
సారాంశం


చాలా మంది కొత్త తల్లులకు సి-సెక్షన్ జరిగిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో తరచుగా అయోమయానికి లోనవుతారు. సి-సెక్షన్ అనేది ఒక వైద్య ప్రక్రియ, కాబట్టి ప్రసవానంతరం మంచి పోషకాహారాన్నితీసుకోవడమనేది ఎంతో ముఖ్యం. కొత్తగా తల్లైన వారి రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చడం వల్ల వారు తొందరగా కోలుకుంటారు.
సి-సెక్షన్ ద్వారా డెలివరీ అయిన కొత్త తల్లులు వారు స్వంతంగా ఎంచుకొనే వీలున్న భారతీయ డైట్ చార్ట్‌ను తయారు చేసుకోవచ్చు. వారు ప్రతిరోజూ సరైన పాళ్లలో పోషకాలను పొందేందుకు వారి రోజువారీ భోజన ప్రణాళికలలో భాగంగా.. క్రింద జాబితా చేయబడిన ఆహారాలను జోడించాలి:
సి-సెక్షన్ తర్వాత.. చాలా మంది స్త్రీలు మలబద్ధకంతో బాధపడుతున్నారని అంటూ ఉంటారు. కుట్లు పగిలిపోయే అవకాశం ఉన్నందున వారు ఆ సమయంలో ఎక్కువ ఒత్తిడి చేయలేరు కాబట్టి ఈ సమస్య కలుగుతుంది. సి-సెక్షన్ల తర్వాత ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు. బాలింత స్త్రీలు వారి రోజువారీ ఆహారంలో పచ్చి కూరగాయలు, పండ్లు ఇంకా సలాడ్‌లను చేర్చుకోవాలి.
DHA ఇంకా లాంగ్-చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు C-సెక్షన్ తర్వాత తీసుకోవలసిన ఆవశ్యకమైన ఆహారాలు. ఎందుకంటే ఈ ఆహారాలు ప్రసవం తర్వాత సాధారణంగా కలిగే డిప్రెషన్‌ను తగ్గించడంలో దోహదపడతాయి. వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు, సార్డినెస్, సాల్మన్ ఇంకా ట్యూనా లాంటి ఆహారాలు అవసరమైన కొవ్వు ఆమ్లాలు అందించే మంచి మూలాలు
సి-సెక్షన్ తర్వాత.. మలబద్ధకాన్ని నివాఏంచేందుకు ఇంకా ప్రేగులో కదలికలను సులభతరం చేసేందుకు ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. బిడ్డకు పాలుపట్టే తల్లులు కూడా డిహైడ్రేషన్‌కు గురవుతారు. దీనివల్ల పాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి.. ప్రసవానంతరం స్త్రీలు నీళ్ళు, పండ్ల రసాలు (నిమ్మ జాతి పండ్లు కానివి) ఇంకా సూప్‌లు వంటి ద్రవాలను ఎక్కువగా తాగడం మంచిది.
సి-సెక్షన్ తర్వాత విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని చేర్చడం చాలా అవసరం ఎందుకంటే అవి త్వరగా కోలుకోవడానికి ఇంకా ఇన్‌ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడతాయి. ప్రసవానంతరం స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో బొప్పాయి, టొమాటో, బ్రోకలీ, ద్రాక్ష, సీతాఫలాలు ఇంకా స్ట్రాబెర్రీ వంటి పండ్లు మరియు కూరగాయలను చేర్చుకోవాలి.
కొత్తగా తల్లైనవారు తమ ఆహారంలో అదనంగా ఐరన్ లభించే పదార్థాల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డకు పాలుపట్టేటప్పుడు వారిలోని ఐరన్ తగ్గిపోదు, కానీ, ఐరన్-ఎక్కువగా లభించే పదార్థాలు బాలింత స్త్రీలలకు ఇతర ఆహారాల నుండి పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడతాయి.
కొత్త తల్లుల ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే పదార్థాలుండాలి. రాగి, సోయాబీన్, శనగలు, ముల్లంగి ఆకులు, పాలు ఇంకా పాల ఉత్పత్తులు కాల్షియం అందించే అద్భుతమైన మూలాలు. ఈ ఆహారాలు త్వరగా కోలుకొనేందుకు ఇంకా తల్లిపాల మెరుగుదలకు ఎంతో సహాయపడతాయి.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కోలుకోవడాన్ని వేగవంతం చేస్తాయి. కండరాల బలాన్ని మెరుగుపరుస్తాయి ఇంకా కొత్త కణజాల వృద్ధికి సహాయపడతాయి. సి-సెక్షన్ తర్వాత, వేగంగా కోలుకోవడానికి మహిళలు వారి రోజువారీ ఆహారంలో పుష్కలంగా ప్రోటీన్ లభించే పదార్థాలను చేర్చాలి. వారు ఎంచుకోగల అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారా పదార్ధాలు చాలానే ఉన్నాయి. మాంసాహారులు గుడ్లు, చికెన్, చేపలు ఇంకా మాంసాన్ని ఇందులో చేర్చవచ్చు, అయితే శాఖాహారులు చీజ్, ఎండిన బీన్స్, బఠానీలు ఇంకా గింజలు తీసుకోవచ్చు.
బిడ్డకు పాలిచ్చే తల్లులకు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అందువల్ల, వారు తరచుగా శక్తిని కోల్పోతారు ఇంకా కార్బోహైడ్రేట్లున్న పదార్థాలపట్ల మక్కువ చూపుతారు. కానీ కొత్తగా తల్లైనవారు శక్తిని పొందేందుకు మంచి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అధిక కేలరీలనిచ్చే కార్బోహైడ్రేట్‌లకు బదులుగా, గింజలు, పప్పులు, గుడ్లు, పాలు ఇంకా చేపలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ప్రసవానంతరం స్త్రీలు ఆరోగ్యకరమైన ఇంకా పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అవి వారిని వేగంగా కోలుకొనేలా ఇంకా పాల ఉత్పత్తి మెరుగుపడేలా దోహదపడుతుంది. కానీ.. అజీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకొనేలా కూడా జాగ్రత్త పడాలి. బాలింత తల్లి, తన సి-సెక్షన్ జరిగిన తర్వాత తీసుకోవలసిన కొన్ని ఆహారాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
1. బియ్యం, వోట్స్, క్వినోవా ఇంకా గోధుమ వంటి తృణధాన్యాలు
2. ఉసిరికాయ, బచ్చలికూర, మెంతులు వంటి ఆకు కూరలు
3. తల్లి పాల ఉత్పత్తిని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుంది
4. సోంపు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి
5. శొంటిపొడి కడుపులోని మంటను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా గ్యాస్ / ఉబ్బరం తగ్గిస్తుంది
6. నారింజ మరియు బొప్పాయి వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువుంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు, పాల ఉత్పత్తిని మెరుగుపరచేందుకు సహాయపడుతుంది
7. పొట్లకాయలు, మునగకాయలు ఇంకా గుమ్మడికాయ వంటి నీటి శాతం అధికంగా ఉన్న కూరగాయలు తేలికగా జీర్ణమవుతాయి.
8. బాదం, జీడిపప్పు ఇంకా వాల్‌నట్ వంటి నట్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు ఆమ్లాలకు లభించే మంచి మూలం.
9. మెంతి, వాము మరియు నువ్వులు వంటి గింజలు తల్లి పాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి
కొత్తగా తల్లైనవారు తాము తినే ఇంకా త్రాగే వాటి గురించి చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అవి వారి ఆరోగ్యాన్ని ఇంకా పాల ఉత్పత్తిపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తాయి. కొత్త తల్లులు పూర్తిగా కోలుకునే వరకు ఇంకా బిడ్డకు పాలు మానిపించే వరకు తీసుకోకూడని కొన్ని ఆహారాలు క్రింద ఇవ్వబడ్డాయి.
కొత్త తల్లులు మొదటి కొన్ని నెలలు పుల్లని ఇంకా ఎక్కువ కారంగా ఉన్న ఆహారాలు తినకూడదు. ఎందుకంటే ఈ ఆహారాలు గ్యాస్, మంట ఇంకా ఉబ్బరం కలిగిస్తాయి.
పిజ్జా, ప్రాసెస్డ్ ఫుడ్స్, సోడాలు మరియు బాగా నూనెలో వేయించిన ఆహారాల వంటి చిరుతిళ్ళు తినడం కొత్త తల్లులు మానేయాలి. ఇలాంటి ఆహారాలు తక్కువ పోషక విలువలను కలిగి ఉండటమే కాక శరీరానికి అదనపు కేలరీలను అందిస్తాయి.
కాఫీ, టీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలు మితంగా తీసుకోవాలి.
పాలిచ్చే తల్లులు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది తల్లి పాలలో కలుస్తుంది. ఇది శిశువుకు చాలా ప్రమాదకరం
ప్రసవానంతరం సరైన సంరక్షణ గురించి మరింత సమాచారం పొందడానికి, మైలో ఫ్యామిలీ వెబ్‌సైట్‌ని సందర్శించండి. తమదైన ఒక కమ్యూనిటీని సృష్టించుకోవడానికి ఈ సైట్ కొత్త తల్లులందరిని ఒక్కటి చేస్తుంది. తల్లులు ఇక్కడ గర్భధారణ ఇంకా పిల్లల సంరక్షణకు సంబంధిచిన నిపుణుల సలహాలను కూడా తీసుకోవచ్చు.
మీ శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి అందించి, త్వరగా కోలుకోవడానికి, తల్లిపాల ఉత్పత్తికి సహాయపడే ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest




Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
BPA Free | Breast-Like Nipple | Food Grade Material | Wide Base for Better Latch | Can be Sterilized | Microwave Safe | Fits Most Standard Bottles







This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |