Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Care for Baby
18 September 2023 న నవీకరించబడింది
కొత్త మాతృత్వం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది, అయితే కొన్నిసార్లు అది తల్లీ బిడ్డ ఇద్దరికీ ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. ఒక వేళ మీరు మొదటిసారి తల్లి అయ్యిఉంటే గంటల వ్యవధిలో పాలివ్వడం, డైపర్స్ ను మారుస్తూ ఉండటం, సమయం దొరికినప్పుడు మాత్రమే నిద్రించడం వంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉంటారు.
మీరు చిన్నబిడ్డకు తల్లి అయి ఉంటే… కొన్నిసార్లు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయినట్లు కూడా అనిపించవచ్చు. ఇలాంటి అనుభూతి జీవితకాలం గుర్తుంటుంది. కొత్తగా పుట్టిన మీ బేబీతో కలసి ఏడాది అంతా చేసేందుకు కావాల్సిన కొన్ని పనులు, సూచనలు ఇక్కడ ఉన్నాయి
1. బేబీకి తల కంట్రోల్ వచ్చే వరకు బెడ్ షీట్ ను సగానికి మడిచి దాన్ని నేల మీద చుట్టూ ఉంచి, బేబీని మధ్యలో ఉంచాలి. బేబీ సురక్షితంగా, భయంలేకుండా ఉందనిపించినప్పుడు తల్లిదండ్రులు అటూ ఇటూ పడుకొని ఊపుతూ ఉండవచ్చు.
2. శిశువులు విభిన్న రంగుల పట్ల ఆసక్తి చూపిస్తారు. కనుక తెల్ల పేపరు మీద నల్లని ఇంకుతో పలు రకాల ఆకృతులను గీసి బేబీకి కనిపించేలా వేలాడదీయండి.
3. శిశువు వీపు, మెడ, కడుపు కండరాలు గట్టిపడేందుకు వ్యాయాయం అవసరం. అందువల్ల మీరు బేబీకి దగ్గరలో బొమ్మలను ఉంచవచ్చు. లేదా తనను తాను చూసుకునేలా చిన్నపిల్లల అద్దాన్ని ఎదురుగా ఉంచండి.
4. బేబీ చేస్తున్న శబ్దాలను కాపీ చేయండి. అది తనను మరింత ఉత్సాహపరుస్తుంది. అలా మీరు మాట్లాడేటపుడు బేబీకి మరింత ఆసక్తిగా ఉంటుంది. అలా మీరు చేసే శబ్ధాలను సైతం బేబీ నేర్చుకుంటుంది.
5. బేబీ చేతులు పట్టుకొని తను నడిచేందుకు సాయం చేయండి. బేబీ కాళ్లను తరచుగా ఆయిల్ తో మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల బేబీ కండరాలు, ఎముకలు గట్టిగా అవుతాయి.
6. మా, దాదా అనే పదాలు వారివైపు చూపిస్తూ మాట్లాడుతూ ఉండండి. దీనివల్ల కుటుంబ సభ్యులను బేబీ గుర్తుపడుతుంది.
7. దాదాపు 6 నుంచి 8 నెలల తర్వాత మీ బేబీ చప్పట్లు కొట్టడం నేర్చుకుంటుంది. కాబట్టి దగ్గరగా ఉంటూ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచండి.
8. మీ బేబీ మొదటి అడుగులు దాదాపు 8 నెలల తర్వాత లేదా బేబీ 2వ ఏడాదిలో అడుగు పెట్టిన మొదట్లో జరుగుతుంది. ఎటువంటి సాయం అందించకుండానే బేబీ నడిచేలా ప్రయత్నించండి.
9. దాదాపు 10 నెలల వయసు వద్ద బేబీకి నీటిని నింపిన చిన్న పూల్స్ లో దించండి. వారికి నచ్చినట్లుగా ఆడుకోనివ్వండి.
10. మీ బేబీ వద్ద తరచుగా పుస్తకాలు చదవండి. అందులోని పాత్రలకు వివిధ రకాల గొంతును ఉపయోగించడం ద్వారా వారిని నేర్చుకోవడంలో లీనం చేయండి. కథలో వచ్చే నటన ద్వారా తను నవ్వేలా ప్రోత్సహించండి.
11. బేబీని బొమ్మలు, మరియు శబ్దాల మధ్య ఎంగేజ్ చేయడం ద్వారా మెంటల్ డెవలప్మెంట్ సాధించవచ్చు.
12. తన మొదటి పుట్టిన రోజు తర్వాత చెక్క పజిల్స్ సాధించడానికి సిద్ధమవుతుంది. రంగురంగుల ఆకృతులు, బొమ్మలు తీసుకొని ‘‘వాటిని చూపిస్తూ అవి ఎలా పని చేస్తాయో చెప్పండి, చేతుల ద్వారా సైగలు చేయండి’’ వారు విజయవంతంగా చేసినప్పుడు చప్పట్లు కొట్టి ఉత్సాహపరచండి.
12 things that you must do with your baby in the first 12 months in Bengali, 12 things that you must do with your baby in the first 12 months in English, 12 things that you must do with your baby in the first 12 months in Hindi, 12 things that you must do with your baby in the first 12 months in Tamil
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ | 11 Benefits of Butterfly Exercise in Pregnancy in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా | ప్రయోజనాలు, ప్రమాదాలు | Pasta During Pregnancy | Benefits & Risks in Telugu
గర్భవతులకు ఉసిరి: లాభాలు, భద్రత, మరిన్ని వివరాలు | Amla In Pregnancy: Benefits, Safety & More in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం మంచిదా? కాదా? | Arbi In Pregnancy: Is It Safe Or Not in Telugu
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Body Moisturizer | Brightening | Tan Removal | By Ingredient | Skin - Hygiene | By Concern | UTIs & Infections | Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-Colic | Diapers & Wipes - Baby Gear | Maternity dresses | Stretch Marks Kit | Stroller |