Pregnancy
31 August 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో యోనిలో దురద కలగడం చాలా సాధారణం. ఇది హార్మోన్ హెచ్చుతగ్గుల కారణంగా యోని ద్రవాల pH స్థాయిలలో కలిగే మార్పుల వల్ల కలుగుతుంది. ఇది పొడిబారడం, దురద ఇంకా కొన్నిసార్లు ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో తీసుకునే కొన్ని మందులు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. ఈ కథనం యోని దురద ఇంకా దానిని ఎలా ఎదుర్కోవచ్చో తెలిపే వివిధ మార్గాల గురించి అన్ని సమాధానాలను అందించేందుకు ఉద్దేశించబడింది.
గర్భధారణ సమయంలో యోని ప్రాంతంలో దురద అనేక కారణాల వల్ల కలగవచ్చు. వీటిలో చాలా వాటికి అత్యవసర వైద్య సహాయం అవసరం ఉండదు. కానీ సాధారణ చికిత్సలతోనే నివారించుకోవచ్చు.
1. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు అసహనాన్ని కలిగించేవిగా ఉండొచ్చు. ఇవి pH లో మార్పు కారణంగా వస్తాయి. ఈస్ట్ బ్యాక్టీరియా అనేది సాధారణ pH ఉన్నప్పుడూ వృద్ధిచెందే ఒక అవకాశవాద బ్యాక్టీరియా. రెండవ త్రైమాసికంలో ఇవి కనబడటం సాధారణం. ఇది చిక్కగా తెల్లని స్రావంలా ఉండి దురద ఇంకా మంటగా అనిపిస్తుంది. ఈ లక్షణాలను గనక గమనించినట్లయితే.. వెంటనే డాక్టరు గారిని సంప్రదించాలి. దీనికి చికిత్స చేసేందుకు యాంటీ ఫంగల్ క్రీమ్‌లు చాలు. ఇది ఎదిగే పిండానికి ఎటువంటి హానిని తలపెట్టదు.
2. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు. హెర్పెస్, గనేరియా ఇంకా ట్రైకోమోనియాసిస్ వల్ల యోనిలో దురద కలగవచ్చు. ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స అవసరం. అందుకోసం.. మొదట డాక్టరు గారిని సంప్రదించి ఈ లక్షణాలను రూపుమాపడం ఎంతో ముఖ్యం.
3. హార్మోన్ల మార్పు దీనికి అతి సాధారణ కారణం. గర్భధారణ సమయంలో యోనిలో దురద గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది మహిళలు దీని బారిన పడతారు.
4. కొంతమంది స్త్రీలకు యోనిలో దురద కలిగించే మరొక కారణం బిడ్డకు పాలుపట్టడం.
5. యాంటిడిప్రెసెంట్స్ ఇంకా యాంటీ అలర్జెనిక్ వంటి మందులు కూడా గర్భధారణ సమయంలో యోనిలో దురదను కలిగిస్తాయి.
6. ఒత్తుగా ఉన్న ఆ ప్రాంతంలోని రోమాలు చికాకును కలిగిస్తాయి. మామూలుగా.. బిగుతైన దుస్తులు ధరించినప్పుడు ఇలా అవుతుంది.
7. గర్భధారణ సమయంలో యోని స్రావాల పెరుగుదల సాధారణం. ఈ స్రావాలు వల్వాను చికాకుకు గురిచేసి ఎర్రగా ఇంకా వాపు వచ్చేలా చేస్తాయి. సాధారణ సందర్భాల్లో.. ఈ స్రావాలు రక్షణ కోసం ఉద్దేశింపపబడినవి. కానీ అతి ఎక్కువైతే అది హానికరం కదా.
8. మూత్రనాళం ఇన్ఫెక్షన్. గర్భధారణ సమయంలో గర్భాశయం మూత్రాశయం పైకి ఒరుగుతుంది. మూత్రాశయంపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడి అది కుంచిచుకుపోతుంది. అందువల్ల మూత్రవిసర్జన సరిగ్గా జరగక, అది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. దానివల్ల గ్రూప్ B స్ట్రెప్ ఇన్ఫెక్షన్ కూడా కలగవచ్చు. రక్తంతో కూడిన స్రావాలు, మూత్ర విసర్జన చేయాలనిపించడం, అలా చేసినా మూత్ర విసర్జన కాకపోవడం, పొత్తికడుపు నొప్పి ఇంకా లైంగిక కార్యంలో నొప్పి అనిపించడం లాంటివి, ఇవి చూపే కొన్ని విభిన్న లక్షణాలు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో UTIలను ఎలా ఎదుర్కోవాలి: నివారణ, చికిత్సలు మరియు చిట్కాలు
గర్భధారణ సమయంలో యోని దురద అనేది ఒక సాధారణ లక్షణం. కానీ, ఇంటి చిట్కాలను ఉపయోగించే ముందు డాక్టరు గారిని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాల్లో, ఇంటి చిట్కాలు అంతా బాగా పనిచేయకపోవచ్చు.
ఇవి కొన్ని చికిత్స ఎంపికలు:
1. దురద ఎలాంటిదైనా సరే, ముందుగా వైద్యుడిని కలవాలి.
2. క్రీములు లేదా ఆయింట్‌మెంట్‌లు వంటివి OTC(మందుల దుకాణాలలో దొరికే) యాంటీ ఫంగల్ మందులు. ఫ్లూకెనాజోల్ మందు ఉన్న వాటిని వాడకూడదు; ఇది యాంటీ ఫంగల్ ఏజెంట్, అంతేకాక ఇది గర్భస్రావం కలిగిస్తుంది. దీనికి ఖచ్చితమైన కారణం తెలియదు. దురదకు ఉపశమనమిచ్చే ఇతర క్రీములు కూడా అందుబాటులో ఉన్నాయి.
3. బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల, అది చర్మంపై దురదను తగ్గిస్తుంది. ఇది స్నానానికి వాడే నీళ్లలో కలపవచ్చు లేదా చల్లని కాపడంగా ఉపయోగించవచ్చు. ఇది తాత్కాలికమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది.
4. చల్లని కాపడం ఇంకా వేడి నీటితో స్నానాలు చేయడం వల్ల ఈ లక్షణాలను తగ్గించుకోవచ్చు.
5. దురదకు కారణమయ్యే ఉత్పత్తులను వాడకూడదు.
6. వదులుగా ఉండే బట్టలు ఇంకా లోదుస్తులను ధరించాలి.
మొదట వైద్యుడిని సంప్రదించడం ఎల్లవేళలా మంచిదే. అవి అనుమానించిన లక్షణాలు కాకపోయినా ఫర్వాలేదు. పశ్చాతాపం పడటం కంటే పదిలంగా ఉండటం మంచిది కదా.
అవలోకనం (Overview)
యోని దురద అనేది చాలా సాధారణ సమస్య. ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. అత్య్వసర చికిత్స అందించాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చా? అని సంబంధిత డాక్టర్ పరీక్షలు చేసి చెబుతారు. కొన్నిసార్లు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు ఎదిగే శిశువుకు హాని కలిగిస్తాయి. యోని ఆరోగ్యంగా చక్కగా ఉండేందుకు.. పైన చూపినవి పాటించాలి ఇంకా పరిశుభ్రతను కాపాడుకోవాలి.
References
1. Soong D, Einarson A. (2009). Vaginal yeast infections during pregnancy. Can Fam Physician. NCBI
2. InformedHealth.org. (2019). Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care. Vaginal yeast infection (thrush): Overview.
What are the causes of vaginal itching during pregnancy in Telugu, How to treat a yeast infection while pregnant in Telugu, Vaginal Itching During Pregnancy: Symptoms and treatment in English, Vaginal Itching During Pregnancy: Symptoms and treatment in Hindi, Vaginal Itching During Pregnancy: Symptoms and treatment in Tamil, Vaginal Itching During Pregnancy: Symptoms and treatment in Bengali
Yes
No
Written by
swetharao62
swetharao62
గర్భధారణ సమయంలో కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది? | Eating Chalk: What You Need to Know About This Unusual Craving in Telugu
ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ లో చేయాల్సినవి మరియు చేయకూడనివి (The Do's And Don'ts Of Sex During Pregnancy in Telugu)
మీకు ఈవెన్ స్కిన్టోన్ కావాలా? అయితే ఈవెన్ స్కిన్ టోన్ సహజంగా పొందేందుకు 5 ఉత్తమ మార్గాలు మీకోసం (Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Telugu)
గర్భధారణ కొత్తలో శృంగారం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు (Things To Know About Sex During Early Pregnancy in Telugu)
ప్రెగ్నెన్సీ(గర్భధారణ) సమయంలో వీధి ఆహారాలు తీసుకోవచ్చా? తింటే ఎలాంటి స్ట్రీట్ ఫుడ్స్ తినాలి? వీధి ఆహారాలు తినాలనే కోరికను ఎలా కంట్రోల్ చేసుకోవాలి (Can street foods be consumed during pregnancy? What kind of street foods should be eaten? How to control the urge to eat street food? in Telugu)?
పీరియడ్స్ దాటిపోవడానికి ముందే తెలిసే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి (What are the pregnancy symptoms that can be noticed before the period is missed in Telugu)?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
By Concern | Weight Management | By Ingredient | Apple Cider Vinegar | Skin - Bath & Body | By Concern | Body Moisturizer | Brightening | Tan Removal | By Ingredient | Skin - Hygiene | By Concern | UTIs & Infections | Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Maternity dresses | Stretch Marks Kit | Stroller |