Teething
18 September 2023 న నవీకరించబడింది
మీ బిడ్డ మొదటి పంటిని మీరు భద్రంగా ఎలా చూసుకోవాలి? (How Can You Care For Your Baby’s First Tooth in Telugu)
మీ బిడ్డ మొదటి పళ్ళు వారి నాల్గవ లేదా పన్నెండవ నెలల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. వారి చిగుళ్ళ విషయానికొస్తే, మీరు మీ వేలితో వారి పళ్ళు తోమడం వల్ల అక్కడి బ్యాక్టీరియాను నెమ్మదిగా తొలగించేందుకు ఆస్కారం ఉంటుంది. అందువలన, ఇది మీ శిశువు పళ్ళకు ఎలాంటి హాని జరగకుండా చక్కగా పెరగేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, మీ బిడ్డకు చిగుళ్ళు లేదా పళ్ళు తోముకోవడం కూడా అలవాటు అవుతుంది.
మీ శిశువుకు వచ్చిన మొదటి పంటిని ఎలా భద్రంగా చూసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ శిశువు పళ్లను తోముకునేందుకు మంచి పద్ధతుల్లో ఒకటి మీ వేలికి ఫింగర్ టూత్ బ్రష్‌ని పెట్టుకొని దానితో బిడ్డ పళ్లను తోమడం. అంతే కాకుండా, మీరు మీ శిశువుకు రోజుకు కనీసం రెండు సార్లు, ప్రతీసారి 2 నిమిషాల పాటు పళ్ళు తోమడం ఎంతో అవసరం. చిన్న చిన్న ఆహారపు ముక్కల కారణంగా నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా ఆపడానికి మీ బిడ్డ పడుకునే ముందు ఫింగర్ బ్రష్‌తో పళ్లు తోమాలని తెలుసుకోవాలి.
అంతే కాకుండా, మీ శిశువుకి మొదటిసారి వారి దంతాలు బయటికి కనిపించిన వెంటనే పిల్లల దంతవైద్యునితో అపాయింట్‌మెంట్ తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. కాలక్రమేణా, మీ శిశువుకి కొత్త పళ్లు రావడం మొదలైన తర్వాత, మీరు బేబీ ఫింగర్ టూత్ బ్రష్ బదులుగా చిన్న పిల్లల బ్రష్‌కి మారడం ప్రయోజనకరంగా ఉండవచ్చు.
ఈ వయస్సులో మీ శిశువుకు ఉన్న దంతాల సంఖ్యను బట్టి, వారు మంచి నోటి పరిశుభ్రతను అలవర్చుకునేలా చేయాలి. మీరు మీ పిల్లలకు నేర్పించగలిగే వాటిలో ఒకటి ఫ్లాస్ చేయడం. ఫ్లాసింగ్ చేసేటప్పుడు, మీ బిడ్డ దవడపళ్లపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నించాలి, ఇక్కడ ఆహారపు ముక్కలు ఎక్కువగా ఇరుక్కుంటాయి కాబట్టి. అంతేకాకుండా, మీరు మీ బిడ్డకు ఫ్లాసింగ్ మొదలుపెట్టేందుకు మంచి వయస్సు ఏదనేది మీ దంతవైద్యుడిని అడిగి తెలుసుకోవచ్చు.
మీ శిశువుకు పళ్ళు వచ్చే ముందు, వారి చిగుళ్ళపై ఉన్న ఆహారపు అవశేషాలను నెమ్మదిగా తుడిచేందుకు మృదువైన శుభ్రమైన బట్టని లేదా మీ ఫింగర్ బ్రష్‌ని ఉపయోగించవచ్చు. అలా కాకుండా, మీ బిడ్డ పెదవి భాగం లోపలి వైపు తుడవడం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే, బాక్టీరియా చాలా త్వరగా పెరిగే ప్రాంతాలలో ఇది ఒకటి.
మీ శిశువుకు ఇప్పటికే దంతాలు వచ్చినప్పటికీ, వారు ఇంకా ఉమ్మివేయడం నేర్చుకోకపోతే, మీరు మీ శిశువు యొక్క దంతాలు మరియు చిగుళ్లపై ఉన్న ఆహారపు ఆనవాళ్లను తొలగించేందుకు మృదువైన తడిగా ఉన్న బేబీ ఫింగర్ టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు. ఇంకా 3 ఏళ్లు దాటని పిల్లలకు, మీరు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను కొద్దిగా వేసి ఉపయోగించవచ్చు.
చాలా మంది వైద్యులు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు, ఎందుకంటే ఫ్లోరైడ్ చిన్నపిల్లల విషయంలో సురక్షితమైనది ఇంకా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తవానికి, మీరు సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా దీనిని వాడకూడదు. అందువల్ల, మీ బిడ్డ తక్కువ మొత్తంలో దీనిని మింగినా కూడా, మీరు దాని వల్ల కలిగే ఎలాంటి దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
టూత్‌పేస్ట్‌ను ఎక్కువగా మింగేయడం వల్ల పొట్ట సంబంధ సమస్యలు రావొచ్చు. అందువల్ల, మీ పిల్లలు బ్రష్ చేసేందుకు టూత్‌పేస్ట్‌ను వాడినప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు టూత్‌పేస్ట్ రుచిని ఇష్టపడతారు; అందువల్ల మీరు దానిని మీ పిల్లలు అందుకోలేని ప్రదేశంలో ఉంచాలని తెలుసుకోవాలి.
మీ బిడ్డకి మొదటి దంతాలు రావడం మొదలైన వెంటనే వారి పళ్లను బ్రష్ చేయడం మొదలుపెట్టాలని అనుకోవచ్చు. మీ శిశువు పళ్ల పైనున్న ఆహారపు అవశేషాలను తొలగించడానికి మీరు ఫింగర్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు లేదా మృదువైన గుడ్డను వాడవచ్చు. మీరు కనీసం మూడు నెలలకు ఒకసారి పిల్లల డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం!
de Groot-Nievaart MA, Veerkamp JS. Tandenpoetsen bij zuigelingen en peuters (2002) June [Tooth brushing in babies and toddlers]. Ned Tijdschr Tandheelkd.
Tags
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Bengali
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ | 11 Benefits of Butterfly Exercise in Pregnancy in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా | ప్రయోజనాలు, ప్రమాదాలు | Pasta During Pregnancy | Benefits & Risks in Telugu
గర్భవతులకు ఉసిరి: లాభాలు, భద్రత, మరిన్ని వివరాలు | Amla In Pregnancy: Benefits, Safety & More in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం మంచిదా? కాదా? | Arbi In Pregnancy: Is It Safe Or Not in Telugu
మీ బేబీ బాటిల్ స్టెరిలైజర్ క్లీనింగ్ గురించి ఈ విషయాలు తెలుసా? తప్పకుండ తెలుసుకోండి (Do You Know These Things About Your Baby Bottle Sterilizer in Telugu!)
గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినొచ్చా?: ప్రయోజనాలు, అపోహలు | Coconut in Pregnancy: Benefits & Myths in Telugu
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Coconut | Skin - Fertility | By Concern | PCOS | Pregnancy Test Kit | Fertility For Her | Ovulation Test Kit | Fertility For Him | By Ingredient | Chamomile | Shatavari | Ashwagandha | Myo-inositol | Skin - Pregnancy & New Mom | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |