Nausea & Vomiting
15 May 2023 న నవీకరించబడింది
ప్రెగ్నెన్సీ అనేది మూడు-త్రైమాసికాల ఆనందానుభూతులు, అసౌకర్యమైన అనుభూతులు కలసిన ప్రయాణం. అలాంటి ఓ అసౌకర్యమైన అనుభూతే వాంతి. అది ప్రెగ్నెంట్ మహిళ యొక్క డైట్‌ను, ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది. వాంతి, వికారంగా ఉండటాన్ని ప్రెగ్నెన్సీలో సహజ లక్షణాలుగా చెబుతారు. తల్లి కాబోతున్న వారు తమ మొదటి త్రైమాసికం ముగిశాక వాంతులు విపరీత స్థాయిలో పొందబోరని గుర్తుంచుకోవాలి. ప్రెగ్నెన్సీని ఎలా ఆపాలో ఇక్కడ కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.
ప్రెగ్నెన్సీలో వాంతులు ఎప్పుడు ప్రారంభమవుతాయి ?
ప్రెగ్నెన్సీలో వాంతులు, వికారాన్ని సహజ లక్షణాలుగా భావిస్తారు. 75 శాతానికిపైగా ప్రెగ్నెంట్ మహిళల్లో ఈ అనుభూతులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన ఆరు వారాల తర్వాత సాధారణంగా ఇలాంటి వాంతి అనుభవంలోకి వస్తుంది. అది కొన్ని రోజుల వ్యవధి నుంచి నెలల పాటు ఉండవచ్చు. అయితే చాలా మంది మహిళల్లో మొదటి మూడు నెలల త్రైమాసికం ముగిశాక పరిస్థితి మెరుగ్గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో వాంతి రావడాన్ని చెడు సంకేతంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తరచుగా ఎక్కువసార్లు వాంతి అవుతున్నట్లు ఉంటే అప్పుడు తల్లి, బిడ్డ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రెగ్నెన్సీలో వాంతిని ఆపడం ఎలా ?
ప్రెగ్నెన్సీ సమయంలో వాంతిని ఎలా ఆపాలనే దానిపై ఎలాంటి కచ్చితమైన మార్గాలు లేవు. అయినప్పటికీ, కొన్ని మార్గాలు సహాయపడవచ్చు. అలాంటి ప్రాక్టికల్ మార్గాలు ఇక్కడ చూడండి.
తినే విధానంలో మార్పులు చేయండి..
తక్కువ మొత్తాల్లో తక్కువ విరామాలతో తినేందుకు ప్రయత్నించండి. ప్రెగ్నెన్సీ సమయంలో ఒకే భోజనంలో ఎక్కువ మొత్తం తినవద్దు. గింజ ధాన్యాలు, క్రాకర్స్ (పిండి పదార్థాలతో చేసినవి బిస్కెట్ల వంటివి), డ్రైఫ్రూట్స్ వంటి వాటితో మీ రోజును ప్రారంభించండి. నీరు, పండ్ల రసాల వంటి వాటిని తరచుగా తీసుకోవడం కూడా అత్యంత ప్రధానం. రెండు సార్లు పూర్తి భోజనం అంటే లంచ్, డిన్నర్ చేసే బదులు తల్లి కాబోతున్న వారు రెండు మూడు గంటలకొకసారి తక్కువ మొత్తంలో భోజనం తీసుకోవడం మేలు.
కొన్ని రకాల ఆహారాలకు ఉండే గాఢమైన వాసనల వల్ల కూడా ప్రెగ్నెంట్ మహిళలు వికారంగా అనుభూతి చెందవచ్చు. అలాంటి వాసన వస్తున్న పదార్థాలు తినకపోవడమే మంచిది. దాంతోపాటు సమస్యలు కలిగించేవైన అధిక నూనెతో కూడినవి, వేపుళ్లు, మసాలా పదార్థాలు తినకపోవడమే మంచిది.
ప్రెగ్నెన్సీలో వంటింటి చిట్కాలతో వాంతి ఆపడమెలా ?
నిమ్మకాయ
ప్రెగ్నెన్సీలో వాంతిని ఆపడంలో సురక్షితమైన మార్గాల్లో నిమ్మకాయ కూడా ఒకటి. తాజా నిమ్మకాయ తొక్క వాసన పీల్చడం ద్వారా మంచి అనుభూతిని ప్రెగ్నెంట్ మహిళ పొందవచ్చు. తరచుగా అవుతున్న వాంతులను ఆపేందుకు నిమ్మకాయ నీళ్లను కూడా తీసుకోవచ్చు.
పుదీనా
వాంతిని డీల్ చేయడానికి మరో అద్భుతకరమైన ఐచ్ఛికమే పుదీనా. అరుగుదలకు తోడ్పడే మెంథాల్ లక్షణాలు పుదీనాలో ఉంటాయి. వికారాన్ని, వాంతులను తగ్గించేందుకు రోజుకోసారి కొన్ని తాజా పుదీనా ఆకులను నమలాలని సూచన.
విటమిన్ బీ 6 ఉన్న ఆహారాలు
గర్భంలో శిశువు పెరగడానికి విటమిన్ బీ6 ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. కొంత పరిస్థితి వరకు వికారాన్ని వాంతులను అది కూడా ఆపగలదు. వికారాన్ని ఆపడానికి విటమిన్ బీ6 ఉన్న ఆహార పదార్థాలను తినాల్సిందిగా సూచన.
జీలకర్ర నీరు
జీలకర్ర నీటిని తాగడం ద్వారా ప్రెగ్నెన్సీ సమయంలో వికారం, వాంతిని సురక్షితంగా, ఉత్తమంగా డీల్ చేయవచ్చు. నీటిలో ఒకటి, రెండు టీస్పూన్ల జీలకర్ర వేసి వాటిని 15 నిమిషాల పాటు వేడి చేయడం ద్వారా జీలకర్ర నీటిని తయారు చేసుకోవచ్చు. అవి చల్లగా అయిన తర్వాత రోజంతా అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా తీసుకోవచ్చు.
రోజూవారీ నడకకు వెళ్లడం
లకు మేలు చేస్తుంది. అాది ఆరోగ్యాన్ని పెంపొందించి వాంతులను, వికారాలను కొంత మేర నిరోధిస్తుంది. అన్నింటికి మించి రోజూ వాకింగ్ చేయడం ద్వారా సహజ డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
సిట్రస్ పంట్లు తినడం
సిట్రస్ పండ్లలో మంచి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి వికారాన్ని, వాంతులను ఆపుతాయి. కాబట్టి మీ రోజూవారీ డైట్‌లో వాటిని చేర్చుకోవడం ద్వారా మీ నాలుకలోని రుచినాళికలు కూడా సంతోషపడతాయి.
ప్రెగ్నెన్సీలో వాంతిని మెడికేషన్ ద్వారా ఆపడం ఎలా?
ప్రెగ్నెన్సీ సమయంలో వంటింటి చిట్కాలు ఉపయోగపడకపోయినా, భరించలేనంత వాంతులు అవుతున్నా అప్పుడు మెడికేషన్‌కు వెళ్లాలి. తీసుకునే మందులు బేబీ ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాంతులు ఆపే మందుల్లో ఏదో ఒకదాన్ని తీసుకోవడం మంచిది కాదు. ప్రెగ్నెంట్ మహిళ తన పరిస్థితి గురించి గైనకాలజిస్ట్‌తో చర్చించాలి. తల్లికి, ఫీటస్‌కు ఎలాంటి ప్రభావం లేకుండా ఉండే మందులను వైద్యులు సూచిస్తారు.
చివరగా..
వాంతులు, వికారం అనేవి ప్రెగ్నెన్సీకి సహజ లక్షణాలుగా గుర్తిస్తారు. అయితే అవి మరీ ఎక్కువైతే వాటిని ఎదుర్కోవడం కష్టంగా ఉండవచ్చు. ప్రెగ్నెన్సీలో వాంతులను ఎలా ఆపాలో తెలియక చాలా మంది మహిళలు సతమతమవుతుంటారు. తినే విధానంలో మార్పులు చేయడం, వంటింటి చిట్కాలను పాటించడం, పైన చెప్పిన ప్రాక్టికల్ టిప్స్ పాటించడం ద్వారా వాంతులు, వికారాన్ని కొంత మేర నివారించవచ్చు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి పని చేయకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు మెడికల్ నిపుణున్ని సంప్రదించాలి. ప్రత్యేకించి గైనకాలజిస్ట్‌ను కలిస్తే వారు సరైన మందులను ఇస్తారు.
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ
పెరిమెనోపాజ్: కారణాలు, లక్షణాలు, ప్రమాదాలు మరియు చికిత్స
గర్భధారణ సమయంలో గజ్జలో నొప్పి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?
గర్భధారణలో IUD: కారణాలు, లక్షణాలు & ప్రమాదాలు
ప్రెగ్నన్సీ లో ప్రురిగో అంటే ఏమిటి? దీనికి కల కారణాలు, లక్షణాలు & చికిత్స ఏమిటి?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Tea Tree | Aloe Vera | Skin - Hair | Hairfall | Dry and Damaged Hair | Shop By Ingredient | Onion | Aloe Vera Range For Hair | Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Stretch Marks | Skin - Health & Wellness | Digestive Health | Lactation | Pain management | By Ingredient | Saffron |