


PCOS & PCOD
3 November 2023 న నవీకరించబడింది
పునరుత్పాదక వయసులో ఉన్నప్పుడు మహిళల్లో వచ్చే ఒక హార్మోన్ సమస్యే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్). పీసీఓఎస్ ఉన్న మహిళల్లో నెలవారీగా రావాల్సిన రుతుక్రమం ఎక్కువ సమయం తీసుకోవడం లేదా అకాల సమయంలో రావడం వంటి పరిణామాలు ఏర్పడుతాయి.. కొన్నిసార్లు మగ హార్మోన్ (ఆండ్రోజెన్) ఎక్కువగా విడుదల అవుతుంది. అండాలు ఎక్కువ ఫోలికల్స్ రూపంలో అభివృద్ధి చెందుతాయి కానీ అండాల విడుదల మాత్రం జరగదు. పీసీఓఎస్ రావడానికి అసలు కారణమేమిటో తెలియదు. పీసీఓఎస్ లక్షణాలను ముందే గుర్తించి సరైన చికిత్స తీసుకొని వ్యాధి నిర్వహణ ద్వారా దీర్ఘకాలికంగా రాబోయే టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చు.
కింది రెండు లక్షణాల్లో ఏది కనిపించినా పునరుత్పాదక వయసులో ఉన్న మహిళలు వైద్యుడిని కలిసి వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి.
ఈ లక్షణాల అర్థం ఓవరీలు అండాలను సమయానికి విడుదల చేయకపోవడం.
ఈ కేసులో, రక్తంలో అధికస్థాయి టెస్టోస్టిరాన్ కనిపిస్తుంది. పాలీసిస్టిక్ ఓవరీలు అల్ట్రాసౌండ్ మీద కనిపిస్తాయి పాలీసిస్టిక్ ఓవరీస్ ఉండటాన్ని స్కాన్స్ చూపిస్తాయి. ఆమె కండీషన్ నిర్ధారణ అయ్యే వరకు, అల్ట్రాసౌండ్ తీయించాల్సిన అవసరం లేదు
పీసీఓఎస్ గుర్తించడానికి కచ్చితమైన పరీక్షలేమీ లేవు. వైద్యులు ఎక్కువగా కుటుంబలోని ఇతర వ్యక్తుల చరిత్ర, వారి రుతుక్రమ చక్రాలు, బరువును తెలుసుకుని వాటి ఆధారంగా చికిత్స ప్రారంభిస్తారు. ఎక్కువ జుత్తు పెరిగిందా, ఇన్సులిన్ నిరోధకం ఉన్నాయా, మొటిమలు ఉన్నాయా తదితర భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వైద్యుడు కిందివాటిని సూచించవచ్చు.
గర్భాశయంలో ఉబ్బిన ఓవరీలు ఉన్నాయేమో పరీక్షిస్తారు.
హర్మోన్ స్థాయిలు, గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకోవడానికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు.
ఓవరీలలో సిస్ట్‌లు ఉన్నాయేమో తెలుసుకోవడానికి లేదా గర్భాశయ మందాన్ని తెలుసుకోవడానికి
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలోని మొదటి మూడు నెలలలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవడం సురక్షితమేనా?
ఫోలికల్స్ గురించి ట్రాన్స్ వజీనల్ అల్ట్రాసౌండ్ వివరాలు అందిస్తుంది.
పొత్తికడుపు మీద చేసే అల్ట్రాసౌండ్ వల్ల పీసీఓఎస్‌తో సంబంధం ఉన్న అధిక ప్రొలాక్టిన్ గురించి వివరాలు తెలుస్తాయి. ఎక్కువగా ప్రొలాక్టిన్ ఉండటం వల్ల రుతుచక్రం క్రమం తప్పుతుంది.
పీసీఓస్ ఉన్న మహిళలు వివిధ లక్షణాలు కలిగి ఉంటారు.అందుకే ఒక క్రమమైన పీసీఓస్ చికిత్స ఏమీ లేదు. పెళ్లి కాని మహిళలకు పీసీఓస్ చికిత్స ఇలా ఉంటుంది.
పీసీఓస్ ఎదుర్కోవడానికి ఉన్న ఒకానొక ఉత్తమ పద్ధతి ఆరోగ్యకరమైన డైట్. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం.
వైద్యుడు సూచిస్తే క్లోమిఫీన్, మెట్‌ఫార్మిన్ మందులను అండాలు సరిగా విడుదలవడానికి వాడవచ్చు.
పీసీఓఎస్, ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారికి కొద్ది కాలం పాటు క్లోమిఫిన్, లెట్రోజోల్ ఇవ్వడం ద్వారా విజయవంతంగా చికిత్స ఇవ్వవచ్చు.
వైద్యుడు కాంట్రాసెప్టివ్ పిల్స్‌ను రుతుక్రమం సరిగా రావడానికి, ప్రొజెస్టోజెన్ మాత్రలను పీరియడ్స్ వచ్చేందుకు సూచించవచ్చు.
పీసీఓఎస్ ఉన్న మహిళలకు ఓవలేషన్ జరిగేందుకు కొన్ని మందులు ఇవ్వవచ్చు. క్లోమిఫిన్, టెట్రోజోల్ నోటి ద్వారా తీసుకోవచ్చు, డోనాడోట్రోపిన్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.
జుట్టు తొలగించే ప్రక్రియలైన డీఫిలటోరిస్, ఎలక్ట్రోలైసిస్, లేదా లేజర్ థెరపీ ద్వారా దీనికి చికిత్స అందించవచ్చు.
ఒకవేళ మహిళ ఎక్కువ బరువుతో ఉంటే కొన్ని కిలోలు తగ్గాల్సిందిగా వైద్యుడు సూచించవచ్చు.
ఒకవేళ మందులు పని చేయకపోతే ఓవరీల పనితీరు మెరుగుపరిచేందుకు వైద్యులు సర్జరీ నిర్వహించవచ్చు. ఇవే కాకుండా పీసీఓస్ ఆయుర్వేదిక్ చికిత్సను కూడా ఎంచుకోవచ్చు.
ఇన్సులిన్ తో పాటు, పీసీఓఎస్ డైట్ కూడా నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల పోషకాలను అందించి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించే డైట్ ద్వారా ఇన్సులిన్ కూడా తగిన మోతాదులోనే ఉంటుంది.
పీసీఓస్ ఉన్నప్పుడు తినాల్సిన ఆహారం గురించి మరింత తెలుసుకోండి
తక్కువ జీఐ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ పెరుగుదలను నియంత్రించవచ్చు. పూర్ణ ధాన్యాలు, తక్కువ పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు, లెగుమ్స్ వంటివి తక్కువ జీఐకి ఉదాహరణలు.
ఈ డైట్ వల్ల పీసీఓస్‌లో ఇన్‌ఫ్లమేషన్ సంబంధిత సమస్య అయిన అలసటను తగ్గించవచ్చు. ఉదాహరణకు బెర్రీలు, ఆలివ్ ఆయిల్.
డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ (డి.ఎ.ఎస్.హెచ్.) డైట్ వల్ల పీసీఓస్ లక్షణాలను నిర్వహించవచ్చు. అది చేపలు, పండ్లు, తక్కువ కొవ్వు ఉన్న డైరీ పదార్థాలు, మాంసం, కూరగాయలు, పూర్ణ ధాన్యాల్లో ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?
రీఫైన్డ్ చేసిన కార్బోహైడ్రేట్స్‌ను పీసీఓఎస్ ఉన్న మహిళలు తినకూడదు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మంటను పెంచి ఇన్సులిన్‌ను అడ్డుకుంటాయి.
పీసీఓఎస్ ఉన్నవారిలో ఇవి మంటలను పెంచి బరువు పెంచి, గాస్ట్రిక్ సమస్యలను పెంచుతాయి.
అధికంగా చక్కెర ఉన్న ద్రవాలు ఇన్సులిన్ విడుదలను పెంచి అసమతుల్యతను పెంచుతాయి. అవి పీసీఓఎస్‌ను ప్రభావితం చేసి దారుణమైన లక్షణాలైన మూడ్ స్వింగ్, బ్లోటింగ్‌లను పెంచుతాయి.
అధిక కొవ్వు కలిగిన పదార్థాల వంటి వాటిని పీసీఓఎస్ మహిళలు తినకూడదు. ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
మార్గరీన్, లార్డ్ వంటివి పీసీఓఎస్ లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి.
అధికంగా రెడ్ మీట్ (మేక, గొర్రె మాంసం) తీసుకోవడంలో వల్ల శరీరంలో మంట పెరిగి ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. పీసీఓఎస్ లక్షణాల తీవ్రతను పెంచుతుంది.
పీసీఓఎస్‌లో సహజంగా కనిపించే మరో సమస్య ఇన్ఫెర్టిలిటీ(సంతానోత్పత్తి సమస్యలు) . పీసీఓస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే రోగి వైద్యున్ని కలిసి సూచనలు తీసుకోవాలి. పీసీఓఎస్‌కు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకోవడం అవసరం. అలాగే వైద్య చికిత్సలు సహాయపడతాయి.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips






డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |