2025
పసిబిడ్డల ఎదుగుదల: పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశలు (గ్రోత్ స్పర్ట్స్) ఎప్పుడు వస్తాయి (Baby Growth: When do Growth Spurts Occur in Babies in Telugu) ?
Likes1 Likes|
Read time7 min

ఏ కుటుంబంలోనైనా అప్పుడే పుట్టిన పసిబిడ్డ యొక్క రాక సంబరాలతో మనోహరంగా ఉంటుంది. ముద్దు చేయాలనిపించే పసిబిడ్డ చిరునవ్వు నుండి వాళ్ళు కేరింతలు కొట్టేటప్పుడు ఆడించే చిన్న చేతివేళ్లు ఇంకా కాలి వేళ్లని లాలించటం వరకూ, ఆశ్చర్యపడేందుకు టన్నుల కొద్దీ విషయాలు ఉన్నాయి. పసిపిల్లల యొక్క ఎదుగుదల కళ్ల ముందు ఎలా జరుగుతుందో గమనించడం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక పట్టని అందమైన చిన్న పిల్లల జుబ్బా బట్టల గురించి అయితే చెప్పనక్కర్లేదు. కానీ ఈ హఠాత్తు పెరుగుదల పసిపిల్లలలో ఎందుకు? అలాగే ఎప్పుడు సంభవిస్తుంది?

మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలు అర్ధరాత్రి వేళ ఎందుకు నిద్ర లేస్తారు?

పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశ (గ్రోత్ స్పర్ట్) అంటే ఏమిటి (What is a Growth Spurt in Telugu) ?

పసిపిల్లల గ్రోత్ స్పర్ట్స్ అంటే మీ బిడ్డ హఠాత్తుగా తన ఎదుగుదల సమయాన్ని తీవ్రతరం చేయడం. ఈ హఠాత్తు ఎదుగుదల దశలో, మీ బిడ్డ తరచుగా పాలు తాగటం, నిద్రపోవటంలో మార్పు అలాగే మరింత చికాకుపడే అవకాశాలు వంటి గుర్తులని కూడా చూపవచ్చు. ఈ సంకేతాలు చాలా మంది పసిపిల్లలలో ఎక్కువ కాలంపాటు కనిపిస్తే, మరికొంతమంది పిల్లలలో కొన్ని రోజులు లేదా ఒక వారం వరకు మాత్రమే ఉంటాయి.

ఈ హఠాత్తు ఎదుగుదల సమయం పసిబిడ్డ యొక్క మారుతున్న ఎత్తు, బరువుల వంటి వాటిని కూడా సూచించినప్పటికీ, మీ బిడ్డ యొక్క పూర్తి ఎదుగుదలని గమనించడం కూడా చాలా కీలకమని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పసిపిల్లల ఎదుగుదలలో మార్పులను ఛార్టు సహాయంతో పూర్తిగా గుర్తించవచ్చు. ఇది తల్లిదండ్రులకు రోజువారీ, వారానికి లేదా నెలవారీ చొప్పున అవసరాన్ని బట్టి వివిధ దశలను ట్రాక్ చేయడానికి అంటే మీ పిల్లల డాక్టరు ఎలా సూచిస్తే అలా గుర్తించడానికి వీలుగా రూపొందించబడింది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: 2 నెలల శిశువు పెరుగుదల, అభివృద్ధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశలు (గ్రోత్ స్పర్ట్స్) ఎప్పుడు వస్తాయి (When Do Growth Spurts Occur in Babies in Telugu)?

