This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి (How To Prevent Breast Milk Leakage During Pregnancy in Telugu)?

Pregnancy
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి (How To Prevent Breast Milk Leakage During Pregnancy in Telugu)?
Likes79 Likes|
Read time8 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • తల్లిపాలిచ్చే సమయంలో రొమ్ముల నుంచి పాలు కారడం చాలా సాధారణం, ఇది భావోద్వేగాలు, అధిక పాల ఉత్పత్తి, రొమ్ము నిల్వ సామర్థ్యం వంటి కారణాల వల్ల జరగొచ్చు.
  • క్రమం తప్పకుండా బిడ్డకు పాలివ్వడం, చనుమొనలను సున్నితంగా ఒత్తడం, మంచి నాణ్యమైన నర్సింగ్ బ్రా ధరించడం రొమ్ము లీకేజీని తగ్గించడంలో సాయపడతాయి.
  • డిస్పోజబుల్ లేదా ఉతికి తిరిగి వాడగలిగే కాటన్ బ్రెస్ట్ ప్యాడ్‌లు పాల చుక్కలను పీల్చుకుని రొమ్మును పొడిగా, సౌకర్యవంతంగా ఉంచుతాయి.
  • రొమ్ము లీకేజీ నుంచి కాపాడే ఉత్పత్తులు ఏవి? Explore our Adjustable & Reusable Cloth Diaper - Red & Blue - Pack of 2.
Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
Rating4.8

బిడ్డ పొందడం గొప్పవరం మరియు మీ బిడ్డకు తల్లిపాలు పట్టే అవకాశం లభించడం గొప్ప ఆశీర్వాదం. తల్లి పాలివ్వడం వల్ల తల్లికి బిడ్డతో గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఇది ఎవరికీ సాధ్యం కాదు. అయితే కొన్నిసార్లు మీ రొమ్ములు (స్తనాలు) నిండినట్టు అనిపించి లీక్ అయ్యే సందర్భాలు ఉంటాయి.

తల్లి పాలివ్వడం యొక్క సైడ్ ఎఫెక్ట్ కింద తరుచుగా రొమ్ము పాలు కారడం, అసౌకర్యంగా ఉండటం జరుగుతుంది. ముందు మీ రొమ్ములోకి పాలు రావడం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏ సమయంలో అయినా మీ రొమ్ముల నుంచి కారడం లేదా చిమ్మడం జరుగుతుంది.

మీకు అప్పుడే బిడ్డ పుట్టినట్టయితే, మీ రొమ్ము లీక్ అవుతున్నట్లు కూడా మీరు గమనించకపోవచ్చు. ఉత్పత్తి అయిన రొమ్ము పాలను బిడ్డ అవసరాలకు పట్టినట్టయితే, లీకేజీ తగ్గొచ్చు లేదా ఆగిపోవచ్చు.

రొమ్ములు ఎందుకు లీక్ అవుతాయి (Why Do Breasts Leak)?

పాలిచ్చే సమయంలో మీ రొమ్ములు ఎందుకు లీక్ అవుతున్నాయని ఆలోచిస్తున్నట్లయితే, ఆందోళనకు సంకేతమా కాదా అనుకుంటే చింతించకండి. తల్లిపాలు ఇచ్చే సమయంలో రొమ్ముల నుంచి పాలు కారడం చాలా సాధారణం. పాల లీకేజీ కారణంగా తరచుగా మీ నర్సింగ్ బ్రా తడి కావడం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చిన కొన్ని కారణాల గురించి తెలుసుకుంటే పాలు ఎందుకు లీక్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు:

భావోద్వేగం (Emotional Triggers)

మీ బిడ్డ ఏడుపు వినడం లేదా చూడటం, మీ పిల్లల ఫొటోలు లేదా వీడియో చూడటం లేదా మీ బిడ్డ గురించి ఆలోచించినప్పుడు పాల విడుదలకు సంబంధించిన హార్మోన్ల ప్రతిస్పందన ప్రభావితం వల్ల ఇలా జరగొచ్చు. కొంతమంది స్త్రీలు పాలు బయటకు రాకముందే జలదరింపు లేదా 'జింగింగ్'ను అనుభవిస్తారు. దాన్నే లెట్-డౌన్ లేదా మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటారు.

టైం ప్రకారం పాలివ్వడం (Scheduled Feeds)

చాలామంది తల్లులు ఓ సమయం ప్రకారం బిడ్దలకు పాలిస్తుంటారు. అయితే ఇందుకు విరుద్ధంగా కొందరు బిడ్డకు ఆకలైనప్పుడే ఇస్తుంటారు. ఇది సాధారణంగా రొమ్ములు లీక్ అవడానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలకు పాలు తాగిన తరువాత బర్పింగ్ ఎలా చేయాలి?

అధిక ఉత్పత్తి (Oversupply)

మీ శరీరంలో అధిక మొత్తంలో పాలను ఉత్పత్తి చేస్తుందనుకుందాం. అప్పుడు మీ రొమ్ములు మరీ తరచుగా లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది తల్లి పాలిచ్చే రోజుల్లో మంచి నాణ్యత గల నర్సింగ్ మెటర్నిటీ బ్రాను ఉపయోగించాల్సి వస్తుంది. మంచి నాణ్యమైన బ్రా మీ రొమ్ములు సౌకర్యవంతంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

రొమ్ము నిల్వ సామర్థ్యం (Breast Storage Capacity)

చిన్న రొమ్ముల్లో తక్కువ పరిమాణంలో పాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. రొమ్ములు ఓ డబ్బా అనుకున్నట్లయితే చిన్న పాత్రలో పాలు తక్కువగా పడుతాయి కదా. అందుకే చిన్న రొమ్ములు ఉన్న స్త్రీలు తమ బిడ్డలకు తరచుగా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారు తక్కువ పరిమాణంలో పాలు ఉత్పత్తి చేస్తారని కాదు. మీరు పాలు పట్టడానికి మధ్య ఎక్కువసేపు వేచి చూస్తే తల్లి పాల 'కంటైనర్' లీక్ అవుతుంది.

పాలిచ్చే సమయంలో (While Breastfeeding)

కొంతమంది తల్లులు తమ బిడ్డకు ఒక రొమ్ము నుంచి పాలు ఇస్తున్నప్పుడు మరో రొమ్ము నుంచి లీక్ కావడం గమనించొచ్చు.

పాలిచ్చే సమయంలో మార్పు (Change In Feeding Times)

తల్లిపాలు పట్టడం ప్రారంభించిన మొదటి కొన్ని నెలల్లో మీ జీవితమంతా మీ చిన్నారికి పాలు పట్టడంతోనే సరిపోయిందని అనిపించినా, మీ బిడ్డ కొంచెం పెరిగాక, ఫీడింగ్ కాస్త తగ్గుతుంది. కాబట్టి మీరు ప్రస్తుతం మీ బిడ్డకు ప్రతి రెండు గంటలకోసారి ఫీడింగ్ చేస్తూ ఉంటే, మీ బిడ్డ పెద్దయ్యాక బిడ్డకు ప్రతి 6 గంటలకోసారి ఫీడింగ్ చేస్తే సరిపోతుంది. మీరు మొదట్లో మీ బిడ్డ పాలిచ్చే సమయంలో లీక్ అవ్వడం మొదలవుతుంది. అయితే దీనికి గురించి మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ శరీరం కొత్త షెడ్యూల్‌కు అలవాటు పడిపోయి పాలు కారడం తగ్గుతుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: బిడ్డకు పాలు ఇస్తున్న దశలో నిప్పల్ బటర్ క్రీమ్ వాడటం సురక్షితమేనా

మీ రొమ్ములు కారకుండా ఆపగలరా (Can You Stop Your Breasts From Leaking in Telugu)?

ఎలాంటి అడ్డంకి లేకుండా రొమ్ములను క్రమం తప్పకుండా బిడ్డకు అందివ్వాలి. ఇలా చేస్తే అదనంగా వచ్చే పాలను తొలగించడంలో సాయపడుతుంది. ఫీడింగ్‌ (పాలివ్వడం) తప్పకూడదు. అలాగే ఫీడింగ్ ఎక్కువసార్లు చేయాలి. ఇలా చేస్తే చనుమొన కండరాల చుట్టూ ఉన్న స్పింక్టర్‌కు ఓ సరైన ఆకారం వచ్చి భవిష్యత్తులో పాలు కారకుండా ఉంటుంది.

మీరు మీ శిశువుకు దూరంగా ఉన్నప్పుడు, మీ రొమ్మును సున్నితంగా నొక్కడం ద్వారా పాలు కారడాన్ని ఆపొచ్చు. మీ ఛాతీపై మీ చేతులను ఉంచి మీ ముంజేతులతో తేలికగా నొక్కడం ఒక అద్భుతమైన మార్గం. అలా చేస్తూ ఉంటే పాలు కారడం తగ్గి, శరీరం ఉత్పత్తి చేసే పాల పరిమాణాన్ని అదుపులో ఉంచుతుంది.

బ్రెస్ట్ ప్యాడ్స్ చుక్కలను పీల్చుకుని రొమ్మును పొడిగా ఉంచుతాయి. కాబట్టి రొమ్ములు కారే వాళ్లు వీటిని ఉపయోగించవచ్చు. అయితే చనుమొనల చుట్టూ చికాకు, తేమ రాకుండా చూసేందుకు వాటిని మారుస్తూ ఉండాలి.

రొమ్ము లీకేజీని నివారించడానికి మీరేం చేయొచ్చు (What Can You Do to Prevent Breast Leakage in Telugu)?

రొమ్ము కారడాన్ని కింది మార్గాల ద్వారా నిరోధించవచ్చు:

  • అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పెరిగిన రొమ్ములపై వెంటనే ​​ఒత్తిడి తగ్గిస్తుంది. శిశువుకు పాలు పట్టిన తర్వాత కూడా ఒత్తిడి అలాగే ఉంటే చేతి ద్వారా పాలను బయటకు తీసేస్తే తగ్గుతుంది. మాస్టైటిస్ అనే రొమ్ముకు అడ్డుపడే ఇన్ఫెక్షన్ వస్తే మీరు 24 గంటల వరకు బెడ్ పైనే ఉండాల్సి వస్తుంది. దీన్ని ఈ పద్ధతి ద్వారా తగ్గించొచ్చు.
  • బయటకు వెళ్లినప్పుడు లీకేజీ ఆనవాళ్లను కనిపించకుండా ఉంచేందుకు దుస్తులను ధరించాలి. పట్టు వస్త్రాలు మరియు ముదురు రంగులను వేసుకోకండి. జాకెట్ లేదా స్వెటర్ ధరించడం ద్వారా తడి మరకలను కప్పేయవచ్చు.
  • మీరు నిద్రపోయే సమయానికి మీ బిడ్డకు పాలిస్తే పాలు కారే అవకాశం తక్కువ. కాస్త ఖచ్చితంగా చెప్పాలంటే, రొమ్ములు ఎప్పుడూ ఖాళీ కావు. కంటికి సరిపడా నిద్ర చాలా ముఖ్యం.
  • పాలు కారకుండా ఉండటానికి, చనుమొనలకు అడ్డంగా అరచేతులను పెట్టాలి. టేబుల్‌ ముందు కూర్చున్నప్పుడు మీ గడ్డానికి చేతులు ఆనించి ముంజేతులను ఉపయోగించి చనుమొనలను ఒత్తడం ద్వారా ద్వారా పాల కారడాన్ని ఆపొచ్చు. పాల ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే ఇలా చేయాలి. చనుపాలివ్వడం యొక్క మొదటి కొన్ని వారాల్లో చేసే బాహ్య ఒత్తిడి వల్ల పాల నాళాలకు అడ్డుపడుతుంటుంది.
  • మీ పరుపు, బెడ్ షీట్లను పొడిగా ఉంచేందుకు నిద్రపోయే ముందు మీ మంచం మీద బాత్ టవల్ పరచండి.
  • మంచి మిల్క్ కలెక్టర్స్ కొని బ్రాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ బిడ్డకు అవసరమైనప్పుడు పాలు అందించవచ్చు.
  • తల్లులు తమ రొమ్ములు శ్రేయస్కరంగా ఉండేందుకు ఆన్‌లైన్‌లో నర్సింగ్ మెటర్నిటీ మౌడ్ స్పేసర్ కప్ బ్రాలు కూడా కొనుక్కోవచ్చు.

మీరు ఏ రకాల బ్రెస్ట్ ప్యాడ్స్ ఉపయోగించాలి (What Types of Breast Pads Should You Use in Telugu)?

  • మీరేదైనా ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా టాస్క్‌లో పని చేస్తున్నప్పుడు లీక్‌లు కాకుండా అడ్డుకోవడంలో ఈ చిట్కాలు మీకు సాయపడతాయి. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మిమ్మల్ని రక్షిస్తాయి:
  • డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్‌లు అందుబాటులో ఉన్నా కూడా కొత్త తల్లులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తప్పు ప్యాడ్ ఉపయోగిస్తే తల్లిపాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చనుమొనలు చిరాకు పెట్టకుండా ఉండేందుకు, వాటర్‌ప్రూఫ్ లేదా ప్లాస్టిక్ లైనింగ్ ఉన్న వాటికి దూరంగా ఉండాలి. మెటర్నిటీ బ్రా కింద వేసుకోగలిగే మంచి ప్యాడ్‌లు కూడా ఉన్నాయి.
  • ఉతికి, తిరిగి వాడగలిగే కాటన్ బ్రెస్ట్ ప్యాడ్‌లు మంచి ఎంపిక. ఈ బ్రెస్ట్ ప్యాడ్ 2 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది.
  • ఉతికి తిరిగి వేసుకోగలిగే క్లాత్ బ్రెస్ట్ ప్యాడ్‌లను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెస్ట్ ప్యాడ్స్ పై ఖర్చు పెట్టడానికి వెనుకాడే తల్లులకు ఇవి సురక్షితమైనవి. తల్లిగా మీకు ఎంత ఎక్కువ అనుభవం ఉంటే, ఈ విధానం ద్వారా మీరు మరింత సౌకర్యవంతంగా ఉంటారు.

ముగింపు (Conclusion)

ప్రతి స్త్రీకి తల్లిపాలిచ్చే అనుభవం చాలా ప్రత్యేకమైనది. మొదటిసారి తల్లులైన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడగలిగితే మరింత తేలికగా ఉండొచ్చు. కొత్త తల్లి తన బిడ్డకు అత్యుత్తమ జీవితాన్ని అందించాలనే కోరికను మొదటి కొన్ని నెలల్లో పాలు కారడం వల్ల సందేహం లేదా అవమానంతో దెబ్బతినకూడదు.

Tags:

breast pads for new moms in telugu, breast leakage in new moms in telugu, How to prevent breast leakage in telugu, tips to prevent breast leakage in telugu.

Also Read In:

English: How To Prevent Breast Milk Leakage During Pregnancy in English

నర్సింగ్ తల్లుల చేత ప్రేమగా ఎంచుకోబడినవి

పాల లీకేజీ ఇబ్బంది లేకుండా, మిమ్మల్ని పొడిగా, సౌకర్యవంతంగా ఉంచేందుకు రూపొందించిన నాణ్యమైన ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి.

Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2

Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2

BPA Free | Breast-Like Nipple | Food Grade Material | Wide Base for Better Latch | Can be Sterilized | Microwave Safe | Fits Most Standard Bottles

5819 Moms bought
₹59₹7925% Off
Rating
4.8
(118)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.