hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • డైపర్ ర్యాషెస్ రకాలు: కారణాలు, చికిత్స arrow

In this Article

    డైపర్ ర్యాషెస్ రకాలు: కారణాలు, చికిత్స

    Baby Care

    డైపర్ ర్యాషెస్ రకాలు: కారణాలు, చికిత్స

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    పిల్లలు డైపర్ వేసుకున్నప్పుడు, కింది ప్రాంతంలో ఎరుపు రంగులో, దురద దద్దుర్లు ఏర్పడటాన్ని డైపర్ ర్యాష్ అంటారు. డైపర్ ర్యాష్ రావడం సాధారణమే. తీవ్రమైనదేమీ కాదు. కానీ పిల్లలకు కాస్త ఇబ్బందిగా, నొప్పిగా ఉంటుంది. కొత్తగా తల్లిదండ్రులు అయినవారు, పిల్లలకు ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని ఎలా నివారించాలని ఆలోచించడం మామూలే. వారికి ఉపయోగపడేలా, డైపర్ ర్యాష్‌లో రకాలు, డైపర్ ర్యాష్ రావడానికి కారణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాల గురించి ఈ ఆర్టికల్‌లో వివరిస్తున్నాం. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి.

    డైపర్ ర్యాష్ అంటే ఏంటీ? (What is diaper rash)

    పిల్లలు తమ జీవితంలో ఏదో ఓ సందర్భంలో డైపర్ ర్యాష్‌తో ఇబ్బంది పడుతుంటారు. తడిగా ఉన్న, పాడైపోయిన డైపర్స్ కారణంగా చర్మానికి చికాకు కలిగి డైపర్ ర్యాషెస్ వస్తాయి. దీంతో పాటు స్కిన్ అలర్జీ, రాపిడి లాంటి వాటివల్ల కూడా డైపర్ ర్యాషెస్ ఏర్పడతాయి. పిల్లల దిగువ భాగంలో లేదా జననాంగాల దగ్గర పిల్లలు ఇబ్బంది ఎదుర్కొంటున్నచోట ఎరుపు రంగులో డైపర్ ర్యాష్ కనిపిస్తుంది. డైపర్ ర్యాష్ రావడం సాధారణమే. తీవ్రమైనదేమీ కాదు. చాలావరకు కేసుల్లో.. కొన్ని రోజుల్లోనే ఇంటి చిట్కాలతో డైపర్ ర్యాషెస్ తగ్గుతాయి. పలు రకాల డైపర్ ర్యాషెస్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అల్లెర్జిక్ రియాక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయినా, చాలావరకు డైపర్ ర్యాషెస్‌ను ఓవర్ ది కౌంటర్ క్రీమ్స్, ఆయింట్‌మెంట్స్ ద్వారా ఇంట్లోనే తగ్గించవచ్చు. ఒకవేళ పిల్లలకు ఇంట్లో కొన్ని రోజులు చికిత్స అందించిన తర్వాత డైపర్ ర్యాషెస్ తగ్గకపోయినా, ర్యాషెస్ తీవ్రంగా ఉన్నా వైద్యుల దగ్గరకు వెళ్లాలి.

    డైపర్ ర్యాష్ రకాలు (Diaper rash types)

    డైపర్ ర్యాషెస్ రకాల విషయానికి వస్తే ప్రతీ రకానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ఉండే రకాల గురించి చూస్తే, కాంటాక్ట్ డైపర్ ర్యాష్, క్యాండిడల్ డైపర్ ర్యాష్, బ్యాక్టీరియల్ డైపర్ ర్యాష్, అల్లెర్జిక్ డైపర్ ర్యాష్ అని ఉంటాయి.

    1. చికాకు కలిగించే కాంటాక్ట్ డెర్మటిటిస్ (Contact Dermatitis):

    కాంటాక్ట్ డెర్మటిటిస్ డైపర్ ర్యాషెస్‌లో సాధారణంగా కనిపించే ఓ రకం. మూత్రం, మలం, సబ్బు లాంటివి చర్మానికి అంటుకోవడం వల్ల ఈ ర్యాషెస్ వస్తాయి. ఈ రకం దద్దుర్లు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి. దురదగా, మంటగా ఉంటుంది. పెట్రోలియం జెల్లీ లాంటి క్రీమ్ ఉపయోగించి ఇలాంటి ర్యాషెస్ తగ్గించవచ్చు.

    2. క్యాండిడా డెర్మటిటిస్ లేదా యీస్ట్ (Candida Dermatitis):

    రెండో రకం డైపర్ ర్యాష్‌ను క్యాండిడయాసిస్ అంటారు. యీస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇది వస్తుంది. చర్మంపై వచ్చే యీస్ట్ ఇన్ఫెక్షన్‌ను క్యాండిడల్ డైపర్ ర్యాష్ అని పిలుస్తారు. ఎరుపు రంగులో చిన్న గడ్డలు, పొలుసులతో ఈ దద్దుర్లు ఉంటాయి. యాంటీఫంగల్ ఓవర్ ది కౌంటర్ క్రీమ్ లేదా ఆయింట్‌మెంట్‌తో తగ్గించవచ్చు. దీంతో పాటు ఆ ప్రాంతంలో పొడిగా ఉంచేందుకు పౌడర్ కూడా ఉపయోగించాలి.

    3. బ్యాక్టీరియల్ డెర్మటిటిస్ (Bacterial Dermatitis)

    చర్మం ముడతపడ్డ ప్రాంతంలో స్ట్రెప్టోకోక్కస్ బ్యాక్టీరియా సులభంగా చిక్కుకుపోయి బ్యాక్టీరియల్ డెర్మటిటిస్ ర్యాష్ వస్తుంది. ఇది ఎరుపు రంగులో పొలుసులుగా, చిన్నగా పసుపు రంగు లేదా తెల్లని గడ్డలతో వస్తుంది. సున్నితమైన చర్మం ఉండే శిశువుల్లో బ్యాక్టీరియల్ డైపర్ ర్యాష్ సర్వసాధారణం. యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్, మైల్డ్ స్టిరాయిడ్ క్రీమ్ లాంటి డైపర్ ర్యాష్ చికిత్స ద్వారా నొప్పిని, మంటను తగ్గించవచ్చు.

    4. అల్లెర్జిక్ కాంటాక్ట్ డెర్మటిటిస్ (Allergic Contact Dermatitis)

    అల్లెర్జిక్ కాంటాక్ట్ డెర్మటిటిస్ మరో రకమైన డైపర్ ర్యాష్. లాండ్రీ డిటర్జెంట్స్, వైప్స్, క్రీమ్ లాంటి వాటి వల్ల అల్లెర్జిక్ రియాక్షన్ వచ్చి ఈతరహా ర్యాషెస్ ఏర్పడతాయి. పెద్దగా, ఎరుపు రంగులో పొక్కులతో గడ్డలు ఏర్పడి ఈ దద్దుర్లు వస్తాయి. నొప్పి, మంట తగ్గించడానికి మైల్డ్ స్టిరాయిడల్ క్రీమ్ సూచిస్తుంటారు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

    డైపర్ వల్ల వచ్చే మరిన్ని సమస్యలు

    • వేడి దద్దుర్లు
    • చేతి, పాదం, నోటి వ్యాధులు
    • సోరియాసిస్
    • తామర

    తల్లిదండ్రులు ఎలాంటి డైపర్లు తీసుకోవాలి? (What type diapers should be taken by parents)

    మార్కెట్లో చాలా రకాల డైపర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ ఒకేలా ఉండవు. కొన్ని రకాల డైపర్స్ శిశువుల్లో ర్యాషెస్ నివారించడంలో ఉపయోగపడతాయి. అయితే పిల్లలకు సౌకర్యవంతంగా ఉన్నాయో లేదో, ర్యాషెస్ రాకుండా కాపడతాయో లేదో చూడాలి. పిల్లలకు సరైన డైపర్ ఎంపిక చేయడం చాలా ముఖ్యం. పిల్లల వయస్సు, బరువుపై ఇది ఆధారపడి ఉంటుంది. మూడు రకాల డైపర్స్ అందుబాటులో ఉంటాయి: డిస్పోజబుల్, క్లాత్, హైబ్రిడ్ రకాలు ఉంటాయి. డిస్పోజబుల్ డైపర్స్ సాధారణంగా ఉపయోగిస్తుంటారు. వాటిని సులువుగా ఉపయోగించి పారెయ్యడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక క్లాత్ డైపర్స్ (Cloth Diapers) కాస్త ఖరీదైనవి. కానీ పర్యావరణం పరంగా చూస్తే డిస్పోజబుల్ డైపర్స్ కన్నా మంచివి. ఇక హైబ్రిడ్ డైపర్స్ విషయానికి వస్తే ఇవి క్లాత్, డిస్పోజబుల్ కలిపి ఉంటాయి. డబ్బు ఆదా చేయడానికి ఇది గొప్ప ఆప్షన్. డిస్పోజబుల్ బదులు క్లాత్ పెట్టి ఉపయోగించుకోవచ్చు. కాటన్ లైనింగ్‌తో క్లాత్ డైపర్ లేదా కెమికల్స్, డైస్ లేని మెటీరియల్స్‌తో తయారు చేసిన డిస్పోజబుల్ డైపర్స్ ఉపయోగించడం మంచిది.

    డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి? (When to meet doctor)

    చికిత్సతో డైపర్ ర్యాష్ నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. డైపర్ ర్యాషెస్ నివారించడానికి తల్లిదండ్రులు డైపర్‌కు, చర్మానికి మధ్య క్రీమ్ లేదా ఆయింట్‌మెంట్‌ను అడ్డంకిగా ఉపయోగించవచ్చు. డైపర్స్ తరచూ మారుస్తూ ఉండటం, క్లాత్ డైపర్స్ ఉపయోగించడం లేదా బ్రీథబుల్ ఔటర్ లేయర్ ఉన్న డైపర్ ఉపయోగించడం లాంటి చిట్కాలు పాటించవచ్చు. ఏదేమైనా, డైపర్ ర్యాష్ తక్కువగా ఉన్నప్పుడు ఓవర్ ది కౌంటర్ క్రీమ్స్, ఆయింట్‌మెంట్స్‌తో ఇంట్లోనే చికిత్స అందించవచ్చు. ఒకవేళ ర్యాషెస్ తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల్ని కలిసి క్రీమ్ లేదా ఆయింట్‌మెంట్ సిఫార్సు చేయించాలి. కొన్ని కేసుల్లో డైపర్ ర్యాష్ వల్ల బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వైద్యంతో ర్యాషెస్ తగ్గకపోతే వైద్య చికిత్స తప్పనిసరి.

    Tags:

    Diaper rashes in telugu, Diaper cream for babies in telugu, How to cure diaper rash in telugu, diaper rash treatment in telugu, diaper rash problems in telugu.

    Baby Diaper Rash Cream - 50 gm

    Made Safe Australia Certified | Heals Rashes & Irritation| Soothes Skin Inflammation | Can be Used Daily | Safe for Newborn

    ₹ 249

    4.3

    (2130)

    13609 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.