
కొత్త తల్లిదండ్రులుగా, పిల్లల్లో అసాధారణంగా అనిపించే ఏ చిన్న విషయమైనా చాలా జాగ్రత్తగా ఉంటాం. బిడ్డకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా, ఏదైనా సంఘర్షణ పడుతున్నా లేదా వెక్కిళ్లతో బాధపడుతున్నా, ఏదో తప్పు జరుగుతున్నదని భావిస్తే శిశువును వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం చాలా ఉత్తమమైన మార్గం. అయితే ఏదో తప్పు జరిగిందని మాత్రం కాదు. అప్పుడే పుట్టిన బిడ్డకు అప్పుడప్పుడూ వెక్కిళ్ళు రావడం చాలా సాధారణం, ప్రతి శిశువుకు ఏదో ఒక సమయంలో ఇలా జరుగుతుంది. కొంతమంది శిశువులకు కడుపులో ఉండగా కూడా వెక్కిళ్ళు వస్తుంటాయి, కానీ ప్రతిసారీ అది గుర్తించలేం. మీ శిశువు డయాఫ్రాం మెలితిరిగినప్పుడు లేదా చిరాకు అనిపించినప్పుడు ఈ వెక్కిళ్ళు వస్తాయి. సాధారణంగా, ఈ వెక్కిళ్లు కొంత సమయం తర్వాత వాటంతట అవే ఆగిపోతాయి. అయితే వాటిని వెంటనే ఆపేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
మీ బిడ్డకు పాలు పడుతున్నప్పుడు, కాస్త విరామం ఇవ్వడం వల్ల మీ బిడ్డ త్రేన్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల గొంతు నుంచి ఆహారం కిందకు జారుతుంది. ఏదైనా వాయువులు పేరుకుపోకుండా చూస్తుంది. గ్యాస్ వెళ్లిపోవడంతో, మీ బిడ్డ వెక్కిళ్లతో బాధపడే అవకాశాలు తగ్గుతాయి. మీ బిడ్డకు పాలిచ్చిన తర్వాత మాత్రమే కాకుండా పాలిస్తున్న సమయంలో కూడా మధ్య మధ్యలో త్రేన్పులు రావడం మంచిది. ఎందుకంటే ఇది కడుపు నుంచి వాయువులను తొలగించడంలో సాయపడుతుంది. తల్లిపాలు ఇస్తున్న సమయంలో రొమ్ములను మార్చేటప్పుడు మీ బిడ్డకు త్రేన్పులు రావచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలకు పాలు తాగిన తరువాత బర్పింగ్ ఎలా చేయాలి?
పాలు తాగడం వల్ల మాత్రమే వెక్కిళ్లు రావు. ఎప్పుడైనా రావొచ్చు. అలాంటప్పుడు మీ పాప నోట్లో పాల పీక ఉంచడం వల్ల డయాఫ్రాం రిలాక్స్ అయ్యి వెక్కిళ్లు ఆగేందుకు దోహదపడుతుంది. అలాగే, శిశువు పాల పీకను చప్పరిస్తున్నప్పుడు డయాఫ్రాం కాస్త వదులుగా మారి ఎలాంటి చిరాకు కలగకుండా చూస్తుంది.
గ్రేప్ వాటర్ అనేది మీ నవజాత శిశువులో వెక్కిళ్లను తగ్గించేందుకు సహాయపడే సహజమైన నివారణ. ఇది నీళ్లలో కలిపిన పలు మూలికల కాంబినేషన్. ఇది పేగుల్లో అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అల్లం, చమోమిలే, దాల్చినచెక్క మరియు సోంపు ఉన్నాయి. ఇవి అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కూాడా అందిస్తుంది. పాప డయాఫ్రాం రిలాక్స్ అయ్యేందుకు అందులో చిరాకును తగ్గించేందుకు గ్రేప్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. గ్రేప్ వాటర్ చాలా సందర్భాల్లో పనిచేసే సహజమైన మంచి ఔషధం. అయితే మీ పాపకు ఇవ్వడానికి ముందు మీ పిల్లల డాక్టర్ ను సంప్రదించడం మేలు.
ఇది వింతగా అనిపించవచ్చు. ఏడాది కన్నా తక్కువ వయస్సు ఉన్న ప్రతి పాపకు వెక్కిళ్లు రావడం సాధారణం కాబట్టి ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమం. చాలా సందర్భాల్లో ఈ వెక్కిళ్ళు వాటంతట అవే ఆగిపోతాయి. మీ బిడ్డ అసౌకర్యంగా కనిపించకపోతే, వాటంతట అవే ఆగిపోయే వరకు చూడటం ఉత్తమం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువు ఏడుపు: దీని అర్థం ఏమిటి మరియు దానిని ఎలా ఎదుర్కోవాలి?
ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో ఎక్కిళ్లు సాధారణంగా వస్తాయి. ఎందుకంటే వారి డయాఫ్రాం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ సాధారణంగానే ఈ వెక్కిళ్లు కొంత సమయం తర్వాత ఆగిపోతాయి. అయితే, అలా ఆగకపోతే మాత్రం మీ వైద్యుడిని సంప్రదించాలి. చాలా అరుదైన విషయం అయినప్పటికీ వెక్కిళ్ళు అంతర్గతంగా ఉండే ఏదేనీ వైద్య సమస్య లక్షణం.
Hiccups in new borns in telugu, Causes of Hiccups in new borns in telugu, Reasons for Hiccups in new borns in telugu, Are Hiccups common in new borns in telugu, What to do if baby has Hiccups in telugu.



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |