Abortion
2 September 2023 న నవీకరించబడింది
అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి ఉండటం సాధారణం. ఇది అసౌకర్యంగా లేదా నొప్పిగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గడం లాంటి హార్మోన్ల మార్పు కారణంగా అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి వస్తుంది. ఈ నొప్పి స్వల్పంగా లేదా తీవ్రంగా ఉంటుంది. ఏడు రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఈ నొప్పి ఉండొచ్చు. గర్భస్రావం తర్వాత రొమ్ము నొప్పి సాధారణమేనా అని చాలామంది మహిళల్లో సందేహం ఉంటుంది. అవును, అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి సహజమే. ఎందుకంటే శరీరం తనలో శిశువు ఉందని నమ్ముతూ, అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది. ఫలితంగా రొమ్ము నొప్పి వస్తుంది. ఈ దశ దాటి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది.
అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి ఎంతకాలం ఉంటుందని సందేహం కూడా ఉంటుంది. సాధారణంగా ఇది ఓ రెండువారాల పాటు ఉండొచ్చు. అయితే ఈ లక్షణాన్ని తగ్గించడానికి, నివారించడానికి పలురకాల నొప్పి నివారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏది ప్రయత్నించాలనుకున్నా, ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. గర్భస్రావం తర్వాత వచ్చే రొమ్ము నొప్పిని తగ్గించడానికి సాధారణంగా అందుబాటులో ఉన్న నొప్పి నివారణ పద్ధతులు, దానికి సంబంధించిన సమాచారం గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అబార్షన్ తర్వాత.. ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఎందుకు కష్టం అవుతుంది?
అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పిని తగ్గించడానికి సహాయపడే అత్యంత ప్రభావవంతమైన నివారణ పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకోండి:
అబార్షన్ తర్వాత వచ్చే రొమ్ము నొప్పిని తగ్గించడంలో నాన్‌స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) ఉపయోగపడతాయి. ఇబుప్రొఫెన్, నాప్రోక్సెన్, యాస్పిరిన్ లాంటి NSAIDs వాడొచ్చు. ఇవి మంటను తగ్గించడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు. అయితే NSAIDs తీసుకునే ముందు సూచనల్ని జాగ్రత్తగా చదవాలి. ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.
అబార్షన్ తర్వాత మహిళల రొమ్ము సైజ్‌లో మార్పులు వస్తాయి. కాబట్టి వాటికి మంచి సపోర్ట్ ఇచ్చి సౌకర్యంగా ఉండే బ్రా ధరించాలి. ఈ సమయంలో కాటన్ బ్రా ధరించడం మంచిదని చెబుతుంటారు. గాలి సరఫరా అయ్యే మెటిరీయల్ కావడంతో పాటు సౌకర్యంగా ఉంటుంది.
యోగా, మెడిటేషన్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం కూడా మంచిది. అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి కారణంగా వచ్చే ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. నొప్పి తగ్గించడంతో పాటు, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు, ఇతర నొప్పి నివారణ పద్ధతుల్ని పాటిస్తూ, యోగా, ధ్యానం లాంటివి చేస్తే మరింత ప్రభావం ఉంటుంది.
మహిళలు అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పిని తగ్గించుకోవడానికి ఈ ఆహార సూచనల్ని పాటించవచ్చు:
అబార్షన్ చేయించుకున్న మహిళల్లో మలబద్ధకం లాంటి జీర్ణక్రియ సంబంధమైన సమస్యలు వస్తాయి. వీరి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, మలబద్ధకం ద్వారా వచ్చే నొప్పిని తగ్గించడానికి ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలని సూచిస్తారు.
అబార్షన్ తర్వాత మహిళ కోలుకోవడానికి విటమిన్స్, మినరల్స్ తప్పనిసరిగా అవసరం. విటమిన్ సీ, క్యాల్షియం, మెగ్నీషియం, బీ విటమిన్స్ లాంటివి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా నొప్పి తగ్గుతుంది. వేగంగా కోలుకుంటారు. ఆరెంజ్, బ్రకోలి, బాదం, ఓట్స్, తృణధాన్యాలు, పాలకూర లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.
అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడానికి విటమిన్ ఇ కూడా ఉపయోగపడుతుంది. రెండువారాల పాటు విటమిన్ ఇ తీసుకుంటే అబార్షన్ వల్ల కలిగిన నొప్పి, వాపును తగ్గిస్తుంది. అయితే ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకున్నా, ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇతర మందులతో రియాక్షన్స్ లేదా దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది.
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ ఫిష్, అవిసె గింజలు, వాల్‌నట్స్ లాంటివి తినడం వల్ల రొమ్ములో మంట, నొప్పి, వాపు తగ్గుతుంది. అదనంగా, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గర్భస్రావం తర్వాత సాధారణంగా ఉండే తిమ్మిర్లను కూడా తగ్గిస్తాయి.
అబార్షన్ తర్వాత వచ్చే నొప్పిని తగ్గించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఏ చికిత్స తీసుకోవాలనుకున్నా ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. గర్భస్రావం అయిన మహిళలు నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి వైద్యుల సూచనలు పాటించాలి. సరైన విధానంతో, అనేక మంది మహిళలు, అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి నుంచి ఉపశమనం పొందారు.
References
1. Nyboe Andersen A, Damm P, Tabor A, Pedersen IM, Harring M. (1990). Prevention of breast pain and milk secretion with bromocriptine after second-trimester abortion. Acta Obstet Gynecol Scand.
2. Beaman J, Prifti C, Schwarz EB, Sobota M. (2020). Medication to Manage Abortion and Miscarriage. J Gen Intern Med.
3. Sereshti M, Nahidi F, Simbar M, Bakhtiari M, Zayeri F. (2016). An Exploration of the Maternal Experiences of Breast Engorgement and Milk Leakage after Perinatal Loss. Glob J Health Sci.
Breast Pain After Abortion Is it Normal in Telugu, How to take care of breast pain after abortion in Telugu, What should you eat for minimizing the breast pain in Telugu, Breast Pain After Abortion: Pain Relief Methods in English, Breast Pain After Abortion: Pain Relief Methods in Hindi, Breast Pain After Abortion: Pain Relief Methods in Tamil, Breast Pain After Abortion: Pain Relief Methods in Bengali
Yes
No
Written by
saradaayyala
saradaayyala
గర్భధారణ సమయంలో కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది? | Eating Chalk: What You Need to Know About This Unusual Craving in Telugu
ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ లో చేయాల్సినవి మరియు చేయకూడనివి (The Do's And Don'ts Of Sex During Pregnancy in Telugu)
మీకు ఈవెన్ స్కిన్టోన్ కావాలా? అయితే ఈవెన్ స్కిన్ టోన్ సహజంగా పొందేందుకు 5 ఉత్తమ మార్గాలు మీకోసం (Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Telugu)
గర్భధారణ కొత్తలో శృంగారం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు (Things To Know About Sex During Early Pregnancy in Telugu)
ప్రెగ్నెన్సీ(గర్భధారణ) సమయంలో వీధి ఆహారాలు తీసుకోవచ్చా? తింటే ఎలాంటి స్ట్రీట్ ఫుడ్స్ తినాలి? వీధి ఆహారాలు తినాలనే కోరికను ఎలా కంట్రోల్ చేసుకోవాలి (Can street foods be consumed during pregnancy? What kind of street foods should be eaten? How to control the urge to eat street food? in Telugu)?
పీరియడ్స్ దాటిపోవడానికి ముందే తెలిసే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి (What are the pregnancy symptoms that can be noticed before the period is missed in Telugu)?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Diaper Rash | Mosquito Repellent | Anti-Colic | Diapers & Wipes - Baby Gear | Stroller | Dry Sheets | Bathtubs | Potty Seats | Carriers | Diaper Bags | Baby Cot | Carry Nest | Baby Pillow | Baby Toothbrush | Diapers & Wipes - Baby Clothing | Wrappers | Winter Clothing | Socks | Cap, Mittens & Booties | Baby Towel | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit |