This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

సెక్స్ తర్వాత గర్భధారణను ఎలా నివారించాలి (How To Prevent Pregnancy After Sex in Telugu)?

Pregnancy Journey
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
సెక్స్ తర్వాత గర్భధారణను ఎలా నివారించాలి (How To Prevent Pregnancy After Sex in Telugu)?
Likes12 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • అసురక్షిత శృంగారం తర్వాత గర్భధారణను నివారించాలంటే వెంటనే వాష్‌రూమ్ ఉపయోగించడం, మూత్ర విసర్జన చేయడం వీర్యం ఆనవాళ్లు తొలగించడంతో పాటు UTI నుంచి రక్షణ ఇస్తుంది.
  • అత్యవసర గర్భనిరోధక మాత్ర (మార్నింగ్ ఆఫ్టర్ పిల్) అసురక్షిత శృంగారం జరిగిన 72 గంటల లోపు తీసుకుంటే అవాంఛిత గర్భధారణను సమర్థవంతంగా నిరోధిస్తుంది. స్పాటింగ్, వికారం వంటి దుష్ప్రభావాలు ఉండొచ్చు.
  • గర్భాశయ పరికరం (IUD) అసురక్షిత శృంగారం తర్వాత 5 రోజుల వరకు చొప్పించవచ్చు. ఇది దీర్ఘకాలిక గర్భనిరోధకంగా పనిచేస్తుంది, కానీ వైద్యుడిని సంప్రదించడం అవసరం.
  • సురక్షిత శృంగారం కోసం ఏ ఉత్పత్తులు ఉపయోగపడతాయి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

మీరు ఇటీవల అసురక్షిత శృంగారంలో పాల్గొన్నారా? మీరు ఉపయోగించిన కండోమ్ పనిచేయకపోవచ్చు లేదా మీరు మార్నింగ్ ఆఫ్టర్ పిల్ (అత్యవసర గర్భ నిరోధక మాత్ర) తీసుకోవడం మర్చిపోవచ్చు. మీరు శృంగారం తర్వాత ప్రెగ్నెన్సీని ఎలా నిరోధించాలో ఇంటర్నెట్‌లో వెతుకుతుంటే.. భయపడకుండా నిశ్చింతగా ఉండండి. మీరు సరైన ప్రదేశంలోనే ఉన్నారు.

ముందుగా, అసురక్షిత శృంగారం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది శృంగారానికి ముందు, శృంగారం సమయంలో లేదా ఆ తర్వాత ఎలాంటి గర్భనిరోధకాలను వాడకుండా లైంగిక చర్యలో పాల్గొనడం. రుతుచక్రం రోజుతో సంబంధం లేకుండా, స్ఖలనం జరిగిందా లేదా అనేదాంతో సంబంధం లేకుండా, అసురక్షిత శృంగారం గర్భధారణకు దారి తీస్తుంది.

వాస్తవానికి, ఎవరూ అవాంఛిత గర్భాన్ని ఎదుర్కోవడం సరికాదు. అందుకే అసురక్షిత శృంగారం తర్వాత గర్భం దాల్చకుండా ఎలా ఉండాలో ఈ ఆర్టికల్ చెబుతుంది.

1. వాష్ రూం వాడండి (Use Washroom)

మీరు శృంగారానికి ముందు, ఆ తర్వాత మూత్ర విసర్జన చేయాలి. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే వీర్యం ఆనవాళ్లు లేకుండా చేయడమే కాదు UTI (మూత్రనాళ సంబంధిత వ్యాధులు) సంక్రమించకుండా నిరోధిస్తుంది. శృంగారం తర్వాత వాష్‌రూమ్‌ వాడిన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రంగా తుడుచుకోవాలనే విషయం గుర్తుంచుకోండి.

2. అత్యవసర గర్భనిరోధక మాత్ర (ECP) తీసుకోండి (Take the Emergency Contraceptive Pill)

శృంగారం తర్వాత అత్యవసర గర్భనిరోధక మాత్ర (దీన్ని 'మార్నింగ్ ఆఫ్టర్' పిల్ లేదా ప్లాన్ బి అని కూడా పిలుస్తారు) తీసుకోవడం కూడా అవాంఛిత గర్భాన్ని నిరోధిస్తుంది. మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే, అసురక్షిత శృంగారంలో పాల్గొన్న 72 గంటల లోపు తీసుకునేలా చూడండి. ఈ సమయం దాటిన తర్వాత తీసుకుంటే పిల్ పూర్తిగా ప్రభావం చూపకపోవచ్చు.

స్పాటింగ్ (స్వల్ప రక్తస్రావం), వికారం, ఒళ్లు నొప్పులు మరియు ఉబ్బరం వంటి తేలికపాటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఇది మీ సాధారణ రుతు చక్రానికి కూడా అంతరాయం కలిగించొచ్చు. మీకు మీ తదుపరి రుతుస్రావం కొంచెం ముందే రావొచ్చు.

అయినప్పటికీ, ఇవి అత్యవసర గర్భనిరోధకాలు మాత్రమే. మీ రెగ్యులర్ గా వాడే గర్భనిరోధక మాత్రల (రోజువారీ తీసుకోవడం కోసం సూచించినవి) స్థానంలో ఉపయోగించొద్దని గుర్తుంచుకోండి.

3. గర్భాశయ పరికరం (IUD) నిరోధిస్తుంది.. (Get an Intra Uterine Device)

గర్భాశయ పరికరం అనేది రాగి, ప్లాస్టిక్‌తో తయారైన చిన్న పరికరం. 'T' ఆకారంలో దీన్ని గర్భాశయం లోపల ఉంచుతారు. అవాంఛిత గర్భధారణను నిరోధించడంలో సహాయపడుతుంది. మీరు అసురక్షిత శృంగారం తర్వాత 5 రోజుల వరకు IUDని చొప్పించవచ్చు.

అత్యంత శక్తిమంతమైన గర్భనిరోధక పద్ధతుల్లో ఒకటి IUD. ఒకసారి చొప్పించిన తర్వాత నిరంతర గర్భనిరోధకంగా పనిచేస్తుంటుంది. అంటే మీరు కొంతకాలం వరకు అవాంఛిత గర్భం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే, ఫైబ్రాయిడ్, కాపర్ అలర్జీ, విల్సన్స్ వ్యాధి (ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టడం కష్టం అవుతుంది.) ఉన్న మహిళలకు IUDలు సరిపడవు. IUD మీకు మంచి ఎంపిక అవునో కాదో తెలుసుకునేందుకు మీ వైద్యుడిని సంప్రదించండి.

4. కుటుంబసభ్యుల మద్దతు పొందండి

అవాంఛిత గర్భం అంటే చాలా భయం, ఆందోళన, అలాగే ఒత్తిడి కూడా ఉంటుంది. అందువల్ల, మీరు బాగా ఆలోచించుకోండి. మీ భాగస్వామితో భావోద్వేగాలను పంచుకుని ఆ మూడ్ నుంచి బయటకు రండి. ఈ విషయంలో మీరు ఒంటరి కాదనే విషయం గుర్తుంచుకోండి.

  • మీరు సౌకర్యవంతంగా ఫీలయ్యే, మీ పరిస్థితిని అర్థం చేసుకోగలిగే కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో మీరు మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడలేకపోతే థెరపిస్టును సంప్రదించండి.
  • చివరగా, గైనకాలజిస్ట్‌తో మాట్లాడటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారు సరైన సలహాను ఇవ్వడం ద్వారా మీకు ఉపశమనం కలుతుగుంది.
  • అసురక్షిత శృంగారం తర్వాత గర్భధారణ పరీక్ష ఎప్పుడు చేసుకోవాలి?
  • ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది- శృంగారం తర్వాత గర్భధారణ ఎలా నివారించాలి.. మీరు అసురక్షిత శృంగారం తర్వాత గర్భధారణ పరీక్ష కోసం సరైన సమయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారా.
  • అసురక్షిత సెక్స్ తర్వాత 2-3 వారాల తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. రెండు వారాల కంటే ముందుగా టెస్ట్ చేసుకోవడం సరికాదు, ఎందుకంటే ఆ సమయంలో శరీరంలోని హార్మోన్ స్థాయిలు గర్భాన్ని గుర్తించేంత స్థాయిలో ఉండవు.

మరోసారి గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • శృంగారం తర్వాత గర్భం దాల్చకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. శ‌ృంగారం సమయంలో కండోమ్ చిరిగిపోయినా లేదా జారిపోయినా సంభోగం తర్వాత అత్యవసర గర్భనిరోధక మాత్రలు తీసుకోవాలి.
  • మీరు IUD లేదా సాధారణ రెగ్యులర్ బర్త్ కంట్రోల్ పిల్స్ వంటి గర్భనిరోధక పద్ధతులను వాడాలనుకుంటే ముందుగా మీ వైద్యుడితో మాట్లాడండి. వెళ్లడానికి ముందు పరీక్షలు చేయించుకోండి (అవసరమైతే).
  • అయినప్పటికీ, లైంగికపరంగా సంక్రమించే వ్యాధుల నుంచి కండోమ్‌లు రక్షణ కల్పిస్తాయనే విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి. అవి మాత్రల కంటే చాలా చవకైనవి, అలాగే సులువుగా అందుబాటులో ఉంటాయి. మీ హార్మోన్లను ఏ విధంగానూ ప్రభావితం చేయవు.
  • కాబట్టి, ప్లాన్ చేసుకోని లేదా అవాంఛిత గర్బాన్ని నిరోధించడానికి, సురక్షితమైన శృంగారాన్ని అనుభవించడమే ఉత్తమ మార్గం.

Tags:

pregnancy after sex in telugu, Unexpected pregnancy in telugu, Precautions to take before sex in telugu, Preventing pregnancy after sex in telugu.

Also Read In:

English: How To Prevent Pregnancy After Sex

Bengali: How To Prevent Pregnancy After Sex in Bengali

Tamil: How To Prevent Pregnancy After Sex in Tamil

మహిళల ఆరోగ్యం కోసం విశ్వసనీయ తోడు

మీ ఆరోగ్యం, శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకునే సురక్షితమైన, నమ్మకమైన ఉత్పత్తులతో మీ ప్రయాణాన్ని హాయిగా కొనసాగించండి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

419 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.