Lowest price this festive season! Code: FIRST10
Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
ఒక వ్యక్తికి చాలా తక్కువ సంఖ్యలో ఎర్ర రక్తకణాలు ఉంటే రక్తహీనత వస్తుంది. మనం మనుగడ సాగించేందుకు ఎర్రరక్తకణాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో ఎన్నో క్లిష్టమైన పనులు చేస్తాయి. ఎర్రరక్తకణాలే ఆక్సిజన్‌ను కణజాలాలకు తీసుకువెళ్తాయి. ఎర్రరక్తకణాలు తగ్గడం వల్ల రక్తహీనత వస్తుంది. తద్వారా అలసట, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వివిధ రకాల వ్యాధులు, ఆహార లోపాలు, జన్యుపరమైన రుగ్మతల వల్ల కూడా ఇది సంభవించవచ్చు. రక్తహీనతకు చికిత్స చేయకుండా వదిలేస్తే.. అలసట, రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తి చివరకు మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. రక్తహీనత లక్షణాలు మెరుగ్గా గుర్తించడంలో సహాయపడే అన్ని అంశాలను పాఠకుల కోసం మేము ఈ కథనంలో అందజేశాం. ఆరోగ్యకరమైన రక్తాన్ని మెయింటేన్ చేసేందుకు ఇది మీకు సహాయపడుతుంది. రక్తహీనత అనేది ప్రాణాంతకంగా మారకుండా నివారించేందుకు లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా అవసరం.
రక్తహీనత లక్షణాలను మరియు సంకేతాలను అర్థం చేసుకోవడం దానిని ఎదుర్కోవడంలో మొదటి అడుగు. ఒక వ్యక్తి రక్తహీనత తీవ్రమైన లక్షణాలను గుర్తించడంలో విఫలం అయితే.. అంతే కాకుండా వైద్య సహాయం కూడా తీసుకోకపోతే.. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. రక్తహీనత యొక్క సాధారణ లక్షణాలు కింది విధంగా ఉన్నాయి.
రక్తహీనత అనేది వైరస్ బారినపడడం ద్వారా, లేదా ఏదైనా శస్త్ర చికిత్స, అనారోగ్యం ద్వారా సంభవించవచ్చు. తక్కువ ఎర్రరక్తకణాలను కలిగి ఉండడమే రక్తహీనత. ఎవరైనా తమ శరీరంలోని ఐరన్ స్థాయిల గురించి ఆందోళన చెందుతూ ఉంటే.. లేదా పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలను కలిగి ఉంటే వారు వెంటనే వైద్యుడితో మాట్లాడడం మంచిది. మీ ఐరన్ స్థాయిలను పెంచుకోవడం కోసం మరియు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించేందుకు వైద్యుడు మీకు సలహాలు ఇస్తాడు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఖర్జూరాలు: ప్రయోజనాలు & డేట్స్
రక్తహీనత సంభవించేందుకు అనేక అంశాలున్నాయి:
రక్తహీనత సంభవించేందుకు అనేక ఇతర కారణాలు ఉంటాయని అర్థం చేసుకోవడం అవసరం.
ఎర్రరక్త కణాలు అనేవి మానవ శరీరానికి జీవనాధరమైనవి. ఇవి మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సప్లై (సరఫరా) చేస్తాయి. అంతే కాకుండా మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఎర్ర రక్తకణాలు అనేవి ఎముక మజ్జలో తయారవుతాయి. ఇవి శరీరంలోని అన్ని భాగాలకు పంపిణీ కాక ముందు (డిస్ట్రిబ్యూట్) కాలేయంలో నిల్వ చేయబడతాయి. రక్తహీనత వాటిని ప్రభావితం చేస్తుంది. ఎర్రరక్తకణాల పాత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
రక్తహీనతను నివారించేందుకు అనేక మార్గాలున్నాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, అతిగా మద్యం తీసుకోకుండా ఉండడం అనేవి వీటిల్లో చాలా ముఖ్యమైనవి. ఐరన్ అనేది పుష్కలంగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఐరన్ అనేది మాంసం, పౌల్ట్రీ, గుడ్లు మొదలయిన వాటిల్లో లభిస్తుంది. తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తుల వంటి వాటిల్లో కూడా లభిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటే డైట్ తినడంతో పాటుగా, ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా.. ఐరన్ మోతాదును పెంచుకోవచ్చు. ఒక వ్యక్తికి తరచూ రక్తస్రావం జరుగుతుంటే ఆ వ్యక్తి రక్తమార్పిడి చేసుకోవాలని డాక్టర్ సిఫారసు చేయొచ్చు.
మానవ శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనపుడు రక్తహీనత ఏర్పడుతుంది. దీని ఫలితంగా అలసట, తేలికపాటి తలనొప్పి, శక్తి లేకపోవడం వంటి వాటిని అనుభవించొచ్చు. రక్తహీనతను చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే గుండె జబ్బులైన స్ట్రోక్, మరియు మరణం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్తహీనత చికిత్స అనేది రోగి నిర్ధారణ రకం (ఎటువంటి ఎనిమియా సోకింది) మరియు ఇతర పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అధిక రుతుస్రావం మరియు గర్భం అనేది ఐరన్ లోపం కారణంగా రక్తహీనతకు దారి తీస్తాయి. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలు ఐరన్ వాడకాన్ని పెంచాలి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |