This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ యొక్క మొదటి 3 నెలల్లో సెక్స్‌ గురించి అవగాహన (Awareness about sex during first 3 months of pregnancy in telugu)

Sex Life
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రెగ్నెన్సీ యొక్క మొదటి 3 నెలల్లో సెక్స్‌ గురించి అవగాహన  (Awareness about sex during first 3 months of pregnancy in telugu)
Likes38 Likes|
Read time7 min

పరిచయం (Introduction)

భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలు, ఆత్మీయతను పెంచే సంపూర్ణ ఆరోగ్యకరమైన ఇంకా సహజమైన చర్యే సెక్స్‌తో ఒక్కటవ్వడం. దంపతులు తమకు సంతానం కావాలనుకున్నప్పుడు, వారు శారీరకంగా సన్నిహితంగా ఉండటమే కాక సెక్స్‌లో పాల్గొవడం కూడా అవసరం. కానీ స్త్రీలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెక్స్ చేయవచ్చా? తొలిసారి ప్రెగ్నెంట్ అయితే లేదా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నట్లయితే, మీ మనసు సందేహాలతో సతమతమౌతుంది - ప్రెగ్నెంట్ అయిన మొదటి 3 నెలల్లో సెక్స్‌లో పాల్గొనడం మంచిదా కాదా అని? చాలామంది స్త్రీలకు ప్రెగ్నెన్సీలో సమస్యలేవీ తలెత్తకపోతే, ఈ సందేహానికి సమాధానం అవును అని చెప్పొచ్చు. మొదటి త్రైమాసికంలోనే కాకుండా మిగిలిన రెండు త్రైమాసికాల్లో మీ ప్రసవం వరకు కూడా సెక్స్‌లో పాల్గొనడం సురక్షితమే. అయితే క్రమం తప్పకుండా మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం కూడా మంచిదే.

ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొనడం సురక్షితమేనా? (Can we have sex during pregnancy in telugu)

చాలా సందర్భాలలో కొత్తగా తల్లిదండ్రులు కాబోతున్న వారు గర్భధారణ సమయంలో ప్రెగ్నెన్సీకి ప్రమాదం అయ్యే అవకాశముంటే లేదా మీ డాక్టరు వద్దని సలహా ఇస్తే తప్ప, సెక్స్ పరమైన సందేహాలు అడిగేందుకు కాస్త జంకుతారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొవడం సురక్షితమే. సెక్స్ వల్ల మీకు గానీ మీ బిడ్డకు గానత ఎలాంటి హాని కలగదు. గర్భాశయంలోని అమ్నియోటిక్ ద్రవం సెక్స్ సమయంలో శిశువుకు హాని జరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మ్యూకస్ ప్లగ్ శిశువుకు రక్షణ కల్పిస్తుంది. ఇది మీ గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారి నుండి మీ బిడ్డని కాపాడుతుంది.

ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మొదటిమూడు నెలలలో సెక్స్‌లో పాల్గొనడం సురక్షితమేనా? (Is it safe to have sex during first 3 months of pregnancy in telugu)

గర్భం దాల్చిన మొదటి త్రైమాసికం లేదా మొదటి మూడు నెలలు చాలా కీలకమైనవి. కాబట్టి ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం సురక్షితమో కాదో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది కొత్తగా ప్రెగ్నెంట్ అయిన మహిళలు ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారు, ఎందుకంటే వారు తరచుగా రకరకాల చిరాకులతో ఉండవచ్చు. వికారంగా అనిపించడం అనేది సర్వసాధారణం అయినా వాస్తవానికి మొదటి త్రైమాసికంలో మూడొంతులమంది కంటే ఎక్కువ మహిళలు మార్నింగ్ సిక్నెస్ సమస్యను చవిచూస్తుంటారు. గర్భధారణ హార్మోన్ HCG యొక్క రియాక్షన్ వల్ల ఇలా జరుగుతుంది. అయితే, మార్నింగ్ సిక్‌నెస్ వల్ల ప్రెగ్నెంట్ అయిన మొదటి కొన్ని వారాలలో మీకు నిస్సత్తువగా ఉన్నట్లు అనిపిస్తే, మీరు సెక్స్‌కి దూరంగా ఉండవచ్చు. మీకు మళ్లీ మామూలుగా అనిపించడం మొదలైన తర్వాత (మార్నింగ్ సిక్‌నెస్ 12 నుండి 14వ వారంలోగా కోలుకుంటారు) లేదా మీకు ముందులాగా సెక్స్ పట్ల ఆసక్తి కలిగితే మాత్రమే మీరు అందుకు ప్రయత్నిచాలి. సూటిగా చెప్పాలంటే, ప్రెగ్నెంట్‌గా ఉన్న మొదటి మూడు నెలలే కాదు ప్రసవం అయ్యే వరకు సెక్స్‌లో పాల్గొనడం సురక్షితం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలోని మొదటి మూడు నెలలలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవడం

ప్రెగ్నెన్సీ కాలంలో సెక్స్ ఎప్పుడు సురక్షితం కాదు? (When sex is not safe during pregnancy in telugu)

మీ డాక్టరు మీ ప్రెగ్నెన్సీకి ప్రమాదకరం అని మీకు సలహా ఇస్తే తప్ప ప్రెగ్నెన్సీ కాలంలో సెక్స్ సురక్షితమే.

గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో, అంతేకాక మిగిలిన ప్రెగ్నెన్సీ దశలలో కూడా సెక్స్‌కు దూరంగా ఉండవలసిన కొన్ని ప్రత్యేక పరిస్థితులు క్రింద ఇవ్వబడ్డాయి –

  • మీకు గతంలో గర్భస్రావం జరిగినటువంటి దాఖలా ఉన్నప్పుడు.
  • మీరు కవలలు లేదా ముగ్గురు, అంతకుమించి ఎక్కువ పిల్లలతో గర్భవతిగా ఉన్నప్పుడు.
  • గతంలో నెలలు నిండకుండానే ప్రసవం జరిగినట్లయితే
  • ప్రస్తుత ప్రెగ్నెన్సీ సమయంలో మీకు ముందస్తు ప్రసవం జరగవచ్చని అనిపించినప్పుడు
  • మీకు యోని గుండా రక్తస్రావం లేదా అధిక స్రావాలు ఉన్నప్పుడు
  • డాక్టర్ మీ గర్భాశయ ముఖ ద్వారం వదులుగా ఉండటం, ప్లాసెంటా ప్రెవియా లేదా తక్కువ-స్థాయి మాయ ఉన్నట్లు చెబితే.
  • మాయ పగిలి ఉమ్మనీరు బయటపడినపుడు.
  • ఏవైనా లైంగిక వ్యాధులు మీకుగాని లేదా మీ భాగస్వామికి గానీ సోకినట్లయితే.

దయచేసి గమనించండి: ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలలో సెక్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, అది యోని ద్వారా జరిపే సెక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నామని మనకు తెలుసు. గర్భధారణ సమయంలో యానల్ సెక్స్ కి ప్రయత్నంచడం సరైనది కాదు. మొదటి మూడునెలల ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు

మొదటి త్రైమాసికంలో గర్భధారణ ప్రయోజనాలను తెలుసుకొనేందుకు మనం కాస్త లోతుగా పరిశీలన చేద్దాం (Pregnancy benefits during first trimister of pregnancy)

మొదటి త్రైమాసికంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల, మీరు ఆనిర్వచనీయ ఆనందంతోపాటు మరిన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు:

● సున్నితత్వం (సూక్ష్మగ్రాహ్యత) పెంపొందడం (Sensitivity)

యోనిభాగంలో రక్త ప్రసరణ పెరగడం వల్ల మొదటి త్రైమాసికంలో జరిపిన సెక్స్ అనుభూతి గతంలో కంటే బాగున్నట్లు అనిపిస్తుంది.

● చురుకుగా ఉండటం (Being Active)

లైంగిక ప్రక్రియ కొన్ని క్యాలరీలను కరిగిస్తుంది. ఇది మీరు మరింత చురుకుగా ఉండేందుకు ఇంకా ఆ సమయంలో ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది.

