Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Diet & Nutrition
4 September 2023 న నవీకరించబడింది
గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలన్న కోరికలు కలగడం మామూలే. వాటిలో బర్గర్ టాప్‌లో ఉంటుంది. బర్గర్‌లో మెత్తటి మాంసం లేదా వెజ్జీ ప్యాటీ, పాలకూర, మయోన్నైస్ లాంటివి నోరూరిస్తుంటే, వాటిని కాదనుకోవడం కష్టం.
గోధుమ రొట్టె, తాజాగా, సరిగ్గా శుభ్రం చేసిన కూరగాయలు, లీన్ బీఫ్ ప్యాటీలు, సురక్షితంగా ప్యాకేజ్ చేసిన మయోన్నైస్‌తో చేసిన బర్గర్లు ఆరోగ్యకరమైన ఆప్షన్స్‌గా ఉంటాయి. ఎందుకంటే అవి బాగా సమతుల్య భోజనాన్ని వివిధ పోషకాలతో అందిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు మీకు బర్గర్ తినాలనిపిస్తే మార్కెట్లో లభించేవి కాకుండా, ఇంట్లో మీరు సిద్ధం చేసుకున్నవి మాత్రమే తినాలి. నియంత్రించలేని విధంగా బరువు పెరగడాన్ని నివారించేందుకు, మీరు తప్పనిసరిగా మీ వైద్యులతో మాట్లాడి, ఎంత తరచుగా బర్గర్ లాంటి ఆహార పదార్థాలు తింటున్నారో వివరించాలి.
గర్భవతిగా ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా బర్గర్స్‌లో ఉపయోగించే ఆహార పదార్థాలపై, తయారు చేసే విధానంపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. పౌల్ట్రీ లేదా లీన్, మెత్తగా, తాజా మాంసంతో తయారుచేసే బర్గర్లు ఆరోగ్యకరమైనవిగా చెప్పుకోవచ్చు. లీన్ బీఫ్, 100 గ్రాములు తీసుకుంటే 10 గ్రాముల కంటే తక్కువ కొవ్వు, 4.5 సాచ్యురేటెడ్ ఫ్యాట్, 95 మిల్లీగ్రాముల కంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న మాంసంగా పరిగణిస్తారు. బర్గర్ ప్యాటీలను తయారు చేయడానికి ఇలాంటి మాంసాన్ని ఉపయోగించాలి. ప్రొటీన్ పొందడానికి ఆరోగ్యకరమైన మార్గాల్లో లీన్ మీట్ ఒకటి. ఇది శిశువు అవయవాల వృద్ధికి ఉపయోగపడుతుంది.
బర్గర్స్‌లో అధికంగా కొవ్వు ఉన్న మాంసం, కొవ్వు పదార్థాలతో టాపింగ్స్ ఉంటాయి కాబట్టి కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తల్లి ఇద్దరి కోసం తింటున్నా, ఎక్కువగా కేలరీలు తీసుకోవడం మంచిది కాదు. అనవసరంగా బరువు పెరగడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మాంసం పట్టీ సరిగ్గా వండకపోతే, లోపల గులాబీ రంగులో ఉంటే గర్భవతులు ఫుడ్ పాయిజన్ లక్షణాలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల రక్తం విషపూరితం కావడం, గర్భస్రావం కావడం లాంటి ప్రమాదాలు ఉంటాయి. పాడైన పాలకూర ఉన్న వెజ్ బర్గర్ తింటే, గర్భధారణ సమయంలో డీహైడ్రేషన్, అతిసారం లాంటి ప్రమాదకరమైన సమస్యలు రావొచ్చు.
“గర్భవతిగా ఉన్నప్పుడు నేను బర్గర్లు తినొచ్చా?” అని చాలా మంది మహిళలకు సందేహం ఉంటుంది. బీఫ్ బర్గర్లలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్నా, తినేప్పుడు నిండుగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మాంసం సన్నగా ఉన్న కాంబినేషన్‌తో చేసే బర్గర్‌ను ఎంచుకోవాలి. 90/10 బీఫ్ లేదా టర్కీ బర్గర్‌కు మారడం మంచిది. అది కూడా అప్పుడప్పుడు, బర్గర్ తినాలన్న కోరిక కలిగినప్పుడు మాత్రమే. పీచుపదార్థం, సూక్ష్మపోషకాల కోసం బర్గర్‌తో పాటు కొన్ని కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
బర్గర్లలో టాపింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే గర్భధారణ సమయంలో అన్ని రకాల టాపింగ్స్ మంచివి కావు. పాపులర్ టాపింగ్స్ ఇవే. ఈ చిట్కాలతో సురక్షితంగా బర్గర్‌ను ప్రిపేర్ చేసుకోండి.
బయట బర్గర్ తినేప్పుడు పాలకూరను వద్దని చెప్పాలి. ఒకవేళ ఇంట్లో ఆకుకూరలతో బర్గర్ చేయాలనుకుంటే, వాటిని బాగా కడగాలి.
బయట బర్గర్ తినేప్పుడు, టొమాటోలు, ఉల్లిపాయలు వేడి ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. బన్‌లో వీటిని పెట్టి బర్గర్‌ను వేడిచేసినప్పుడు, కూరగాయలు వేడిగా అవుతాయి కానీ, సూక్ష్మజీవుల్ని చంపలేవు. ఇంట్లో అయితే పచ్చి టొమాటో, ఉల్లి మంచిదే. కానీ వాటిని సరిగ్గా కడిగి, సరైన పద్ధతిలో వాడినప్పుడే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి.
3. పచ్చళ్లు (Pickles)
గర్భవతిగా ఉన్నప్పుడు కాబోయే తల్లులకు ఎక్కువగా తినాలనిపించేవి పచ్చళ్లు. ఊరగాయలు ఇష్టపడేవాళ్లు బర్గర్ టాపర్‌గా వీటిని ఉపయోగించవచ్చు.
జ్ మంచిదా కాదా అన్నది వాటిని తయారుచేసిన విధానంపై ఆధారపడి ఉంటుంది. పాశ్చరైజ్డ్ పాలతో తయారు చేసిన సెమీ సాఫ్ట్, హార్డ్ చీజ్ తినడం సురక్షితం.
గుడ్లలో తరచుగా సాల్మొనెల్లా ఉంటుంది. బాగా వండిన బర్గర్‌పైన మాత్రమే వేయించిన గుడ్డు పెట్టాలి.
కెచప్, మస్టర్డ్, మయొన్నైస్, ఇతర టాపింగ్స్ విషయానికి వస్తే, వాటి తయారుచేయడానికి వాడిన పదార్థాలపై అవి మంచివో కాదో నిర్ణయించవచ్చు. క్రీమ్ లేదా మయొతో చేసిన సాస్‌లల్లో పచ్చి గుడ్లు ఉంటాయి. స్టోర్లల్లో తీసుకొచ్చే సాస్‌లల్లో ఉండే పాశ్చరైజ్డ్ ఎగ్ గర్భవతులు తినడానికి సురక్షితమే.
గర్భవతులు తమ డైట్‌లో బర్గర్స్ తీసుకోవడం మంచి ఆప్షనే. బయట తిన్నా, ఇంట్లో అయినా, వాటిని సురక్షిత పద్ధతుల్లో తయారుచేయడం మంచిదన్న విషయం గుర్తుంచుకోండి. వీలైనంతవరకు బయట బర్గర్స్ తినకపోవడమే మంచిది. ఇంట్లో తయారుచేసుకునే బర్గర్స్ కూడా తల్లితో పాటు, కడుపులోని బిడ్డకు మేలు చేసేలా ఉండాలి. టాపింగ్స్ విషయానికి వస్తే సురక్షితమైనవి, పైన సూచించిన విధంగా మాత్రమే ఎంచుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో బర్గర్ తినాలా వద్దా అన్న సందేహం ఉంటే ఓసారి వైద్యుల్ని సంప్రదించి, మీరు ఎలాంటి బర్గర్స్ తింటున్నారో వివరించి వారి సలహాలు తీసుకోవాలి.
References
1. Stråvik M, Jonsson K, Hartvigsson O, Sandin A, Wold AE, Sandberg AS, Barman M. (2019). Food and Nutrient Intake during Pregnancy in Relation to Maternal Characteristics: Results from the NICE Birth Cohort in Northern Sweden. Nutrients.
2. Lipsky LM, Burger KS, Faith MS, Siega-Riz AM, Liu A, Shearrer GE, Nansel TR. (2021). Pregnant Women Consume a Similar Proportion of Highly vs Minimally Processed Foods in the Absence of Hunger, Leading to Large Differences in Energy Intake. J Acad Nutr Diet.
Burger During Pregnancy in Telugu, Is it safe to eat Burger during Pregnancy in Telugu, Can I eat Burger during Pregnancy in Telugu, Burger During Pregnancy: Benefits & Effects in English, Burger During Pregnancy: Benefits & Effects in Hindi, Burger During Pregnancy: Benefits & Effects in Tamil, Burger During Pregnancy: Benefits & Effects in Bengali
Yes
No
Written by
swetharao62
swetharao62
థైరాయిడ్ క్యాన్సర్ | స్త్రీలలో లక్షణాలు మరియు కారణాలు (Thyroid Cancer | Symptoms and Causes in Females in Telugu)
గర్భధారణ సమయంలో కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది? | Eating Chalk: What You Need to Know About This Unusual Craving in Telugu
ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ లో చేయాల్సినవి మరియు చేయకూడనివి (The Do's And Don'ts Of Sex During Pregnancy in Telugu)
మీకు ఈవెన్ స్కిన్‌టోన్ కావాలా? అయితే ఈవెన్ స్కిన్ టోన్ సహజంగా పొందేందుకు 5 ఉత్తమ మార్గాలు మీకోసం (Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Telugu)
గర్భధారణ కొత్తలో శృంగారం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు (Things To Know About Sex During Early Pregnancy in Telugu)
ప్రెగ్నెన్సీ(గర్భధారణ) సమయంలో వీధి ఆహారాలు తీసుకోవచ్చా? తింటే ఎలాంటి స్ట్రీట్ ఫుడ్స్ తినాలి? వీధి ఆహారాలు తినాలనే కోరికను ఎలా కంట్రోల్ చేసుకోవాలి (Can street foods be consumed during pregnancy? What kind of street foods should be eaten? How to control the urge to eat street food? in Telugu)?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Baby Toothbrush | Diapers & Wipes - Baby Clothing | Wrappers | Winter Clothing | Socks | Cap, Mittens & Booties | Baby Towel | Laundry Detergent | Diapers & Wipes - Feeding & Lactation | Feeding Bottle | Grooved Nipple | Fruit Feeder | Manual Breast Pump | Baby Sipper | Skin | SHOP BY CONCERN | Dry & Dull Skin | Anti Ageing | Skin brightening | Acne & Blemishes | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |