
ముఖ్యంగా ఇంక పిల్లలు వద్దు లేదా అసలు పిల్లలు వద్దనుకున్నప్పుడు.. ప్రణాళిక లేకుండా వచ్చే గర్భం అనూహ్యమైనది లేదా కోరుకోనిది. తల్లిదండ్రులు కావాలనుకున్నవాళ్ళు వారు కోరుకున్న సమయానికి ముందే ప్రెగ్నెంట్ అయినా కూడా ఇలాంటి స్థితి ఎదురవుతుంది. చాలామటుకు ప్రణాళిక లేని గర్భాలు గర్భనిరోధక పద్ధతి సరిగ్గా వాడనప్పుడు లేదా అస్సలు వాడనప్పుడు వస్తాయి.
వందకి వందశాతం ప్రభావవంతంగా పనిచేసే గర్భనిరోధక పద్ధతి సంయమనం పాటించడం అని అందరికీ తెలిసిన విషయమే. ఇతర రకాల గర్భనిరోధకాలు కూడా పనిచేస్తాయి. కానీ, ప్రమాదాలకి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లు, అలాగే గర్భాశయంలో పెట్టే పరికరాలు ఇవన్నీ కొన్ని ప్రసిద్ధ గర్భనిరోధక పద్ధతులు. ఎవరైనా గర్భనిరోధక పద్ధతిని వాడకపోతే లేదా సరిగ్గా వాడకపోతే వారు గర్భవతులయ్యే అవకాశం పెరుగుతుంది.
ప్రణాళిక లేని గర్భానికి అతిపెద్ద కారణం గర్భనిరోధక పద్ధతిని అసమర్థంగా వాడటం కాదు. అసలు ఏ రకమైన గర్భనిరోధక పద్ధతిని వాడకపోవటం. కొంతమంది స్త్రీలు ఎటువంటి గర్భనిరోధక పద్ధతిని ఉపయోగించరు. మరికొంతమంది క్రమం తప్పకుండా వాడలేరు. గర్భనిరోధక పద్ధతులని వాడకపోవటానికి కారణాలు రకరకాలుగా ఉండవచ్చు. కొంతమంది మహిళలకి వాటిని వాడటం ఇష్టం ఉండదు. కొందరికి ఇవి అసలు అందుబాటులోనే ఉండవు. మరికొంతమందికి వాటిని వాడకూడదని భావించే భాగస్వాములు ఉండవచ్చు. కొంతమంది ఆడవారు తము గర్భం దాల్చగలమనే విషయం కూడా మర్చిపోతారు. చాలాకాలంగా సంతానలేమి లేదా వ్యంధ్యత్వంతో బాధపడుతున్నవారు లేదా క్రమం తప్పకుండా పిరియడ్స్ రాని మహిళలు వారు గర్భవతి కాలేమని నమ్మవచ్చు. కానీ, వారు ప్రెగ్నెంట్ అవడం కూడా సాధ్యమయ్యే విషయమే.
మీకు ఇది కూడా నచ్చుతుంది: సెక్స్ తర్వాత గర్భధారణను ఎలా నివారించాలి?
గర్భం రాకుండా నివారించాలనుకునే లేదా వాయిదా వేయాలనుకునే మహిళలు ఈ కింది రకాల గర్భనిరోధక పద్దతులతో అలా చేయవచ్చు:
ఎవరైనా స్త్రీకి హఠాత్తుగా తను అనూహ్యంగా గర్భం దాల్చానని తెలిస్తే.. ఆమెని తను ఎన్నోనెల, తర్వాత ఏం చేయాలి? అసలు ఏం ప్రత్యామ్నాయాలు ఉన్నాయిలాంటి టన్నుల కొద్దీ ప్రశ్నలు ఆలోచనలని నింపేయవచ్చు. డాక్టరు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇవ్వగలరు. మీకు ఇదివరకే గైనకాలజిస్టు (OB-GYN) ఉంటే, వారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంప్రదించటం మంచిది. ఒకవేళ మీకు డాక్టరు ఎవరూ లేకపోతే.. మొదటి స్టెప్ వారిని వెతకడం. ఎవరినైనా సూచించమని మీ స్నేహితులని, స్థానిక క్లినిక్ లేదా హాస్పిటల్లో కనుక్కోండి.
మీరు గర్భవతని తెలిపే పరీక్ష మిమ్మల్ని ఆశ్చర్యం అలాగే షాక్‌కి గురిచేయవచ్చు. కానీ, ఈ అనుకోని గర్భానికి సంబంధించి అదనంగా కూడా టన్నుల కొద్దీ భావోద్వేగాలని అనుభూతి చెందవచ్చు. ఇవన్నీ సహజమైనవే. మహిళలు ఈ స్థితిలో మానసిక ఒత్తిడికి గురైనా, అతిగా సంతోషించినా, అనుమానపడుతూ ఉన్నా, శాంతిగా ఉన్నా లేదా ఆందోళనగా ఉన్నా, ఈ భావనలన్నీ సహజమైనవి అలాగే సరైన కారణం ఉన్నవి కూడా. మీరు ఈ వార్తని జీర్ణించుకుని, భవిష్యత్తు కోసం తర్వాత నిర్ణయాలని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా క్షణాల తేడాలో ఒక అనుభూతి మరొకదానికి మారిపోతూ ఉంటుంది. ఇలా భావోద్వేగాలు గాఢంగా ఉన్న సమయంలో మీ పట్ల మీరు కఠినంగా ఉండకుండా ఉండటం ముఖ్యం. మీకు అన్పించే ప్రతికూల, తటస్థమైన ఇంకా సానుకూల భావాల ఆధారంగా మిమ్మల్ని మీరు విమర్శించుకోనవసరం లేదు.
ఒకవేళ మీరు ప్రణాళిక లేకుండా గర్భం దాల్చిన పరిస్థితిలో, తర్వాత నిర్ణయాలు తీసుకోవటానికి చాలారకాల ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయాల పరిధి కూడా చాలా కారణాలపై అంటే మీరు గర్భం దాల్చి ఎన్నిరోజులైంది, మీరు ఎక్కడ ఉంటున్నారు, అలాగే మీ ప్రాధాన్యత ఏంటి అనేవాటిపై ఆధారపడి ఉంటుంది.
1. పేరెంటింగ్/కో-పేరెంటింగ్:
తల్లిదండ్రులకి ఈ హఠాత్తు సమాచారం జీర్ణించుకుని, అర్థం చేసుకుని ఆలోచించే సమయం దొరికితే చాలామటుకు ఊహించని ప్రెగ్నెన్సీలు ఇష్టపడి కోరుకునే ప్రెగ్నెన్సీలుగా మారిపోతాయి.
2. దత్తత ఇవ్వటం:
ఒకవేళ మీరు గర్భవతిగా ఉండి, తల్లి కాకూడదు అనుకుంటే మీరు మీ బిడ్డని దత్తతకి ఇచ్చి మరొకరు తల్లిదండ్రులు అవటానికి సాయం చేయవచ్చు. ఈ రకమైన దత్తతని ఏర్పాటు చేయటానికి చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే దత్తత ఏజెన్సీలు, సోషల్ మీడియా, తల్లిదండ్రుల ప్రొఫైల్స్ అలాగే నోటిమాట మొదలైనవి.
3. అబార్షన్ లేదా గర్భస్రావం:
ఏ మహిళైనా తన గర్భాన్ని తొలగించుకోవాలని కూడా అనుకోవచ్చు. అబార్షన్ని ఎంచుకోవటం వ్యక్తిగతమైన నిర్ణయం. ఎవరికీ దీనికి వ్యతిరేకంగా సలహా ఇవ్వటానికి అనుమతి ఉండకూడదు. వారి వారి రాష్ట్రాలు/దేశాలని బట్టి గర్భస్రావానికి సంబంధించిన పరిమితి కాలం 6వారాలు-15 వారాల మధ్య మారుతూ ఉంటుంది.
డెలివరీ తర్వాత బిడ్డని తనతో ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నా లేకపోయినా, వెన్నంటి అండగా నిలబడేవారు చుట్టుపక్కల ఉండటం అవసరం. ఈ బలమైన సపోర్టునిచ్చేవారు స్నేహితుల బృందం, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు, లేదా ఎవరన్నా కావచ్చు. గర్భం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది భావోద్వేగాలతో నిండివుంటుంది. అలాంటప్పుడు ఇలాంటివారు అండగా నిలిచి సాయపడతారు. ఒకవేళ మీకు అలాంటి దగ్గరితనం ఉన్నవారు ఎవరూ లేకపోతే, మానసిక ఆరోగ్య నిపుణులు, లైఫ్ కోచ్ లేదా సంతాన సాఫల్యం/అబార్షన్ నిపుణుల నుండి సాయం కోరవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?
ఒక యువతికి తన నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమాచారం అంతా లభించాక, మొదటి స్టెప్ ఏంటంటే ఈ ప్రణాళిక లేని గర్భాన్ని తనంతట తాను కొనసాగించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవటం. ఆమె ఈ కింది కఠినమైన ప్రశ్నలని తనని తాను అడగవలసి ఉంటుంది:
ఈ స్టెప్ తప్పనిసరికాని ఒక ప్రత్యామ్నాయమే, పూర్తిగా కుటుంబం అనేది వద్దు అనుకున్నవారికి మాత్రమే. ఒకవేళ ఈ అనూహ్య గర్భం మిమ్మల్ని నిరాశకి గురిచేస్తే.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నివారించడానికి కావలసిన చర్యలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. ఒకవేళ మీరు ఎన్నటికీ గర్భం దాల్చకూడదని ఖఛ్చితంగా అనుకుంటే, మీరు శాశ్వత గర్భనిరోధక పద్ధతులైన ట్యూబల్ లైగేషన్ వంటి ప్రత్యామ్నాయాలని ఎంచుకోవచ్చు. మీరు మీ భాగస్వామిని కూడా వేసెక్టమీ చేయించుకోమని అడగవచ్చు. లేకపోతే.. మీరు హార్మోన్లతో సంబంధం లేని లేదా హార్మోన్లకి సంబంధించిన కుటుంబ నియంత్రణ పద్ధతులని ఎంచుకోవచ్చు. అవి:
ఒక యువతికి ఈ మధ్యే తను గర్భవతని తెలిస్తే.. పైగా తను అది ఊహించనిది అయితే, ఆమె అనేక భావోద్వేగాలకి గురవుతుంది. ఎవరైనా ఇలాంటి సమాచారాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వచ్చే ప్రతిచర్యలన్నీ పూర్తిగా సహజమైనవని గుర్తుపెట్టుకోవటం ముఖ్యం. వారు ఈ విషయం జీర్ణించుకున్నాక, ప్రెగ్నెన్సీకి సంబంధించి తీసుకునే నిర్ణయం యొక్క తర్వాత దశలవైపు ప్రయాణించవచ్చు.




This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |