Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Care for Baby
18 September 2023 న నవీకరించబడింది
కొత్తగా తల్లిగా మారడం.. కొన్ని సార్లు చాలా ఆనందంగా ఉంటుంది. శిశువుకు నాలుగు నెలల సమయం వచ్చిన తర్వాత శిశువు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. అయితే మీరు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను ఎలా చేర్చాలో తెలుసుకునేందుకు ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ సమయంలో 1 ఇయర్ బేబీ ఫుడ్ చార్ట్ గొప్పగా సహాయం చేస్తుంది. అంతే కాకుండా మీరు క్రమంగా ఎలా కొత్త ఆహార పదార్థాలను చేర్చాలో నేర్చుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది.
మీ బిడ్డకు తల్లిపాలు ఇస్తున్నందున వారు తమ తల్లిపాల నుంచి అనేక పోషకాలను పొందుతున్నారు. కావున తల్లి తప్పనిసరిగా పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో 3 నెలల బేబీ ఫుడ్ చార్ట్‌ను మాత్రమే అనుసరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆరు నెలల వరకు బేబీకి తల్లిపాలు మాత్రమే పట్టాలని వైద్యులు సూచిస్తారు. అయితే వైద్యుడిని సంప్రదించి ఈ సమయంలో మీ శిశువు ఆహారంలో కొత్త పదార్థాలను చేర్చవచ్చు. ఉదాహరణకు మీరు యాపిల్స్, అవకాడోలు, అరటిపండ్ల వంటి కొన్ని పండ్లను చేర్చొచ్చు. అంతే కాకుండా మీరు మీ బిడ్డకు పచ్చి బఠానీలు, స్వీట్ పొటాటో (చిలగడ దుంపలు) వంటి కొన్ని కూరగాయలను కూడా ప్రయత్నించవచ్చు.
మీ శిశువుకు 4 నుంచి 6 నెలల సమయం ఉన్నపుడు ఎటువంటి మాంసాహారం ఇవ్వకూడదని తెలుసుకోండి. మీ బిడ్డకు ఇప్పటికీ తల్లిపాలు ఇస్తున్నందున మీరు వీలైనంత వరకు దగ్గర్లోనే డైరీ ప్రొడక్ట్స్ ఉంచండి. బార్లీ, ఓట్స్, బియ్యం ట్రై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు 4 నెలల బేబీ ఫుడ్ చార్ట్ ను ఫాలో కావడం మంచిది.
మీ బిడ్డ ఈ స్టేజ్‌లో ఉన్నట్లయితే మీరు వేరే విధానాన్ని అవలంభించాల్సి ఉంటుంది. మీరు మామిడి పండ్లు, పీచెస్, వంటి ఆహారపదార్థాలను కూడా చేర్చొచ్చు. మీరు క్యారెట్లు, కీరాను పోలి ఉండే జుచినీ గుజ్జు, పచ్చి బఠానీ కూరగాయలు ఇవ్వొచ్చు. 6 నెలల బేబీ ఫుడ్ చార్ట్ మీకు అవసరమైన అదనపు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
ఈ దశలో మీరు టర్కీ, చికెన్ వంటి మాంసాహార పదార్థాలను తినిపించడం మొదలుపెట్టొచ్చు. అంతే కాకుండా మీ బేబీకి డైరీ ఉత్పత్తులను కూడా అందించొచ్చు. అయితే ఈ ప్రయాణంలో మీ బిడ్డ అనేక రకాల ఆహారాలను తినే అవకాశం ఉంటుంది. అందువల్ల బిడ్డకు కొత్త ఆహారపదార్థాలను నెమ్మదిగా అలవాటు చేయడం ముఖ్యం.
ఈ దశలో మీరు మీ బేబీ డైట్‌లో అన్ని రకాల పండ్లను చేర్చవచ్చు. కొబ్బరికాయలు, కాన్బెర్రీస్, ఫిగ్స్, ద్రాక్షపండ్ల వంటి పండ్లు సహా అన్ని రకాలనూ చేర్చవచ్చు. మీరు ఆస్పరాగస్, పెప్పర్, కాలిఫ్లవర్ వంటి కూరగాయలను కూడా డైట్‌లో చేర్చవచ్చు.
మీ శిశువు ఆహారంలో అనేక రకాల ధాన్యాలను కూడా ఇవ్వొచ్చు. ఫ్లాక్స్, పాస్తా, క్వినోవా వంటి వాటిని అందించొచ్చు. మీ పిల్లలకు జున్నుతో పాటుగా ఇతర పాల వస్తువులను అందించడం కూడా ప్రారంభించొచ్చు.
మీ బిడ్డ ఈ దశలో ఉన్నపుడు మీరు మీ పిల్లలకు కొన్ని రకాలైన పప్పులు, సూప్ ఇచ్చేందుకు ట్రై చేయొచ్చు. అంతే కాకుండా మొక్కజొన్న, పాల కూర, టొమాటో కూడా ట్రై చేయొచ్చు. అంతకుముందు నెలతో పోలిస్తే ఈ వయసులో మీ పిల్లలు ఎక్కువ రకాల ఆహారాలను తినొచ్చు. ఈ దశలో మీకు 11 నెలల బేబీ ఫుడ్ చార్ట్ చాలా ప్రయోజనకంగా ఉంటుంది.
మీ బిడ్డకు ఇప్పటికే ఒక సంవత్సరం వయస్సు వచ్చింది కాబట్టి ఈ దశలో మీ బిడ్డకు ఆవుపాలను తాగించడం ప్రారంభించొచ్చు. అంతే కాకుండా మీరు మీ పిల్లలకు నారింజ, మాండరిన్ వంటి సిట్రస్ పండ్లను కూడా తినిపించవచ్చు. మీ బిడ్డకు సంవత్సరం వయసు వచ్చింది కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం ఏదైనా తినొచ్చు. ఏదేమైనా ఈ వయసులో మీ బిడ్డ తీయదనం కోరుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తరచూ వాటి జోలికి వెళ్లకుండా చూసుకోవాలి.
మీ పిల్లలకు తీపి తినాలన్న కోరిక తీర్చేందుకు మామిడి పండ్లు, ఇతర తీపి పండ్లను తినిపించవచ్చు. చాక్లెట్లు, లాలీపాప్స్కు త్వరగా అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నందున ఈ వయసులో తగిన జాగ్రత్త తీసుకోవాలి.
పెరుగుతున్న శిశువు కడుపు కణజాలం చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే అవి ఇంకా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందువల్ల ఇప్పుడే మీరు మీ బేబీ డైట్‌కు అనేక ఆహారపదార్థాలను చేర్చినట్లయితే మీ బిడ్డ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా మీ బిడ్డకు అన్ని రకాల పోషకాలను అందించేందుకు కొత్త ఆహార పదార్థాలను ఇవ్వడాన్ని నెమ్మదిగా ప్రారంభించడం చాలా అవసరం.
మీ బిడ్డ మొదటి సంవత్సరంలో తీసుకునే ఆహార పదార్థాలు మీ బిడ్డ పోషకాహార అవసరాలను తీరుస్తాయి. అంతే కాకుండా ఇప్పటికీ తల్లిపాలు తాగుతున్న శిశువులకు రోజుకు ఎనిమిది నుంచి పది సార్లు ఆహారం ఇవ్వవలసి ఉంటుంది. ఫార్ములా ఫీడింగ్ (డబ్బా పాలు తాగించే శిశువులకు) రోజుకు 6 నుంచి 10 సార్లు తినిపించాలి.
మీ పిల్లల ప్రారంభ వయసులో వారి అభివృద్ధి, పెరుగుదలకు పోషకాహారాలు చాలా అవసరం. చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రారంభించడం వల్ల జీవితంలో గొప్ప ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. తినడం అనేది మీ శిశువు వయస్సు, మెచ్యురిటీ, తినగలిగే సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది.
పిల్లలు ఆకలిగా ఉంటే చెప్పగలరు. కావున మీ బిడ్డ తినేందుకు సిద్ధంగా ఉన్నపుడు తినిపించండి. తల్లి పాలు తాగే పిల్లలకు రోజు 8 నుంచి 12 సార్లు పాలివ్వండి. ప్రతి నిపుల్ (చనుమొన) నుంచి 10 నిమిషాల పాటు పాలను తాగనివ్వండి. మీ బిడ్డకు తినిపించేటపుడు బేబీ ఫుడ్ చార్ట్‌కు కట్టుబడి ఉండండి.
ఫార్ములా ఫెడ్ (డబ్బా పాలు తాగిన) శిశువులకు రాత్రితో కలుపుకుని రోజులో 6 నుంచి 10 సార్లు ఆహారం అందించాలి. ఎక్కువగా ఆహారం తినిపించడం అనేది మీ బిడ్డ రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడదు. ఇది మీ బిడ్డ బరువు పెరగడానికి, కీలకమైన పోషకాలను తీసుకోవడం తగ్గించేందుకు కారణమవుతుంది. అంతే కాకుండా ఇది పొటెన్షియల్ చోకింగ్ (ఉక్కిరిబిక్కిరవ్వడం) వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.
మీ శిశువు ఘన పదార్థాలు తీసుకోవడం ప్రారంభించినపుడు తక్కువగా తాగుతుంది. తల్లిపాల స్థాయిలను తగ్గించేటపుడు మీరు తినిపించే ఆహార పదార్థాల పరిమాణాన్ని పెంచండి. ఆహారాలను బాటిల్‌తో కాకుండా స్పూన్‌తో అందజేయాలని గుర్తుంచుకోండి.
1. NHS. Introducing your baby to solids. www.hct.nhs.uk
2. Kathryn G Dewey, TusaRebecca Pannucci, Kellie O Casavale. (2021). Development of Food Pattern Recommendations for Infants and Toddlers 6–24 Months of Age to Support the Dietary Guidelines for Americans, 2020–2025, The Journal of Nutrition. academic.oup.com
3. Abeshu MA, Lelisa A, Geleta B. (2016). Complementary Feeding: Review of Recommendations, Feeding Practices, and Adequacy of Homemade Complementary Food Preparations in Developing Countries - Lessons from Ethiopia. NCBI
4. Amezdroz E, Carpenter L, O'Callaghan E, Johnson S, Waters E. (2015). Transition from milks to the introduction of solid foods across the first 2 years of life: findings from an Australian birth cohort study. NCBI
How To Gradually Incorporate New Food Items Into Your Baby’s Diet in Bengali, How To Gradually Incorporate New Food Items Into Your Baby’s Diet in English, How To Gradually Incorporate New Food Items Into Your Baby’s Diet in Tamil, How To Gradually Incorporate New Food Items Into Your Baby’s Diet in hindi
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ | 11 Benefits of Butterfly Exercise in Pregnancy in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా | ప్రయోజనాలు, ప్రమాదాలు | Pasta During Pregnancy | Benefits & Risks in Telugu
గర్భవతులకు ఉసిరి: లాభాలు, భద్రత, మరిన్ని వివరాలు | Amla In Pregnancy: Benefits, Safety & More in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం మంచిదా? కాదా? | Arbi In Pregnancy: Is It Safe Or Not in Telugu
మీ బేబీ బాటిల్ స్టెరిలైజర్ క్లీనింగ్ గురించి ఈ విషయాలు తెలుసా? తప్పకుండ తెలుసుకోండి (Do You Know These Things About Your Baby Bottle Sterilizer in Telugu!)
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Weight Management | By Ingredient | Apple Cider Vinegar | Skin - Bath & Body | By Concern | Body Moisturizer | Brightening | Tan Removal | By Ingredient | Skin - Hygiene | By Concern | UTIs & Infections | Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Maternity dresses | Stretch Marks Kit | Stroller |