బేబీ గ్రోత్ స్పర్ట్స్ పసిపిల్లలందరిలో ఒకేసారి రావాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది పసిపిల్లల పెరుగుదల సాధారణంగా పుట్టిన మొదటి సంవత్సరంలోనే జరుగుతుంది. ఇది వివిధ దశలలో సంభవించవచ్చు. అలా తల్లిదండ్రులు ఈ మార్పులను వారాల నుండి నెలల వరకూ అనుభూతి చెందవచ్చు. పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశల యొక్క బిడ్డ అభివృద్ధి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1. 1 నుండి 3 వారాల వయస్సు (1 to 3 weeks of age)

2. 6 వారాలు (6 weeks)

3. 3 నెలలు (3 months)

4. 6 నెలలు (6 months)

5. 9 నెలలు (9 months)

ఈ ఛార్టు పిల్లలని బట్టి మారుతూ భిన్నంగా ఉండవచ్చు ఇంకా చాలా అంశాలు కూడా ఉండవచ్చు. అందువల్ల ఈ ఇచ్చిన వయస్సుల ప్రకారం, మీ పసిబిడ్డలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులుగా మీరు చింతించనవసరం లేదు. మీ బిడ్డ సరిగ్గా పాలు తాగుతున్నంతవరకూ, విసర్జన ఇంకా అవసరమైనంత నిద్రపోతున్నంతవరకూ అలాగే ఇవన్నీ డాక్టర్ సూచించిన విధంగా పసిపిల్లల ఎదుగుదల ట్రాకర్‌ని ఉపయోగించి సరిగ్గా ట్రాక్ చేస్తున్నంతవరకూ ఎటువంటి హాని ఉండదు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ గ్రోత్ ట్రాకర్ ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో టాప్ 5 కారణాలు

పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశల (గ్రోత్ స్పర్ట్స్) యొక్క సంకేతాలు ఏమిటి (What are the Signs of Baby Growth Spurts in Telugu) ?

ఈ సమయంలో పసిబిడ్డ ప్రవర్తనలో చాలా మార్పులను ఎదుర్కొంటుంది. బేబీ గ్రోత్ స్పర్ట్స్ సమయంలో సాధారణ లక్షణాలని తెలుసుకోవటం ద్వారా, తల్లిదండ్రులు ఈ ఎదుగుదల కాలాన్ని సులభంగా గుర్తించవచ్చు. వాటిలో కొన్ని కింద ఇవ్వబడ్డాయి:

1. తరచుగా తల్లిపాలు తాగటం(Frequent Feeding):

ఈ ఎదుగుదల సమయంలో పసిపిల్లలు చాలా తరచుగా పాలు తాగుతూ ఉంటారు. ప్రతి రెండు గంటల తర్వాత లేదా అంతకంటే ముందే పాలు కావాలని మొండితనం చేస్తారు. ఒకవేళ పాలివ్వకపోతే గంటల తరబడి ఏడుస్తారు. తరచుగా తల్లిపాలు పట్టడం వలన బిడ్డకి పెరుగుతున్న ఆకలి తీరడానికి మీలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే అవకాశాలు కూడా పెరుగుతాయని తల్లి తెలుసుకోవాలి. అందువల్ల మీ పసిబిడ్డ డాక్టరుకి బిడ్డ స్థితిపై అవగాహన కల్పించడానికి ఇంకా తల్లిదండ్రులుగా మీకు అవసరమైన సలహాలను అందించడానికి వారాలవారీగా పసిపిల్లల ఎదుగుదల ట్రాకర్‌తో నోట్ చేయడం చాలా ముఖ్యం.

2. నిద్రపోయే వ్యవధులలో మార్పులు (Change in Sleeping Patterns):

పసిపిల్లలు కూడా పెద్దవాళ్లలాగానే అర్ధరాత్రి చిరుతిళ్ళని ఇష్టపడతారు. ఎందుకంటే రోజంతా పాపం వారిని ఆకలి వేధిస్తుంది. ఇంకా అలా వారు పడుకునే దినచర్యకి అడ్డు కలుగుతుంది. అందువల్ల పసిపిల్లలు పడుకున్న నిమిషాల వ్యవధిలోనే తల్లిదండ్రులు వారి పెద్ద కేకలు లేదా ఏడుపుతో వెంటనే నిద్ర లేపబడతారు. ఈ సమయంలో పసిపిల్లలకి కావల్సినంత ఆహారం లేదా పాలు ఇవ్వడం అలాగే వారిని ఆకలితో వదిలేయకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ బిడ్డకి పాలు పట్టడం వలన త్వరగా నిద్రపోయే అవకాశం కూడా పెరుగుతుంది.

3. చిరాకు పెరగటం(Growing Fussiness):

పసిపిల్లలకి ఈ సమయంలో తరచుగా ఆకలి ఉంటుంది కాబట్టి.. ముఖ్యంగా పాలుపట్టనప్పుడు బిడ్డ గజిబిజిగా మారడం సహజం. పాలు పట్టేటప్పుడు కూడా తల్లులు తమ బిడ్డ చికాకుగా ఉండటాన్ని గమనించవచ్చు. పాలు తక్కువ ఉత్పత్తి అయినప్పుడు అలాగే బిడ్డకి తాగడానికి తగినంత పాలు లభించనప్పుడు కొంతమందిలో ఇది జరుగుతుంది. కాబట్టి పాల ఉత్పత్తిని పెంచడానికి బిడ్డకి తరచుగా పాలివ్వడం చాలా అవసరం. ఎందుకంటే బిడ్డకి ఎంత ఎక్కువ పాలు ఇస్తే, తల్లి అంత ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుంది.

చివరిమాట (Conclusion)

బిడ్డ ఇలా హఠాత్తుగా వేగంగా ఎదిగే దశలలో, తల్లికి తను జీవితంలో రోజూ చేస్తున్నదంతా బిడ్డకు పాలు ఇవ్వడమేనని భావించవచ్చు. ఈ అనుభూతి చాలా కారణాల వల్ల ఎక్కువ అన్పిస్తూ ఉండవచ్చు. కానీ చింతించాల్సిన పని లేదు. పసిపాప అలాగే పసిబాబులకి చెందిన ఎదుగుదల ఛార్టులుగా అందుబాటులో ఉన్న పసిపిల్లల ఎదుగుదల ట్రాకర్‌లను ఉపయోగించడం అనేది పిల్లల అభివృద్ధిని ట్రాక్ చేయడంలో అలా తల్లిదండ్రులుగా అనవసరంగా కంగారుపడటం మానేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పసిపిల్లల కోసం గ్రోత్ ఛార్టుని ఉపయోగిస్తున్నప్పుడు, డబ్యూహెచ్ఓ వంటి ప్రామాణికమైన వెబ్‌సైట్లు సూచించే ఛార్టులనే ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ అసలైన ఛార్టులు పసిపాప అలాగే పసిబాబు ఇద్దరికీ సంబంధించి ఖచ్చితమైన ఫలితాలను పొందడానికి తల్లిదండ్రులకు సాయం చేస్తాయి. గుర్తుంచుకోండి.. బాబు, పాపల ఇద్దరికీ చెందిన పర్సంటైళ్ళలో తేడాలు వస్తాయి. అందుకని, ఎదుగుదల ఛార్టులు పసిపాపకి, పసిబాబుకి వేర్వేరుగా వస్తాయి.

మరిన్ని ఆసక్తికరమైన అంశాలపై ఆర్టికల్స్ చదవటానికి, అలాగే వైవిధ్యభరితమైన పసిపిల్లల సంరక్షణా ఉత్పత్తులని కొనడానికి www.mylofamily.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

TAGS :

Baby growth in telugu, When does a child's growth spurt in telugu,symptoms of baby growth spurt in telugu, Baby Growth: When do growth spurts occur in babies In English, Baby Growth: When do growth spurts occur in babies In Hindi, Baby Growth: When do growth spurts occur in babies In Tamil, Baby Growth: When do growth spurts occur in babies In Bengali

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.