hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Illnesses & Infections arrow
  • గర్భధారణ సమయంలో జాండీస్: కారణాలు, లక్షణాలు, చికిత్స | Jaundice in Pregnancy: Causes, Symptoms & Treatment in Telugu arrow

In this Article

    గర్భధారణ సమయంలో జాండీస్: కారణాలు, లక్షణాలు, చికిత్స | Jaundice in Pregnancy: Causes, Symptoms & Treatment in Telugu

    Illnesses & Infections

    గర్భధారణ సమయంలో జాండీస్: కారణాలు, లక్షణాలు, చికిత్స | Jaundice in Pregnancy: Causes, Symptoms & Treatment in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ కాలం ప్రతీ మహిళకు భిన్నంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావడం సాధారణమే. అలాంటి వాటిలో జాండీస్ కూడా ఒకటి. దీన్నే కామెర్లు అని అంటారు. రక్తప్రవాహంలో బిలిరుబిన్ స్రావం అధికంగా ఉండటం వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారతాయి. గర్భవతులకు తేలికపాటి లక్షణాలతో జాండీస్ వస్తుంది. కొన్ని కేసుల్లో ఇది తీవ్రం కూడా కావొచ్చు. వైద్య సహాయం అవసరం అవుతుంది. గర్భధారణ సమయంలో జాండీస్ రావడానికి అనేక అంశాలు కారణం. అయితే సరైన కారణం ఏంటో తెలుసుకొని చికిత్స చేయడం అవసరం. మరి గర్భధారణ సమయంలో జాండీస్ రావడానికి కారణాలేంటీ? లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఎలా చేయాలి? అని తెలుసుకోండి.

    గర్భధారణ సమయంలో జాండీస్ అంటే ఏంటీ? (What is jaundice during pregnancy in Telugu)

    రక్తపరీక్ష ద్వారా రక్తప్రవాహంలో బిలిరుబిన్ స్రావం ఎంత ఉందని తెలుసుకోవచ్చు. బిలిరుబిన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారతాయి. గర్భధారణ సమయంలో ఈ సమస్య వస్తుంది. చాలామందిలో బిలిరుబిన్ స్థాయి 0.1 నుంచి 1.2 mg/dl ఉంటుంది. గర్భవతికి ఈ స్థాయి 2mg/dl దాటితే జాండీస్ లక్షణాలు కనిపించవచ్చు. కళ్లు, చర్మం, మూత్రం పసుపు రంగులోకి మారతాయి. గర్భవతుల్లో బిలిరుబిన్ స్థాయి ఎక్కువగా కనిపిస్తుంది. గర్భవతులు కాని మహిళలతో పోలిస్తే గర్భవతుల్లోనే ఈ స్థాయి ఎక్కువగా ఉంటుంది.

    గర్భవతిగా ఉన్నప్పుడు జాండీస్‌కు గల కారణాలేంటీ? (What causes jaundice in pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో జాండీస్‌కు ఇన్ఫెక్షన్ లేదా వైరల్ హెపటైటిస్ ప్రధాన కారణం కావొచ్చు. హెపటైటిస్ ఏ, బీ, సీ, డీ లేదా ఇ వైరస్‌లు వైరల్ హెపటైటిస్ అని పిలిచే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కి కారణం కావచ్చు.

    ఇవి మంటకు, లివర్ సెల్స్ దెబ్బతినడానికి కారణమౌతాయి. ఫలితంగా రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరగుతుంది.

    గర్భవతుల్లో జాండీస్ రావడానికి మరిన్ని కారణాలు ఇవే:

    1. హైపర్‌మెసిస్ గ్రావిడారం (Hyperemesis gravidarum)

    గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ట్రమిస్టర్‌లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన, అపరిమితమైన వాంతులు వస్తాయి. తేలికపాటి లక్షణాలతో జాండీస్ రావడం, కాలేయం పనిచేయకపోవడం ఈ పరిస్థితికి సంకేతంగా భావించవచ్చు.

    2. గర్భధారణలో కొలెస్టాసిస్ (Cholestasis of pregnancy)

    కాలేయంలో పైత్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా రక్తప్రవాహంలోకి పిత్త లవణాలు అధికంగా చేరతాయి. మూడవ ట్రమిస్టర్‌లో గర్భవతుల్లో అరచేతులు, అరికాళ్లలో దురద వస్తుంది.

    3. గర్భధారణలో కాలేయంలో తీవ్రమైన కొవ్వు (Acute fatty liver during pregnancy)

    ఇది చాలా అరుదైన పరిస్థితి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది జాండీస్, వికారం, వాంతులు, కడుపు నొప్పికి కారణమవుతుంది.

    4. ప్రీ-ఎక్లాంప్సియా, హెల్ల్‌ప్ సిండ్రోమ్ (Pre-eclampsia and HELLP syndrome)

    ఈ పరిస్థితికి రక్తపోటు, ప్రోటీన్యూరియా రెండు లక్షణాలు కారణం. కొన్ని సందర్భాల్లో, కాలేయం దెబ్బతినడానికి, లివర్‌లో ఎంజైమ్స్ అధిక స్థాయిలో పెరగడానికి, జాండీస్ రావడానికి ఈ పరిస్థితి కారణం కావచ్చు.

    గర్భధారణ సమయంలో జాండీస్ లక్షణాలు (Symptoms of jaundice in pregnancy in Telugu)

    గర్భవతుల్లో జాండీస్ లక్షణాలు వెంటనే కనిపించకపోవచ్చు. ముందుగా కళ్లు పసుపు రంగులోకి మారతాయి. దీన్నే ప్రాథమిక సంకేతంగా భావిస్తారు. గర్భధారణ సమయంలో జాండీస్ లక్షణాలు మరిన్ని ఉంటాయి:

    • మూత్రం పచ్చగా రావడం
    • చర్మంపై దురద
    • లేత రంగులో మలవిసర్జన
    • వికారం లేదా వాంతులు
    • పొత్తికడుపు నొప్పి
    • అలసట లేదా బలహీనత
    • జ్వరం

    గర్భవతుల్లో ఒక్కొక్కరికి జాండీస్ లక్షణాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఈ లక్షణాలను మీరు గమనించినట్టైతే వైద్యుల్ని సంప్రదించాలి.

    గర్భవతికి జాండీస్ వచ్చిందని ఎలా నిర్ధారిస్తారు? (How is jaundice diagnosed in pregnancy in Telugu)

    రక్తంలో బిలిరుబిన్ లెవెల్స్‌ని వైద్యులు పరిశీలించి జాండీస్ ఉందో లేదో నిర్ధారిస్తారు. ఒకవేళ రక్తంలో బిలిరుబిన్ లెవెల్స్ 2mg/dl కన్నా ఎక్కువ ఉంటే జాండీస్ వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. మరిన్ని లక్షణాలను తెలుసుకోవడం కోసం వైద్యులు భౌతిక పరీక్ష కూడా చేస్తారు. ఈ వ్యాధికి గల కారణాలను తెలుసుకోవడం కోసం మరిన్ని పరీక్షల్ని సూచించవచ్చు. ఒకవేళ వైరల్ హెపటైటిస్ సోకినట్టు అనుమానం ఉంటే, వైద్యులు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించమని సూచించవచ్చు. రక్తంలో పెరిగిన ఎంజైమ్స్ స్థాయిల్ని తెలుసుకోవడం కోసం పరీక్షలు అవసరం.

    డాక్టర్లు సూచించే వేర్వేరు పరీక్షలు ఇవే:

    • రక్తహీనత లేదా ఇన్ఫెక్షన్ సంకేతాలను తెలుసుకోవడం కోసం కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC).
    • లివర్ ఎంజైమ్స్ టెస్ట్
    • వైరల్ హెపటైటిస్ టెస్ట్
    • కాలేయంలో అసాధారణతలు చెక్ చేయడానికి పొత్తికపుడు అల్ట్రాసౌండ్ స్కాన్.
    • వీటితో పాటు మూత్ర పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ లాంటి పరీక్షలు కూడా ఉంటాయి.

    గర్భధారణ సమయంలో వచ్చే జాండీస్‌కు ఎలాంటి చికిత్స చేస్తారు? (Treatment of jaundice in pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో జాండీస్‌ను ఎలా నివారించాలో, గర్భవతికి జాండీస్ వస్తే ఎలాంటి చికిత్స అందించాలో చాలామందికి తెలియదు. ముందుగా జాండీస్‌కు గల కారణాలను గుర్తించి.. అందుకు తగ్గట్టుగా చికిత్స చేయాలి. పరిస్థితిని నియంత్రించడం, వైద్య సమస్యలను నివారించడం, సరైన కారణాలను గుర్తించడం చికిత్స ఉద్దేశం. వైద్యులు మందులతో పాటు, సహాయక చికిత్స సూచించవచ్చు.

    గర్భధారణ సమయంలో జాండీస్ వస్తే ఈ కింది చికిత్సా మార్గాలు ఉన్నాయి:

    • హైడ్రేషన్, పోషక స్థాయిల్ని పెంచేందుకు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ సప్లిమెంట్స్‌గా ఇస్తారు.
    • జ్వరం మందులు
    • వాంతులు రాకుండా మందులు
    • గర్భం కొలెస్టాసిస్ నిర్వహించడానికి మందులు
    • తీవ్రమైన కాలేయ వ్యాధికి సమగ్రమైన, ఇంటర్ డిసిప్లినరీ చికిత్స ఇవ్వడం.
    • మరోవైపు గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి, వైద్యులు క్రమం తప్పకుండా చెక్-అప్స్, అల్ట్రాసౌండ్, హార్ట్ బీట్‌ను తరచూ పర్యవేక్షిస్తూ ఉంటారు.

    గర్భవతికి జాండీస్ వస్తే ఏం తినాలి? (What should we eat in jaundice during pregnancy in Telugu)

    గర్భవతిగా ఉన్నప్పుడు జాండీస్ వస్తే సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. నిండు ధాన్యాలు, లీన్ ప్రొటీన్స్, ఆకుకూరలు, చిక్కుళ్లు, లో ఫ్యాట్ పాల ఉత్పత్తులు, పండ్లు తీసుకోవాలి. ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటూ నిత్యం హైడ్రేట్‌గా ఉండాలి. నీళ్లు, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు తీసుకుంటూ ఉండాలి.

    వైద్యుల్ని ఎప్పుడు సంప్రదించాలి? (When should I contact a health professional in Telugu)

    జాండీస్‌కు సంబంధించి పైన వివరించిన లక్షణాలు ఏవైనా ఉంటే.. వైద్యుల్ని, ఆరోగ్య నిపుణుల్ని సంప్రదించడం తప్పనిసరి. సురక్షితమైన గర్భధారణ కోసం వైద్యులు జాండీస్‌ను సరిగ్గా నిర్ధారించి చికిత్స అందిస్తారు. గర్భవతికి జాండీస్ వచ్చినప్పుడు వారికి కావాల్సిన యాంటీబయాటిక్ మందుల్ని వైద్యులు సూచిస్తారు. భవిష్యత్తులో జాండీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు.

    References

    1. Lunzer MR. (1989). Jaundice in pregnancy. Baillieres Clin Gastroenterol.

    2. Changede P, Chavan N, Raj N, Gupta P. (2019). An Observational Study to Evaluate the Maternal and Foetal Outcomes in Pregnancies Complicated with Jaundice. J Obstet Gynaecol India.

    Tags

    Jaundice in pregnancy in Telugu, What causes of Jaundice in pregnancy in Telugu, Symptoms of Jaundice in pregnancy in Telugu, Treatment of jaundice in pregnancy in Telugu, Jaundice in Pregnancy in English, Jaundice in Pregnancy in Hindi, Jaundice in Pregnancy in Tamil, Jaundice in Pregnancy in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.