back search

Want to raise a happy & healthy Baby?

  • Get baby's growth & weight tips
  • Join the Mylo Moms community
  • Get baby diet chart
  • Get Mylo App
    ADDED TO CART SUCCESSFULLY GO TO CART
    • Home arrow
    • Weight Loss arrow
    • ప్రసవానంతరం పొత్తికడుపు పైనుండే క్రొవ్వును సహజంగా ఎలా తగ్గించుకోవాలి (How to Reduce Post-Partum Belly Fat Naturally in Telugu) arrow

    In this Article

      ప్రసవానంతరం పొత్తికడుపు పైనుండే క్రొవ్వును సహజంగా ఎలా తగ్గించుకోవాలి (How to Reduce Post-Partum Belly Fat Naturally in Telugu)

      Weight Loss

      ప్రసవానంతరం పొత్తికడుపు పైనుండే క్రొవ్వును సహజంగా ఎలా తగ్గించుకోవాలి (How to Reduce Post-Partum Belly Fat Naturally in Telugu)

      3 November 2023 న నవీకరించబడింది

      ఎంతోమంది మహిళలకు, ప్రసవానంతరం బరువు తగ్గడం అనేది ఎంతో కష్టమనిపిస్తుంది. శిశువు పుట్టిన తర్వాత శిశువుకు పాలు పట్టి వారి ఆలనా పాలన చూడటం వల్ల ఆ నిద్రలేని రాత్రుల మధ్య, కొత్తగా తల్లైనవారు ఒక్కోసారి తమను తాము సరిగ్గా పట్టించుకోవడం కూడా మరిచిపోతారు. ప్రసవానంతరం కనిపించే పొత్తికడుపులోని క్రొవ్వు శాశ్వతమైన సమస్య కానప్పటికీ, కొత్త తల్లులు వాటివల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే అది తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషించాలి. అత్యంత ప్రభావవంతమైన ప్రసవానంతర బరువు తగ్గించే ఆహారం తీసుకోవడంతో పాటు సరైన వ్యాయామం ఇంకా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల త్వరగా మంచి ఆకృతిని తిరిగి పొందడంలో ఇవి సహాయపడతాయి. కాబట్టి, పైన తెలిపినట్లుగా, ప్రసవానంతర బరువు తగ్గించే టిప్స్‌లను అనుసరించి, ప్రసవానంతరం ఏర్పడే లావుపాటి పొట్టను తగ్గించుకోవచ్చు:

      మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర బరువు తగ్గడానికి ప్లాన్ చేసేందుకు ఉత్తమ సమయం ఏది?

      1. తరచుగా పాలుపట్టాలి (Breastfeed Frequently)

      ప్రసవానంతర బరువు తగ్గించే ఉత్తమ టిప్స్‌లలో ఒకటి శిశువుకు తరచుగా పాలుపట్టడం. తల్లిపాలు శిశువు రోగనిరోధక శక్తికి బలాన్నిస్తుంది మరియు పాలిచ్చే తల్లులకు ప్రతిరోజూ 300 నుండి 500 కేలరీలు ఖర్చు కావడానికి ఇది దోహదపడుతుంది. కానీ వారు తమ శిశువుకు కావలసిన పాల ఉత్పత్తి కోసం తగినంత కేలరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలనేది తెలుసుకోవాలి.

      తల్లిపాలు పట్టడమనేది ప్రసవానంతరం పెరిగిన బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది, గర్భాశయం పూర్వస్థితిని పొందడంలో సహాయపడుతుంది. ఎందుకంటే తల్లిపాలు కండరాల సంకోచానికి కారణమయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది కాబట్టి.

      2. బిడ్డతో చురుకుగా వ్యవహరించాలి (Get Active with the Baby)

      చాలా మంది కొత్తగా తల్లైనవారికి ప్రసవం తర్వాత కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించడం కాస్త కష్టంగానే ఉంటుంది ఇంకా అందుకు పరిష్కారం ఏమిటంటే - శిశువుతో చురుకుగా ఉండటం. కొత్త తల్లులు, తమ శిశువు ఆలనా పాలనా చేస్తున్నపుడు తేలికపాటి సంగీతాన్ని వింటూ దానికి తగ్గ నృత్యం చేసేందుకు ప్రయత్నించవచ్చు. కావున, బిడ్డను కనిపెట్టుకొని ఉన్నప్పుడు కూడా పొట్ట కొవ్వును వదిలించుకోవడానికి ఇదొక ఆహ్లాదకరమైన మార్గం.

      3. ప్రసవానంతరం చేసుకొనే మసాజ్ కూడా సహాయపడుతుంది (Postpartum Massage Can Help)

      ప్రసవానంతరం మహిళలకు తమను తాము పట్టించుకోవడం వల్ల అది వారికి శారీరకంగా ఇంకా మానసికంగా ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త తల్లులు తమను తాము పట్టించుకొనే దినచర్యలో ఒక అంతర్భాగంగా మసాజ్ చేసుకోవడాన్ని చేర్చుకోవాలి, మసాజ్ వల్ల పొత్తికడుపు ప్రాంతానికి రక్త ప్రవాహం పెరిగి ప్రసవం తర్వతా త్వరగా కోలుకునేలా చేస్తుంది. సరైన మసాజ్‌లు వడలిపోయిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి, ఎందుకంటే మసాజ్‌కి వాడే తైలాల వల్ల చర్మ స్థితిస్థాపకత మెరుగవుతుంది ఇంకా చర్మానికి పోషణ లభిస్తుంది.

      ఈ చిన్నపాటి ప్రేరణ కండర సంకోచ ప్రక్రియకు సహాయపడే ఆనందం కలిగించే ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది గర్భాశయాన్ని గర్భానికి ముందున్న పూర్వ స్థితికి వచ్చేలా చేస్తుంది. ఏదేమైనప్పటికీ, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న మహిళలు ప్రసవానంతర మసాజ్ చేసుకొనే ముందు తమ డాక్టరుగారిని సంప్రదించాలి.

      4. ప్రసవానంతరం బరువు తగ్గడానికి సరైన ఆహార ప్రణాళికను అనుసరించాలి (Follow the Right Postpartum Diet Plan for Weight Loss)

      ప్రసవానంతర బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావవంతమైన ఆహారం ప్రోటీన్లు, పిండి పదార్థాలు ఇంకా కొవ్వులతో కూడిన సరైన సమతుల్యతతో ఉంటుంది. స్త్రీలు ప్రసవం తర్వాత తీసుకొనే ఈ భోజనాన్ని ఇతర ఆహార పదార్ధాలతో మార్చకూడదు లేదా వారి భోజనాన్ని దాటవేయకూడదు. అందుకు బదులుగా, ప్రసవానంతర శిశువు సరైన పెరుగుదలకు తోడ్పడే తగినంత పాల ఉత్పత్తికి మహిళల ప్రసవానంతర ఆహార ప్రణాళిక వివిధ సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా నిండిఉండాలి.

      కొత్త తల్లులు పగలూ రాత్రి చురుకుగా ఉండటానికి వారికి ఎంతో శక్తి అవసరం అవుతుంది. అందువల్ల, బరువు తగ్గడానికి వారి ప్రసవానంతర ఆహార ప్రణాళికలో అధికంగా ఆకుకూరలు, మసాలాలు, లీన్ ప్రోటీన్ ఇంకా గ్రీన్ టీ కలిగిఉండాలి.

      5. వ్యాయామం మొదలుపెట్టాలి ( Start Working Out)

      20 నుండి 30 నిమిషాల స్ట్రెంగ్త్ ఇంకా కార్డియో శిక్షణ, కొత్త తల్లులందరికీ పొట్టలోని కొవ్వును గణనీయంగా తగ్గించుకొనేందుకు సహాయపడుతుంది. వారి బిడ్డ నిద్రిస్తున్నప్పుడు లేదా బిడ్డను ఎవరైనా కనిపెట్టుకొనే వారుంటే, అప్పుడు వారు తప్పనిసరిగా ఈ శిక్షణలో పాల్గొనాలి. పుష్-అప్‌లు, క్రంచెస్, ట్రైసెప్ డిప్స్, ప్లాంక్‌లు, స్పాట్ జాగింగ్, హై నీస్, లంగ్స్, జాక్‌నైఫ్, స్క్వాట్‌లు, ట్రైసెప్ ఎక్స్‌టెన్షన్‌లు, జంపింగ్ జాక్స్ మరియు బైసెప్ కర్ల్స్ అన్నీ సహాయపడే వ్యాయామాలే. కానీ తప్పనిసరిగా చేయకూడని వ్యాయామాల గురించి తెలుసుకోవడం కోసం తమ డాక్టరుగారిని సంప్రదించాలి.

      స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో పాల్గొనలేని సిజేరియన్ డెలివరీలు ఉన్న మహిళలకు బ్రిస్క్ వాకింగ్ మంచి వ్యాయామం. అదనపు బరువు కోసం తమ బిడ్డను స్ట్రోలర్ లేదా ఫ్రంట్ బ్యాగ్‌లో తీసుకెళ్లడం వల్ల ఈ సులభమైన ఇంకా సరళమైన ప్రసవానంతర శారీరక శ్రమ మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది.

      6. తగినంత నీటిని తీసుకోవాలి (Stay Hydrated)

      ఇటీవల ప్రసవించిన వారు లేదా ప్రత్యేకంగా పాలిస్తున్న తల్లులు, ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీటిని త్రాగాలి. సన్నని నడుమును తిరిగి పొందాలని తపించే మహిళలకు ఇది ఎంతో అవసరం. శరీరం నుండి మలినాలను బయటకు పంపే ప్రక్రియలో నీరు శరీరంలోని ద్రవ సమతుల్యతను సులభతరం చేస్తుంది. అంతేకాక, ఇది అధికంగా ఉన్న పొత్తికడుపులోని కొవ్వును తగ్గిస్తుంది మరియు కొత్త తల్లులు తమ పిల్లలకు ప్రతిరోజూ పట్టే పాలను భర్తీ చేయడంలో దోహదపడుతుంది.

      7. తగినంత విశ్రాంతి తీసుకోవాలి (Get Sufficient Rest)

      తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల స్త్రీల శరీరంలో టాక్సిన్లు ఏర్పడుతాయి, వాటి ఫలితంగా ప్రసవానంతర మంటతో కూడిన వాపు కనిపిస్తుంది. ఇది కొవ్వు గ్రాహకాలను పొత్తికడుపు ప్రాంతానికి బదిలీ చేయడంవల్ల, అక్కడ అవి కొవ్వుగా నిల్వ చేయబడతాయి. కాబట్టి, ప్రసవానంతర శరీర బరువును తగ్గించుకోవడానికి సరైన విశ్రాంతి ఎంతో ముఖ్యం. శిశువుతో ఉన్నప్పుడూ మంచి నిద్రను పొందడం కాస్త కష్టమైనప్పటికీ, మహిళలు తమ కోసం కొంత సమయం కేటాయించుకొని, వీలైనంత విశ్రాంతిని తీసుకోవాలి.

      8. కఠినమైన డైట్లను పాటించకూడదు ( Do Not Follow Extreme Diets)

      కొత్త తల్లులు ప్రసవానంతరం డిప్రెషన్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే దీనికి వారు భయపడి, నియంత్రణ కోల్పోవాలనేది దీని అర్థం కాదు. కొంతమంది స్త్రీలు తిరిగి పూర్వపు ఆకృతిని పొందేందుకు తీవ్రమైన చర్యలు చేపడుతారు. అందుకోసం వారు పోషకాహార లోపాన్ని కలిగించడమే కాకుండా శిశువు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే కఠినమైన ఆహార ప్రణాళికలను ఆశ్రయిస్తారు. పస్తులుండటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదని మహిళలు తెలుసుకోవాలి. వారు తప్పనిసరిగా డైటీషియన్‌ను సంప్రదించి, తమ పొట్టను త్వరగా తగ్గించుకోవడానికి ఏంచేయాలో, ఎంత ఇంకా ఎప్పుడు ఏది సులువైనదో అనే అవగాహనను పొందాలి.

      9. ప్రతిరోజూ ధ్యానం చేయాలి (Meditate Every Day)

      ప్రసవానంతర దశలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. బిడ్డను చూసుకోవడం, ఇంటిపనులన్నీ చేసుకోవడంతో పాటు తమకిష్టమైన పనులు చేసుకోవడంలో కొత్త తల్లులందరూ కొంత ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం ధ్యానం. అందువల్ల ఏకకాలంలో మహిళలు తమ దైహిక స్వభావాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా శరేరంలోని ప్రతికూల శక్తిని విసర్జించేందుకు, తమ మనసుని వీటిపై కేంద్రీకరించడానికి ధ్యానం సహాయపడుతుంది.

      చివరి మాట (Final Word)

      ప్రసవానంతరం బరువు తగ్గాలని భావిస్తున్న కొత్త తల్లులు తమంతట తాముగా సులభంగా ఈ ప్రయత్నం చీయాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం ఇంకా స్థిరమైన జీవనశైలి మార్పులు వారిని కొద్దికాలంలోనే కోలుకునేలా చేస్తాయి. ప్రసవానంతరం బరువు తగ్గడం లేదా అటువంటి అంశాలున్న కథనాలను చదవడం కొరకు ఇంకా మరింత సహాయం కోసం, మైలోని సందర్శించండి.

      Tags:

      Post-partum weight loss in telugu, Lose post-partum belly fat in telugu, weight loss tips in telugu, How to Reduce Post-Partum Belly Fat Naturally in English, How to Reduce Post-Partum Belly Fat Naturally in Hindi, How to Reduce Post-Partum Belly Fat Naturally in Tamil, How to Reduce Post-Partum Belly Fat Naturally in Bengali.

      Is this helpful?

      thumbs_upYes

      thumb_downNo

      Written by

      Nayana Mukkamala

      Get baby's diet chart, and growth tips

      Download Mylo today!
      Download Mylo App

      RECENTLY PUBLISHED ARTICLES

      our most recent articles

      Start Exploring

      About Us
      Mylo_logo

      At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

      • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
      • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
      • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

      Open in app