hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • గర్భధారణ సమయంలో సరిగ్గా నిద్ర పోలేకపోతున్నారా? | Loss of Sleep in Pregnancy in Telugu arrow

In this Article

    గర్భధారణ సమయంలో సరిగ్గా నిద్ర పోలేకపోతున్నారా? | Loss of Sleep in Pregnancy in Telugu

    Pregnancy

    గర్భధారణ సమయంలో సరిగ్గా నిద్ర పోలేకపోతున్నారా? | Loss of Sleep in Pregnancy in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ సమయంలో నిద్రించడం బిడ్డ ఎదుగుదలకు సహాయం చేస్తుందా? కాబోయే తల్లులందరి మనసుల్లోనూ ఈ ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. ప్రతి రోజు 7 నుండి 9 గంటల నిద్ర గర్భిణీ స్త్రీలకు అనువైనది. మెరుగైన నాణ్యత కలిగిన నిద్ర గర్భధారణ సమయంలో బరువును శరీరం అంతా మెరుగ్గా పంపిణీ చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గర్భధారణ సమయం లో ఎడమవైపుకి తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గర్భాశయాన్ని ముందుకు నెట్టి గుండెపై అదనపు ఒత్తిడిని తొలగిస్తుంది. ఈ విధంగా, శిశువుకు రాత్రిపూట రక్తం, పోషకాలు మరియు ఆక్సిజన్ పుష్కలంగా లభిస్తాయి. అయితే, చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో నిద్రకు ఇబ్బంది పడుతుంటారు. ఈ బ్లాగ్ కాబోయే తల్లులు ఎదుర్కొనే నిద్ర సమస్యలను చర్చిస్తుంది. వాటిని ఎదుర్కోవడానికి సహజ నివారణలను తెలుసుకోవడానికి ఇక ముందుకు చదవండి.

    నిద్రలేమి గర్భాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? (How Does Lack of sleep Affect Pregnancy in Telugu)

    సరైన నిద్ర లేకపోవడం అన్నది తల్లి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు దీని వల్ల మహిళలు గర్భధారణ మధుమేహం మరియు రక్తపోటుతో బాధ పడతారు. పెరిగిన రక్తపోటు మరియు మూత్రంలో ప్రోటీన్‌తో, ప్రీక్లాంప్సియా సంభవించవచ్చు, దీని వలన తల్లిలో అవయవ గాయం ఏర్పడుతుంది మరియు తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రీఎక్లంప్సియాతో బాధపడుతున్న స్త్రీలు స్లో-వేవ్ స్లీప్ పెరుగుదలతో తక్కువ నిద్ర నాణ్యతను కలిగి ఉంటారని అధ్యయనాలు నివేదించాయి. వారు తగ్గిన రాపిడ్ ఐ మూవ్మెంట్ REM) నిద్రను కూడా కలిగి ఉంటారు.

    అలాగే, వారు గురక మరియు స్లీప్ అప్నియాను అభివృద్ధి చేస్తారు, దీని వల్ల శిశువు పెరిగే ప్లాసెంటాకు పంప్ చేయబడే రక్తాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా, తక్కువ ఆక్సిజన్ సరఫరా అవడం వల్ల పిండం పెరుగుదల ప్రభావితం అవుతుంది. నిద్ర లేమి అనేది లేబర్ యొక్క సాధారణ పురోగతిని , జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత కూడా ప్రభావితం చేస్తుంది మరియు డిప్రెషన్ కు కారణం కావచ్చు. స్త్రీలు 37 వారాల గర్భవతి కావచ్చు కానీ అధిక ఈస్ట్రోజెన్ స్థాయిల వల్ల వచ్చే రినైటిస్ మరియు స్లీప్ అప్నియా కారణంగా అస్సలు నిద్రపోలేరు.

    1. మొదటి త్రైమాసికంలో నిద్ర లేకపోవడం (Lack of sleep during the First Trimester)

    మొదటి త్రైమాసికంలో, ప్రొజెస్టెరాన్ యొక్క అధిక స్థాయిల కారణంగా మహిళలు పగటిపూట నిద్రపోతారు. ఈ హార్మోన్ స్త్రీ పునరుత్పత్తి చక్రాన్ని నియంత్రిస్తుంది. అయితే ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో నిద్ర లేకపోవడానికి ఇతర కారణాలు తరచుగా మూత్రవిసర్జన, వాంతులు, వెన్నునొప్పి, రొమ్ము సున్నితత్వం మరియు కడుపులో అసౌకర్యం. కాలు తిమ్మిర్లు, శ్వాస ఆడకపోవడం, గుండెల్లో మంట మరియు లేబర్ కు సంబంధించిన ఒత్తిడి/ఆందోళన కూడా ఉండవచ్చు.

    2. రెండవ త్రైమాసికంలో నిద్రలేమి (Sleeplessness in the Second Trimester)

    2వ త్రైమాసికంలో గర్భవతిగా ఉన్న స్త్రీ నిద్రపోలేకపోవచ్చు. దినచర్యకు అనుగుణంగా శరీరం అడ్జెస్ట్ అయినప్పుడు, స్త్రీలకు నిద్ర సమస్యలు తక్కువగా ఉండవచ్చు. కానీ రెండవ త్రైమాసికంలో రాత్రి సమయంలో ఎదుర్కొనే గుండెల్లో మంట మరియు కాలు తిమ్మిర్లు, పీడకలలు మరియు ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలు నిద్రకు ఇబ్బంది కలిగించవచ్చు. 6-24 వారాల ఈ దశలో, సాయంత్రం సమయంలో శిశువు కదలికలను అనుభవించడం కూడా నిద్రకు భంగం కలిగించవచ్చు.

    3. మూడవ త్రైమాసికంలో నిద్ర లేకపోవడం (Lack of Sleep in the Third Trimester)

    3వ త్రైమాసికంలో గర్భవతిగా ఉన్న స్త్రీ నిద్రపోలేకపోతే, పొట్ట పరిమాణం ఎక్కువగా పెరగడం మరియు బరువు పెరగడం దీనికి కారణం. కాలు తిమ్మిర్లు, వెన్నునొప్పి వంటి సమస్యలు కూడా సాధారణంగా ఉంటాయి. అలాగే గర్భాశయం ఇతర అవయవాలకు నొక్కినప్పుడు, అది గుండెల్లో మంట, గురక, తరచుగా మూత్రవిసర్జన మొదలైన వాటికి కారణమవుతుంది. తలనొప్పి, పెల్విక్ నొప్పి, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ మరియు శిశువు కదలికలు కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ సమయం లో స్త్రీలు చర్మం పై దురదతో కూడా బాధపడవచ్చు, ఎందుకంటే అది సాగదీయబడుతుంది కాబట్టి. ఇది చిరాకు మరియు నిద్ర లేమికి దారితీస్తుంది.

    గర్భధారణ సమయంలో నిద్ర లేకపోవడానికి మరియు శిశువు లింగానికి సంబంధం ఉందా? (Is lack of sleep in Pregnancy Gender-related in Telugu)

    శిశువు యొక్క లింగం గురించి చాలా కథలు ప్రచారం చేయబడతాయి. వాటిలో కొన్ని కేవలం అపోహలు అయితే మరికొన్ని పరిశోధనల మద్దతుతో చెప్పబడతాయి. అలాంటి ఒక కథ ఏమిటంటే గర్భధారణ సమయంలో నిద్ర లేకపోవడానికి లింగానికి సంబంధం ఉంటుంది అని. దీన్ని ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధన మద్దతునిస్తోంది. "శిశువు యొక్క లింగం గర్భధారణ సమస్యలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది" అని ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయంలోని రాబిన్సన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన అధ్యయన మొదటి రచయిత డాక్టర్ పెట్రా వెర్బర్గ్ చెప్పారు. మగ పిల్లలు తొందరగా పుట్టే అవకాశం ఉంది. వారి తల్లులు తరచుగా గర్భధారణ మధుమేహం మరియు ప్రీఎక్లంప్సియా (తీవ్రమైన అధిక రక్తపోటు)ను అభివృద్ధి చేస్తారు. కాబట్టి, ఈ ఆరోగ్య సమస్యలు నిద్ర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

    5 గర్భధారణ సమయంలో నిద్రలేమికి 5 సహజ నివారణలు (5 Natural Remedies For Insomnia During Pregnancy in Telugu)

    గర్భిణీ స్త్రీలు త్వరగా నిద్రపోవడానికి అనేక చిట్కాలు మరియు ఉపాయాలను ఉపయోగించవచ్చు. అయితే, వారికి ఏది బాగా సరిపోతుందో చూసుకోవాలి. ఈ విషయం ఖచ్చితంగా తెలియకుంటే, గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. గర్భధారణ సమయంలో నిద్రలేమికి సహాయపడే 5 సహజ నివారణలు క్రిందివి.

    1. సాధారణ నిద్ర సమయాన్ని సెటప్ చేయండి: గాడ్జెట్‌లను స్విచ్ ఆఫ్ చేయండి, హాయినిచ్చే స్నానం చేయండి మరియు ప్రశాంతత కోసం పుస్తకాన్ని చదవడం లేదా ధ్యానం చేయడానికి ప్రయత్నించండి.

    2. హైడ్రేటెడ్ గా ఉండండి: రోజంతా నీరు త్రాగండి మరియు 7 P.M తర్వాత ఆహారం తీసుకోవడం తగ్గించండి. సాయంత్రం వేళల్లో కెఫిన్‌ను నివారించండి. బదులుగా కామోమైల్ టీ ని ప్రత్యామ్నాయం గా తీసుకోండి.

    3. ఆరోగ్యకరమైన ఆహారం: రాత్రిపూట ఆరోగ్యకరమైన ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినండి, ఇది రాత్రి సమయంలో రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. అలాగే, గుండెల్లో మంట కలిగించే ఆహారాలకు దూరంగా ఉండండి.

    4. వ్యాయామం: మిమ్మల్ని చురుకుగా మరియు ఫిట్‌గా ఉంచడానికి తేలికపాటి వ్యాయామాలు చేయడం ఇతర ఆరోగ్య సమస్యలను కొంతవరకు నివారించవచ్చు మరియు తద్వారా బాగా నిద్రపోవచ్చు.

    5. కంఫర్ట్ కీలకం: శిశువు పెరుగుతున్న కొద్దీ, పడుకోవడం కష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన దిండ్లు మరియు వదులుగా ఉండే దుస్తులను ఉపయోగించండి మరియు కొంత మనసుకు ఉల్లాసాన్నిచ్చే సంగీతాన్ని వినండి.

    చివరగా (Takeaway)

    అలసిపోవడం అన్నది గర్భధారణ కు సంబందించిన ఒక సాధారణ లక్షణం. తల్లికి మరియు అభివృద్ధి చెందుతున్న శిశువుకు నిద్ర చాలా ముఖ్యం. ఇతరుల నుండి గుడ్డి సలహా తీసుకునే ముందు ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి. అన్ని చిట్కాలు మీ కోసం పని చేయవు. అలాగే, ఎలాంటి అంతర్లీన సమస్యలు లేవని ద్రువీకరించుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల తెలుసుకున్నదేమిటంటే, ప్రశాంతమైన, ఉల్లాసమైన మనస్సు సమస్యలను దూరం చేస్తుంది మరియు సంతోషకరమైన గర్భధారణ దశను ఇస్తుంది.

    References

    1. Chang JJ, Pien GW, Duntley SP, Macones GA. (2010). Sleep deprivation during pregnancy and maternal and fetal outcomes: is there a relationship? Sleep Med Rev.

    2. Silvestri R, Aricò I. (2019). Sleep disorders in pregnancy. Sleep Sci.

    Tags

    1. Loss of Sleep in Early in Pregnancy, Insomnia during Pregnancy, Sleep Affect Pregnancy, Loss of Sleep in Pregnancy in English, Loss of Sleep in Pregnancy in Tamil, Loss of Sleep in Pregnancy in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.