Pregnancy
4 April 2023 న నవీకరించబడింది
మీరు గర్భవతి అని ఇటీవలే తెలుసుకున్నారా? మీరు ఇంతకుముందు గర్భస్రావం ఎదుర్కొన్నారా? డాక్టర్ మీకు ఎకోస్ప్రిన్ లేదా ఆస్ప్రిన్ మందులను రాశారా? ఈ మందుల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? మీకు ఎటువంటి చింత అవసరం లేదు. గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు చదవడం కొనసాగించండి.
ఇటీవలి పరిశోధనల ప్రకారం.. ప్రతి రోజు తక్కువ మోతాదులో ఆస్ప్రిన్‌ను తీసుకోవడం వలన గర్భధారణ స్త్రీలు తమ గర్భధారణ ఫలితాలను మెరుగుపర్చుకోవచ్చునని తెలిసింది. వాస్తవానికి గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ తీసుకోవడం వలన మావిలోకి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ప్రీ ఎక్లాంప్సియా, యాంటీఫాస్పోలిపిడ్ సిండ్రోమ్ వంటి వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పరిస్థితులు మీ గర్భంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
ఈ మందులను తీసుకోవడం ఎప్పుడు ప్రారంభించాలో మీ వైద్యునితో మాట్లాడి తెలుసుకోవడం ఉత్తమం. మీకు 12 వారాల గర్భం పూర్తయిన తర్వాత చాలా మంది డాక్టర్లు Ecosprin(ఎకోస్ప్రిన్) వేసుకోమ్మని మీకు సిఫారసు చేస్తారు. వాస్తవం చెప్పాలంటే ఇలా తీసుకోవడం మంచి ఎంపిక. ఎందుకంటే వీటి వలన పిండ ప్రమాదాలు (ఫెటల్ అనామలీస్) మరియు ఊహించని రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.
సాధారణంగా గర్భవతిగా ఉన్నపుడు వాపు, నొప్పి లేదా ఇతర కారణాలను తగ్గించేందుకు ఎకోస్ప్రిన్ 150ని వైద్యులు సిఫారసు చేస్తారు. అంతే కాకుండా ఇది మీ మావి (ప్లాసెంటా) పనితీరును మెరుగుపరుస్తుంది. అందువల్ల మీ కడుపులో ఉన్న శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ క్రమం తప్పకుండా అందుతుంది. ఇది అభివృద్ధి చెందేందుకు సహాయపడుతుంది.
మీరు మీ రోజువారీ మోతాదును కోల్పోతే మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీరు గర్భవతిగా ఉన్న సమయంలో ఈ మందులను తీసుకోవడం మాత్రమే. ఈ సమయంలో మీ వైద్యుడు కూడా మిమ్మల్ని పర్యవేక్షిస్తూనే ఉంటాడు. గర్భధారణ సమయంలో ఆస్ప్రిన్‌ను తీసుకోవడం వలన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆస్ప్రిన్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి మీరు గర్భస్రావం ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా పుట్టబోయే శిశువు ఎటువంటి సమస్యలు లేకుండా ఎదిగేందుకు ఇది సహాయపడుతుంది.
ఎకోస్ప్రిన్ గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గర్భధారణకు ముందు ఆస్ప్రిన్‌ను తీసుకునే వ్యక్తులలో ఈ మందుల యొక్క ప్రయోజనాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. చాలా మంది గర్భవతులు తక్కువ మోతాదు గణాంకాలను ఖచ్చితంగా పాటించాలని అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే అధికం అయితే ప్రాణాంతకం కావొచ్చు.
గర్భధారణ సమయంలో ఆస్ప్రిన్‌ను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎకోస్ప్రిన్ ను నిరంతరం తీసుకోవడం వలన గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. మరో వైపు చూసుకుంటే అనేది అందరికీ పని ఎకోస్ప్రిన్ చేయకపోవచ్చు. అందువల్ల తక్కువ మోతాదు థెరపీని ప్రారంభించే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం.
ప్రీఎక్లంప్సియా మరియు యాంటీఫాస్పోలిపిడ్ అభివృద్ధి చెందే అవకాశం ఉన్న గర్భిణీ స్త్రీలకు ఎకోస్ప్రిన్ ను సూచిస్తారు. ఎందుకంటే ఈ పరిస్థితి పుట్టబోయే శిశువు ఆరోగ్యాన్ని మరియు తల్లి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. యాంటీఫాస్పోలిపిడ్ సిండ్రోమ్ అనేది గర్భస్రావాలకు దారి తీస్తుంది. ఇలాగే ఉంటే చివరికి గర్భిణీ స్త్రీకి ఎక్లంప్సియా అనేది డెవలప్ అవుతుంది.
అస్ర్పిన్ను అధిక మోతాదులో తీసుకోవడం వలన పిండం గుండెనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇది చివరికి అనేక ఆరోగ్య సమస్యలకు మరియు గర్భధారణ సమస్యలకు దారి తీస్తుంది. అంతే కాకుండా ఆస్ప్రిన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన శిశువు మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆస్ప్రిన్ మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండేందుకు ఏవైనా మందులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ప్రీక్లాంప్సియా మరియు యాంటీఫాస్పోలిపిడ్ సిండ్రోమ్స్ రెండూ రక్త ప్రవాహానికి సంబంధించినవే కాబట్టి ఆస్ప్రిన్ అనేది రక్తం గడ్డకట్టకుండా చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా గర్భధారణ సమమంలో ఇటువంటి పరిస్థితులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. మీరు ఇంతకుముందు గర్భస్రావాలను ఎదుర్కొని ఉంటే.. ఈ సారి జాగ్రత్తగా ఉండాలని అనుకుంటే.. తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి మందుల గురించి.. పరిస్థితుల గురించి మరింత తెలుసుకోవడం ఉత్తమం. కొన్ని పరిస్థితులను తగ్గించేందుకు మీరు ఎకోస్ప్రిన్ లేదా తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ మందు గోలీలను(ట్యాబ్లెట్స్) తీసుకోవడం మంచిది.
గర్భధారణ సమయంలో ఆస్ప్రిన్‌ను ఉపయోగించిన తర్వాత ఏవైనా అసాధారణ లక్షణాలు ఉంటే వెంటనే పరిష్కరించాలి. అంతే కాకుండా వ్యక్తికి అధిక రక్తస్రావం లేదా అల్సర్ ఉంటే ఆ వ్యక్తి ఆస్ప్రిన్‌ను తీసుకోకూడదు. అటువంటి పరిస్థితులలో మీ వైద్యుడు మీకు ప్రత్యామ్నాయ ఔషధాన్ని సిఫారసు చేయొచ్చు. అలాగే ఆస్ప్రిన్ థెరపీకి సంబంధించిన విషయాలను అవాయిడ్ (నివారించవచ్చు.) చేసే అవకాశం ఉంటుంది.
ఆస్ప్రిన్ వేసుకున్నపుడు మీకు ఏవైనా ఎలర్జీలు వస్తే మీరు దానిని వాడకుండా ఉండడం మంచిది. మీకు దానితో ఏవైనా ప్రయోజనాలు కనిపిస్తే.. మీరు గర్భందాల్చక ముందే చిన్నమోతాదులో దానిని తీసుకోవడం ప్రారంభించాలి. మీరు గర్భధారణ సమయంలో లేదా గర్భధారణకు ముందు తక్కువ మోతాదుతో చికిత్సను ప్రారంభించాలని అనుకోవచ్చు. అటువంటి సమయంలో ఫలితాలు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.
మీరు కనుక తీవ్ర గర్భధారణ సమస్యలతో బాధపడుతూ ఉంటే.. మీకు మీ డాక్టర్ రక్తం గట్టకట్టడాన్ని నిరోధించే ప్రతిస్కందకాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గర్భస్రావం అయ్యే ప్రతిసారి ఆస్ప్రిన్ నివారించలేదు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేందుకు మీరు వేరే పరిష్కారాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. అది మాత్రమే కాకుండా జన్యు సంబంధిత సమస్యల వలన కూడా గర్భస్రావం జరుగుతుందని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మంచి డైట్ మెయింటేన్ చేయడం, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా వైద్య చికిత్సలు, ఆస్ప్రిన్‌ను వాడడం కంటే స్త్రీలకు మంచి ఫలితాలను ఇస్తాయి. గర్భధారణ సమయంలో కొత్త జీవనశైలిని ఎంచుకోకుండా మీ పాత జీవనశైలికే కట్టుబడి ఉండండి. అప్పుడు మీకు నమ్మశక్యం కాని ఫలితాలు వస్తాయి.
గర్భిణీ స్త్రీ ఆస్ప్రిన్ థెరపీని తీసుకోవడం సురక్షితమే అయినప్పటికీ.. తీసుకునే మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే ఈ సమయం కడుపులో ఉన్న బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికీ ప్రమాదకరమైనది. మీరు గర్భస్రావం ముప్పు నుంచి తప్పించుకునేందుకు మీ వైద్యునితో తరచూ చెక్ చేయించుకుంటూ ఉండాలి.
గర్భధారణ సమయంలో ఒక మహిళ ఎకోస్ప్రిన్ 75 తీసుకున్నపుడు దురదగా ఉంటే.. ప్రత్యామ్నాయ మందులను తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటుగా.. మందులతో కూడిన డైట్ ప్లాన్ను కలిగి ఉండడం మరింత ఉత్తమం. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
భారతదేశంలో సరైన కార్డ్ సెల్ బ్యాంకులని ఎలా ఎంచుకోవాలి
పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు
బారసాల అంటే ఏమిటి..? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించాలి?
పుణ్యవచనం అంటే ఏమిటి? డెలివరీ అయ్యిన తరువాత ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు?
అన్నప్రాశన అంటే ఏమిటి? పిల్లలకు అన్నప్రాశన ఎప్పుడు చేయాలి?
పుంసవనం అంటే ఏంటి? ఈ వైదిక కర్మ ద్వారా ఆడబిడ్డ లేదా మగబిడ్డ ను పొందవచ్చా?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |