ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ (MoHFW), భారత ప్రభుత్వం 2016 జూన్లో ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ యోజన పథకాన్ని ప్రారంభించాయి. మన్ కీ బాత్ జూలై 2016 ఎపిసోడ్లో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ యోజన లక్ష్యాలు మరియు అందులోని ముఖ్యాంశాల గురించి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు మాట్లాడారు.
మన దేశంలో అధికంగా ఉన్న మాతా శిశు మరణాల రేటును నియంత్రించడం కోసం గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందించడం ఎంత అవసరమో ఆయన తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ యోజన (PMSMA) గర్భిణీ స్త్రీలందరికీ సమగ్రమైన మరియు నాణ్యమైన ప్రసవానంతర సంరక్షణను అందించడంపై దృష్టి సారించినందున రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుందని కూడా ఆయన వివరించారు. తనిఖీ కార్యక్రమాలు ప్రతి నెలా 9వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి.
అసలు PMSMA(ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్) అంటే ఏమిటి?
PMSMA అనేది ప్రభుత్వం రన్ చేస్తున్న ఒక కార్యక్రమం. ప్రతి నెలా 9వ తేదీన గుర్తించబడిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో 2 మరియు 3వ త్రైమాసికంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ప్రసవ సంరక్షణ సేవలను అందుతాయని ఇది హామీ ఇస్తుంది.
ప్రచారంలో పాల్గొనేలా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషియనర్లను ప్రోత్సహించేందుకు PMSMA ఒక క్రమబద్ధమైన విధానాన్ని అవలంభించింది. ఇదే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు గతంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య కార్యక్రమాల నుంచి వేరుగా ఉంచుతుంది. ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరియు ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ సెక్టార్కు కూడా ఆకర్షణీయంగా చేసేందుకు ఇది ఎన్నో సమర్ధవంతమైన వ్యూహాలను ఇది రూపొందిస్తోంది.
PMSMA(ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్)లోని ముఖ్య లక్షణాలు ఏమిటి?
- రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మన దేశంలో ప్రతి 100,000 మంది గర్భవతుల్లో 167 మంది గర్భవతులు గర్భధారణ సమయంలో లేదా బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చనిపోతున్నారు. 55,000 వేల మంది కంటే ఎక్కువ భారతీయ స్త్రీలు డెలివరీ సమయంలో మరణించారని UNICEF లెక్కలు చెబుతున్నాయి. అయితే సకాలంలో వైద్య పరీక్షలు చేయడం మరియు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈ మరణాలను తగ్గించవచ్చు. విషయం ఇంత తీవ్రంగా ఉండడంతో భారత ప్రభుత్వం ఈ మరణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకటి కంటే ఎక్కువ మెడికల్ స్కీమ్స్ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
- ఇండియాలో ఉన్న ప్రతి గర్భిణీ స్త్రీని వైద్యుడు పరీక్షించేలా PMSMA రూపకల్పన చేయబడింది. PMSMA సమయంలో(గర్భవతిగా ఉన్న సమయంలో) ప్రతి గర్భిణీ స్త్రీకి ఒక్కసారైనా సరైన చెకప్స్ అందించడం ఆ తర్వాత వైద్యులు సరిగ్గా చూసుకునేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇది మన దేశంలో MMR(ప్రసూతి మరణాల రేటు), నవజాత శిశు మరణాల సంఖ్యను తగ్గించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది.
- PMSMA కోసం ప్రైవేటు వైద్య రంగం నుంచి ప్రభుత్వం విజయవంతంగా మద్దతును సేకరించగల్గింది. ప్రైవేట్ OB/ GYN(ఒబ్స్టెట్రిక్స్/ గైనకాలజీ) నిపుణులు, రేడియాలజిస్టులు, ఫిజీషియన్స్ PMSMA ద్వారా యాంటనేటల్ చెకప్స్ (గర్భధారణకు పూర్వ చెకప్స్) అందించడం ద్వారా తమ వంతు కృషి చేసేందుకు ముందుకు వచ్చారు.
- ·ఈ పథకం కింద పరీక్ష చేయించుకున్న ప్రతి గర్భిణీ స్త్రీకి ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు స్టిక్కర్ను అందజేస్తారు. రెడ్ కలర్ స్టిక్కర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు ఇవ్వబడుతుంది. అయితే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేని గర్భవతులకు ఈ గ్రీన్ కలర్ స్కిక్టర్ ఇస్తారు.
PMSMA(ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్) ప్రధాన లక్షణాలు ఏమిటి?
పైన పేర్కొన్న విధంగా PMSMA ప్రధాన లక్ష్యం ఇండియాలోని గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. ఇలా చేయడం ద్వారా MMR(ప్రసూతి మరణాల రేటు) మరియు NNMR(శిశు మరణాల రేటు) తగ్గాయి. PMSMA పథకం కిందకు వచ్చే ఇతర లక్ష్యాలు:
- గర్భిణీ స్త్రీలకు వారి రెండవ లేదా మూడో త్రైమాసికంలో ఒక నిపుణుడి చేత యాంటీనాటల్ చెకప్(ప్రెగ్నెన్సీ నిర్దారణ అయిన తర్వాత చేయించుకునే పరీక్ష)కు హామీ ఇస్తుంది.
- గర్భిణీ స్త్రీలకు రోగ నిర్దారణ అయితే చేసే సేవలు, స్క్రీనింగ్, మరియు కౌన్సిలింగ్ అందజేయబడతాయి.
- పరీక్షించిన గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సరైన పత్రాలు మరియు రికార్డులను మెయింటేన్ చేయడం.
- పరీక్షించిన గర్భవతులలో ఎనిమియా, ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే హైపర్ టెన్షన్, గర్భధారణ మధుమేహం వంటి సమస్యలు ఉంటే వాటిని నయం అయ్యేలా చేయడం.
- హై రిస్క్ గర్భాలను గుర్తించడం.
- పరీక్షించిన ప్రతి గర్భిణీ స్త్రీకి సరైన బర్త్ ప్లానింగ్ కల్పించడం ఏదైనా సమస్య తలెత్తినా వారు పోరాడేలా వారిని తయారు చేయడం.
- ఆరోగ్య తనిఖీల కోసం గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించడం మరియు వారికున్న ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశల్లోనే గుర్తించడం.
- పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పరీక్షల్లో తేలిన గర్భిణీ స్త్రీల పట్ల ఎక్కువ శ్రద్ధ.
PMSMA(ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్) ఉచిత చెకప్ మహిళలకు సహాయపడుతుందా?
- PMSMA కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భవతులకు చాలా ప్రయోజనకరంగా మారిందని ఇప్పటికే నిరూపితం అయింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఇప్పుడు అన్ని ప్రభుత్వ దవాఖనాలు మరియు హెల్త్ సెంటర్లు అన్ని ఈ ప్రోగ్రాం కిందకు వస్తాయి.
- ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వారు ప్రతి నెలా 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అన్ని రకాల రక్తపరీక్షలు, బీపీ పరీక్షలు, హీమోగ్లోబిన్ పరీక్షలు, బరువు తనిఖీ, షుగర్ లెవెల్ పరీక్షలు, జనరల్ స్క్రీనింగ్ వంటి పరీక్షలు ఉంటాయి.
- ప్రతి గర్భిణీ స్త్రీ ఏదేని ప్రభుత్వ ఆసుపత్రి, లేదా హెల్త్ సెంటర్ లేదా PMSMAలో నమోదు చేసుకున్న ప్రైవేట్ ఆసుపత్రిని 3–6 నెలల గర్భధారణ సమయంలో తనిఖీల కోసం సంప్రదించే హక్కును PMSMA గర్భిణీ స్త్రీలకు అందిస్తుంది.
- భారతదేశంలోని స్త్రీలు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరనే విషయం మనందరికీ తెలిసిందే. మనదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న గర్భిణీ స్త్రీలు ఇప్పటికే పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు. వనరుల కొరత కారణంగా వారికి గర్భధారణ సమయంలో అవసరమైన పోషకాహారం అందడం లేదు. దీని ఫలితంగా వారు అసాధారణలతో కూడిన పిల్లలకు జన్మనిస్తారు.
- సకాలంలో పరీక్షలు చేయడం మరియు తొందరగా సమస్యను నిర్దారించడం వల్ల ఈ అసాధారణతలను తగ్గించవచ్చు. కానీ పేదరికం, అవగాహన లేమి వల్ల గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది గర్భిణీ స్త్రీలకు ఇంతకుముందు వీలు పడేది కాదు.
- ఏదేమైనా సమాజంలోని అన్ని వర్గాల గర్భిణీ స్త్రీలు ప్రతి నెలా 9వ తేదీన ఉచితంగా వైద్య పరీక్షలను పొందేలా PMSMA వీలు కల్పిస్తుంది. వారు దేశంలోని ఎటువంటి ప్రభుత్వ ఆసుపత్రికైనా లేదా హెల్త్ కేర్ సెంటర్కైనా వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు.
- సమయానికి తనిఖీలు చేయడం, ఏదైనా సమస్య ఉంటే సమయానికి గుర్తించడం వల్ల అసాధారణతలతో(సమస్యలతో) పుట్టే శిశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. PMSMA కార్యక్రమం కింద సమయానికి ఆరోగ్య తనిఖీలు చేయడంతో పాటుగా ఆరోగ్యాలను ఎల్లప్పుడూ పర్యవేక్షించడం వలన సరైన విధంగా పోషకాహారం అందించడం మరియు న్యూట్రీషియన్ సప్లిమెంట్లను అందించడం వెనుకబడిన తరగతుల స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కష్టపడి ఇంటి పనులు చేసినా కానీ రెండు పూటల తినేందుకు కూడా తిండి దొరకని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
- జననీ సురక్ష యోజన (JSY)తో పాటుగా PMSMA గర్భిణీ స్త్రీలకు గొప్ప వరం అని ఇప్పటికే నిరూపించబడింది. JSY(జననీ సురక్ష యోజన) కింద గర్భిణీ స్త్రీలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత ప్రసవం పొందేందుకు అర్హులవుతారు.
చివరగా..
UNICEF అంచనా ప్రకారం.. శిశుమరణాలు, ప్రసవానంతర సమస్యలు అనేవి పోషకాహార లోపం వల్ల సంభవిస్తాయి. అయినప్పటికీ సరైన సమయంలో ఆరోగ్య తనిఖీలు, తల్లులకు సరైన పోషకాహారం అందించడం వల్ల ఈ సమస్యలను తగ్గించవచ్చు. PMSMA(ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్) ఒక గొప్ప పథకం. ఇది ఎంతో గర్భవతులు మరియు నవజాత శిశువుల జీవితాలను కాపాడింది. ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్లి తన లక్ష్యాలను త్వరగా సాధించాలని అనుకుంటే మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా గర్భవతులకు ఉచితంగా పోషకాహారం అందించాలి.