back search
Browse faster in app
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
 • Home arrow
 • Postnatal Care arrow
 • డెలివరీ తరువాత వచ్చే ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలి? arrow

In this Article

  డెలివరీ తరువాత వచ్చే ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలి?

  Postnatal Care

  డెలివరీ తరువాత వచ్చే ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలి?

  1 June 2023 న నవీకరించబడింది

  డెలివరీ తరువాత వచ్చే డిప్రెషన్ వలన మనం తక్కువగా మాట్లాడే పరిస్థితి తలెత్తుతుంది. ప్రసవం తర్వాత తల్లులు అధిక ఆందోళనతో బాధపడతారు. ఇది భయాందోళన లేదా నిరంతర చింతను కలిగిస్తుంది. ప్రసవం తర్వాత మొదటి రెండు వారాల వరకు ఈ పరిస్థితులు సాధారణమే అయినా.. కానీ ఈ పరిస్థితి గురించి తల్లుల కుటుంబసభ్యులు పూర్తి అవగాహనతో ఉండి గుర్తించాలి. ఈ పరిస్థితి మరియు దాని లక్షణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ఆర్టికల్ ప్రదాన ఉద్దేశం.

  ప్రసవానంతర ఆందోళన అంటే ఏమిటి?

  బిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిన తర్వాత.. తల్లులలో కొంత డిప్రెషన్ వస్తుండడం సహజం. ఇటువంటి భావాలు విపరీతమైనవిగా మారవచ్చు. బిడ్డకు త్వరగా జన్మనిచ్చి కళ్లారా చూడాలనే ఆతృత కలగడం సహజం. ప్రసవానంతర ఆందోళన ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండా తల్లిదండ్రులకు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే వారు జరుగుతున్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో జరిగిన ప్రతికూల సంఘటన కూడా ఇక్కడ ట్రిగ్గర్ ఏజెంట్​ లా (వారిని ఆందోళన పడేలా ప్రేరేపించడం) పని చేస్తుంది. ప్రసవానంతర ఆందోళన లక్షణాలు ప్రసవానంతర డిప్రెషన్​తో సమానంగా ఉంటాయి. అందువల్ల ఈ పరిస్థితిని గుర్తించి చికిత్స చేయడం చాలా అవసరం.

  ప్రసవానంతర ఆందోళన యొక్క లక్షణాలు

  ఆందోళన అనేది మీ శరీరాన్ని ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధం చేస్తుంది.

  • సాధారణ శారీరక లక్షణాలు:
  • నిద్ర సమస్యలు
  • పెరిగిన హృదయ స్పందనల రేటు
  • వికారం మరియు కడుపులో నొప్పి
  • ఊపిరిపీల్చుకునేందుకు కష్టంగా అనిపించడం
  • ఆకలి లేకపోవడం
  • కండరాల నొప్పి
  • అశాంతి

  బయటకు కనిపించే లక్షణాలు

  • అతిగా నియంత్రించుకుని ఉండడం
  • కొంత మంది వ్యక్తులు లేదా కొన్ని నిర్దిష్ట పరిస్థితులకు దూరంగా ఉండడం
  • ఒకే విషయాన్ని పదే పదే తనిఖీ చేయడం
  • OCD(అతిశుభ్రత వ్యాధి) కలిగి ఉండడం
  • భావోద్వేగ లక్షణాలు
  • ప్రశాంతంగా ఉండలేకపోవడం
  • చిరాకు
  • ఎక్కువగా ఆలోచించడం
  • మతిమరుపు
  • అన్ని వేళలా బయపడిపోవడం
  • నిరంతరం ప్రతికూలంగా ఉండడం

  ప్రసవానంతర ఆందోళనలకు కారణం:

  • హార్మోన్ల స్థాయిలో ఆకస్మిక మార్పు
  • నిద్ర లేకపోవడం
  • ఒకే సారి బాధ్యతగా ఫీల్ కావడం
  • కష్టతరమైన గర్భం లేదా ఒత్తిడితో కూడుకున్న ఘటన
  • పాత రోజుల్లో ఆందోళన లేదా డిప్రెషన్ కలిగి ఉండడం

  మీకు ఇది కూడా నచ్చుతుంది: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటీ? దీన్ని ఎలా నయం చేయాలి?

  ప్రసవానంతర ఆందోళనలకు ఎలా చికిత్స చేయాలి?

  • కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (CBT)- ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనా విధానాలు ఎలా మారుతాయో ఇది గుర్తిస్తుంది. ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాలను అభివృద్ధి చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది. శిక్షణ పొందిన బిహేవియరల్ థెరపిస్ట్ ఈ చికిత్సను చేస్తాడు.
  • అరోమాథెరపీ అనేది మెదడులో ఉన్న భావోద్వేగ కేంద్రాన్ని శాంతపరిచేందుకు కొన్ని రకాల నూనెలతో చికిత్స చేసే పద్ధతి. ఈ థెరపీ చాలా ఉపశమనం కలిగిస్తుంది.
  • యాంటీ డిప్రెసెంట్ మందులను (SSRIs) సర్వసాధరణంగా ఉపయోగిస్తారు. మనిషి ఆలోచనను స్థిరంగా ఉంచే మెదడు రసాయనాలను పెంచడం ద్వారా ఇది పని చేస్తుంది.
  • బెంజోడియాజిపైన్స్ వంటి ఆందోళనను తక్కువ చేసే(యాంటీ యాంక్సైటీ) మందులు ఉపయోగకరంగా ఉంటాయి.

  ప్రసవానంతర ఆందోళన కోసం ఉపయోగించే మందులు

  పాలిచ్చే తల్లులు ఈ మందులను తీసుకునే ముందు వైద్యుడితో మాట్లాడాలి. ఈ మందులను రొమ్ముపాల ద్వారా శిశువుకు కూడా బదిలీ అవుతాయి. కానీ తక్కువ ట్రాన్స్​ఫర్ లెవెల్స్ కారణంగా నేటి రోజుల్లో చాలా యాంటీ డిప్రెసెంట్స్ (డిప్రెషన్​ కొరకు వాడే మందులు) తక్కువ ట్రాన్స్​ఫర్ లెవెల్స్​ను కలిగి ఉంటున్నాయి. కాబట్టి వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.

  వైద్యులు సూచించే కొన్ని సాధారణ మందులు:

  • SSRIs
  • SNRIs
  • బుప్రోపియన్
  • ట్రై సైకిల్ యాంటీ డిప్రెసెంట్స్

  ప్రసవానంతర ఆందోళన కోసం నాన్ మెడికేటెడ్ చికిత్స

  ఇటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులు తమ అనుభవాలను పంచుకునేందుకు తమలాగే బాధపడుతున్న వ్యక్తుల సమూహాలను కనుక్కోవాలి. కుటుంబం లేదా స్నేహితులను సహాయం కోసం అడగండి. ప్రతి రోజు ఏదో రకమైన వ్యాయామం చేసేందుకు ప్రయత్నించండి. ఇంటిలోపలే శిశువును ఆడించడం ద్వారా కూడా ఇది చేయొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. సరిపోయేంత నిద్రపోండి. శిశువు నిద్రపోతున్నపుడు మీరు కూడా నిద్రించండి. మందులు పని చేయడం స్టార్ట్ కావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అకస్మాత్తుగా ఈ మందులను ఉపయోగించడం ఆపకూడదు. PPD(ప్రసవానంతర డిప్రెషన్) కనుక కనిపించినట్లయితే.. బ్రెక్సనోలోన్​తో కలిపి IV మెడికేషన్​ను వైద్యుడు ప్రారంభిస్తాడు.

  ప్రసవానంతర ఆందోళన మరియు ప్రసవానంతర డిప్రెషన్ (ఒత్తిడి) మధ్య వ్యత్యాసం ఉందా?

  ఈ రెండు పరిస్థితులు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటిని ఒక దాని నుంచి మరో దానిని వేరు చేయడం సాధ్యమవుతుంది. PPD అనేది ప్రమాదకరమైన మానసిక వ్యాధి. ఇది వ్యక్తి యొక్క రోజువారీ దినచర్యకు ఆటంకం కలిగిస్తుంది. ప్రసవం తర్వాత మొదటి రెండు వారాలు ఆందోళన చెందడం సహజం. ఇది రెండు వారాల కంటే ఎక్కువ కొనసాగితే దీని గురించి ఆలోచించాలి. వైద్యుడికి తెలియజేయాలి. PPD అనేది కొన్ని వారాల నుంచి నెలల వరకు ఉంటుంది. ప్రసవానంతర డిప్రెషన్​ను మేనేజ్ చేసేందుకు సైకోథెరపీ (మానసిక చికిత్స) అవసరం. అలవాట్లు, యోగా, బ్రీతింగ్ వ్యాయామాలు ప్రసవానంతర ఆందోళనను తగ్గించేందుకు సహాయపడతాయి.

  మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతరం వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి?

  ప్రసవానంతర ఆందోళన అనేది మళ్లీ వస్తుందా?

  అవును అది తిరిగిరావచ్చు. సరైన చికిత్స చేయకుండా వదిలేస్తే అది మరలా ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రసవానంతర డిప్రెషన్​కు దారి తీస్తుంది.

  సహాయం కోసం నేను వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

  ఈ కింద పేర్కొన్న ప్రత్యేక సందర్భాలు సంభవించినపుడు

  • శిశువుతో బంధం ఏర్పరుచుకోవడం కష్టతరమైనపుడు..
  • పగలు రాత్రి తేడా లేకుండా దిగాలు చెందుతున్నపుడు
  • డిప్రెషన్ (ఒత్తిడి) సంకేతాలు కనిపించినపుడు
  • ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు వచ్చినపుడు.
  • తమకు తాము హాని తలపెట్టుకోవడం లేదా బిడ్డకు హాని కలిగించడం వంటి ఆలోచనలు వచ్చినపుడు

  బిడ్డకు జన్మనిచ్చిత తర్వాత కొత్త జీవనశైలికి అలవాటు పడడం సవాలుగా ఉంటుంది. కొంత చింత మరియు ఆందోళన సహజం. కొంత మందికి మాత్రం ఈ ఆందోళన వారి రోజు వారి కార్యకలాపాలకు ఆటంకం కలిగించేంత ఎక్కువగా ఉంటుంది. శారీరక మరియు మానసిక భావోద్వేగ సంకేతాలు కనిపించడం ప్రారంభించినపుడు ఇది PPA(ప్రసవానంతర ఆందోళన)ను సూచిస్తుంది. ఈ అనియంత్రిత భావోద్వేగాలకు వైద్య నిపుణులు మాత్రమే చికిత్స చేసి.. నయం చేస్తారు. హెల్త్ కేర్ ప్రొవైడర్, లేదా కుటుంబసభ్యుల నుంచి సహాయం తీసుకోండి. సరైన చికిత్సతో ఈ లక్షణాలు తగ్గుతాయి. ఇందుకు కాస్త సమయం పడుతుంది.

  Is this helpful?

  thumbs_upYes

  thumb_downNo

  Written by

  dhanlaxmirao

  dhanlaxmirao

  Read from 5000+ Articles, topics, verified by MYLO.

  Download MyloLogotoday!
  Download Mylo App

  RECENTLY PUBLISHED ARTICLES

  our most recent articles

  100% Secure Payment Using

  Stay safe | Secure Checkout | Safe delivery

  Have any Queries or Concerns?

  CONTACT US
  +91-8047190745
  shop@mylofamily.com
  certificate

  Made Safe

  certificate

  Cruelty Free

  certificate

  Vegan Certified

  certificate

  Toxic Free

  About Us
  Mylo_logo

  At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

  All trademarks are properties of their respective owners.2017-2023©Blupin Technologies Pvt Ltd. All rights reserved.