hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Conception arrow
  • ప్రెగ్నెన్సీ కి సంబందించిన IUI (ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్) చికిత్స గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు arrow

In this Article

    ప్రెగ్నెన్సీ కి సంబందించిన IUI (ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్) చికిత్స గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు

    Conception

    ప్రెగ్నెన్సీ కి సంబందించిన IUI (ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్) చికిత్స గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) అనేది ఇన్​ఫెర్టిలిటీ (వ్యంధత్వం) కి చేసే చికిత్స. ఈ ప్రక్రియలో స్త్రీ అండాశయం ఫలదీకణం చెంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లను విడుదల చేసే సమయంలో వీర్యాన్ని నేరుగా.. గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) ఫలితం ఏమిటంటే.. వీర్యం ఫెలోపియన్ ట్యూబ్​లోకి వెళ్లి అండాన్ని ఫలదీకరణం చేస్తుంది. తత్ఫలితంగా గర్భం వస్తుంది. ఈ రకమైన కృతిమ గర్భధారణ కింది సమస్యలను కలిగి ఉన్న జంటలకు ఉపయోగిస్తారు.

    1. వివరించలేని ఇన్​ఫెర్టిలిటీ (వంధ్యత్వం):

    వివరించలేని వంధ్యత్వానికి చికిత్సగా దీనిని నిర్వహిస్తారు.

    2. ఎండోమెట్రియాసిస్ సంబంధిత వంధ్యత్వం:

    ఎండోమెట్రియాసిస్ వంధ్యత్వానికి మందులతో పాటుగా IUI కూడా మొదటి చికిత్సగా ఉంది.

    3. పురుషుల వంధ్యత్వం:

    వీర్యం విశ్లేషణ సగటు వీర్యం స్థాయి కంటే తక్కువసంఖ్యలో ఉండడం, బలహీన కదలిక లేదా వీర్యకణాల ఆకారం, పరిమాణంలో అసాధారణతను చూపుతుంది. IUI ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది వీర్యం నుంచి తక్కువ క్వాలిటీ వీర్యాన్ని వేరు చేస్తుంది.

    4. ఒవొల్యూషన్​ (అండోత్సర్గము) సంబంధిత వంధ్యత్వం:

    ఎవరైతే స్త్రీలు ఒవొల్యూషన్ (అండోత్సర్గము) సమస్యలు లేదా అండాల సంఖ్య తగ్గుదలతో బాధపడుతున్నారో వారికి IUI చేయవచ్చు.

    Article continues below advertisment

    5. గర్భాశయ సంబంధిత వంధ్యత్వం:

    ఒవొల్యూషన్ (అండోత్సర్గము) సమయంలో స్త్రీ గర్భం శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వీర్యం యోని నుంచి ఫెలోపియన్ ట్యూబ్​లకు ప్రయాణించేందుకు సహాయం చేస్తుంది. కానీ గర్భాశయ శ్లేష్మం చాలా మందంగా ఉన్నపుడు అది వీర్య ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. అండాన్ని చేరకుండా నిరోధిస్తుంది.

    IUI ఎలా సహాయపడుతుంది?

    IUI అనేది నాన్ ఇన్వాసివ్ మరియు తక్కువ ఖరీదైన సంతానోత్పత్తి చికిత్స. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్​తో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అయితే కింది సందర్భాలలో IUI చికిత్స అనేది ప్రభావవంతంగా ఉండదు.

    • ఎండోమెట్రిసిస్ మధ్యస్థంగా ఉన్న వారికి
    • ఫెలోపియన్ ట్యూబ్స్ తీసేసిన వారికి
    • ఫెలోపియన్ ట్యూబ్స్​లో వ్యాధులు ఉన్నవారికి
    • మల్టీపుల్ పెల్విక్ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలకు
    • వీర్యం ఉత్పత్తి చేయని పురుషులకు..
    • IUI చికిత్స విజయశాతం వయస్సు, ముందు ఉన్న ఆరోగ్య సమస్యలు, సంతానోత్పత్తి మందుల వాడకం ఇంకా ఇతర కారకాల మీద ఆధారపడి ఉంటుంది.

    IUI చికిత్స కోసం సంసిద్ధత

    IUI చికిత్స అసలు ప్రక్రియ మొదలయ్యే ముందు కింది వాటిని కలిగి ఉంటుంది. వీర్య నమూనా తీసుకోవడం: వీర్య నమూనాను మహిళ భాగస్వామి నుంచి తీసుకుంటారు. వీర్యంలోని నాన్ స్పెర్మ్ ఎలిమెంట్స్ మహిళ ఫలదీకణానికి ఆటంకం కలిగించే చర్యలను కలిగి ఉంటాయి. తక్కువ నాణ్యత గల వీర్యకణాలు లేకుండా కేవలం అధిక నాణ్యత ఉన్న వీర్యకణాలు మాత్రమే ఉండేలా వీర్యాన్ని శుభ్ర పరుస్తారు. గర్భం సాధించే అవకాశాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఒవొల్యూషన్​ (అండోత్సర్గము) గుర్తించేందుకు సంకేతాలు: IUI చేసేందుకు ఒవొల్యూషన్ సమయం చాలా ముఖ్యం కాబట్టి.. మీరు హోమ్ యూరిన్ ఒవొల్యూషన్ కిట్ ఉపయోగించి.. లుటినైజింగ్ హార్మోన్ విడుదలను గుర్తించాలి. ఈ కిట్ లుటినైజింగ్ హార్మోన్​ను గుర్తిస్తుంది. సమయాన్ని నిర్ణయించండి: చాలా IUIలు ఒవొల్యూషన్ (అండోత్సర్గము) వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత చేస్తారు.

    గర్భధారణ ఫలితం..

    ఇంట్లో గర్భధారణ పరీక్ష చేసుకోవడానికి రెండు వారాల సమయం అవసరం కావొచ్చు. త్వరగా పరీక్ష చేసుకోవడం వలన తప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ హార్మోన్లు ఇంకా కొలవదగిన స్థాయిలో లేకపోతే నెగటివ్ రిజల్ట్ వస్తుంది. లేదా ఒవల్యూషన్​ను ప్రేరేపించే మెడిసిన్ గర్భాన్ని సూచించే తప్పుడు పాజిటివ్​కు దారి తీయొచ్చు. మీరు రెండు వారాల తర్వాత ఇంటి వద్ద గర్భనిర్ధారణ పరీక్ష చేసుకున్నాక కూడా గర్భవతి అని తేలకపోతే మీరు వేరే సంతానోత్పత్తి చికిత్సలను ప్రయత్నించవచ్చు. లేకపోతే మూడు నుంచి ఆరునెలల విరామం ఇచ్చి అదే చికిత్సను మరలా ప్రయత్నించవచ్చు.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.