back search
Browse faster in app
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Conception arrow
  • 5 వారాల తర్వాత గర్భస్రావం జరిగితే మీరు ఎంత తర్వగా గర్భం కోసం ప్రయత్నించాలి?  arrow

In this Article

    5 వారాల తర్వాత గర్భస్రావం జరిగితే మీరు ఎంత తర్వగా గర్భం కోసం ప్రయత్నించాలి? 

    Conception

    5 వారాల తర్వాత గర్భస్రావం జరిగితే మీరు ఎంత తర్వగా గర్భం కోసం ప్రయత్నించాలి? 

    25 May 2023 న నవీకరించబడింది

    పరిచయం:

    ప్రెగ్నెంట్ కావడం అనేది మోస్ట్ హ్యాపీ మూమెంట్స్​లో ఒకటి. కానీ ఒకపక్క ఆందోళన కూడా ఉంటుంది. మీకు ఇంతకు ముందే గర్భస్రావం జరిగితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం ఎవరైతే జంటలు 5 వారాల ఎర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో గర్భస్రావాన్ని ఎదుర్కొంటారో వారు మరలా మూడు నెలల్లోపే ప్రెగ్నెంట్​ కావాలని ప్రయత్నించినపుడు.. మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి ఉన్న వారితో పోల్చితే సజీవ జననాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ మరో గర్భం కోసం ప్లాన్ చేసే ముందు మీరు గైనకాలజిస్ట్​ను కలవడం ఉత్తమం. ఎందుకంటే ప్రతి శరీరం వేరుగా ఉంటుంది. వివిధ చికిత్సలు అవసరం కావొచ్చు. మీ డాక్టర్ మీకు తగిన సలహాలు, సూచనలు అందిస్తాడు. మీ మెడికల్ కండీషన్​ను బట్టి అవసరమైన చికిత్సలను రికమెండ్ చేస్తారు. ఈ ఆర్టికల్ 5 వారాల్లోపు గర్భస్రావం కావడానికి గల కారణాలను చర్చిస్తుంది. మిస్ క్యారేజ్ తర్వాత ఏం ఎక్స్​పెక్ట్ చేయాలో వివరిస్తుంది. 5 వారాల గర్భస్రావం తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ అయ్యేందుకు ఉత్తమ సమయం ఏదో తెలియజేస్తుంది.

    5 వారాలపుడు గర్భస్రావం (మిస్ క్యారేజ్) జరిగేందుకు గల కారణాలు

    • 5 వారాల్లో గర్భస్రావం అయ్యేందుకు క్రోమోజోమ్స్ ఒక సమస్య కావొచ్చు. అవసరమైన క్రోమోజోముల కంటే ఎక్కువ లేదా తక్కువ రిసీవ్ చేసుకోవడం, ప్లాసెంటా డెవలప్​మెంట్ సమస్యలు, ఒబెసిటీ, ధూమపానం, డ్రగ్స్, ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం లేదా ఆల్కహాల్ తీసుకోవడం వంటి ఇతర కారకాలు కారణం కావొచ్చు.
    • డయాబెటిస్, లూపస్, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యల వలన కూడా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
    • రూబెల్లా, యోనిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, HIV, మలేరియా, గనేరియా వంటి కొన్ని రకాల వ్యాధుల వలన కూడా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
    • ఫుడ్ పాయిజనింగ్ లేదా కొన్ని రకాల మందుల వలన కూడా గర్భస్రావం జరుగుతుంది. అందుకోసమే డైట్ విషయంలో మరియు మందులు వేసుకునేటపుడు మీ వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
    • గర్భస్రావం జరిగేందుకు PCOS (పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్​) కూడా ఒక కారణం కావొచ్చు.

    5 వారాల పిండం గర్భస్రావం అయితే..

    మీ గర్భస్రావం ఎందుకు అయిందో కారణం తెలుసుకున్న తర్వాత మీరు మళ్లీ ప్రెగ్నెంట్ కావాలని ఆలోచించే ముందు మీ మెడికల్ కండీషన్​కి అనుగుణంగా నడుచుకోవాలి. మీరు మళ్లీ ప్రెగ్నెంట్ కావాలని ఆలోచించే ముందు మీరు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం కోసం, అధిక థైరాయిడ్, డయోబెటిస్ మేనేజ్​మెంట్ కోసం మీరు మీ డైట్​ను మార్చాలి. జీవనశైలి విధానాన్ని మార్చాలి. అదుపులో లేని మధుమేహం గర్భస్రావానికి దారి తీస్తుంది. జనన అసాధారణతలకు దారి తీస్తుంది. నియంత్రణలో ఉండే అనేక అనారోగ్యాలు గుర్తించి తగిన చికిత్స చేయించుకుంటే ప్రెగ్నెంట్ కాకముందే వాటిని అదుపులో పెట్టొచ్చు.

    5 వారాల్లో గర్భస్రావం జరిగితే ఏమి చేయాలి.. మళ్లీ ప్రెగ్నెంట్ కావడానికి ఉత్తమ సమయం ఏది?

    ఇలా జరిగిన వారు మూడు నెలల పాటు తప్పక వేచి ఉండాలని యునైటెడ్ స్టేట్స్​లో వైద్యులు సూచిస్తున్నారు. గర్భాశయం, పీరియడ్ సైకిల్స్ మామూలు స్థితికి రావాలని చెబుతారు. అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే శరీరం మామూలు స్థితికి వచ్చేందుకు ఆరునెలల సమయం అవసరం అని సిఫారసు చేసింది. ఒక వేళ గర్భస్రావం జరిగిన తర్వాత తగినంత సమయం వేచి ఉండకుండా ప్రెగ్నెంట్ అయితే వారికి అదనపు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వేచి ఉన్న జంటలను, వేచి ఉండ లేని వారితో పోల్చేందుకు తగిన ట్రయల్స్ నిర్వహించలేదు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి గర్భస్రావం అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో నిపుణుల సలహాలు వారికి అందుబాటులో లేవు. ఒక మహిళకు గర్భం వచ్చిందని ఏవైనా సంకేతాలు ప్రదర్శించడానికి ముందే ఆరంభంలోనే గర్భస్రావాలు జరుగుతూ ఉన్నాయి.

    మరలా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే ముందు మీరు ఎంతకాలం వేచి ఉండాలి. చెప్పాలంటే సందర్భాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మీకు గర్భస్రావం అనేది మొదటి త్రైమాసికం మొదట్లోనే సంభవిస్తే మీరు ఎక్కువ కాలం వేచి ఉండకుండా ప్రెగ్నెన్సీ కోసం మరలా ప్రయత్నించవచ్చు. ఇంకా చెప్పాలంటే త్వరగా ప్రెగ్నెంట్ కావడం వలన మరలా గర్భస్రావం జరిగే ప్రమాదాలు తగ్గుతాయి. ఒక స్టడీ ప్రకారం ఆరోగ్యకరమైన గర్భధారణతో ఇబ్బందుల ప్రమాదం పెరగదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అయిన మహిళలు వారి తదుపరి రెగ్యులర్ పీరియడ్ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: తెలియకుండా అబార్షన్: దీనికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితి లక్షణాలు ఎలా ఉంటాయి?

    గర్భస్రావం తర్వాత మళ్లీ గర్భవతి కావడానికి పరిగణించవల్సిన ఆంశాలు

    • గర్భస్రావం అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఒక పీరియడ్ వేచి ఉండడం ఉత్తమం. పీరియడ్ తరువాత ప్రెగ్నెంట్ అయితే గర్భధారణ తేదీలను నిర్ణయించడం ఆమెకు సులభతరం అవుతుంది.
    • మీరు కనుక మీ పీరియడ్​కు ముందు ప్రెగ్నెంట్ అయితే ఇది మీకు గర్భస్రావం అయ్యే ప్రమాదాలను పెంచదు. వాస్తవానికి గర్భస్రావం తర్వాత మొదటి 6 నెలల్లో ప్రెగ్నెంట్ అయిన స్త్రీలకు మరలా గర్భస్రావం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బలమైన ఆధారాలు ఉన్నాయి.
    • చాలా సందర్భాల్లో మీరు, మీ జీవిత భాగస్వామి మరో గర్భం కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం అయినపుడు ప్రయత్నాలు ప్రారంభించడం ఉత్తమం.

    చివరగా..

    5 వారాలలో గర్భస్రావం జరిగిన తర్వాత చికాకు, చిరాకు కలుగుతుంది. కానీ మరలా ప్రెగ్నెంట్ అయ్యేందుకు మీ మనసును గర్భస్రావం ఆలోచనల నుంచి మరల్చేందుకు కొంత సమయం ఇవ్వడం ముఖ్యం. మీరు మరలా ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్నపుడు వెంటనే డాక్టర్​ను సంప్రదించండి. మీకు గర్భస్రావం జరగడానికి గల కారణాలను విశ్లేషించండి. మీ జీవనశైలి మార్పు కోసం ప్రయత్నించండి. మీ ఒత్తిడిని మేనేజ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా త్వరలోనే మళ్లీ శుభవార్త వింటారు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    swetharao62

    swetharao62

    Read from 5000+ Articles, topics, verified by MYLO.

    Download MyloLogotoday!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    100% Secure Payment Using

    Stay safe | Secure Checkout | Safe delivery

    Have any Queries or Concerns?

    CONTACT US
    +91-8047190745
    shop@mylofamily.com
    certificate

    Made Safe

    certificate

    Cruelty Free

    certificate

    Vegan Certified

    certificate

    Toxic Free

    About Us
    Mylo_logo

    Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.

    Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.

    Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.

    All trademarks are properties of their respective owners.2017-2023©Blupin Technologies Pvt Ltd. All rights reserved.