Want to raise a happy & healthy Baby?
New Mom
3 November 2023 న నవీకరించబడింది
బాలింతగా ఉండే కాలం (పోస్ట్ పార్టం పిరియడ్) డెలివరీ తర్వాత మొదలవుతుంది అలాగే ఆ మహిళ శరీరం తిరిగి ప్రెగ్నెన్సీకి ముందులాగా మారినప్పుడు ముగుస్తుంది. ఇది 6 నుండి 8 వారాలపాటు ఉంటుంది. ఈ వ్యవధిలో ఆడవారు చాలా రకాల శారీరక, మానసిక మార్పులతో ప్రయాణిస్తారు. చాలా బాధ్యతల మధ్య చిక్కుకుపోయి, కొత్తగా తల్లయిన ప్రతి మహిళ తన బిడ్డని చూసుకోవడం అలాగే తన స్వంత శరీర మార్పులతో వ్యవహరించడం మధ్య నలిగిపోతుంది. వీటన్నింటి మధ్య, డెలివరీ తర్వాత బరువు తగ్గడం నిజమైన పోరాటమనే చెప్పాలి. కొత్తగా తల్లయిన మహిళలు గుర్తుంచుకోవలసిన టాప్ 5 విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
కొత్తగా తల్లులు అయిన మహిళలు తప్పనిసరిగా తాజా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చేపలు, చికెన్ అలాగే తృణధాన్యాలు ఉన్న సమతుల్య పోషకాహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా తింటేనే బిడ్డకి కూడా ఎక్కువ పోషకాహారం అందుతుంది. అందుకని, బరువు తగ్గడానికి డెలివరీ తర్వాత డైట్లో పెరుగు, చీజ్ అలాగే తక్కువ కొవ్వు ఉన్న పాలు ఉండాలి, ఎందుకంటే వాటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత బరువు తగ్గించే డైట్లో ట్రౌట్ ఇంకా సాల్మన్ ఫిష్ వంటి సూపర్‌ఫుడ్‌లు చేర్చడం వలన కొత్తగా తల్లులైనవారికి తగినంత బరువును తగ్గించడంలో సహాయపడతాయి.
డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి కొత్తగా తల్లి అయిన మహిళ డైట్ ప్లాన్‌లో గోధుమరవ్వ, బ్రౌన్ రైస్, సంపూర్ణ గోధుమలు ఇంకా ఓట్స్ వంటి ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారపదార్థాలు ఉండాలి, ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి అలాగే ఆకలి బాధలను తగ్గిస్తాయి. ఇలాంటి పదార్థాలు మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించేలా చేస్తాయి ఇంకా ఆకలిని తగ్గిస్తాయి, ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పరిమితం చేస్తూ కొవ్వుని కరిగించే ప్రక్రియని వేగవంతం కూడా చేస్తాయి. తెల్లటి వెన్న, ఆవనూనె ఇంకా నెయ్యి కూడా బలం వచ్చేందుకు అలాగే మంచి జుట్టు, చర్మాన్ని పొందేందుకు సహాయపడతాయి. కాకపోతే వీటిని కూడా అతిగా తినకూడదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: త్వరగా కోలుకొనేందుకు సి-సెక్షన్ అయిన తర్వాత ఏమి తినాలి?
కొత్తగా తల్లయిన మహిళలు కొన్నిసార్లు భోజనాన్ని తినకుండా దాటవేస్తారు, అది వారి మెటబాలిజాన్ని గందరగోళానికి గురి చేస్తుంది ఇంకా డెలివరీ తర్వాత బరువుని తగ్గించే ప్రక్రియను కూడా అడ్డుకుంటుంది. మీరు పాపాయికి పాలివ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వీలైనంత త్వరగా తినటం ప్రాక్టీసు చేయాలి. అలాగే, మీ బిడ్డ పడుకున్నప్పుడు కూడా తింటూ ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండటం మంచిది కాదు, ఎందుకంటే అప్పుడు మీ ఆకలి తీరడానికి అతిగా తినేలా చేస్తుంది, ఆ వదిలించుకోవాల్సిన పౌండ్లను పోగొట్టకుండా చేస్తుంది. కొత్తగా తల్లయిన మహిళలకి ఒకేసారి అతిగా తినడం అంటే (బింజ్ చేయటం) సరైన పోషకాహారానికి దూరంగా ఉండి తమకి తాము ద్రోహం చేసుకోవడం ఇంకా మీలో ఉన్న అదనపు కొవ్వు మరింత పెరగటానికి అవకాశం ఇవ్వటమని గుర్తించండి. కాబట్టి, ఆ చిప్స్ ప్యాకెట్ని పండ్లు లేదా కొన్ని డ్రైఫ్రూట్లు లేదా నట్లతో భర్తీ చేయండి. మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవటానికి ఆరోగ్యకరమైన పదార్థాలని ఎంచుకోవటం ముఖ్యం.
కొత్త తల్లులకు డెలివరీ తర్వాత బరువు తగ్గించే మంచి చిట్కాలలో ఒకటి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచటం. తగినంత నీరు త్రాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గి, శరీరంలో ఎక్కువగా ఉన్న కేలరీలని కరిగించటంలో సహాయపడుతుంది. కడుపు నిండినట్లుగా అనుభూతి చెందడానికి అలాగే చిరుతిళ్ల పట్ల ఆకలిని తగ్గించుకోడానికి స్నాక్ సమయానికి ముందు నీరు త్రాగాలి. తల్లి పాలలో 90% నీరు ఉంటుందంటే పాలిచ్చే తల్లులు కూడా హైడ్రేటెడ్‌గా ఉండాలి. పాలిచ్చే తల్లులు రోజూ కనీసం 16 గ్లాసుల నీరు తాగితే తమని తాము ఇంకా తమ బిడ్డలను ఆరోగ్యంగా ఉంచుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. మూత్రం రంగు అలాగే వాష్‌రూమ్‌ను ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు – నిపుణులు ఈ రెండు విషయాల ఆధారంగా ఎంత నీరు తాగాలో నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. తగినంత ద్రవ పదార్థాలు త్రాగే కొత్త తల్లులు స్పష్టమైన మూత్రాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి 3 నుండి 4 గంటలకు బాత్రూమ్‌ని ఉపయోగిస్తారు. కాబట్టి, మామూలు నీటితో పాటు, కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, వెజిటబుల్ సూప్‌లు ఇంకా చికెన్ సూప్‌ల వంటివి కూడా అవసరమైన ద్రవ పదార్థాలుగా గుర్తించబడతాయి.
డెలివరీ తర్వాత బరువు తగ్గించే సరైన డైట్ని అనుసరించడంతోపాటు, కొత్తగా తల్లయిన మహిళలందరూ వారి రోజువారీ షెడ్యూల్‌లో స్ట్రెంత్ ట్రయినింగ్ ఇంకా ఏరోబిక్ వ్యాయామాలను చేర్చుకోవాలి. బరువు తగ్గడంలో వారికి సహాయపడటమే కాకుండా, సరైన వ్యాయామం ఎముకలు ఇంకా కండరాలను బలంగా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, డిప్రెషన్, నిద్ర సమస్యలలో సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి ఆకృతిలోకి రావాలంటే జిమ్‌కి తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం లేదు. కండరాలు పనిచేయడానికి అలాగే గుండె సరిగ్గా పనిచేయడానికి బ్రిస్క్ వాకింగ్ కి వెళ్లడం సరిపోతుంది. యోగా, ధ్యానం, డ్యాన్స్, స్విమ్మింగ్ ఇంకా జాగింగ్ కూడా అధిక బరువును తగ్గించడంలో సహాయపడతాయి. కానీ ఏదైనా వ్యాయామ రొటీన్‌ను ప్రారంభించే ముందు, ప్రత్యేకంగా సి-సెక్షన్ చేయించుకున్న మహిళలు డాక్టరు ఆమోదం పొందండి.
కొత్తగా తల్లయిన మహిళలకి డెలివరీ తర్వాత బరువు తగ్గగలిగేలా చేసే అత్యంత సాధారణ చిట్కాలలో ఒకటి తగినంత నిద్రపోవడం. ఎందుకంటే నిద్రలేమి వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన బరువు తగ్గడం కష్టమవుతుంది. అలాగే, వారికి అన్ని సమయాల్లో అలసటగా ఉంటుంది కాబట్టి, వారి శరీరం బరువు పెరగటాన్ని ప్రోత్సహించే కార్టిసాల్‌తో సహా స్ట్రెస్ హార్మోన్లని ఎక్కువగా విడుదల చేస్తుంది. అందుకని, కొత్తగా తల్లయిన మహిళలకి నిద్ర చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పూర్తిగా 8 గంటలసేపు నాణ్యమైన నిద్రను పొందడం అసాధ్యమే కానీ, బిడ్డ పడుకున్నప్పుడల్లా నిద్రపోయేలా చూసుకోవాలి. అంతేకాకుండా, పగటిపూట వీలైనంత ఎక్కువసేపు కునుకులు తీస్తూ ఉండండి, రాత్రిపూట త్వరగా మంచాన్ని చేరి ఎక్కువగా పడుకోవటానికి ప్రయత్నించండి.
ఒక మహిళ బిడ్డకి జన్మనిచ్చాక చందమామని ఎక్కినంత ఆనందాన్ని అనుభూతి చెందుతుంది, కానీ దానితోపాటు తన పట్ల తనకి, తన బిడ్డ పట్ల కూడా చాలా కొత్త బాధ్యతలు వస్తాయి. అందుకని, ఫిట్ గా అలాగే ఆరోగ్యంగా ఉండటానికి సరైన విషయాలను తెలుసుకోవడం అవసరం. ఎంతమంది ఎన్నిరకాల సలహాలు ఇచ్చినప్పటికీ, మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు డాక్టరుని సంప్రదించడం మంచిది. ఇవే కాకుండా, కొత్తగా అమ్మయిన మహిళలు మరింత సమాచారం ఇంకా చిట్కాల కోసం మైలో సైట్లో ఉన్న ఆర్టికల్స్ ఇంకా అక్కడ తెలియచేసిన వనరులని చెక్ చేయవచ్చు.
Yes
No
Written by
Nayana Mukkamala
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Acne & Blemishes | Skin hydration | Dark Circles | Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |