Scans & Tests
24 May 2023 న నవీకరించబడింది
ఎంత అధునాతనమైన గర్భ నిరోధక మార్గాలు వాడినా ఎప్పుడో ఒకసారి అవి విఫలమవ్వవచ్చు. అండాన్ని ఫలదీకరణ చేయడమే వీర్యం పని. అటువంటి పరిస్థితుల్లో OTC పరీక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుంది. OTC ప్రెగ్నెన్సీ టెస్ట్ మూత్రంలో హార్మోన్ హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (HCG) ఉందో లేదో పరిశీలిస్తుంది. మీరు గర్భవతి అయితే, మీ శరీరంలో HCG ఉంటుంది. ఒక అండం ఫలదీకరణం చెందినప్పుడు కానీ ఇంకా గర్భాశయం గోడలో గానీ గర్భాశయం వెలుపల గానీ అతుక్కున్నప్పుడు , ఈ హార్మోన్ విడుదల అవుతుంది.
ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఒక కిట్ ఎంచుకోవాలి. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో ప్రెగ్నెన్సీ కిట్లు దొరుకుతున్నాయి. అవన్నీ ఒకేలా పనిచేస్తాయి. కొనేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా ప్యాక్ చేశారో లేదో, కొత్తగా ఉందో లేదో చూడండి. ఒకే కిట్‌లో రెండు స్టిక్స్ ఉండేవి ఉన్నాయేమో అడగండి. అలాంటిది ఉంటే మరొక దానికోసం వెంటనే పరుగులు తీయవలసిన అవసరం రాదు. టెస్ట్ కిట్‌ని కొన్ని నెలలపాటు కిచెన్లో వదిలేసి, ఆ తర్వాత ఎప్పుడో వాడకూడదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఎప్పుడైనా కొత్తదే కొనుక్కోవాలి.
ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లోపల ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలనేదాని గురించి ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి. కొత్త దాన్ని కొన్న వెంటనే దానిపైన ఉండే సూచనలు సరిగ్గా చదవండి. ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలిపే గుర్తులు తయారు చేసిన కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి. మూత్రాన్ని సేకరించే చేసే విధానం కూడా మరోలా ఉండవచ్చు. మీ కిట్‌ని సరిగ్గా ఉపయోగించడానికి సూచనలు చదవడం మంచిది. నెల తప్పిన తర్వాత హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మీరు ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకోవడానికి కనీసం ఒక రోజైనా ఆగాలి. సరైన ఫలితం తెలియాలంటే కనీసం ఒక వారం తర్వాత టెస్ట్ చేసుకుంటే మంచిది. ఉదయాన్నే లేచిన తర్వాత వచ్చే మొట్టమొదటి మూత్రంలో HCG ఎక్కువగా ఉంటుంది కనుక అప్పుడే పరీక్ష చేసుకుంటే మంచిది.
మీరు ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందులో అనుమానమేమీ లేదు. కిట్‌తో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొనేటప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. టెస్ట్ స్టిక్‌ని తీసేముందు మీ చేతులను సబ్బుతోను, గోరువెచ్చని నీళ్ళతోను శుభ్రం చేసుకోండి.
ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం మీరు మీ మూత్రాన్ని చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో పట్టవలసి రావచ్చు, లేదా స్టిక్ పైన నేరుగా పోయాల్సిరావచ్చు. ప్రోబ్ పైన పోసేటప్పుడైనా లేదా కంటైనర్లో పట్టేటప్పుడైనా సగం యూరిన్ పోయిన తర్వాత వచ్చే యూరిన్‌ని ఉపయోగించడం మంచిది. కొన్ని బ్రాండ్ల ప్రొడక్ట్స్‌లో మీరు స్టిక్ పైన కాసేపు పోయాలనే సూచన ఉండవచ్చు. కిట్‌తో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొనేటప్పుడు సరైన ఫలితం రావాలంటే స్టాప్‌వాచ్ వాడండి. మీరు స్టిక్ యొక్క అబ్‌జార్బెంట్ సెక్షన్‌పైనే మూత్రం పోయాలి గానీ డిస్‌ప్లే గ్లాస్‌పైన కాదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అబద్ధపు ప్రెగ్నెన్సీ(ఫాల్స్ ప్రెగ్నెన్సీ) అంటే ఏమిటి? అబద్ధపు ప్రెగ్నెన్సీకి కారణాలు
లేదంటే మూత్రాన్ని ఒక కప్పులోకి పట్టి, దానిలో స్టిక్‌ని ముంచి ఐదు నుండి పది సెకన్లు ఉంచాలి. లేదా కిట్లో ఉన్న సూచనలలో ఇచ్చినట్లు చేయాలి. కిట్‌తో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటప్పుడు డ్రాపర్ కూడా ఉపయోగించవచ్చు.
ఫలితం తెలియటానికి టెస్ట్ స్టిక్‌ని ఐదు నుండి పది నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. అందువల్ల ఒక కప్పు టీ తాగిన తర్వాత ఫలితం చూసుకోండి. మీకు టెస్ట్ స్టిక్ పైన ఒక చిన్న లైను కనిపిస్తే లేదా టైమర్ కనిపిస్తే ఆ స్టిక్ బాగా పనిచేస్తోందని అర్థం. అది పనిచేయకుంటే మరొక స్టిక్ తీసుకోండి.
మీరు ప్రెగ్నెంటా కాదా అనేది తెలుసుకోవడానికి ఈ సింబల్స్ చూడండి. ఈ సింబల్స్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. అందువల్ల ఇంట్లో చేసుకొనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లో ఇచ్చిన సూచనలు సరిగ్గా చదవండి. ఇంట్లో చేసుకొనే ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో సాధారణంగా ప్లస్ గుర్తు గానీ మైనస్ గుర్తు గానీ ఇస్తారు. టెస్ట్‌లో పాజిటివ్ వస్తే డాక్టర్‌ని కలవండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ : గర్భవతే కానీ తెలియదు
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
నవజాత శిశువుల్లో పగిలిన పెదవులకు ఎలాంటి చికిత్స చేయాలి?
టెర్రీబుల్ టూస్ దశలో కలిగే అనుభవాలు: ఏమి జరుగుతుంది?
ప్లాసెంటాను తినడం సురక్షితమేనా? అసలు ప్లాసెంటాని ఎందుకు తింటారు?
ప్లేసిబో అంటే ఏంటీ? దాని ప్రభావాలు ఎలా ఉంటాయి?
మైండ్‌ఫుల్ పేరెంటింగ్: పద్ధతులు & ప్రయోజనాలు
శిశువు కడుపు మీద నిద్రపోవడం వలన వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలి?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Diaper Rash | Mosquito Repellent | Anti-colic | Diapers & Wipes - Baby Gear | Carry Nest | Dry Sheets | Bathtub | Potty Seat | Carriers | Diaper Bags | Stroller | Baby Pillow | Diapers & Wipes - Baby Clothing | Wrappers | Winter Clothing | Socks | Diapers & Wipes - Feeding & Lactation | Feeding Bottle | Grooved Nipple | Fruit Feeder |