Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Health & Wellness
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ అనేవి సాధారణం. కానీ మీరు అన్ని వేళలా భయంభయంగా లేదా నెర్వస్‌గా ఫీల్ అయితే.. ఇది తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. గర్భధారణ ఒత్తిడి మరియు హార్మోన్ల మార్పులు అనేవి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. కొంత మంది గర్భిణీ స్త్రీలు ఈ కింది వాటిని అనుభవిస్తారు.
ఆందోళన అనేది ప్రస్తుతం సంభవిస్తున్న ఘటనల వల్ల కలిగేది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి భయం పెట్టుకోవడం, తల్లి కావడం, పిల్లలను పెంచడం వంటి వాటి గురించి కలిగే భయం. ఈ భయాలు మరియు చింతలన్నీ ఆందోళనకు దారి తీయొచ్చు. దీనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
నిరాశ, నిస్పృహ అనేది చాలా వారాలు, నెలల పాటు లో ఫీలింగ్ మరియు బాధను కలిగి ఉంటుంది. ఇది చికాకును కూడా కలిగిస్తుంది. కొంత మంది స్త్రీలు గర్భధారణకు ముందు కూడా డిప్రెషన్‌ను అనుభవించవచ్చు. అయితే తల్లి గర్భవతిగా ఉన్నపుడు సంతోషంగా లేకపోతే లేదా ఇంటిలో లేదా పని చేసే ప్రాంతంలో ఏదైనా ఒత్తిడికి గురైనపుడు డిప్రెషన్ సంభవిస్తుంది.
Article continues below advertisment
గర్భిణీ స్త్రీలలో కనిపించే ఇతర భావోద్వేగాలు
మీరు ఆందోళనగా లేదా డిప్రెషన్‌గా ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని లేదా థెరపిస్ట్‌ను సంప్రదించాలి. తల్లి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరగా చికిత్స చేసుకోవాలి. మీ మెడికల్ హిస్టరీని గురించి వైద్యుడితో పంచుకోండి. అప్పుడు గర్భధారణ సమయంలో మీకు సంభవించే సంఘటనల గురించి మీ వైద్యుడికి తెలిసిపోతుంది. కొంత మంది తల్లులు సరైనవి కాని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం మొదలుపెడతారు. ఇది తల్లి లేదా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీకు ఏవైనా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురైతే వీలైనంత త్వరగా మీ థెరపిస్ట్‌ను సంప్రదించండి.
మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స పద్ధతులు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఈ కింది రకాల చికిత్సలను వ్యక్తులకు ఇస్తారు.
శిక్షణ పొందిన వైద్యుడి నుంచి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎల్లప్పుడూ మందులు తీసుకోండి. ఏదైనా ఔషధాన్ని తీసుకోవడం ఆకస్మికంగా ఆపకండి. ఎందుకంటే ఇవి తల్లి మరియు బిడ్డను ప్రభావితం చేసే ఉపసంహరణ దుష్ప్రభావాలను కలిగి ఉండవచ్చు. మీ పూర్తి వైద్య చరిత్రను గురించి ఎల్లప్పుడూ వైద్యులకు అందించండి. ఎందుకంటే కొన్ని రకాల మందులు శిశువు మరియు శిశువు పెరుగుదల మీద కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. మీకు ఏవైనా మానసిక సమస్యలు ఉండి.. గర్భవతి కావాలని ఆలోచిస్తున్నట్లయితే మీ వైద్యుడికి తెలియజేయండి. భవిష్యత్‌లో మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మీ వైద్యుడు మీకు మందులను సిఫారసు చేయవచ్చు.
మీ వైద్యుడు లేదా థెరపిస్ట్‌తో టాక్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. మీ అవసరాలు మరియు మానసిక ఆరోగ్యం గురించి వైద్యుడు ఒక అంచనాకు వస్తాడు. మీకు సుఖంగా ఉండేలా మీ ఫ్రెండ్స్ గ్రూప్‌తో మీ సమస్యలను పంచుకోండి. మీ మానసిక ఒత్తిడిని పెంపొందించుకోవద్దు. ఇది మీకు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మీరు ఇతర గర్భిణీ స్త్రీలతో కమ్యూనికేట్ చేయాలని అనుకోవచ్చు. మీ సమస్యలను ఇతరులతో పంచుకోవడం వలన మీకు అవగాహన వస్తుంది. అంతే కాకుండా అపారమైన మద్దతు లభిస్తుంది. మీరు మీ గర్భం లేదా ఇతర సమస్య గురించి ఆందోళన చెందుతుంటే మీ కుటుంబం లేదా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. తద్వారా వారు మీకు మద్దతును అందిస్తారు. ఇది మీ ఆందోళన లేదా డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
Article continues below advertisment
కొన్ని రకాల సాధారణ వ్యాయామాలైన యోగా, ధ్యానం అనేవి ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయం చేస్తాయి. మీకు ఎప్పుడైనా ఆతృతగా అనిపిస్తే ఇంటి పని చేయడం, మీకు ఇష్టమైన టీవీ షోలు చూడడం, లేదా మీ స్నేహితులతో బయటకు వెళ్లడం వంటి పనులు చేసేందుకు ప్రయత్నించండి. మీకు ఆందోళనగా మరియు డిప్రెషన్‌గా అనిపించినపుడు లోతైన శ్వాసను తీసుకోండి. లేదా మీ స్నేహితులు లేదా కుటుంబసభ్యులకు కాల్ చేయండి. మీకు మంచి అనుభూతి కలుగుతుంది.
గర్భధారణ సమయంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు గర్భధారణ సమయంలో మానసిక స్థితిని మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కానీ ఇది నిజం. రంగురంగుల ప్లేట్లో మంచి ఆహారం ఎల్లప్పుడూ తినాలనే ఉత్సాహాన్నిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే ఒకరిలో సంతోషకరమైన హార్మోన్లను పెంచుతాయి. ఎండార్పిన్లు, డోపమైన్, మరియు సెరిటోనిన్ వంటి వాటి స్థాయిని పెంచుతాయి. గర్భధారణ సమయంలో సరైన విధంగా తినడం వల్ల వీటి ఉత్పత్తి పెరుగుతుంది. అందువల్ల మంచి ఆహారం గర్భధారణ సమయంలో మంచి శారీరక ఆరోగ్యంతో పాటు మంచి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటి | దాని ప్రాముఖ్యత & లక్షణాలను అర్థం చేసుకోవడం
Mental health during pregnancy in telugu, How to maintain good mental health during pregnancy in telugu, Things that effect mental health in telugu, Things that keep your mental health stable in telugu, emotions occur if mental health disturbed in telugu.
Article continues below advertisment
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
(1,166 Views)
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
(181 Views)
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
(565 Views)
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
(153 Views)
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
(90 Views)
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
(397 Views)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |