hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Baby Care arrow
  • శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు arrow

In this Article

    శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    Baby Care

    శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    పేరెంట్​హుడ్ అనేది అదో అందమైన ఫీలింగ్. ఇది కేవలం ఆనందాలను మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా తెస్తుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్న మార్పు కూడా తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.

    పిల్లలు పెరిగేటపుడు వారిలో తరుచుగా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. వారి ప్రాణాధారాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నందువల్ల వారి శ్వాసరేటు సాధారణం కంటే ఎక్కువగా ఉండొచ్చు. వారు శ్వాసక్రియల మధ్య లాంగ్ గ్యాప్స్ తీసుకోవచ్చు. అంతే కాకుండా శబ్దాలు కూడా చేయొచ్చు. కానీ పిల్లల శ్వాసకోశ వ్యవస్థ పెద్దవారికంటే భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

    అప్పుడే పుట్టిన శిశువులు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా శ్వాసను తీసుకోవచ్చు. వారు పుట్టినపుడు శ్వాస తీసుకునే మార్గంలో అమ్నియోటిక్ ద్రవం మరియు మెకోనియం కలిగి ఉంటారు. పిల్లల బ్రీతింగ్ సైకిల్స్ చాలా చిన్నవి. పిల్లలు మరియు పెద్దల శ్వాస​ అలవాట్లలో కొన్ని తేడాలు ఉండడం సాధారణం.

    ఏది ఏమైనా తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన పిల్లల మీద అదనపు శ్రద్ధను వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించి దానికి పరిష్కారం కనుక్కునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

    ఒక వేళ మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే నిర్ధారించుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరం.

    Article continues below advertisment

    క్రమరహితంగా శ్వాసతీసుకోవడం అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక మరింత ఒత్తిడికి గురవుతారు.

    మీ పిల్లల శ్వాస విషయంలో మీరు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలను ఇక్కడ పొందుపరిచాం.

    . పిల్లల శ్వాసచక్రాన్ని గమనించండి..

    మీ శిశువుకు సంబందించి శ్వాసకోశ అలవాట్లను గమనించండి. వాటి గురించి తెలుసుకోండి, తద్వారా ఏదైనా సమస్య ఉంటే గుర్తించవచ్చు.

    · మీ పిల్లల శ్వాసను గమనించి.. మీ డాక్టర్​తో షేర్ చేసుకోండి.

    మీ శిశువు శ్వాస తీసుకునే విధానాన్ని రికార్డ్ చేయండి. మరియు దానిని వైద్యుడికి చూపించండి. అతడి అభిప్రాయాన్ని తీసుకోండి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఇప్పుడు ఆన్​లైన్ అపాయంట్​మెంట్స్, ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. అనవరస ప్రయాణాల నుంచి మిమ్మల్ని ఇవి కాపాడుతాయి.

    · పిల్లలు ఎల్లప్పుడూ వెల్లకిలానే పడుకోవాలి.

    ఒక ప్రముఖ study ప్రకారం మీ బేబీ ఎల్లప్పుడూ వెల్లకిలానే పడుకోవాలి. ఇలా చేయడం వలన ఆకస్మిక మరణ సిండ్రోమ్ (SIDS) ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. మీ శిశువుకు శ్వాసకోస సమస్య ఉండి.. సరిగ్గా నిద్రపోకపోతే, ఆ సమస్య పరిష్కారానికి మార్గం కనుక్కోవాలని వైద్యుడిని సంప్రదించండి. అంతే కాకుండా వారి ఊయలలను వాలుపై ఉంచడం సురక్షితం కాదు.

    Article continues below advertisment

    · చిక్కటి శ్లేష్మం

    ఫిజియోలాజికల్ సీరమ్ డ్రాప్స్. ఇవి ఫార్మసీల్లో లభిస్తాయి. మందంపాటి శ్లేష్మాన్ని నయం చేయడంలో ఇది సహాయపడుతుంది.

    · వారు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే దుస్తులను వేయండి.

    కొన్ని సార్లు శిశువులు డిస్ట్రబ్ అయినపుడు లేదా ఎక్కువ వేడిని అనుభవించినపుడు వారి శ్వాసక్రియ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. మీ బిడ్డకు సరైన విధంగా శ్వాస అందేలా మీరు దుస్తులు వేయాలి.

    చివరగా..

    చిన్నపిల్లలు పెద్దవారి కంటే వేగంగా ఊపిరి పీల్చుకుంటారు. వారు శ్వాస తీసుకునేటపుడు అసాధారణ శబ్దాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. వైద్య పరిస్థితుల కారణంగా పిల్లలు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడడం చాలా అరుదు. మీ శిశువుకు శ్వాసకోస సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలి. మీ శిశువు సాధారణ శ్వాస అలవాట్లను తెలుసుకోండి. ఏవైనా సమస్యలను గుర్తిస్తే వైద్యుడిని సంప్రదించండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.