
సారాంశం


వేల సంవత్సరాల చరిత్రను తిరగేస్తే డేట్స్ (ఖర్జూరాలు) అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండే ఒక పురాతన పంటగా ఉన్నాయి. డేట్స్ (ఖర్జూరాలు)లో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మెడ్జూల్ డేట్స్ (ఖర్జూరాలు), డెగ్లెట్ నూర్ డేట్స్ (ఖర్జూరాలు) వంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో డేట్స్ (ఖర్జూరాలు) తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బిడ్డ పెరుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు, తల్లి ఆరోగ్యం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
డేట్స్‌లో (ఖర్జూరాలు) విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అవి శరీరంలో కణాలు క్షీణించకుండా కాపాడుతాయి. గర్భధారణ సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం మీకు, మీకు పుట్టబోయే బిడ్డకు అవసరమైన పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
డేట్స్ (ఖర్జూరాలు)లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. 4 డేట్స్ (ఖర్జూరాలు) 6.7 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. ప్రతి రోజు తీసుకోవాలని సూచించిన 20–30 గ్రాములలో ఇది 25 శాతం వరకు ఉంటుంది. గర్భధారణ సమయంలో డ్రై డేట్స్ (పొడి ఖర్జూరాలు) తీసుకోవడం వలన మలబద్దకం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇది గర్భధారణ సమయంలో చాలా మందిలో ఉంటుంది. హర్మోన్లు జీర్ణక్రియను మందగించేలా ప్రేరేపించడం వల్ల ఇది ఏర్పడుతుంది. చాలా మంది గర్భవతులు ఐరన్ సప్లిమెంట్లను తీసుకుంటారు. దీని వల్ల మలబద్దకం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
ద్రవ సమతుల్యతను అందించేందుకు, నార్మల్ సెల్ యాక్టివిటీకి మద్దతు అందించేందుకు మీ శరీరానికి పొటాషియం అవసరం. మొదటి త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలకు వాంతులు సహజం. ఇది శరీరంలో ఉన్న పొటాషియం స్థాయిలు తగ్గేందుకు కారణం అవుతాయి. గర్భధారణ సమయంలో డేట్స్ (ఖర్జూరాలు) తినడం వల్ల మీ శరీరంలో పొటాషియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
డేట్స్ (ఖర్జూరాలు) లో ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో అవసరమైన B విటమిన్. స్పినా బిఫిడా వంటి పుట్టకతో వచ్చే తీవ్రమైన వైకల్యాలను నివారించడంలో ఇది చాలా కీలకం. రోజూవారీగా 600 గ్రాముల ఫోలేట్ తీసుకోవడం అవసరం. గర్భిణీ స్త్రీలు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. 100 గ్రాముల డేట్స్ (ఖర్జూరాలు) లో 15 mcg ఫోలేట్ ఉంటుంది.
గర్భిణీ స్త్రీలలో ఐరన్ లోపం (ఎనిమియా) వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున గర్భవతులు కాని వారితో పోల్చుకుంటే వారు రెండు రెట్ల ఐరన్ తీసుకోవాలి. తీవ్రమైన ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే అవకాశం లేదా తక్కువ బరువుతో బిడ్డ పుట్టే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ప్రవవానంతర డిప్రెషన్ కూడా వారిలో తలెత్తుతుంది. డేట్స్ (ఖర్జూరాలు) లో ఐరన్ అధికంగా ఉంటుంది. కావున ఇది ఎనిమియా (ఐరన్ లోపం) తో పోరాడుతుంది.
డేట్స్ (ఖర్జూరాలు) యొక్క గ్లెసెమిక్ ఇండెక్స్ (GI)(చెక్కెర స్థాయిలు) చాలా తక్కువగా ఉంటుంది. ఇవి సులభంగా జీర్ణం అవుతాయని మరియు రక్తంలో చెక్కెర స్థాయిల పెరుగుదలకు ఇవి ఏ మాత్రం కారణం కావని ఇది తెలియజేస్తుంది. డయాబెటిస్ (మధుమేహం) రక్తంలో ఎక్కువ స్థాయిలో చెక్కెరలను కలిగి ఉండడం. దాదాపు 10 శాతం మంది గర్భిణీ స్త్రీలను ఇది ప్రభావితం చేస్తుంది. నెలలు నిండకుండానే డెలివరీ మరియు పుట్టిన శిశువు సాధారణ బరువు కంటే ఎక్కువగా పుట్టడం వంటి సమస్యలకు ఇది దారి తీస్తుంది.
చక్కెర స్థానంలో డేట్స్ (ఖర్జూరాలు)ను ఉపయోగించవచ్చు. డేట్ షుగర్ కోసం డ్రైడ్ డేట్స్ (ఎండబెట్టిన ఖర్జూరాలు) ప్రాసెస్ చేయబడతాయి. ఈ చెక్కెరను కొన్ని సూపర్ మార్కెట్లు, హెల్త్ ఫుడ్ స్టోర్లలో విక్రయిస్తారు. సాధారణ చక్కెరతో పోల్చుకుంటే ఇందులో దాదాపు 30 శాతం వరకు చక్కెర తక్కువగా ఉంటుంది.
డేట్స్ (ఖర్జూరాలు) గర్భవతిగా ఉన్నపుడు మాత్రమే కాదు ఎప్పుడు తిన్నా అవి సురక్షితమే. ఒకటి, రెండు, మూడో త్రైమాసికంలో గర్భవతులు డేట్స్ (ఖర్జూరాలు) తినడం హానికరం అని అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు.
మూఢనమ్మకాలకు వ్యతిరేఖంగా ఆలోచించి గర్భధారణ సమయంలో డేట్స్ (ఖర్జూరాలు) తినడం వల్ల తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారికి మంచి అనుభూతి లభిస్తుంది. మరీ ముఖ్యంగా తక్కువ శక్తి, లేదా మలబద్దకంతో బాధపడే స్త్రీలు డేట్స్ (ఖర్జూరాలు) తీసుకోవడం మూలాన అధిక ప్రయోజనం ఉంటుంది.
గర్భధారణ సమయంలో డేట్స్ (ఖర్జూరాలు) తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలలో ఒకటి.. ఇది అలెర్జీని ప్రేరేపిస్తుంది. పెదవులు లేదా నాలుక చుట్టూ జలదరింపు, దురద, మరియు మంట ఈ అలెర్జీ వల్ల సంభవిస్తాయి.
డేట్స్ (ఖర్జూరాలు) లేబర్ ఇండక్షన్లో (ప్రసవ నొప్పులను కృతిమంగా ప్రేరేపించడం) లో సహాయపడతాయని చాలా మంది నమ్ముతారు. గర్భధారణ సమయంలో డేట్స్ (ఖర్జూరాలు) తినడం వల్ల లేబర్ తగ్గుతుంది. కానీ అది ప్రారంభం కాదు. 2013లో 200 మంది గర్భిణీ స్త్రీల మీద చేసిన అధ్యయనంలో వెల్లడైంది ఏంటంటే.. గర్భధారణ సమయంలో డేట్స్ (ఖర్జూరాలు) తినడం వల్ల లేబర్ కోసం గర్భాశయం సన్నద్ధం అవుతుందని లేదా గర్భాశయం మరింత మృదువుగా అవుతుందని నిరూపితమైంది.
మరొక అధ్యయనంలో బయటపడిన విషయం ఏమిటంటే... తమ డ్యూ డేట్ కంటే 4 వారాల ముందు నుంచి రోజుకు 6 డేట్స్ (ఖర్జూరాలు) తినే స్త్రీలలో మొదటి దశ లేబర్ తగ్గిపోయిందని మరియు గర్భాశయం గర్భాశయం మృదువుగా మారిందని నిరూపితమైంది. గర్భధారణ చివరి దశల్లో డేట్స్ (ఖర్జూరాలు) తినడం వల్ల లేబర్‌ను ప్రోత్సహించేందుకు వాడే ఔషధం ఆక్సిటోసిన్ అవసరం తగ్గిందని నిరూపించబడింది.
చక్కెర తినాలనే కోరికలను తగ్గించుకునేందుకు గర్భిణీ స్త్రీలు కొన్ని డేట్స్ (ఖర్జూరాలు) ను స్నాక్‌గా తినొచ్చు. గర్భధారణ సమయంలో తీపిగా ఉండే ఐస్‌క్రీమ్ మరియు క్యాండీల కంటే డేట్స్ (ఖర్జూరాలు) ఉత్తమ ఎంపిక. తల్లులు మరియు వారి పిల్లల మీద జరిపిన పరిశోధనల ప్రకారం.. గర్భధారణ సమయంలో అధిక చెక్కెర మోతాదు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల పిల్లల మెదడు పనితీరు తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయినప్పటికీ డేట్స్ (ఖర్జూరాలు) వంటి సహజ పండ్లను తినడం వల్ల అధిక IQ స్థాయిలు ఉంటాయి.
గర్భధారణ సమయంలో డేట్స్ (ఖర్జూరాలు) అనేక విధాలుగా సహాయం చేస్తాయని స్పష్టం అవుతోంది. ఈ రుచికరమైన డ్రై ఫ్రూట్‌ను తినే ముందు మీ డాక్టర్ మరియు డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.
సహజమైన పోషకాహారం, ప్రినేటల్ సప్లిమెంట్లు మీకు, మీ బిడ్డకు అవసరమైన ఐరన్, ఫోలేట్ పోషకాలను అందిస్తాయి సురక్షితంగా.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest




Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each







This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |