hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • గర్భధారణ సమయంలో దానిమ్మ తినవచ్చా? దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి? (Pomegranate During Pregnancy : Benefits in Telugu) arrow

In this Article

    గర్భధారణ సమయంలో దానిమ్మ తినవచ్చా? దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి? (Pomegranate During Pregnancy : Benefits in Telugu)

    Pregnancy Best Foods

    గర్భధారణ సమయంలో దానిమ్మ తినవచ్చా? దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి? (Pomegranate During Pregnancy : Benefits in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    మహిళల గర్భధారణ ప్రయాణం చాలా చాలెంజింగ్​గా ఉంటుంది. ప్రత్యేకించి గర్భవతిగా ఉన్నపుడు స్పెషల్ ఫుడ్ మరియు చాలా రకాల పోషకాలు అవసరం. గర్భిణీ స్త్రీల డైట్​లో దానిమ్మ ఎంతో ప్రయోజకరమైన ఆహారంగా ఉంటుంది. ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ B, మరియు ఫోలిక్ యాసిడ్​ అంతే కాకుండా ఇతర ముఖ్య మినరల్స్​తో కూడిన సూపర్ ఫుడ్ అయినందున దానిమ్మ గర్భధారణకు చాలా మంచిది. దానిమ్మ గర్భవతిగా ఉన్నపుడు మంచిదా? అని ప్రశ్నిస్తే అవును మంచిదే అనే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. ఆశించే తల్లులకు దానిమ్మ పండు మంచి పోషణను అందిస్తుంది. పుట్టబోయే బిడ్డలో శారీరక వైఫల్యాలు అలాగే పిండంలో న్యూరల్ ట్యూబ్ అసాధారణతలను నివారించడంలో దానిమ్మ దోహదం చేస్తుంది. గర్భధారణ సమయంలో దానిమ్మ తినడం వల్ల ఆశించే తల్లుల చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.

    గర్భధారణ సమయంలో దానిమ్మ తినడం ఆరోగ్యకరమైన ఎంపికేనా? (Is Eating Pomegranate During Pregnancy a Healthy Choice?)

    గర్భధారణ సమయంలో దానిమ్మ మంచిదా? నిస్సందేహంగా.. మంచిదే. గర్భవతిగా ఉన్నపుడు తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి దానిమ్మ. ఎందుకంటే అవి కాబోయే తల్లికి ఆమె శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దానిమ్మలో మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వైద్యులు మరియు ఆరోగ్యనిపుణులు గర్భధారణ కోసం దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ఇందులో ఉండే అధిక విటమిన్స్ మరియు ఫైటోకెమికల్ కంటెంట్ కారణంగా దానిమ్మ గర్భిణీ స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా హృదయం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

    దానిమ్మలో ఉండే పోషకాల విలువ (Pomegranate Nutritional Value in Telugu?)

    ప్రొటీన్, ఐరన్, ఫైబర్, విటమిన్స్ C, K మరియు B, ఫోలేట్ మరియు ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో మూలకాలకు దానిమ్మ గొప్ప మూలం. ఫెయిర్​ బేబీ కోసం గర్భధారణ సమయంలో దానిమ్మ రసం తాగమని ఎంతో మంది సలహా ఇస్తారు. దానిమ్మరసం మాత్రమే కాకుండా దానిమ్మ విత్తనాలు కూడా ఆశించే తల్లులకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.

    గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Pomegranate During Pregnancy in Telugu)

    గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మ పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది. గర్భధారణ సమయంలో దానిమ్మ ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉంటాయి.

    • జీర్ణక్రియలో సహాయపడుతుంది(Aids in digestion): ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణసమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మెరుగైన జీర్ణక్రియ మరియు పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
    • తిమ్మిర్లను నివారిస్తుంది(Prevents cramps): దానిమ్మలో పొటాషియం ఉంటుంది. ఇది గర్భధారణ నొప్పులను తగ్గించడంలో శరీరానికి సహాయపడుతుంది.
    • మెదడు అభివృద్ధిలో సహాయపడుతుంది(Aids in brain development): దానిమ్మలో ఫోలేట్ ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నశిశువు ఆరోగ్యకరమైన మెదడు పెరుగుదలకు సహాయపడుతుంది. పెద్దలు రోజువారీగా తీసుకోవాలని సిఫారసు చేసిన ఫోలేట్​ కంటెంట్​ దానిమ్మలో 10 శాతం వరకు ఉంటుంది.
    • రక్తహీనతను నివారిస్తుంది(Prevents anemia): దానిమ్మ అనేది ఐరన్​కు మరియు విటమిన్ Cకి మంచి సోర్స్. ఇది రక్తహీనత, గర్భధారణ సంబంధిత బలహీనతలు, మరియు అలసటను నివారించడంలో సహాయపడుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం

    గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మ రసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు (Benefits of Having Pomegranate Juice in Telugu?)

    గర్భధారణ సమయంలో దానిమ్మ అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ దానిమ్మ రసం కూడా అంతే స్థాయిలో ప్రయోజనాలను కలిగి ఉంటుందా? అని ఆశ్చర్యపోక, ప్రశ్నించక మానరు. కానీ దానికి సమాధానం అవును అనే వస్తుంది. దానిమ్మ గింజలు మాత్రమే కాకుండా దానిమ్మ రసం కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులో ఫోలేట్ మరియు విటమిన్స్ C, K ఉంటాయి. గర్భిణీ స్త్రీ శరీరానికి అవసరమైన అన్ని రకాల న్యూట్రియంట్స్ మరియు మినరల్స్​ను దానిమ్మ రసం కలిగి ఉంటుంది.

    గర్భవతిగా ఉన్నపుడు రాత్రిపూట దానిమ్మ తినడం మంచిదేనా? (Is it Safe to Eat Pomegranate in Night During Pregnancy?)

    గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మలను ఉదయం పూట తినడం చాలా మంచిది. దానిమ్మ సిట్రస్ ఆమ్ల పండ్లు. గర్భవతిగా ఉన్నపుడు రాత్రి పూట దానిమ్మను తినడం వల్ల గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడవచ్చు. సమస్యలను నివారించేందుకు రాత్రిపూట దానిమ్మ పండుకు దూరంగా ఉండడం మంచిది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు & ప్రమాదాలు

    దానిమ్మ గింజలను తినడం సురక్షితమేనా? (Is it Safe to Eat Pomegranate During Pregnancy in Telugu?)

    గర్భవతులు దానిమ్మ గింజలను పూర్తిగా జీర్ణం చేసుకోవచ్చు. రసం తాగడం కన్నా గింజలను తినడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. దానిమ్మ గింజలు జీర్ణవ్యవస్థ గుండా కదిలేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే వీటిలో కొన్ని జీర్ణం కానివి ఉంటాయి. అయితే అవి ఎటువంటి సమస్యలను కలిగించవు. దానిమ్మ గింజలు తినడం వల్ల హానికర పరిస్థితులు తలెత్తేవి రెండే సందర్భాలు ఉన్నాయి.

    • మీకు కనుక పండ్ల ఎనర్జీ ఉంటే..
    • ఒక వ్యక్తి రక్తం పల్చబడినట్లయితే అతడు దానిమ్మ గింజలను ఎక్కువగా తినడం వల్ల నొప్పి వస్తుంది.

    గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మ తింటే మలబద్దకాన్ని కలిగిస్తుందా? (Can Pomegranate Relieves Constipation During Pregnancy in Telugu?)

    గర్భధారణ సమయంలో దానిమ్మను తినడం మలబద్దకం కలుగుతుందా? అస్సలుకే కలగదు. దానిమ్మ పండులో ఫైబర్స్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఉబ్బరం మరియు మలబద్దకాన్ని నివారించడంలో కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. రెండో విషయం ఏమిటంటే గర్భధారణ సమయంలో దానిమ్మలను తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

    మీ డైట్​లో దానిమ్మలను ఎలా చేర్చుకోవాలి? (How to Add Pomegranate to Your Diet in Telugu?)

    కాబోయే తల్లులు గర్భవతులుగా ఉన్నపుడు వివిధ మార్గాల్లో దానిమ్మలను తీసుకోవచ్చు. అవి:

    • సలాడ్లు లేదా కూరగాయల్లో దానిమ్మను గార్నిష్​గా చేర్చండి
    • మీ పెరుగులో దానిమ్మ గింజలను యాడ్ చేయండి.
    • స్మూతీ పదార్థంగా ఉపయోగించండి.
    • దానిమ్మ జ్యూస్.

    తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

    1. గర్భిణీ స్త్రీ ఎన్ని దానిమ్మ పండ్లను తినవచ్చు?

    గర్భిణీ స్త్రీలు సాధారణంగా రోజుకు ఒక దానిమ్మ పండును తీసుకోవచ్చు. దానిమ్మ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. లేదా పంటి ఎనామిల్ పూత దెబ్బతింటుంది.

    2. శిశువులకు దానిమ్మ మంచిదేనా?

    దానిమ్మ చర్మానికి అనువైనది. అయితే ఇది ఫెయిర్ స్కిన్​ను అందిచదు. జనదారణ పొందిన నమ్మకాన్ని వమ్ము చేసేలా గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మ రసం తాగితే ఫెయిర్ స్కిన్​తో బిడ్డ పుడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, మినరల్స్, పొటాషియం, విటమిన్ B ఉన్నందున దానిమ్మరసం పుట్టబోయే బిడ్డలకు చాలా మంచిది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.