hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Abortion arrow
  • గర్భస్రావం తర్వాత రొమ్ము నొప్పి: తగ్గించడానికి మార్గాలు | Breast Pain After Abortion: Pain Relief Methods in Telugu arrow

In this Article

    గర్భస్రావం తర్వాత రొమ్ము నొప్పి: తగ్గించడానికి మార్గాలు | Breast Pain After Abortion: Pain Relief Methods in Telugu

    Abortion

    గర్భస్రావం తర్వాత రొమ్ము నొప్పి: తగ్గించడానికి మార్గాలు | Breast Pain After Abortion: Pain Relief Methods in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి ఉండటం సాధారణం. ఇది అసౌకర్యంగా లేదా నొప్పిగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గడం లాంటి హార్మోన్ల మార్పు కారణంగా అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి వస్తుంది. ఈ నొప్పి స్వల్పంగా లేదా తీవ్రంగా ఉంటుంది. ఏడు రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఈ నొప్పి ఉండొచ్చు. గర్భస్రావం తర్వాత రొమ్ము నొప్పి సాధారణమేనా అని చాలామంది మహిళల్లో సందేహం ఉంటుంది. అవును, అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి సహజమే. ఎందుకంటే శరీరం తనలో శిశువు ఉందని నమ్ముతూ, అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది. ఫలితంగా రొమ్ము నొప్పి వస్తుంది. ఈ దశ దాటి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది.

    అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి ఎంతకాలం ఉంటుందని సందేహం కూడా ఉంటుంది. సాధారణంగా ఇది ఓ రెండువారాల పాటు ఉండొచ్చు. అయితే ఈ లక్షణాన్ని తగ్గించడానికి, నివారించడానికి పలురకాల నొప్పి నివారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏది ప్రయత్నించాలనుకున్నా, ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. గర్భస్రావం తర్వాత వచ్చే రొమ్ము నొప్పిని తగ్గించడానికి సాధారణంగా అందుబాటులో ఉన్న నొప్పి నివారణ పద్ధతులు, దానికి సంబంధించిన సమాచారం గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: అబార్షన్‌ తర్వాత.. ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఎందుకు కష్టం అవుతుంది?

    రొమ్ము నొప్పి ఎలా తగ్గించుకోవాలి (Taking care of breast pain in Telugu)

    అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పిని తగ్గించడానికి సహాయపడే అత్యంత ప్రభావవంతమైన నివారణ పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకోండి:

    1. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి NSAID టాపికల్ క్రీమ్ ఉపయోగించడం (Applying an NSAID topical cream for pain relief)

    అబార్షన్ తర్వాత వచ్చే రొమ్ము నొప్పిని తగ్గించడంలో నాన్‌స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) ఉపయోగపడతాయి. ఇబుప్రొఫెన్, నాప్రోక్సెన్, యాస్పిరిన్ లాంటి NSAIDs వాడొచ్చు. ఇవి మంటను తగ్గించడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు. అయితే NSAIDs తీసుకునే ముందు సూచనల్ని జాగ్రత్తగా చదవాలి. ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.

    2. రొమ్ములకు మంచి సపోర్ట్ ఇచ్చే కాటన్ బ్రా ధరించడం (Wearing a cotton bra that fits properly to support the breasts well)

    అబార్షన్ తర్వాత మహిళల రొమ్ము సైజ్‌లో మార్పులు వస్తాయి. కాబట్టి వాటికి మంచి సపోర్ట్ ఇచ్చి సౌకర్యంగా ఉండే బ్రా ధరించాలి. ఈ సమయంలో కాటన్ బ్రా ధరించడం మంచిదని చెబుతుంటారు. గాలి సరఫరా అయ్యే మెటిరీయల్ కావడంతో పాటు సౌకర్యంగా ఉంటుంది.

    3. రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆందోళనను నియంత్రించడం (Controlling anxiety caused by discomfort by utilising relaxation techniques)

    యోగా, మెడిటేషన్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం కూడా మంచిది. అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి కారణంగా వచ్చే ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. నొప్పి తగ్గించడంతో పాటు, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు, ఇతర నొప్పి నివారణ పద్ధతుల్ని పాటిస్తూ, యోగా, ధ్యానం లాంటివి చేస్తే మరింత ప్రభావం ఉంటుంది.

    రొమ్ము నొప్పిని తగ్గించడానికి మహిళలు ఏమి తినాలి? (What should a woman eat to minimise breast pain in Telugu)

    మహిళలు అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పిని తగ్గించుకోవడానికి ఈ ఆహార సూచనల్ని పాటించవచ్చు:

    1. ఫైబర్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవడం (Switching to a high-fibre diet)

    అబార్షన్ చేయించుకున్న మహిళల్లో మలబద్ధకం లాంటి జీర్ణక్రియ సంబంధమైన సమస్యలు వస్తాయి. వీరి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, మలబద్ధకం ద్వారా వచ్చే నొప్పిని తగ్గించడానికి ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలని సూచిస్తారు.

    2. విటమిన్ సీ, క్యాల్షియం, మెగ్నీషియం, బీ విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం (Consumption of food rich in Vitamin C, calcium, magnesium, and B vitamins)

    అబార్షన్ తర్వాత మహిళ కోలుకోవడానికి విటమిన్స్, మినరల్స్ తప్పనిసరిగా అవసరం. విటమిన్ సీ, క్యాల్షియం, మెగ్నీషియం, బీ విటమిన్స్ లాంటివి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా నొప్పి తగ్గుతుంది. వేగంగా కోలుకుంటారు. ఆరెంజ్, బ్రకోలి, బాదం, ఓట్స్, తృణధాన్యాలు, పాలకూర లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.

    3. రెండు వారాల పాటు విటమిన్ ఇ సప్లిమెంట్స్ తీసుకోవడం (Consuming Vitamin E supplement for two weeks)

    అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడానికి విటమిన్ ఇ కూడా ఉపయోగపడుతుంది. రెండువారాల పాటు విటమిన్ ఇ తీసుకుంటే అబార్షన్ వల్ల కలిగిన నొప్పి, వాపును తగ్గిస్తుంది. అయితే ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకున్నా, ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇతర మందులతో రియాక్షన్స్ లేదా దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది.

    4. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం (Omega-3 fatty acids should be consumed)

    ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ ఫిష్, అవిసె గింజలు, వాల్‌నట్స్ లాంటివి తినడం వల్ల రొమ్ములో మంట, నొప్పి, వాపు తగ్గుతుంది. అదనంగా, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గర్భస్రావం తర్వాత సాధారణంగా ఉండే తిమ్మిర్లను కూడా తగ్గిస్తాయి.

    ప్రత్యామ్నాయంగా పనిచేసే ప్రిమ్‌రోజ్ ఆయిల్ సప్లిమెంట్స్

    • ప్రిమ్‌రోజ్ ఆయిల్ సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఇది అబార్షన్ తర్వాత వచ్చే మంటను, నొప్పిని తగ్గిస్తుంది. రెండు వారాలపాటు ప్రిమ్‌రోజ్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకుంటే గర్భస్రావం వల్ల వచ్చే నొప్పి, వాపు, అసౌకర్యం తగ్గుతుంది.
    • అసౌకర్యాన్ని తగ్గించడానికి కెఫిన్, నికోటిన్ లాంటివి వాడకపోవడం

    • అబార్షన్ తర్వాత వచ్చే రొమ్ము నొప్పిని తగ్గించాలనుకునేవారు కెఫీన్, నికోటిన్ లాంటివాటికి దూరంగా ఉండాలి. ఇవి ఉద్దీపనలుగా పనిచేసి, ఆందోళనను, చురుకుదన్నాన్ని పెంచుతాయి. దీని వల్ల రిలాక్స్ కాలేకపోతారు. నొప్పి కూడా తగ్గదు.
    • వాపు తగ్గించడం కోసం సోడియం వినియోగాన్ని తగ్గించడం

    • సోడియం తక్కువగా ఉన్న డైట్ తీసుకోవడం వల్ల అబార్షన్ తర్వాత వచ్చే నొప్పి, వాపు తగ్గుతాయి. అందుకే సోడియం ఎక్కువగా ఉండే ప్యాకేజింగ్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది కాదు. అదనంగా వంటల్లో ఉపయోగించే ఉప్పును తగ్గించాలి.

    అబార్షన్ తర్వాత వచ్చే నొప్పిని తగ్గించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఏ చికిత్స తీసుకోవాలనుకున్నా ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. గర్భస్రావం అయిన మహిళలు నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి వైద్యుల సూచనలు పాటించాలి. సరైన విధానంతో, అనేక మంది మహిళలు, అబార్షన్ తర్వాత రొమ్ము నొప్పి నుంచి ఉపశమనం పొందారు.

    References

    1. Nyboe Andersen A, Damm P, Tabor A, Pedersen IM, Harring M. (1990). Prevention of breast pain and milk secretion with bromocriptine after second-trimester abortion. Acta Obstet Gynecol Scand.

    2. Beaman J, Prifti C, Schwarz EB, Sobota M. (2020). Medication to Manage Abortion and Miscarriage. J Gen Intern Med.

    3. Sereshti M, Nahidi F, Simbar M, Bakhtiari M, Zayeri F. (2016). An Exploration of the Maternal Experiences of Breast Engorgement and Milk Leakage after Perinatal ‎Loss‎. Glob J Health Sci.

    Tags

    Breast Pain After Abortion Is it Normal in Telugu, How to take care of breast pain after abortion in Telugu, What should you eat for minimizing the breast pain in Telugu, Breast Pain After Abortion: Pain Relief Methods in English, Breast Pain After Abortion: Pain Relief Methods in Hindi, Breast Pain After Abortion: Pain Relief Methods in Tamil, Breast Pain After Abortion: Pain Relief Methods in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.