This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు & ప్రమాదాలు

Pregnancy
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు & ప్రమాదాలు
Likes16 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో నిమ్మకాయలను తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితం. ఇవి తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, పోషకాలను అందిస్తాయి.
  • నిమ్మకాయలో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. ఫోలేట్ పిండం నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో అవసరం.
  • నిమ్మరసం వికారాన్ని, వాంతులను తగ్గిస్తుంది. హైడ్రేషన్ కోసం నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం సురక్షితం, మలబద్దకం మరియు మూత్రనాళాల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
  • గర్భధారణ సమయంలో పోషకాహారానికి ఏ ఉత్పత్తులు ఉపయోగపడతాయి? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

గర్భం అనేది ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ సమయంలో మనం సాధారణంగా తరచూ తీసుకునే ఆహారపదార్థాలను కూడా అనుమానంతో చూడాలి. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు చేయాల్సినవి చేయకూడనివి బోలెడన్ని ఉన్నాయి. వీటిల్లో చాలా విషయాలకు ఎటువంటి రుజువులు లేవు.

గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం వల్ల కలిగే భద్రతాపరమైన ఆందోళనలు

గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం సురక్షితమేనా? అనే విషయంపై కొన్నే పరిశోధనలు ఉన్నప్పటికీ.. వీటి విషయంలో అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే.. గర్భధారణ సమయంలో నిమ్మకాయలు మరియు సిట్రిక్ యాసిడ్ ఉన్న ఇతర పండ్లు తీసుకోవడం సురక్షితమే అని. నిమ్మకాయలను తక్కువ మోతాదులో తీసుకుంటే తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలను అందిస్తాయి. ఇవి బిడ్డ ఎదుగుదలకు ఎంతో అవసరం. మీరు కనుక అధిక మోతాదులో నిమ్మకాయలను తీసుకుంటుంటే.. మీరు మీ OBGYN(ప్రసూతివైద్యుడు, గైనకాలజిస్ట్​)తో మాట్లాడాల్సి ఉంటుంది.

గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

నిమ్మకాయల్లో ఎన్నో రకాల మంచి లక్షణాలు ఉన్నాయి. ఇవి మీకు గర్భధారణ సమయంలో ఎంతో ఉపయోగపడతాయి. నిమ్మకాయ వల్ల గర్భధారణ సమయంలో మీకు కలిగే ప్రయోజనాల్లో కింద కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

1. వికారాన్ని తగ్గిస్తుంది...

నిమ్మకాయ తినడం లేదా నిమ్మరసం తాగడం వల్ల మీకు వికారం అనేది తగ్గుతుంది. గర్భధారణ సమయంలో మందులను నోటి ద్వారా తీసుకున్నపుడు కలిగే వికారం, వాంతులను నిమ్మకాయ తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇది కేవలం ప్లేసిబో (చురుకైన ఔషధం) కు మాత్రమే పరిమితం కాలేదు. నిమ్మకాయ వాసనను పీల్చుకోవడం వల్ల వాంతులు వికారం తగ్గుతాయని, 100 మంది గర్భిణీ స్త్రీలతో 2014లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

2. విటమిన్ C: రోగనిరోధక శక్తి మరియు పిండం అభివృద్ధి కొరకు..

ఒక చిన్న నిమ్మకాయలో 2 గ్రాముల విటమిన్ C ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇది ఎంతో ఆవశ్యకమైనది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం అధికంగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ శారీరక ఎదుగుదలకు మరియు తల్లి ఆరోగ్యానికి విటమిన్ C అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అది మాత్రమే కాకుండా విటమిన్ C ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం ఐరన్ అనేది ఎంతో కీలకం.

విటమిన్ C అనేది ఎంతో ముఖ్యమైనప్పటికీ గర్భవతులు ఈ విటమిన్ కోసం కేవలం నిమ్మకాయల మీద మాత్రమే ఆధారపడకూడదని పేర్కొన్నారు. ఈ విటమిన్​ను కలిగి ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం అవసరం. కింది వాటిలో విటమిన్ C ఉంటుంది.

  • విటమిన్ C ఉండే తృణధాన్యాలు మరియు రసాలు
  • బ్రోకలీ
  • నారింజ
  • ద్రాక్షపండు
  • టమాట
  • బచ్చలికూర మొదలయినవి

ఫోలేట్: పిండం నాడీ అభివృద్ధి కొరకు..

ఒక యావరేజ్ నిమ్మకాయలో 6.38 మైక్రోగ్రాముల ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరమైన పోషకం. ఎందుకంటే పెరుగుతున్న పిండంలో నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు పోలేట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఫుడ్ మరియు న్యూట్రీషియన్ బోర్డు ప్రకారం.. ఎవరైతే తల్లి కావాలని ఉవ్విళ్లూరుతున్నారో అటువంటి స్త్రీలకు ఆహారం, సప్లిమెంట్ల నుంచి 600 mcgల ఫోలేట్ అవసరం. ఈ అతి ముఖ్యమైన న్యూట్రీషియన్ నిమ్మకాయల్లో విరివిగా లభిస్తుంది.

ఏదేమైనప్పటికీ విటమిన్ C మాదిరిగానే గర్భిణీ స్త్రీలు తమకు అవసరమైన ఫోలేట్ కొరకు నిమ్మకాయల పైనే ఆధారపడకూడదు.

ఫోలేట్ లభించే ఇతర పోషకాహారాలు:

  • ఫోలేట్​ ఉన్న అన్ని రకాల అల్పాహారాలు.. (1998 నుంచి బ్రెడ్, పాస్తా, తృణధాన్యాలు, బియ్యాన్ని 140 mcg ఫోలేట్​తో బలపరచాలని FDA ఆదేశించింది)
  • అవకాడో
  • వీట్ (గోధుమ) జెర్మ్
  • వైట్ బ్రెడ్
  • బచ్చలికూర

గర్భధారణ సమయంలో నిమ్మరసం ప్రయోజనాలు

జీవితంలోని ప్రతి దశలో మరీ ముఖ్యంగా గర్భధారణ దశలో హైడ్రేషన్ అనేది ఎంతో ముఖ్యం. గర్భంతో ఉన్న స్త్రీలు మరియు పాలిచ్చే వారు ప్రతి రోజు సాధారణ వ్యక్తుల కంటే అదనంగా 300 మిల్లీలీటర్ల నీటిని తీసుకోవాలి. ఎందుకంటే వారి శరీర బరువు మరియు రక్తపరిమాణం నిరంతరం మారుతూ ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎక్కువ ద్రవాలను తీసుకోవాలని ఎవరైనా చెబితే కోపంగా అనిపించినప్పటికీ ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో మూత్రనాళాల ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో నీటిలో నిమ్మరసం కలుపుకోవడం పూర్తిగా సురక్షితం. ఇంకా ఎవరైనా నిమ్మకాయ వాసన, రుచిని ఇష్టపడి ఆ రసాన్ని సాధారణ నీటిలో కలుపుకుని తాగితే.. వారికి ఇంకా ఎక్కువగా తాగమని ప్రోత్సహించండి.

గర్భధారణ సమయంలో నిమ్మకాయ వల్ల ప్రమాదాలు

  • గర్భవతులుగా (కాబోయే తల్లులకు) ఉన్న మహిళలు తక్కువ మోతాదులో నిమ్మకాయ తీసుకోవడం సురక్షితమే అయినప్పటికీ.. మరీ ఎక్కువగా నిమ్మకాయలు తీసుకోకూడదు.
  • దంతాలు బలహీనంగా తయారవడం – గర్భవతిగా ఉన్న మహిళలు అధికంగా దంత సమస్యలకు గురవుతారు. క్యావిటీలు మరియు పీరియాడోంటల్(చిగుళ్లకు వచ్చేవి) వ్యాధులు కావొచ్చు. అంతే కాకుండా నిమ్మకాయను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. దీనిలో ఉండే అధిక సిట్రిక్ యాసిడ్ కంటెంట్ డెంటిన్ యొక్క కోతకు కారణం అవుతుంది. గర్భధారణ సమయంలోనైనా లేదా మామూలు వ్యక్తులైనా సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్లు, మరియు నిమ్మకాయలను తక్కువగా తీసుకోవడం మంచిది.
  • గుండెల్లో మంట– గర్భణీ స్త్రీలు గుండెల్లో మంటకు ఎక్కువగా గురవుతారు. నిమ్మకాయల్లో ఉండే అధిక సిట్రిక్ యాసిడ్ కాబోయే తల్లులలో గుండె మంటకు కారణం అవుతుంది. అయినప్పటికీ గుండెల్లో మంటను ప్రేరేపించే ఆహారపదార్థాలు సందర్భాన్ని బట్టి ఉంటాయి. కేవలం సిట్రస్ పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుందని భావించకూడదు.

గర్భిణీ స్త్రీలు నిమ్మకాయలు ఎక్కువగా తినకుండా ఉండేందుకు గల కారణాలు

గర్భవతిగా ఉన్న సమయంలో అధికంగా ఉండే ఏదైనా సమస్యే అవుతుంది. నిమ్మకాయలకు ఎటువంటి మినహాయింపు లేదు. గర్భవతిగా ఉన్నపుడు నిమ్మకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల సమస్యలు, దంతాలు బలహీనంగా తయారు కావడం, మరియు గుండెల్లో మంట మొదలగు సమస్యలు వస్తాయి.

గర్భిణీ స్త్రీల కోసం సురక్షితమైన (ఎటువంటి భయం లేని) నిమ్మకాయ రెసిపీలు (వంటకాలు)

మీరు మీ ఆహారంలో మరింతగా నిమ్మకాయ ఫ్లేవర్​ను యాడ్ చేసుకుని మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవాలని అనుకుంటే.. మీరు గర్భవతిగా ఉన్నపుడు అనుకూలమైన కొన్ని నిమ్మకాయ వంటకాలు

  • ఒక కప్పు గ్రీక్ పెరుగు (వడకట్టిన పెరుగు, మరింత చిక్కగా ఉంటుంది)తీసుకుని దానిని కొన్ని టేబుల్ స్పూన్ల నిమ్మరసంతో కలపాలి. ఆ మిశ్రమానికి తక్కువ చెక్కెర ఉండే గ్రానోలా, తేనెను కలిపి లెమన్ యోగర్ట్ (పెరుగు) పర్ఫైట్​ను తయారు చేసుకోవచ్చు.
  • కాల్చిన వస్తువులు తొక్కతో అందంగా అలంకరించబడి ఉంటాయి.
  • సలాడ్​ తయారు చేసేటపుడు అలంకరణ కోసం నిమ్మకాయలను పిండండి.
  • మాంసం కూరలలో వాడే మ్యారినేట్ (సుగంధద్రవ్యాలతో అలంకరణ) కోసం లెమన్ జ్యూస్ ఉపయోగించండి.

గర్భిణీ అమ్మల కోసం నమ్మకమైన పోషక సహచరులు

మీ గర్భధారణ ప్రయాణంలో అవసరమైన విటమిన్లు, ఫోలేట్, ఐరన్ పోషకాలను అందించే సురక్షితమైన ఉత్పత్తులు మీకు తోడుగా ఉంటాయి.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

530 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

417 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.