Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Conception
28 August 2023 న నవీకరించబడింది
ఒక జంట ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే వైద్యుడు వాళ్లకు కృతిమ గర్భధారణ చికిత్సావిధానం (IUI) గురించి సిఫారసు చేయొచ్చు. సాధారణ పద్ధతిలో ప్రెగ్నెంట్ కాని అనేక మంది ఈ మెథడ్ ద్వారా ప్రెగ్నెంట్ అవుతారు. ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ప్రయోజనాలతో పాటు ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. కృతిమ గర్భ ధారణ సమయంలో స్త్రీ గర్భాశయంలోకి స్పెర్మ్‌ను నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. వైద్యుడు గర్భాశయంలోకి స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేసే పద్ధతిని ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) అని అంటారు. ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎదుర్కొనేందుకు ఇది చాలా ప్రజాదరణ పొందిన ట్రీట్మెంట్. ఏది దీనిని ఉపయోగకరంగా మారుస్తుంది?
IUI చికిత్సా విధానంలో స్పెర్మ్ జర్నీ తగ్గుతుంది. ఇతర అడ్డంకులు కూడా తొలగిస్తారు. ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంటే డాక్టర్ సూచించే మొదటి చికిత్సా విధానం ఇది. అండాశయం అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అండాలను విడుదల చేసినపుడు శుభ్రం చేసిన స్పెర్మ్‌ను వెంటనే గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేసిన స్పెర్మ్ ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశించి అండాలను ఫలదీకణం చేస్తుంది. అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇన్ఫెర్టిలిటీ సమస్యలను బట్టి IUI రెగ్యులర్ సైకిల్ లేదా ఫెర్టిలిటీ డ్రగ్స్‌తో కలిపి చేయొచ్చు. IUI చికిత్సావిధానం అనేది తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఫెర్టిలిటీ చికిత్సా విధానం. ఇది నేరుగా ఉండే చికిత్స. తక్కువ టెక్ ప్రాసెస్‌ను కలిగి ఉంటుంది. వుమెన్ ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఇది అవకాశాలను పెంచుతుంది. కానీ ప్రతి వ్యక్తి శరీరం వేరుగా ఉంటుంది కావున IUI చికిత్సా విధానం ప్రతి ఒక్కరికీ సక్సెస్ అవుతుందని ఎటువంటి గ్యారంటీ లేదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) వలన ప్రెగ్నెంట్ అయ్యే చాన్సెస్ ఏమిటి?
గర్భధారణ ఆపరేషన్‌కు ముందు ఓవులేషన్ (అండోత్సర్గము) ప్రోత్సహించే మందులను తీసుకోవచ్చు. వీర్యాన్ని డోనార్ (దాత) లేదా భాగస్వామి నుంచి తీసుకుంటారు. స్పెర్మ్ నుంచి కాన్సంట్రేటెడ్ (ఆచరణాత్మకమైన) స్పెర్మ్ తీసుకునే ప్రక్రియనే ‘స్పెర్మ్ వాషింగ్’ అని అంటారు. ఈ ప్రక్రియ తర్వాత డాక్టర్ వెంటనే స్పెర్మ్‌ను గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అండాన్ని స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందించి.. గర్భం యొక్క లైనింగ్లో అమర్చినట్లయితే ఆ మహిళ గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రక్రియకు ముందు ఇంట్రాయుటరైన్ ఇన్సెప్షన్ (IUI) కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
IUI చికిత్స కోసం అవసరమైన స్పెర్మ్‌ను సేకరించేందుకు వివిధ పద్ధతులు ఉన్నాయి. ధృవీకరణ ఉన్న ల్యాబ్ లేదా డాక్టర్ అందజేసే స్టెరిలైజ్ చేసిన ప్లాస్టిక్ కప్ లేదా గాజు గ్లాస్లో మగవారు హస్తప్రయోగం చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే విలక్షణమైన పద్ధతి. అలా కాకుండా డాక్టర్ అందజేసే కండోమ్ ద్వారా మీరు సెక్స్ చేసే సమయంలో కూడా స్పెర్మ్ పొందొచ్చు. ఒక వేళ మగవారు తిరోగమన స్ఖలనంతో బాధపడుతుంటే అతడి మూత్రాన్ని కలెక్ట్ చేసి కూడా ల్యాబ్ ద్వారా స్పెర్మ్‌ను పొందొచ్చు. స్ఖలనం, స్తంభన సమస్య ఉన్న పురుషులకు, వెన్నుముక గాయాలు ఉన్న పురుషులకు వైబ్రేషనల్ స్టిములేషన్ లేదా ఎలక్ట్రోఎజాక్యులేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఎలక్ట్రోఎజాక్యులేషన్ అనేది స్పెర్మ్ నమూనాను క్రియేట్ చేసేందుకు ఎలక్ట్రో స్టిములేషన్ను కలిగి ఉంటుంది. వెన్నుముక గాయాలు ఉన్న పురుషులకు ఎలక్ట్రోఎజాక్యులేషన్ను డాక్టర్ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. అంతే కాక అనస్థేషియా (మత్తుమందు) ఇచ్చి దీనిని ఆపరేషన్ రూమ్‌లో కూడా చేమొచ్చు. ఈ చికిత్సలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెన్నుముక దెబ్బతిన్న పురుషులలో సర్జికల్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్ పేరుతో ఉండే ASRM ఫ్యాక్ట్ షీట్‌ను పరిశీలించండి.
సేకరించిన తర్వాత.. వీర్యం నుంచి సెమినల్ ద్రవాన్ని వేరు చేసేందుకు ల్యాబ్‌లో వాష్ చేస్తారు. ఆరోగ్యకరమైన వీర్యాన్ని ఉంచుతారు. (సెమినల్ ద్రవం అనేది మహిళలలో కండరాల నొప్పి వచ్చేందుకు కారణం అవుతుంది). ఈ ప్రాసెస్‌కు రెండు గంటల వరకు సమయం పడుతుంది. స్త్రీ ఒవొల్యూషన్ టైమ్‌కు ముందు IUI చేస్తారు. వీర్యం తయారయిన తర్వాత IUI మెథడ్ చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. స్త్రీ బెడ్ మీద పడుకున్న తర్వాత ఆమె యోనిలోకి చొప్పించిన స్పెక్యులమ్‌తో గర్భాశయాన్ని పరిశీలిస్తారు. వాష్ చేసిన వీర్యాన్ని కాథర్ (ఒక చొన్న గొట్టం) ద్వారా గర్భాశయంలోకి చొప్పిస్తారు. ఈ సర్జరీ ఎటువంటి నొప్పి లేకుండా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొంత మంది స్త్రీలు కండరాల నొప్పి ఎదుర్కొంటారు. కొంత మంది స్త్రీలు IUI తర్వాత ఒకటి రెండు రోజుల వరకు స్వల్ప రక్తస్రావాన్ని (స్పాటింగ్) ఎదుర్కొంటారు.
Sperm collection in telugu, How IUI is done in telugu, Ovulation in females in telugu, How to Get Sperm for IUI (Intrauterine Insemination) Procedure in English, How to Get Sperm for IUI (Intrauterine Insemination) Procedure in Hindi, How to Get Sperm for IUI (Intrauterine Insemination) Procedure in Tamil, How to Get Sperm for IUI (Intrauterine Insemination) Procedure in Bengali.
Yes
No
Written by
saradaayyala
saradaayyala
గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఇంట్లోనే పరీక్షించటం ఎలా (How to Check Baby's Heartbeat During Pregnancy at Home in Telugu)?
మీ ప్రెగ్నెన్సీ రెండో త్రైమాసికంలో మీరు మీ భాగస్వామితో సెక్స్ చేయడం సురక్షితమేనా (How safely can you have sex with your partner during the second trimester of your pregnancy in Telugu)?
గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారంలో చిరుధాన్యాలని తినడం వలన వచ్చే లాభాలు | Benefits of Millet During Pregnancy in Telugu
గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Brown Rice During Pregnancy: Benefits & Precautions in Telugu
శిశువులకు ప్లష్ బాల్ యొక్క టాప్ 5 ప్రయోజనాలు (Top 5 Benefits of Plush Balls for Babies in Telugu)
రొమ్ము వాపు గురించి మరింత తెలుసుకోండి- కారణాలు, చికిత్స, లక్షణాలు (Know More About Breast Engorgement- Causes, Treatment & Symptoms in Telugu)
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Myo-inositol | Skin - Pregnancy & New Mom | By Concern | Stretch Marks Cream | Maternity Wear | Lactation | Maternity Gear | Shop By Ingredient | Dhanwantaram | Shea Butter | Skin - Daily Wellness | By Concern | Digestive Health | Immunity | By Ingredient | Saffron | Wheatgrass | Skin - Weight | By Concern | Weight Management | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |