This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మల్టీపుల్ బర్త్(ఒకరి కంటే ఎక్కువ మంది జననం): కవలలు, ముగ్గురు పిల్లలు పుట్టినపుడు ఉండే ప్రమాదాలు & లక్షణాలు

Pregnancy
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Jan 24, 2026
మల్టీపుల్ బర్త్(ఒకరి కంటే ఎక్కువ మంది జననం): కవలలు, ముగ్గురు పిల్లలు పుట్టినపుడు ఉండే ప్రమాదాలు & లక్షణాలు
Likes6 Likes|
Read time7 min

మల్టీపుల్ ప్రెగ్నెన్సీ (బహుళ గర్భం) అంటే ఏమిటి?

గర్భవతి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలను కలిగి ఉన్నపుడు మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) సంభవిస్తాయి. ఉదాహరణకు.. కవలలతో గర్భాన్ని కలిగి ఉన్నారంటే మీరు ఒకేసారి మీ కడుపులో ఇద్దరు పిల్లలను మోస్తున్నారని అర్థం. ట్రిప్​లెట్స్ అంటే ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం. మీరు ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలను కూడా ఒకేసారి కనేందుకు వీలుంటుంది. మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) సింగిల్టన్ గర్భం కంటే ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. (కడుపులో ఒకే శిశువును మోయడం).

మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) రావడానికి గల కారణం ఏమిటి?

మహిళ రుతుచక్రం సమయంలో ఆమె అండాశయం ఒకటి కంటే ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. వీర్యం ఒకటి కంటే ఎక్కువ అండాలను ఫలదీకరణం చేస్తే గర్భాశయం లోపల అనేక పిండాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా పుట్టిన శిశువులలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శారీరక తేడాలు ఉంటాయి. ఒక ఫలదీకరణ గుడ్డు ఒకటి కంటే ఎక్కువ అండాలుగా విభజించబడినపుడు ఒకేలా ఉన్న కవలలు పుడతారు. ఒకేలా ఉన్న కవలలు పుట్టే సంఖ్య ఫ్రెటర్నల్ కవలలు పుట్టే సంఖ్య కంటే చాలా తక్కువగా ఉంటుంది.

ముగ్గురు పిల్లలు లేదా ఐడెంటికల్ ట్విన్స్ ఒకే జెండర్​కు (లింగం) చెందినవారై ఉంటారా?

ఒకేలా ఉన్న కవలలు లేదా ముగ్గురు పిల్లల మధ్య జన్యుపదార్థం భాగస్వామ్యం చేయబడుతుంది. అందుకే వారు ఒకే లింగంతో జన్మిస్తారు. అండం అనేది వీర్యం ద్వారా ఫలదీకరణం చెందినపుడే పుట్టబోయే బిడ్డ లింగం నిర్దారించబడుతుంది. వీర్యకణాలు X మరియు Y అనే రెండు రకాల క్రోమోజోములను కలిగి ఉంటాయి. తల్లికి చెందిన X క్రోమోజోములు అండంలో ఉంటాయి. XX (ఆడ) కాంబినేషన్ రూపాంతరం చెందినపుడు ఆడవారు జన్మిస్తారు. అండం నుంచి X-క్యారియర్ వీర్యం నుంచి కూడా X-క్యారియర్. వీర్యకణాలు Y క్రోమోజోమును కలిగి ఉండి అండం ఫలదీకరణం చెందినపుడు అది జెనెటికల్​గా ఐడెంటికల్ అండాలుగా విడిపోతుంది. పుట్టబోయే బిడ్డ లింగం అనేది క్రోమోజోముల ఆధారంగా నిర్ణయించబడుతుంది.

మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) వచ్చే అవకాశాలను ఏది ఎక్కువ చేస్తుంది?

సంతానోత్పత్తి మందులు అండోత్సర్గాన్ని ప్రేరేపించినపుడు అండాశయాలు ఎక్కువగా అండాలను విడుదల చేస్తాయి. ఇది మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) కు దారి తీస్తుంది. (ఉదాహరణ: కవలలు, ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టడం వంటివి). ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా ఒకటి కంటే ఎక్కువ పిండాలను గర్భాశయంలో అమర్చినట్లయితే మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ సాధ్యమవుతాయి. ఫలదీకరణం చెందిన అండం బదిలీ తర్వాత విభజించబడితే ఒకేలా ఉన్న కవలలు లేదా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశాలు ఉంటాయి. 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలకు ఒకే రుతుచక్రంలో ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అందువల్లే వయసు మీద పడిన మహిళలకు యుక్త వయసు ఉన్న మహిళల కంటే ఎక్కువగా మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉంది.

ఒకరి కంటే ఎక్కువ మంది పుట్టడం ఎంత కామన్​?

గత కొన్ని సంవత్సరాలలో ఇలా ఎక్కువ జననాలు సంభవించాయి. ఎందుకంటే ఎక్కువ మంది జంటలు తాము గర్భం దాల్చేందుకు IVF వంటి సంతానోత్పత్తి ప్రక్రియలు మరియు మందులను ఉపయోగిస్తున్నారు.

మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్(బహుళ గర్భాలు) ఉన్నాయని సూచించే లక్షణాలు ఏమిటి?

మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) ఉన్న స్త్రీలకు ఉదయం పూట నలతగా అనిపించవచ్చు. మరియు సింగిల్టన్ ప్రెగ్నెన్సీ (కడుపులో ఒకే బిడ్డను మోస్తున్న స్త్రీ) కలిగి ఉన్న స్త్రీల కంటే రొమ్ములు నొప్పిగా అనిపించవచ్చు. వారు త్వరగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మల్టీపుల్​ ప్రెగ్నెన్సీస్ ఉంటే చాలా సందర్భాల్లో అల్ట్రీసౌండ్​లో తెలిసిపోతుంది.

ఒకరి కంటే ఎక్కువ మంది పుట్టడం వలన వచ్చే ప్రమాదాలు ఏమిటి?

ఈ కింది సమస్యలు వచ్చే అవకాశం ఉంది:

  • ముందస్తు ప్రసవం మరియు జననం: మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ సమయంలో ఎక్కువగా వచ్చే సమస్య ముందస్తు ప్రసవం. మీ గర్భంలో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే గర్భంలో ఒకరు మాత్రమే ఉన్న మహిళల కంటే మీకు ముందుగా ప్రసవం అయ్యే అవకాశం ఉంది. (37 వారాల ముందు)
  • గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు (అధిక రక్తపోటు): మీ గర్భధారణ సమయంలో మీ వైద్య సంరక్షకుడు తరచూ మీ రక్తపోటును తనిఖీ చేస్తారు. ఎక్కువ ప్రెగ్నన్సీలు ఉండడం వలన మీకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు వల్ల గర్భధారణ సమయంలో మధుమేహం రావచ్చు.
  • గర్భధారణ మధుమేహం: మీకు గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ప్లాసెంటా నుంచి అధిక సంఖ్యలో హార్మోన్లు రావడం వల్ల ఇది జరుగుతుంది.
  • ప్లాసెంటల్ అబ్రప్షన్ (పుట్టుకకు ముందే గర్భాశయం లోపలి గోడ నుంచి ప్లాసెంటా విడిపోతుంది): శిశువు పుట్టుకకు ముందే ప్లాసెంటా అనేది గర్భాశయ గోడ నుంచి విడిపోయినపుడు ఇది జరుగుతుంది.
  • ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ (పిండం పెరుగుదలలో పరిమితి): దీనిని గర్భధారణ వయస్సు (SGA) కు చిన్నదిగా లేదా గర్భాశయ పెరుగుదల పరిమితి (IUGR)కి చిన్నదిగా పిలుస్తారు. మీ శిశువుల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సరిగ్గా ఎదిగినపుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

నేను మల్టీపుల్ గర్భాలను మోస్తున్నపుడు నాకు C-సెక్షన్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?

మీరు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే.. మీకు C-సెక్షన్ అవసరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మీ కడుపులో ఒక బిడ్డ ఉన్నా కానీ ప్రసవానికి కొన్ని సార్లు C-సెక్షన్ అనేది అత్యంత సురక్షితం. శిశువులు గర్భంలో ఉన్న ప్రతి సారి తమ తలను కిందికే కలిగి ఉండరు. కానీ ఇది పుట్టుకకు ఉత్తమ పొజిషన్. యోని ద్వారా మీ శిశువు జననానికి ఏవైనా సమస్యలు వచ్చినపుడు లేదా మీ శిశువుకు ఏదైనా ప్రమాదం కలుగుతుందని తెలిసినపుడు C-సెక్షన్ కూడా నిర్వహించబడవచ్చు. మీ గడువు తేదీకి ముందే డాక్టర్ లేదా నర్స్ మిమ్మల్ని తనిఖీ చేస్తారు. మీ ప్రసవానికి గల ఉత్తమ మార్గాన్ని గురించి చర్చిస్తారు.

మల్టీపుల్ గర్భాలను మోస్తున్నపుడు నా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నేను ఏమి చేయగలను?

ఆరోగ్యకరమైన ఆహారం తినడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, తరచూ వైద్యుడి వద్దకు వెళ్లడం వల్ల మీరు గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ కలిగి ఉన్నట్లయితే.. మీరు ఎక్కువ పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది. తగినంత ప్రొటీన్ మరియు తగిన మోతాదులో ద్రవాలను తీసుకోవడం అవసరం. పిండం సరిగ్గా అభివృద్ధి చెందేందుకు మీరు అదనపు కేలరీలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కడుపులో శిశువును మోస్తున్నపుడు 300 కేలరీలను అదనంగా తీసుకోవాలనేది ఎప్పటి నుంచో ఉన్న నియమం. మీరు కనుక మల్టీపుల్ ప్రెగ్నెన్సీలను కలిగి ఉంటే.. ప్రతి రోజు 600 కేలరీలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గర్భవతిగా ఉన్నపుడు ఎంత తినాలి మరియు ఏమి తినాలనే దాని గురించి మీ వైద్యుడు లేదా మంత్రసానితో మాట్లాడి సలహా తీసుకోవాలి.

నేను మల్టీపుల్ గర్భాలను మోస్తున్నపుడు వ్యాయామాలు మరియు ఇతర పనులను చురుగ్గా చేయగలనా?

గర్భధారణ సమయం మొత్తం మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెయింటేన్ చేసేందుకు తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం ఉత్తమం. మీరు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వబోతుంటే స్విమ్మింగ్, వాకింగ్, ప్రినేటల్ యోగా వంటివి చేయొచ్చు. ఇవి తక్కువ ప్రభావాన్ని చూపించే వ్యాయామాలు. మీరు గర్భవతిగా ఉన్నపుడు చురుగ్గా ఉండడం మంచిదే అయినప్పటికీ, మీరు ఎటువంటి నియమాలు పాటించాలో మీ వైద్యునితో గానీ మీ మంత్రసానితో కానీ మాట్లాడాలి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.