Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Weight Loss
29 August 2023 న నవీకరించబడింది
నవజాత శిశువులకు ప్రాథమిక పోషకాహారం తల్లిపాలు. రొమ్ము పాలిచ్చేటపుడు బరువు తగ్గడం అనేది కొత్త తల్లులలో సాధారణంగా జరుగుతుంది. గర్భధారణ సమయంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు శరీరం ఎక్కువ కొవ్వులను సేకరిస్తుంది. రొమ్ము పాలిచ్చే సమయంలో అందుకే తల్లులు బరువు తగ్గుతారు. మీ శరీరానికి అదనపు బలాన్ని అందించేందుకు మీరు ప్రతి రోజు 300 నుంచి 500 కేలరీలను తీసుకోవాలనే సిఫారసులను అనుసరించినా కానీ రొమ్ము పాలివ్వడం వలన బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ కథనం రొమ్ము పాలివ్వడం వల్ల బరువు తగ్గడం వెనుకున్న సైన్స్ మరియు ప్రయోజనాల గురించి వివరిస్తుంది.
రొమ్ము పాలిచ్చేటపుడు బరువు తగ్గడం అనేది చాలా మంది తల్లులలో సహజంగా సంభవిస్తుంది. ఇందుకు ఒక స్పష్టమైన కారణం.. ప్రసవించిన తర్వాత కొత్త తల్లికి సడెన్గా శారీరక అలసట పెరగడం. చాలా అధ్యయనాలు తెలిపిన దాని ప్రకారం.. రొమ్ము పాలిచ్చే ప్రతి తల్లి ప్రతి రోజు సగటున 500 అదనపు కేలరీను బర్న్ చేస్తుంది. 45 నుంచి 60 నిమిషాల వరకు వ్యాయామం చేసినపుడు కూడా ఇంతే మొత్తంలో క్యాలరీలను బర్న్ చేస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువులలో క్లస్టర్ ఫీడింగ్: తల్లిదండ్రుల కోసం పూర్తి గైడ్
రొమ్ము పాలిచ్చే ప్రతి ఒక్కరూ ఏకరీతిలో బరువు తగ్గరు. మరియు ఇది అంత సులభంగా కూడా ఉండదు. పాలిచ్చే తల్లులందరూ రొమ్ముపాలిచ్చేటపుడు బరువు తగ్గరు. ప్రతి రోజు 500 కేలరీలను బర్న్ చేయడం ద్వారా (కరిగించడం ద్వారా) వారానికి 0.5 కిలోల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. పేపర్ మీద ఉన్న లెక్కలతో పోలిస్తే చాలా మంది పాలిచ్చే తల్లులు ఎక్కువ సమయం తీసుకుంటారు. చాలా మంది పాలిచ్చే తల్లులు గర్భధారణ సమయంలో అధికంగా పెరిగిన బరువులో 86 శాతం ప్రసవం తర్వాత మొదటి ఆరునెలల్లోపే కోల్పోయారని అనేక అధ్యయనాలు చూపించాయి. రొమ్ము పాలివ్వడం మరియు బరువు తగ్గడం రెండూ వేర్వేరు విషయాలని వాదించే పరిశోధనలు అనేకం ఉన్నాయి. అయితే ఇది నిరూపించేందుకు కొన్ని పరిమిత అధ్యయనాలు ఉన్నాయి.
గర్భధారణ అనేది చాలా మంది మహిళలకు సవాలుగా ఉంటుంది. వారు గర్భధారణ ప్రయాణంలో అలసిపోతారు. ప్రసవం మరింత వేదనను కలిగిస్తుంది. వారు మరింత అలసిపోతారు. ప్రసవం తర్వాత రొమ్ముపాలివ్వడం మరియు పిల్లల సంరక్షణ అనేవి ఇప్పటికే శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉన్న తల్లులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. పాలిచ్చే తల్లులు ఎక్కువ ఆకలితో ఉంటారు. వారు ఎక్కువ మొత్తంలో తినేందుకు మొగ్గు చూపుతారు. అంతే కాకుండా నిద్రలేమి అనేది బరువు తగ్గడం కంటే బరువును పెంచేందుకు దోహదం చేస్తుంది.
రొమ్ము పాలివ్వడం మరియు బరువు తగ్గడం అనేవి రెండు సున్నితమైన విషయాలు. అందుకే వీటి విషయంలో చాలా శ్రద్ధ మరియు జాగ్రత్త అవసరం. రొమ్ము పాలిచ్చేటపుడు బరువు తగ్గేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు.
పాలిచ్చే తల్లులు బరువు తగ్గేందుకు ఈ ఆహారమే తీసుకోవాలని రూల్ లేదు. కానీ రొమ్ముపాలిచ్చే సమయంలో బరువు తగ్గేందుకు కొన్ని మార్గదర్శకాలు (గైడ్లైన్స్) ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ వివిధ పరిశోధనలు, రీసెర్చెస్ చేసి రూపొందించారు. ఆ జాబితా మీకోసం..
తల్లిపాలిచ్చేటపుడు బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు కీలకం. ఇది సహజమైన ప్రక్రియ అని పరిగణలోనికి తీసుకుంటే.. సరైన ఎంపికలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
Weight loss during breast feeding in telugu, weight loss in telugu, breast feeding in telugu, Healthy weight loss in telugu, Weight gain during breastfeeding in telugu.
Also Read in:
English: Weight Loss During Breastfeeding: Unlocking the Secrets to Shedding Pounds Safely
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
బిడ్డలకు బట్టలు ఎంచుకొనే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు (Points To Remember While Selecting Baby Clothes in Telugu)
లోపలి తోడ భాగంలో పగుళ్లు: కారణాలు, లక్షణాలు, చికిత్స | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Telugu
అబద్ధపు ప్రెగ్నెన్సీ(ఫాల్స్ ప్రెగ్నెన్సీ) అంటే ఏమిటి? అబద్ధపు ప్రెగ్నెన్సీకి కారణాలు & లక్షణాలు ఏమిటి (What Are the Causes & Symptoms of A False Pregnancy in Telugu)?
అనారోగ్య సిరలు అంటే ఏమిటి? మీ ప్రెగ్నెన్సీ సమయంలో వాటిని ఎలా నివారించాలి (What are varicose veins, and how to prevent them during your pregnancy in Telugu)?
10 వారాల గర్భిణీ పొట్ట ఎలా కనిపిస్తుంది (What does a 10-week pregnant belly look like in Telugu)?
ఇంట్రాయుటరైన్ ఇన్సెప్షన్ (IUI) పద్ధతి కోసం స్పెర్మ్ ఎలా పొందాలి (How to Get Sperm for IUI (Intrauterine Insemination) Procedure in Telugu)?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
By Concern | Weight Management | By Ingredient | Apple Cider Vinegar | Skin - Bath & Body | By Concern | Body Moisturizer | Brightening | Tan Removal | By Ingredient | Skin - Hygiene | By Concern | UTIs & Infections | Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Maternity dresses | Stretch Marks Kit | Stroller |