Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Pregnancy
4 April 2023 న నవీకరించబడింది
ఎల్ఎంపీ అంటే లాస్ట్ మెన్‌స్ట్రువల్ పీరియడ్. చివరిసారిగా పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయో తెలుసుకొని డెలివరీ డేట్‌ను అంచనా వేస్తుంటారు. అయితే డెలివరీ డేట్‌ను అంచనా వేసేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్స్‌ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మహిళల పీరియడ్ ఉన్న కాలం, ఒవల్యూషన్ తేదీ లాంటివి ఖచ్చితత్వంపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రెండు తేదీల మధ్య వ్యత్యాసం ఉంటుంది.
గర్భవతి ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ద్వారా కడుపులో శిశువు ఖచ్చితమైన వేగంతో పెరుగుతుందో లేదో నిర్ణయిస్తుంటారు. సుదీర్ఘ గర్భాలను నివారించడానికి శిశువుకు ఇండక్షన్ అవసరమా లేదా అన్నది తెలుసుకోవడానికి ఇది అవసరం కూడా. గర్భం దాల్చిన 42 వారాల్లో.. మహిళలకు ప్రసవం కోసం ఇండక్షన్ చేస్తుంటారు. ఒకవేళ ఈడీడీ చాలా దూరంగా ఉంటే, పిండం పూర్తిగా శిశువుగా తయారు కాకముందే జన్మించే అవకాశాలుంటాయి. కాబట్టి స్కానింగ్‌లో ఇచ్చిన తేదీ, ఎల్ఎంపీ తేదీలు వేర్వేరుగా ఉన్నాయేమోనని గమనించాలి. ఒకవేళ ఎల్ఎంపీకి, అల్ట్రాసౌండ్‌కు 4 వారాల తేడా ఉంటే, అప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా అంచనా వేసిన తేదీకి డెలివరీ డేట్ మార్చాలి.
అల్ట్రాసౌండ్ ద్వారా డెలివరీ డేట్ అంచనా వేయొచ్చు. ఒకవేళ మహిళ తనకు తానుగా డెలివరీ డేట్ అంచనా వేయాలనుకుంటే ఈ టిప్స్ పాటించవచ్చు.
కొన్ని సరైన పరిస్థితుల్లో ఎల్ఎంపీ ద్వారా వచ్చిన ఈడీడీ కచ్చితత్వంతో ఉంటుంది. సరైన పరిస్థితులు అంటే మహిళలకు రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం, ఒవల్యూషన్ 14వ రోజు రావడం, అదే రోజు శిశువు గర్భం దాల్చడం లాంటివి. చాలా గర్భాల్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఎల్ఎంపీ ద్వారా కచ్చితమైన డెలివరీ డేట్‌ను అంచనా వేయడం చాలా కష్టం. డెలివరీ డేట్‌ను అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్ విశ్వసనీయ పద్ధతిగా పరిగణిస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో శిశువు పరిమాణం కూడా సరిగ్గా తెలుస్తుంది. దాన్ని బట్టి వైద్యులు బేబీ వయస్సును కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. అయితే అల్ట్రాసౌండ్ ఫలితాలు ఖచ్చితంగా ఉండాలంటే.. గర్భవతి అయిన తర్వాత మొదటి ట్రమిస్టర్‌లోనే ఈ స్కానింగ్ చేయించాలి. అల్ట్రాసౌండ్ తేదీకి, ఎల్ఎంపీ డేట్‌కు మధ్య ఒక వారం తేడా ఉంటే, అల్ట్రాసౌండ్ తేదీ ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీని లెక్కిస్తారు. ఒకవేళ అల్ట్రాసౌండ్ తేదీకి, ఎల్ఎంపీ డేట్‌కు మధ్య 5 రోజుల తేడా ఉంటే.. ఎల్ఎంపీ డేట్ ద్వారా డెలివరీ డేట్‌ను లెక్కిస్తారు. మొదటి ట్రమిస్టర్‌లో నిర్ణయించిన ఈడీడీని ప్రెగ్నెన్సీ సమయంలో మార్చకూడదు.
అనేక సందర్భాల్లో.. గర్భవతులు మొదటి ట్రమిస్టర్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించరు. 18 నుంచి 20 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో అల్ట్రాసౌండ్ చేయిస్తారు. ఈ సమయంలో గర్భవతులు అల్ట్రాసౌండ్ చేయిస్తే, ఎల్ఎంపీ తేదీకి, అల్ట్రాసౌండ్ డేట్‌కు మధ్య 10 రోజుల వ్యత్యాసం ఉంటే, అప్పుడే అల్ట్రాసౌండ్ ఫలితాలను అంచనా వేసి డెలివరీ డేట్‌ను మార్చుకోవచ్చు.
సాధారణంగా ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ తేదీల మధ్యా 2 వారాల వ్యత్యాసం ఉంటుంది. మొదటి రెండు వారాల్లో, ఎల్ఎంపీ నుంచి వచ్చిన తేదీ ప్రకారం చూస్తే మహిళ గర్భవతి కాదు. కానీ ఆ సమయంలో అండోత్సర్గం సాధారణంగా జరుగుతుంది. అయితే కొన్ని కేసుల్లో ఎల్ఎంపీ తేదీకి, అల్ట్రాసౌండ్ స్కాన్ తేదీకి మధ్య చాలా రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒవల్యూషన్ సాధారణ తేదీ కన్నా తర్వాత జరిగి, గర్భధారణ తేదీని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ తేదీల మధ్య రెండు వారాల వ్యత్యాసం ఉంటే, ఎల్ఎంపీ తేదీపై ఆధారపడలేం. ఈడీడీ కోసం అల్ట్రాసౌండ్ తేదీని పరిగణలోకి తీసుకోవాలి.
ఎల్ఎంపీ తేదీ నుంచి 40 వారాలను కలిపి లెక్కించే కాలాన్ని గర్భధారణ వయస్సు అంటారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అందులో GA అని ఉంటే దాన్ని గర్భధారణ వయస్సుగా భావించాలి. ఓయూఏ అంటే యాక్చువల్ అల్ట్రాసౌండ్ ఏజ్‌ను శిశువు అసలు వయస్సును అంచనా వేయడానికి పరిగణలోకి తీసుకుంటారు. GA LMP Vs GA AUA మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం ఉంటుంది. GA LMP కన్నా, GA AUA వేర్వేరుగా ఉంటుంది. GA LMP లో గర్భధారణకు, చివరి పీరియడ్‌కు మధ్య రోజుల్ని మినహాయిస్తారు.
ఎల్ఎంపీ ఉపయోగించే డెలివరీ డేట్‌ను అంచనా వేయడం చవకైన ఆప్షన్. అయితే కచ్చితమైన తేదీ తెలుసుకోవడానికి వీలైనంత త్వరగా అల్ట్రాసౌండ్ చేయించాలి. ఒకవేళ.. ఎల్ఎంపీ డ్యూడేట్, అల్ట్రాసౌండ్ డేట్ మధ్య వ్యత్యాసం 1 వారం కన్నా తక్కువ ఉంటే, ఎల్ఎంపీ డ్యూ డేట్‌ని కొనసాగించవచ్చు. కానీ, 2 వారాల వ్యత్యాసం ఉంటే అల్ట్రాసౌండ్ తేదీని పరిగణలోకి తీసుకోవాలి.
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటి | దాని ప్రాముఖ్యత & లక్షణాలను అర్థం చేసుకోవడం
గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు
ప్రెగ్నెన్సీ స్కాన్‌లో CRL
గర్భధారణ సమయంలో నెయ్యి మంచిదేనా?
గర్భధారణ సమయంలో ప్లం ఫ్రూట్ ప్రయోజనాలు: రిస్క్‌లు & సైడ్ ఎఫెక్ట్స్
గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు): అర్థం, కారణాలు & నివారణలు
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
UTIs & Infections | Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-Colic | Diapers & Wipes - Baby Gear | Stroller | Dry Sheets | Bathtubs | Potty Seats | Carriers | Diaper Bags | Maternity dresses | Stretch Marks Kit |