● చక్కని భావప్రాప్తి (Orgasm)

గర్భధారణ సమయంలో యోని ప్రాంతంలో రక్త ప్రసరణ పెరిగిన అనుభూతి మీకు కలుగుతుంది. అందువల్ల మీరు ఈ సమయంలో మెరుగైన భావప్రాప్తి పొందే అవకాశాలే ఎక్కువ.

● మంచి నిద్ర (Good Sleep)

ప్రెగ్నెన్సీ ఇంకా నిద్ర రెండూ భిన్నవైనవని మనకు తెలుసు. అయితే సెక్స్ తర్వాత వచ్చే ప్రశాంతత మీకు ఇంకా మీ భాగస్వామికి మంచి నిద్రకు దారితీస్తుంది.

● మరిన్ని మనసుకు హాయినిచ్చే హార్మోన్లు (Hormones releasing)

భావప్రాప్తి సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ కారణంగా, మీరు సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్న అనుభూతి చెందుతారు. అందువల్ల మీరు హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు.

మొదటి మూడునెలల ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ కోసం టిప్స్ (Tips for first trimester pregnancy sex in telugu)

ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో లైంగిక సంతృప్తి కోసం ఇక్కడ కొన్ని ఆచరించదగ్గ సూచనలు ఉన్నాయి:

సెక్స్ పొజిషనింగ్ (Sex position)

సెక్స్‌పై ఆసక్తి ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో కొందరికి చాలా ఉత్సాహంగా అనిపిస్తే, మరికొందరికి ప్రెగ్నెన్సీ వల్ల శరీరంలో వచ్చిన మార్పులతో అసౌకర్యంగా అనిపించవచ్చు. గర్భధారణ ప్రారంభంలో అనువైన సెక్స్ పొజిషన్– ఆమె వెనుక పక్కవైపు తన భాగస్వామి ఉండేలా పడుకోవడం

  • ఆమె పై వైపు ఉండే పొజిషన్
  • ఆమె భాగస్వామి ఒడిలో కూర్చుని ఉండే పొజిషన్
  • భాగస్వామి వెనుక ఉన్నప్పుడు ఆమె చేతులు మరియు మోకాళ్లపై ఉన్న పొజిషన్

లూబ్రికేషన్ (Lubrication)

  • లూబ్రికేటెడ్ కండోమ్
  • నీటిలో కరిగే లూబ్రికేంట్ జెల్లీ
  • బేబి ఆయిల్ లేదా వ్యాసలిన్ వాడకండి

ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌కి ప్రత్యామ్నాయాలు (Sex alternatives for Pregnancy in telugu)

మీ భాగస్వామిని ప్రేమించేందుకు, వారి పట్ల మీప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రతిసారి సెక్స్ రూపేణా తెలియ చెప్పాలని అనుకోవద్దు. మీరు మీ ప్రెగ్నెన్సీ సమయంలో ఇరువురి మధ్య సాన్నిహిత్యం కోల్పోకుండా ఈ ప్రత్యామ్నాయాలను కూడా ప్రయత్నించవచ్చు.

  • కౌగిలించుకోవడం
  • ముద్దులు పెట్టుకోవడం
  • బాడీ మసాజ్
  • ఓరల్ సెక్స్
  • పరస్పర హస్త ప్రయోగం

గుర్తుంచుకోవాల్సిన ప్రధానాంశాలు (Remember these things)

సూటిగా చెప్పాలంటే, మీ డాక్టరుగారు సలహా ఇస్తే తప్ప, మీ ప్రెగ్నెన్సీ మొదటి వారంలో అయిన లేదా ప్రెగ్నెన్సీతో ఉన్న మొదటి 2 నెలల వరకు సెక్స్‌లో పాల్గొనవచ్చు. మీ శరీరం ఇంకా మనస్సుపై శ్రద్ధ చూపండి. అవసరమైనప్పుడు సరిచేసుకుంటూ ఆ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించండి.

Tags

Sex during pregnancy in telugu, sex during first 3 months of pregnancy in telugu, sex during first trimister in telugu, sex life during pregnancy in telugu, can we have sex during pregnancy in telugu, is sex safe during pregnancy in telugu.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.