hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Growth & Development arrow
  • బేబీ గ్రోత్ ట్రాకర్ ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో టాప్ 5 కారణాలు (Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important in Telugu) arrow

In this Article

    బేబీ గ్రోత్ ట్రాకర్ ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో టాప్ 5 కారణాలు (Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important in Telugu)

    Growth & Development

    బేబీ గ్రోత్ ట్రాకర్ ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో టాప్ 5 కారణాలు (Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    అసలు బేబీ గ్రోత్ ట్రాకర్ అంటే ఏమిటి (What is a Baby Growth Tracker in Telugu)?

    పేరులో సూచించిన విధంగా బేబీ గ్రోత్ ట్రాకర్ పిల్లల ఎదుగుదలను గుర్తించేందుకు కొలమానంగా పని చేస్తుంది. పుట్టిన పిల్లలకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఖచ్చితంగా బేబీ గ్రోత్ ట్రాకర్ ఉపయోగించాలని సూచించబడింది. ఎందుకంటే ఈ వయసులోనే పిల్లలు అధిక మార్పులకు గురవుతుంటారు. ఈ సంవత్సరాలు చాలా ముఖ్యం. ప్రతి బిడ్డ పెరుగుదల వేరుగా ఉంటుంది. అంతే కాకుండా అతడు లేదా ఆమె సాధారణ వేగంతో ఎదగకపోతే తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. ఇటువంటి సమయాల్లోనే గ్రోత్ ట్రాకర్ సహాయం చేస్తుంది.

    పిల్లలు తీసుకునే ఆహారం దగ్గరి నుంచి వారి నిద్ర ప్యాటర్న్ (విధానం) వరకు పిల్లల ఎదుగుదలను ట్రాక్ చేయడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. దీంతో తల్లిదండ్రులు ఈజీగా అర్థం చేసుకోవచ్చు మరియు అవసరమైనపుడు చర్యలను తీసుకోవచ్చు. వారు బరువు, పొడవు మరియు తల చుట్టుకొలత వంటి ఫిజికల్ డెవలప్​మెంట్​లను ట్రాక్ చేయవచ్చు. మార్కెట్లో విస్త్ర‌‌త శ్రేణి బేబీ ట్రాకింగ్ చార్ట్స్​ మీకు లభిస్తాయి. WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) అందించిన స్టాండర్డ్ బేబీ ట్రాకర్​ అనుసరించాలని రిఫర్ చేయబడింది. అనవసరమైన గందరగోళాలు లేకుండా పిల్లల పెరుగుదలను సరైన విధంగా పర్యవేక్షించేందుకు ఇది సహాయపడుతుంది.

    బేబీ గ్రోత్ ట్రాకర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి (What is the Importance of a Baby Growth Tracker in Telugu)?

    అనేక కారణాల వల్ల బేబీ ట్రాకర్ ప్రాముఖ్యత పెరిగింది. మీ చిన్నారి ఫిజికల్ మరియు మెంటల్ గ్రోత్​ను అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. బేబీ గ్రోత్ ట్రాకర్​ను ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.

    1. కారణం1: పుట్టిన తేదీ నుంచి చాలా నెలల వరకు శిశువు బరువును ట్రాక్ చేయడంలో బేబీ గ్రోత్ ట్రాకర్. ఇది వెయిట్ చెక్ చేసేందుకు మంచిగా సహాయపడుతుంది. పుట్టిన తేదీ నుంచి కొన్ని నెలల వరకు బరువు కొలిచేందుకు ఉపయోగపడుతుంది.
    2. కారణం 2: ట్రాకర్​ను ఉపయోగించుకునేందుకు రెండో కారణం.. వివిధ నెలల్లో శిశువు ఎత్తును తనిఖీ చేయడం.
    3. కారణం 3: బేబీ గ్రోత్ ట్రాకర్ శిశువు బరువును బట్టి అతని కరెంట్ లెంగ్త్​ను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.
    4. కారణం 4: తల చుట్టుకొలత తనిఖీ: శిశువు పెరుగుతున్నా కొలదీ తల సైజ్ కూడా పెరుగుతుంది. తల చుట్టుకొలతను ఈ ట్రాకర్ ఉపయోగించి కొలవొచ్చు.
    5. కారణం 5 : క్షణ్ణమైన అంచనా: బేబీ ట్రాకర్ సహాయంతో తల్లిదండ్రులు తమ శిశువు పెరుగుదల గురించి పైన పేర్కొన్న విధంగా పర్ఫెక్ట్ అంచనాకు రావొచ్చు. ఇది పిల్లల పీడియట్రీషియన్ (శిశు వైద్యుడు) కి ఎదుగుదల గురించి డీటేయిల్డ్ సమాచారం అందిస్తుంది. వారు అవసరమైన వేళలో సరైన పరిష్కారాలను అందించగలరు.

    పిల్లల ట్రాకింగ్ (పెరుగుదలను కొలవడం) ప్రక్రియను స్టార్ట్ చేసేందుకు ఈ కింది లింక్స్ ఉపయోగించొచ్చు.

    WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) పెరుగుదల పట్టిక

    Article continues below advertisment

    (నవజాత శిశువుల నుంచి 24 నెలల వయసు వరకు రికమెండ్ చేయబడింది)

    CDC గ్రోత్ చార్ట్స్

    బేబీ గ్రోత్ ట్రాకర్ ఎలా పని చేస్తుంది (How Does a Baby Growth Tracker Work in Telugu)?

    బేబీ గ్రోత్ ట్రాకర్​ను వాడడం చాలా సులభం. దానిని ఎలా వాడాలో ఇక్కడ ఉంది.

    1. వెయిట్ చెక్: CDC గ్రిడ్ కుడివైపుకు వెళ్లండి. అక్కడ నెల ప్రకారం పిల్లల వయసుని కనుక్కొని.. కర్వ్​డ్ లైన్​లో ఖండన వద్ద కలుసుకునే అడ్డగీతలు మరియు నిలువు గీత వరకు చాలా జాగ్రత్తగా అనుసరించాలి. చివరగా.. శాతాలు వైట్ కలర్​లో రాసే చోటు వరకు ఫాలో అవుతూ ఉండాలి.
    2. హైట్ చెక్: శిశువు ఎత్తు లేదా పొడవును కనుక్కోవడానికి గ్రిడ్ ఎడమవైపుకు వెళ్లి.. అక్కడ వయసు (నెలల్లో) కనుక్కోవాలి. తర్వాత గ్రోత్ కర్వ్​లో అడ్డంగా మరియు నిలువుగా వెళ్తున్న గీతలను ఖండన వరకు ట్రాక్ చేయాలి. ఈ వక్రరేఖను చివరి వరకు అనుసరిస్తే.. అక్కడ శాతాలు తెలుపు రంగులో రాయబడతాయి.
    3. లెన్త్ తెలుసుకునేందుకు వెయిట్ చెక్: తల్లిదండ్రులు గ్రిడ్ దిగువకు వెళ్లాలి. అక్కడ వారు ఎడమ వైపున బరువును కనుగొంటారు. గ్రోత్ కర్వ్ ఇంటర్​సెక్షన్ (ఖండన) వరకు అడ్డంగా మరియు నిలువుగా వెళ్తున్న లైన్స్ అనుసరించాలి. మరియు శాతం కనుక్కోవడానికి వక్రరేఖను చివరి వరకు అనుసరించాలి.
    4. తల చుట్టు కొలత చెక్: తల్లిదండ్రులు చార్ట్​కు ఎడమవైపుకు వెళ్లి.. అక్కడ ఉండే నిలువు మరియు అడ్డు వరుసలను ఇంటర్​సెక్షన్ (ఖండన–– రెండు ప్రదేశాలు కలిసే చోటు) వరకు అనుసరించాలి. మరియు చివరి వరకు వక్రరేఖను అనుసరించాలి. అక్కడ తెలుపు రంగులో ఒక సంఖ్య కనబడుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: 2 నెలల శిశువు పెరుగుదల, అభివృద్ధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

    ముగింపు (Conclusion)

    శిశువు నిర్దిష్ట వయసు వరకు CDC గ్రోత్ ట్రాకర్​లను వాడడంలో ఎటువంటి పరిమితులు లేవు. దీనిని పుట్టిన తేదీ నుంచి 19 సంవత్సరాల వయసు వరకు ఉపయోగించొచ్చు. అదే విధంగా WHO గ్రోత్ చార్ట్​ను నవజాత శిశువులకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉపయోగించొచ్చు. CDC చార్ట్ మరియు WHO చార్ట్ వినియోగం ఒకే తరహాలో ఉంటుంది. ప్రతి రోజు తమ పిల్లలు ఎదగడాన్ని చూసిన తల్లిదండ్రులు ఆనందం పొందుతారు.

    Article continues below advertisment

    సోర్సెస్ (Sources):

    https://www.cdc.gov/growthcharts/who_charts.htm

    https://www.pregnancybirthbaby.org.au/understanding-baby-growth-charts

    Tags:

    Baby growth chart in telugu, how to check baby growth chart in telugu, uses of baby growth chart.

    Also Read In:

    Article continues below advertisment

    English: Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important

    Bengali: Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important in Bengali

    Tamil: Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important in Tamil

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.