hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతసేపు వెల్లకిలా పడుకోవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (How Long Can You Lay On Your Back When Pregnant in Telugu?) arrow

In this Article

    గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతసేపు వెల్లకిలా పడుకోవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (How Long Can You Lay On Your Back When Pregnant in Telugu?)

    Pregnancy Journey

    గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతసేపు వెల్లకిలా పడుకోవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (How Long Can You Lay On Your Back When Pregnant in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    కడుపుతో ఉన్నప్పుడు చేయవలసిన, చేయకూడని పనుల లిస్టు కొంచెం ఎక్కువగానే అన్పిస్తుంది. మీ పొట్ట సైజు వారంవారానికి పెరుగుతూ ఉన్నప్పుడు మీకున్న ఆందోళనల లిస్టుకి పడుకునే విధానాన్ని కూడా చేర్చవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు వెల్లకిలా పడుకుంటూ ఉంటే, ఇక కొత్త భంగిమకి అలవాటు పడాలి ఎందుకంటే, 20 వారాల తర్వాత కడుపుతో ఉన్న మహిళలు వెల్లకిలా పడుకోవటం సిఫారసు చేయబడదు. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు వెల్లకిలా పడుకుంటే, మీ గర్భాశయం యొక్క ఒత్తిడి వెన్నెముక వద్ద ఉండే ప్రధాన రక్తనాళమైన వెనా కావాని కుదించగలదు. అంచనాల ప్రకారం ఈ వెనా కావా కుదించబడితే మీ బిడ్డకి రక్త సరఫరాలో అంతరాయం కలగవచ్చు. అందుకని, సాధారణంగా చాలామంది డాక్టర్లు పడుకునేటప్పుడు ఈ రక్తనాళాన్ని కుదించవద్దని సలహా ఇస్తారు.

    ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర ఎందుకు చాలా ముఖ్యం? (Why Is Sleep So Important During Pregnancy in Telugu?)

    నిద్ర అనేది మీ శరీరం తనను తాను రీసెట్ చేసుకుంటూ బాగు చేసుకునే కాలం. మీ మెదడు ఈ సమయంలో జ్ఞాపకాలను తయారు చేసుకుంటుంది, మీ శరీరం రక్తనాళాలని పునరుద్ధరించుకుంటుంది, ఈ సమయంలో బిడ్డకి సపోర్టు అందించడానికి కావలసిన అదనపు రక్త ప్రవాహం వలన అవి ఒత్తిడికి లోనయి ఉంటాయి. అలాగే, నిద్ర వలన మీ రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, ఇది కూడా మీ ప్రెగ్నెన్సీకి సపోర్టుని అందించటానికి ఒత్తిడికి గురై ఉంటుంది. నిద్రపోవడం వలన మీ శరీరం ఇన్సులిన్ కు ఎలా స్పందిస్తుందో కూడా నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు తగినంత ఇన్సులిన్ అందకపోతే ప్రెగ్నెన్సీ సంబంధిత డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.

    ప్రెగ్నెన్సీ సమయంలో పడుకోవటానికి మంచి పొజిషన్ ఏది? (What Is The Best Position To Sleep In Pregnancy?)

    మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ ఎడమ వైపు పడుకోవడం మంచి నిద్ర పొజిషన్ అని నిపుణులు సిఫార్సు చేస్తారు, కానీ మీరు కుడివైపు కూడా పడుకోవచ్చు. స్పష్టమైన కారణాల వలన, మీరు మొదటి ట్రైమిస్టరు తర్వాత పొట్టపై బోర్లా పడుకోవడం అసాధ్యం. చాలామంది నిపుణులు ప్రెగ్నెన్సీ సమయంలో రాత్రి మొత్తం వెల్లకిలా పడుకోవడం మానుకోవాలని సలహా ఇస్తారు. కానీ, మీకు ఇంకా మీ బిడ్డ ఆరోగ్యానికి పడుకోవడం చాలా అవసరం కాబట్టి Aర్భవతి మహిళలు దాని గురించి ఎక్కువగా ఆందోళన పడకుండా ఏ సౌకర్యవంతమైన పొజిషన్లో అయినా పడుకోవచ్చని కొంతమంది నిపుణులు అంటున్నారు. పక్కకి తిరిగి పడుకోవడంలో మీకు అలవాటు అయ్యేదాకా సాయం అవసరమైతే, రకరకాల దిండులతో వివిధ శరీర భాగాలకు సపోర్టు ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు ప్రెగ్నెన్సీ దిండును వాడవచ్చు లేదా మీ ఒంటికి సౌకర్యంగా ఉండేలా వత్తుకి చాలా సాధారణమైన దిండ్లను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి, మీరు మీ మోకాళ్ల మధ్య ఒక దిండు పెట్టుకోవచ్చు అలాగే మీ పిరుదుల కింద మరొకటి పెట్టుకోవచ్చు, ఇది మీ పక్కవైపుని మరింత సులభంగా బ్యాలెన్స్ చేయడంలో మీకు సాయం చేస్తుంది. మీరు మీ వెనుకవైపు లేదా ముందువైపు పెట్టుకునే పూర్తి బాడీ పిల్లోతో కూడా పడుకోవడానికి ప్రయత్నించవచ్చు లేదా వెడ్జ్ ఆకారంలో ఉన్న దిండుని పరీక్షించవచ్చు, దాన్ని మీ పక్కవైపు లేదా ఛాతీ కిందన ఉంచండి.

    మీ ప్రెగ్నెన్సీ యొక్క రెండవ ట్రైమిస్టరులో మంచి నిద్ర పొజిషన్ పక్కకి తిరిగి పడుకోవడం అని చెప్పవచ్చు. కొంతమంది డాక్టర్లు కుడివైపు కన్నా ఎడమవైపు పడుకోమని సలహా ఇస్తారు ఎందుకంటే వెనా కావా మీ వెన్నెముకకు కుడి వైపున ఉంటుంది. అలాగే మీరు ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన మీ బిడ్డకు రక్తం మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. అంతేకాదు, మీరు సౌకర్యవంతమైన పొజిషన్ ను ఎంచుకోవాలి కాబట్టి ఇదైతే మంచిది. మీ ఇంకా మీ బిడ్డ ఆరోగ్యం కోసం ఎప్పుడూ "మంచి పొజిషన్" కంటే సౌకర్యాన్ని ఎంచుకోండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఎప్సమ్ ఉప్పుతో స్నానం చేయడం వలన కలిగే 5 ప్రయోజనాలు

    ప్రెగ్నెన్సీ సమయంలో బోర్లా పడుకోవటం (Sleeping On Your Stomach During Pregnancy in Telugu)

    మీరు గర్భవతిగా ఉన్నప్పుడు బోర్లా పడుకోవడాన్ని ఎప్పుడు ఆపాలని నేను ఆలోచిస్తున్నాను. మీరు కొద్దిసేపు అయితే ఖచ్చితంగా నిద్రపోవచ్చు. మీరు ప్రెగ్నెన్సీలో 16 నుండి 18 వారాల సమయం వరకూ బోర్లా పడుకోవడం మంచిది. ఈ దశలో మీ బంప్ కూడా పెరగవచ్చు, దానివల్ల ఈ పొజిషన్లో పడుకోవటం అంత సౌకర్యంగా ఉండబోదు. మీ పొట్ట సైజు పెరగటం ప్రారంభమైన తర్వాత, బోర్లా పడుకోవడం చాలామంది మహిళలకు అసౌకర్యంగా అన్పిస్తుంది. కానీ బోర్లా పడుకోకుండా ఉండటం వలన ప్రశాంతంగా అన్పించటమే కాదు, మీకు సురక్షితం కూడా. మీ పొట్టపై బోర్లా పడుకోవడం కూడా, వెల్లకిలా పడుకునేటప్పుడు వచ్చే నెగటివ్ ప్రభావాలని తీసుకురావచ్చు. అలాగే, ప్రెగ్నెన్సీ సమయంలో బోర్లా పడుకోవడం వల్ల మీ బంప్ పొట్టలోకి తోయబడుతుంది అలాగే దాని బరువు ధమని ఇంకా IVC (కిందవైపు ఉండే వెనా కావా) పై పడుతుంది.

    ప్రెగ్నెన్సీ సమయంలో వెల్లకిలా పడుకోవడం (Sleeping On Your Back During Pregnancy)

    మొదటి ట్రైమిస్టరులో మీరు వెల్లకిలా పడుకోవటం సురక్షితం. కానీ ప్రెగ్నెన్సీ మధ్యలో మీ గర్భాశయం బరువుగా మారుతుంది కాబట్టి, మరొక స్థానాన్ని ఎంచుకోవడం మంచిది. అలాగే, ప్రెగ్నెన్సీ యొక్క 15-20 వారాల మధ్య, మీరు వెల్లకిలా పడుకున్నప్పుడు, గర్భాశయం రక్త ప్రవాహానికి అడ్డు కలిగించేంత పెద్దదిగా మారుతుంది. ఇది మీ వెన్నెముక యొక్క కుడి వైపుకు వెళ్ళే పెద్ద సిర అయిన కిందవైపు వెనా కావాపై ఒత్తిడి కలిగించగలదు. అలాగే శరీరంలోని కింద ఇంకా మధ్య భాగాల నుండి గుండెకు ఆక్సిజన్ రహిత రక్తాన్ని ప్రసారం చేస్తుంది. వెల్లకిలా పడుకోవడం ప్రధాన ధమనిని కూడా కుదించగలదు, మీ శరీరం అలాగే మావికి ప్రధానంగా జరిగే రక్త సరఫరాను ఆపివేస్తుంది. దాని కారణంగా గర్భవతి మహిళలకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించవచ్చు లేదా వెల్లకిలా పడుకోవడం వల్ల వారికి గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించవచ్చు, అలా జరగటం గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు వెల్లకిలా పడుకోవడం వలన ఇతర సమస్యలైన వెన్నునొప్పి, హెమోరాయిడ్స్, జీర్ణ సమస్యలు మరియు తక్కువ రక్త ప్రసరణ వంటివి కూడా రావచ్చు.

    ప్రెగ్నెన్సీ సమయంలో పక్కకి తిరిగి పడుకోవడం (Sleeping On Your Side During Pregnancy in Telugu)

    రక్త ప్రవాహం సమంగా పొందటానికి గర్భవతిగా ఉన్న మహిళకి గర్భాశయం యొక్క బరువు కుడి వైపు నుండి పడుతూ ఉండటం సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ సమయంలో పడుకోటానికి ఎడమవైపు మంచి పొజిషన్ గా చెప్పబడుతుంది. కుడివైపు పడుకోవడం ఎడమవైపు అంత సురక్షితం కాదు, ఎందుకంటే ఇది IVC పై ఒత్తిడి పెంచి కుదించగలదు, కానీ గర్భాశయాన్ని పైకి లేపడానికి దిండ్లను ఉపయోగించడం కొన్నిసార్లు అది కుడివైపుకు జారిపోకుండా కాపాడుతుంది. కానీ మీరు జీవితం మొత్తం వెల్లకిలా లేదా బోర్లా పడుకునివుంటే, ఎడమవైపుకి తిరిగి పడుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని ప్రెగ్నెన్సీ కాలం మొదట్లో అది అలవాటు అవడానికి, ఎలా సౌకర్యంగా పడుకోవాలో అర్థం చేసుకోడానికి డాక్టర్లు ప్రెగ్నెన్సీ బాడీ పిల్లోని వాడమని సూచిస్తారు. నిద్రపోతున్నప్పుడు తుంటినొప్పి లేదా కాళ్ళనొప్పిని తగ్గించుకోడానికి ఆ దిండుని కాళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు పక్కకి సౌకర్యంగా తిరగలేకపోతుంటే మీరు దిండ్లని వాడి మీ ఎత్తుని పెంచి ఏటవాలు పొజిషన్లో పడుకోవచ్చు. 45 డిగ్రీల కోణంలో వెల్లకిలా పడుకోవడం వలన ఒంట్లో వేటిమీదా ఒత్తిడి పడకుండా నివారించవచ్చు.

    ప్రెగ్నెన్సీ సమయంలో మీరు వెల్లకిలా పడుకున్న భంగిమలో నిద్రలేస్తే ఏమవుతుంది? (What If You Wake Up Sleeping On Your Back During Pregnancy?)

    మనం అందరం పడుకునేటప్పుడు రాత్రంతా పొజిషన్లని మార్చడం సాధారణం. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ సమయంలో మీరు వెల్లకిలా పడుకుని లేదా బోర్లా పడుకుని నిద్రలేస్తే, భయపడకండి; ఎలాంటి హాని జరగదు. అసౌకర్యంగా నిద్రపోవడాన్ని నివారించడానికి మీ శరీరం సర్దుకుంటూ ఉండటం వలన మీరు శాంతిగా చాలాకాలం నుండి పడుకొని ఉండకపోవచ్చు, అందుకని మీకు తెలియకుండానే అలా పడుకుని ఉండవచ్చు. కానీ, మూడవ ట్రైమిస్టరులో కూడా వెల్లకిలా పడుకుంటుంటే, అది రక్త ప్రవాహాన్ని తగ్గించి మీకు త్వరగా చెడ్డగా అన్పిస్తుంది. అందుకని మీరు మధ్యలో లేస్తూ ఉండాలి, మీ బిడ్డకి రక్తప్రవాహంలో ఏ రకమైన రాజీ జరగకుండా ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు వెల్లకిలా, బోర్లా లేదా కుడివైపు తిరిగి లేవడం ఆపలేకపోతుంటే, మిమ్మల్ని మధ్యమధ్యలో చెక్ చేస్తూ లేపమని మీ భాగస్వామిని కోరండి.

    ప్రెగ్నెన్సీ సమయం 28 వారాలు దాటిన తర్వాత మీరు వెల్లకిలా ఎందుకు పడుకోకూడదు (Why You Should Not Sleep On Your Back Past 28 Weeks Of Your Pregnancy in Telugu)

    28 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో, మీ గర్భాశయం బరువుగా మారినప్పుడు వెల్లకిలా పడుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. మీ బిడ్డ, మావి (ప్లేసెంటా) అలాగే ఆమ్నియోటిక్ ద్రవం ఉండే మీ గర్భాశయం బరువు మీరు ప్రెగ్నెన్సీ సమయంలో పెరిగే బరువులో మూడింట ఒక వంతు ఉంటుంది. మీరు వెల్లకిలా పడుకున్నప్పుడు గర్భాశయం యొక్క బరువు IVCపై పడుతుంది. IVC కుదించబడటం వలన పుట్టుక సమయంలో బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ప్రీక్లాంప్సియా, పిండం ఎదుగుదల తగ్గిపోవటం అలాగే ప్రసవ సమయంలో చనిపోయే స్థితులకి దారితీస్తుంది.

    ప్రెగ్నెన్సీ యొక్క 28 వారాల తర్వాత వెల్లకిలా పడుకోవడం వల్ల వచ్చే ప్రమాదభయాలు (Risks Of Sleeping On Your Back Past 28 Weeks Of Your Pregnancy in Telugu)

    ప్రెగ్నెన్సీలో మీరు వెల్లకిలా పడుకునేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన కొన్ని రిస్కులు ఉన్నాయి. అవేంటంటే:

    · ప్రీక్లాంప్సియా: గర్భవతిగా ఉన్న సమయంలో, వెనా కావాపై ఎక్కువ ఒత్తిడి పడటం వలన ప్రీక్లాంప్సియా ఇంకా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రీక్లాంప్సియా వలన, మీకు తలనొప్పి లేదా కడుపు నొప్పి వస్తాయి, అవి ముందస్తు ప్రసవం లేదా ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవటానికి దారితీస్తుంది.

    1. పిండం ఎదుగుదల తగ్గిపోవటం అలాగే తక్కువ బరువుతో పుట్టటం: గర్భసమయంలో 30 / వారాలు దాటిన తరువాత, మీరు వెల్లకిలా పడుకోవడం వలన కిందవైపు వెనా కావాను కుదించవచ్చు, అది రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది ఇంకా పిండం ఎదుగుదల తగ్గడానికి దారితీస్తుంది. ఆఖరికి అది పుట్టుక సమయంలో బిడ్డ యొక్క తక్కువ బరువుకు దారితీస్తుంది. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకి శ్వాస సమస్యలు అలాగే కామెర్లుసహా ఇతర సమస్యలకి సంబంధించి ఎక్కువ ప్రమాదం ఉండవచ్చు.
    2. ప్రసవం సమయంలో చనిపోవటం: గర్భవతి మహిళలు 28 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత వెల్లకిలా పడుకుంటే, ప్రసవం సమయంలో బిడ్డ మరణించే ప్రమాదం మూడు రెట్లు పెరిగిందని పరిశోధనలో తేలింది. వెల్లకిలా నిద్రపోవడం పిండం ఎదుగుదలని పరిమితం చేస్తూ,ఒత్తిడిని పెంచుతుంది, ఇవి రెండూ ప్రసవ సమయంలో మరణానికి దారితీయవచ్చు. ఈ కారకాలు ఏవైనా ఇంతకుముందే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రసవ సమయంలో ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.

    ప్రెగ్నెన్సీ సురక్షిత ప్రత్యామ్నాయాలు (Pregnancy Safe Alternatives)

    28 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత, వెల్లకిలా పడుకోవడం ఇంక సురక్షితం కాదు, కానీ మీరు సురక్షితంగా పడుకోవడానికి కొన్ని ఇతర సౌకర్యవంతమైన స్థానాలు ఉన్నాయి.

    1. బోర్లా పడుకున్నట్లు కొద్దిగా పక్కకి తిరిగి పడుకోవడం(బెల్లీ స్లీపింగ్): పొట్టపై పడుకోవటం వలన ఏ ముఖ్యమైన రక్తనాళాలపై ఒత్తిడి కలిగించదు, మీ బిడ్డకి కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ స్థితిలో డోనట్ దిండుతో మీరు హాయిగా పడుకోవచ్చు.
    2. పార్శ్వ డెక్యుబిటస్ స్థానం (లేటరల్ డెక్యుబిటస్ పొజిషన్): మీరు అన్నిటికన్నా ఎక్కువగా వెల్లకిలా పడుకోవడంలో సౌకర్యం ఫీలయితే, మూడవ ట్రైమిస్టరులో మీరు కొద్దిగా వెల్లకిలా పడుకోవడం వలన సౌకర్యంగా అన్పించవచ్చు. వైద్య నిపుణులు గర్భవతిగా ఉన్నప్పుడు పడుకోవటానికి మంచి స్థానాన్ని పార్శ్వ డెక్యుబిటస్ స్థానంగా సూచిస్తారు. ఈ స్థానం మీరు వెల్లకిలా పడుకోవడం అలాగే పక్కకి తిరిగి పడుకోవడానికి మధ్యలో ఉంటుంది. ఈ పొజిషన్లోకి రావడానికి అలాగే అందులో పడుకున్నంతసేపు కదలకుండా ఉండటానికి,దిండ్లు, బోల్స్టర్లు సాయపడతాయి. పార్శ్వ డెక్యుబిటస్ పొజిషన్ లో పడుకున్నప్పుడు మీరు రెండువైపులా పడుకొనవచ్చు. ఏదేమైనా, అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, పూర్తిగా పక్కకి లేదా పూర్తిగా వెల్లకిలా కూడా పడుకోకూడదు.
    3. ఎడమవైపు తిరిగి పడుకోవడం: 28 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత మీ ఎడమవైపు పడుకోవడం సురక్షితమైన ప్రత్యామ్నాయం, ఎందుకంటే మీ కుడివైపు పడుకోవడం కూడా మీరు వెల్లకిలా పడుకుంటే వచ్చే ప్రమాదాలనే తీసుకువస్తుంది.

    చివరిమాట: (Conclusion)

    ప్రెగ్నెన్సీ సమయంలో మీరు వెల్లకిలా పడుకోవడం మొదటి రెండు ట్రైమిస్టరులలో సురక్షితమే. ఏదేమైనా, మూడవ ట్రైమిస్టరులో మాత్రం, వెల్లకిలా నిద్రపోకుండా ఉండటం మంచిది, ఎందుకంటే ఇది మీకు అలాగే మీలో ఉన్న బిడ్డకు ప్రమాదకరం కావచ్చు. మీరు నిద్రలేచినప్పుడు ఒకవేళ వెల్లకిలా ఉన్నట్లు అన్పిస్తే మీ పొజిషన్ ను మార్చుకుంటూ ఉండండి. మీరు ప్రెగ్నెన్సీ దిండును కూడా వాడవచ్చు అలాగే మీరు నిద్రలో వెల్లకిలా తిరిగిపోతూ ఉండకుండా ఆ దిండుని మీ వీపు వెనుక పెట్టుకోవచ్చు. అలాగే, ప్రెగ్నెన్సీ సమయంలో పడుకునే స్థానాల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే మీ డాక్టరుతో మాట్లాడటం మంచిది.

    Best sleeping positions during pregnancy in telugu, sleeping positions for pregnant ladies in telugu, is sleeping on back is safe during pregnancy, in telugu, pregnancy safe sleeping positions in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.