hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Preparing For Delivery arrow
  • నార్మల్ డెలివరీ.. యోనీ ద్వారా సురక్షిత ప్రసవానికి చిట్కాలు (Tips for a Safe Normal Delivery in Telugu) arrow

In this Article

    నార్మల్ డెలివరీ.. యోనీ ద్వారా సురక్షిత ప్రసవానికి చిట్కాలు (Tips for a Safe Normal Delivery in Telugu)

    Preparing For Delivery

    నార్మల్ డెలివరీ.. యోనీ ద్వారా సురక్షిత ప్రసవానికి చిట్కాలు (Tips for a Safe Normal Delivery in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    మీరు భారతీయ మహిళ అయి ఉండి గర్భవతి అయితే నార్మల్ డెలివరీ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, అంటే యోని ద్వారా ప్రసవం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీరు గర్భవతి అని తెలిసిన ప్రారంభ రోజుల నుండే విని ఉంటారు. నార్మల్ డెలివరీకి ఎన్ని టిప్స్ పొందారో మీకు గుర్తులేదా! అయితే, నార్మల్ డెలివరీ అయినప్పుడు మీ శరీరానికి లభించే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఒక పద౦ నార్మల్ డెలివరీకి పర్యాయపద౦గా ఉ౦టు౦ది. అదే "నొప్పి." ప్రతి తల్లి తన బిడ్డకి చెప్పిన యుగయుగాల నాటి డైలాగ్ - "నేను నిన్ను ఎంత నొప్పి భరించి ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చానో, నీకెలా తెలుస్తుంది? ఒక స్త్రీ మాత్రమే ఆ నొప్పిని అర్థం చేసుకోగలదు." వింతగా అనిపిస్తోంది కదా? ఏదేమైనా నార్మల్ డెలివరీలో నొప్పి ఉండడం నిజం. పోరాటం కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఆర్టికల్ నార్మల్ డెలివరీ టిప్స్ పై మాత్రమే కాకుండా మరిన్ని విషయాలను మీతో పంచుకుంటుంది. నార్మల్ డెలివరీ అంటే ఏమిటి అనే దాని గురించి మనం మొదట క్లుప్తంగా మాట్లాడుకుందాం. తరువాత యోని / సహజ / సాధారణ ప్రసవం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో కొంత తెలుసుకుందాం! పదండి. తెలుసుకుందాం.

    నార్మల్ డెలివరీ అంటే ఏమిటి? (What is Normal Delivery in Telugu)

    యోని ద్వారా బిడ్డకు జన్మనివ్వడం అనేది సాధారణ ప్రసవం లేదా సాధారణ యోని ప్రసవం (NVD). అనేక సందర్భాల్లో కాబోయే తల్లులు ఈ డెలివరీ పద్ధతిని ఎంచుకుంటారు. ఎందుకంటే ఇది శస్త్రచికిత్సా విధానాలు లేదా సి-సెక్షన్ నుండి వచ్చే సంక్లిష్టతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కనీస మందులు వాడడం ద్వారా లేదా నొప్పి మందులు అసలే వాడకుండా జరిగే యోని జననాలు కూడా కొంతమంది తల్లులకు ఆప్షన్లుగా ఉన్నాయి. నొప్పి మందుల వినియోగం, చికిత్సలు ప్రతి మహిళకు అవసరం లేదు. ఇది చాలా వరకు వ్యక్తిగత ఎంపిక. పురుటి నొప్పులు విలక్షణమైనవి. కానీ నార్మల్ డెలివరీ ప్రక్రియలో కొన్ని నొప్పిలేని నార్మల్ డెలివరి టిప్స్ పాటించడం ద్వారా మీరు మెరుగ్గా సిద్ధం కావడానికి, మీ సాధారణ డెలివరీ సాధ్యమైనంత వరకు సజావుగా సాగేలా చూడటానికి మీకు సహాయపడుతుంది.

    నార్మల్ డెలివరి ప్రయోజనాలు (Benefits of Normal Delivery in Telugu)

    నార్మల్ డెలివరీ అనేది అత్యంత "సహజ" ప్రసవ విధానంగా ప్రశంసలు పొందిన పద్ధతి. ఈ పద్ధతికి ఏవైనా వైద్య ప్రయోజనాలు ఉన్నాయా అని మీరు అడగవచ్చు. ఒక సాధారణ జననం నిజంగా తల్లి, బిడ్డ ఇద్దరికీ అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. సంక్లిష్టమైన ప్రసవానికి నిక్షిప్తీకరించిన ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఇప్పుడు కొన్నింటి గురించి చర్చిద్దాం: సిజేరియన్ జననం లేదా ఫోర్సెప్స్ డెలివరితో పోల్చినప్పుడు మీ శరీరం రికవరీ రేటు సహజ లేదా నార్మల్ డెలివరీలో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది తల్లులు తాము తీసుకునే ఔషధాలు, పర్యవేక్షణ కారణంగా ప్రసవించిన తరువాత అలసిపోయినట్లుగా, దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తారు. ఇది తల్లీబిడ్డల మధ్య స్పర్శ తగలడం, తల్లి పాలివ్వడం వంటి ప్రసవానంతర కార్యకలాపాల్లో నిమగ్నమవడంలో ఇబ్బంది పెడుతుంది.

    సిజేరియన్ (సీ--సెక్షన్)తో ఇబ్బందులు ఇవీ (Problems with Caesarian Delivery in Telugu)

    ఈ మధ్యన సి-సెక్షన్ అనే మాట ఎక్కువగా వింటున్నాం. అంటే సిజేరియన్ అనే శస్త్రచికిత్స. దీని కారణంగా ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండటం, ఇన్‎ఫెక్షన్ జరిగే ప్రమాదం, కోత వల్ల మచ్చలు పడడం, మత్తుమందు కారణంగా ఇక్కట్లు పడడం, అసౌకర్యం వంటి ప్రసవ అనంతర ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకసారి సి-సెక్షన్ అయిన మహిళల్లో మరోసారి ప్రెగ్నెన్సీ టైంలో అదే రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అయితే అలాగే అవ్వాలని కూడా ఏం లేదు. సిజేరియన్ డెలివరీ తరువాత నార్మల్ డెలివరీ కోసం కొన్ని టిప్స్‎ని ఫాలో చేస్తే సాధ్యమే.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: త్వరగా కోలుకొనేందుకు సి-సెక్షన్ అయిన తర్వాత ఏమి తినాలి?

    Article continues below advertisment

    సహజ కాన్పులో పుట్టిన శిశువుల గట్ ఫ్లోరా (ఆహారం జీర్ణం కావడానికి సహకరించే బ్యాక్టీరియా) మరింత వైవిధ్యంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది నవజాత శిశువు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఒక ముఖ్యమైన కారకం. ఈ దశలో ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన జీవితానికి పునాది వేస్తుంది. కాబట్టి మీకు కావలసిందల్లా నార్మల్ డెలివరీ కోసం కొన్ని ప్రెగ్నెన్సీ టిప్స్. తద్వారా మీరు ముందుకు సాగవచ్చు. సాధారణ డెలివరీకి సిద్ధంగా ఉండవచ్చు.

    సులభమైన నార్మల్ డెలివరీ కొరకు టిప్స్ (Tips for Easy Normal Delivery in Telugu)

    మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుండి సిజేరియన్ డెలివరీ కాకుండా, నార్మల్ డెలివరీ పొందాలని టిప్స్ అందుకుంటున్నారని మాకు తెలుసు. చాలా మంది చాలా టిప్స్ ఇచ్చి ఉంటారు. కానీ మీకు ఖచ్చితంగా పనికి వచ్చే నార్మల్ డెలివరీకి టిప్స్‎ని వాటి నుండి ఎలా వేరు చేస్తారు? అందువల్ల నార్మల్ డెలివరీ కోసం మీకు కొన్ని తగిన, అవసరమైన గర్భధారణ టిప్స్‎ని అందిస్తున్నాం.

    మీ సొంత పరిశోధన చేయండి.. (Reasearch Yourself)

    నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మీరందరూ వినే ఉంటారు. ప్రెగ్నెన్సీ అనేది మిశ్రమ భావోద్వేగాలతో నిండిన ప్రయాణం. ప్రసవ నొప్పులు, జనన ప్రక్రియ మొదలైన ప్రతి పాజిటివ్, నెగెటివ్ భావోద్వేగాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి మీకున్న ఏకైక మార్గం.. మొత్తం ప్రక్రియ గురించి బాగా తెలుసుకోవడం. ఇందుకు ఉత్తమ మార్గం ఏమిటంటే మీరు తగిన పరిశోధన చేయడం. సులభమైన, నార్మల్ డెలివరీ కోసం కొన్ని టిప్స్ సేకరించడం. మీ గర్భధారణ, ప్రసవానంతర కాలంలో ఏం ఆశించాలనే దాని గురించి తెలియజేయడానికి మీకు, మీ పార్ట్‎నర్‎కి సహాయపడే అనేక పుస్తకాలు, ఆన్ లైన్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మీకు వీలైతే మీ గర్భం గురించి మీ తల్లి, సన్నిహిత స్నేహితులు లేదా తోబుట్టువులతో మాట్లాడండి. నార్మల్ డెలివరీ గురించి మీరు ప్రతికూల విషయాలను కూడా వినవచ్చు. ఈ పరిస్థితిలో ప్రతి మహిళ గర్భధారణ ప్రయాణం ప్రత్యేకమైనదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వేరొకరికి ఆహ్లాదకరమైన గర్భధారణ అనుభవం లేనందున, మీరు కూడా అదే అనుభవం ఎదుర్కొంటారని బెంగ అవసరం లేదు.

    మీ డాక్టర్‎ని తెలివిగా ఎంచుకోండి (Select Your Doctor Wisely)

    దురదృష్టవశాత్తూ, ఈరోజుల్లో మీకు ఏ రకమైన డెలివరీ ఉంటుందో డాక్టర్ నిర్ణయిస్తారు. షాకింగ్ గా అనిపిస్తోందా? అన్నీ కాదు. చాలా మంది డాక్టర్లు నిజంగా నార్మల్ డెలివరీలతో గొప్ప సక్సెస్ రేట్‎ని కలిగి ఉండరు. సి-సెక్షన్లకు వెళతారు. అటువంటి సందర్భంలో యోని ద్వారా ప్రసవానికి మిమ్మల్ని మీరు ఎంత సిద్ధం చేసుకున్నా లేదా మీరు ఎన్ని నార్మల్ డెలివరి టిప్స్‎ని తీసుకున్నా, మీ డాక్టర్ ఇక్కడ గేమ్-ఛేంజర్‌గా ఉంటారు. అందువల్ల మీ డాక్టర్‌ని ఎంచుకోవడం అనేది నార్మల్ డెలివరీ యొక్క అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. దీని కోసం నార్మల్ డెలివరీలు, సిజేరియన్ డెలివరీలు ఎన్ని జరిగాయనే లెక్కలను డాక్టర్‎ని అడగవచ్చు. అక్కడ ప్రసవించిన లేదా డాక్టర్‎తో ట్రీట్మెంట్ తీసుకున్న మహిళల ద్వారా కూడా డాక్టర్ ఎలా ఉన్నారో తెలుసుకోవచ్చు.

    మీ గైనకాలజిస్ట్‎ని ప్రశ్నలు అడగండి (Ask Your Gynecologists )

    మీరు ముందుగానే హోం వర్క్ చేసినట్లయితే మీ గైనకాలజిస్ట్‎ని ప్రశ్నలు అడగడం సులభం. గర్భధారణ, ప్రసవం విషయానికి వస్తే మీ డాక్టర్ అత్యంత జ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తి. కాబట్టి మీ డాక్టర్‎తో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న ప్రశ్నలకు అన్ని సమాధానాలు మీ డాక్టర్ వద్ద ఉంటాయి.

    Article continues below advertisment

    కొన్ని ప్రశ్నలు ఇలా ఉండొచ్చు..

    • డెలివరీ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
    • ఇది ఎంత నొప్పిని కలిగిస్తుంది?
    • డెలివరీ కోసం సిద్ధం కావడానికి మీరు ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
    • మీ డైట్ ఎలా ఉండాలి?

    మీరు మీ హోంవర్క్ సరిగ్గా చేసినప్పుడు మాత్రమే మీరు డాక్టర్‌ని మీ మనసులో ఉన్నఅన్ని ప్రశ్నలు అడగగలుగుతారు. సమాధానాలను పొందగలుగుతారు. ఉదాహరణకు మీరు హాస్పిటల్ బ్యాగ్ ఎలా సిద్ధం చేయాలో లేదా బర్త్ ప్లాన్ (జనన ప్రణాళిక)ను ఎలా రూపొందించుకోవాలో సూచనలు పొందవచ్చు. మీ సంరక్షణకు సంబంధించిన అన్ని ఆందోళనలకు డాక్టర్ పరిష్కారం చూపగలరు.

    నార్మల్ డెలివరీ కోసం ప్రోత్సహించాలి (How to Encourage for Normal Delivery)

    చాలాసార్లు మహిళకు సాధారణ డెలివరీకి వెళ్లేందుకు తగినంత ధైర్యం లేదా సంకల్పం ఉండదు. యోని ద్వారా ప్రసవం నొప్పితో కూడినదని సహజ కాన్పు అనుభవం కలిగి ఉన్న ఇతర మహిళల కథల గురించి చుట్టూ ఉన్న వ్యక్తులు చెబుతుంటే వినడం వల్ల ఈ భయం తలెత్తవచ్చు. ప్రతి మహిళకు భిన్నమైన గర్భధారణ ఉందని, ప్రతి మహిళకు పరిస్థితులను ఎదుర్కోవడానికి భిన్నమైన మార్గం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే యోని జననం అవసరం అని మీకు మీరుగా ప్రోత్సహించుకోవాలి. సాధారణ డెలివరీ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, అలాగే మిగిలిన వాటితో పోలిస్తే ఈ ప్రక్రియలో మీరు, మీ బిడ్డ ఎంత సురక్షితంగా ఉంటారనే దాని గురించి మీరు బాగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సి-సెక్షన్ ద్వారా ప్రసవించిన శిశువులతో పోలిస్తే సాధారణ డెలివరీ ద్వారా జన్మించిన శిశువుకు పుట్టుకతోనే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వేరే అవకాశం లేనంత వరకు సి-సెక్షన్ సిఫారసు చేయరు.

    ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి.. (Try to Be Without Stress)

    అండగా, ప్రోత్సాహకరంగా ఉండే వాతావరణంలో ఉన్నప్పుడు మీ గర్భధారణ, డెలివరీ మరింత సజావుగా సాగుతుంది. మీకు, మీ బిడ్డకు ప్రశాంతమైన వాతావరణం సృష్టించడానికి మీరు మీ వంతు కృషి చేసినంత కాలం ఒత్తిడి లేని గర్భధారణ సాధ్యమవుతుంది. ఎలాంటి భయాలు లేకుండా.. హాయిగా చదవడం లేదా టీవీ చూడటాన్ని ఎంజాయ్ చేయడం లాంటి కార్యకలాపాలకు సమయాన్ని వెచ్చించండి. మీరు శ్రద్ధ వహించే వ్యక్తులతో సమయం గడపండి. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న వారి నుండి సపోర్ట్ లభించకపోతే మీకు మీరు తిరిగి కనెక్ట్ అవ్వండి. యోగా, శ్వాస వ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్‎సైజ్‎లు), ధ్యానం వంటి సెల్ఫ్ కేర్ ప్రాక్టీసులపై పనిచేయడానికి కొంత సమయం గడపడం మంచి ఆలోచన.

    సమతుల ఆహారంపై దృష్టి సారించండి (Focus on Quality Food)

    అంతా బాగుండటానికి పోషకాహారం అవసరం. క్రమం తప్పకుండా తినండి. కానీ కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను గమనించండి. మరొక విధంగా చెప్పాలంటే, మీ గర్భధారణలో అతిగా బరువు పెరగడం సహజంగా, ఆరోగ్యకరమైన శిశువును ప్రసవించే అవకాశాలను తగ్గించవచ్చు. మీరు మీ ఆహారంలో తృణధాన్యాలు, ప్రోటీన్లను చేర్చుకుంటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. గర్భధారణ సమయంలో మీరు మీ ఆహారంలో పలు ఆహార పదార్థాలు చేర్చుకోవడం సాధారణ ప్రసవానికి మేలు చేస్తుంది. రాస్ప్‌బెర్రీస్, మామిడి, పైనాపిల్‎తో సహా అనేక పండ్లు మహిళ పునరుత్పత్తి వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా పైనాపిల్స్. మామిడి పండ్లు రెండూ ప్రసవ నొప్పులను తగ్గిస్తాయి.

    ఎక్సర్‎సైజ్, యోగా, వాకింగ్, కెగెల్ ఎక్సర్‎సైజ్ (Excercise and Yoga)

    నడక బహుశా శారీరక శ్రమకు సంబంధించి అత్యంత ప్రాథమిక, సాధారణ రూపం. నడక నార్మల్ డెలివరీ టిప్స్‎ల జాబితాలో మొదటిది. మామూలుగా మీరు 30-45 నిమిషాలు నడవాలి. కానీ మీరు వాకింగ్‎కు కొత్త వారైతే ప్రారంభంలో ప్రతిరోజూ 15 నిమిషాలు వాకింగ్ చేయొచ్చు. మీ గర్భధారణ సమయంలో మీ ప్రధాన కండరాలను బలోపేతం చేయడానికి మీరు ప్రీనాటల్ యోగాను కూడా చేయవచ్చు. స్క్వాట్స్, ఇతర శ్వాస ప్రక్రియలు (బ్రీతింగ్ టెక్నిక్స్), వ్యాయామాలు మీరు ప్రసవానికి సిద్ధంగా ఉండటానికి, నొప్పిని మరింత తట్టుకోవడానికి సహాయపడతాయి.

    Article continues below advertisment

    కెగెల్ ఎక్సర్‎సైజ్‎లు, పెరినియల్ (యోని, మలద్వారం మధ్య ఉండే ప్రాంతాన్ని పెరినియం అంటారు) మసాజ్‌తో కటి చుట్టుపక్కలి కండరాలను బలోపేతం చేయవచ్చు. అలాగే సాగదీయవచ్చు. ఇది సహజ కాన్పుకు సిద్ధం చేస్తుంది. కెగెల్ ఎక్సర్‎సైజ్‎లను గర్భధారణ ప్రక్రియలో మూడో త్రైమాసికంలో ప్రారంభించవచ్చు. మీ గర్భధారణ 36 వ వారంలో, మీరు ప్రతిరోజూ సున్నితంగా స్ట్రెచింగ్ చేయడం (సాగదీయడం) ద్వారా మీ పెరినియంను సహజ కాన్పునకు సిద్ధం చేయడం ప్రారంభించాలి. పెరినియల్ మసాజ్ అనేది మీ నొప్పిని తగ్గించడానికి, యోని కణజాలం చిరిగిపోవడాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తుంది. పెరినియల్ మసాజ్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఇందుకు తగిన రీసెర్చ్ చేయండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలోని మూడవ త్రైమాసికంలో మెట్లు ఎక్కడం సురక్షితమేనా?

    తగినంత నిద్ర పొందండి (Sleep Well)

    చాలా మంది మహిళలు ఈమధ్య తగినంత నిద్ర పోవడాన్ని మర్చిపోయినట్లు అనిపిస్తోంది. ఆరోగ్యకరమైన గర్భధారణ, ప్రసవం పొందడానికి మీరు పుష్కలంగా విశ్రాంతి తీసుకోవాలి. గర్భధారణ సమయంలో మీరు నిద్రపోయేటప్పుడు మీ శరీరం రిపేర్ అవుతుంది. తిరిగి పుంజుకుంటుంది. గర్భధారణ అలసట అనేది మీరు గర్భవతిగా ఉన్నారని చెప్పే మొదటి సంకేతాలలో ఒకటి. ఇది హార్మోన్ల పెరుగుదల వల్ల, అలాగే గర్భవతిగా ఉండటానికి మీ శరీరం సిద్ధం కావడం వల్ల కలుగుతుంది గర్భవతిగా ఉండటం అద్భుతమైన అనుభవం. మీరు అలసిపోతారు కాబట్టి చాలా నిద్ర అవసరం. మీ రోగనిరోధక శక్తిని పటిష్టంగా ఉంచడానికి రాత్రి పూట మంచి నిద్రను పొందడం కూడా చాలా ముఖ్యం. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు రాత్రి పూట బాగా విశ్రాంతిని పొందడం మీకు సవాలుగా మారితే మీ డాక్టర్‎తో మాట్లాడి పరిష్కారం పొందండి.

    ముగింపు (Conclusion)

    మీరు నిజంగా మీలో ఒక జీవితాన్ని మోస్తున్నారని తెలుసుకున్న మరుక్షణం మీ ప్రపంచం మారిపోతుంది. మీ ప్రాధాన్యతలు కూడా మారుతాయి. ఏదేమైనా మీ ఆరోగ్యానికి సంబంధించి మీ పట్ల, మీలోని బిడ్డ పట్ల శ్రద్ధ అవసరం. యోని ద్వారా సురక్షిత డెలివరీ మీరు దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. మీరు భయపడవచ్చు కానీ హిందీలో నార్మల్ డెలివరీ టిప్స్, ఇంగ్లీష్‌లో నార్మల్ డెలివరీ టిప్స్‌కు కూడా అనేక సోర్స్ ఉన్నాయి! కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఆత్మవిశ్వాసంతో ఉంటూ మీ డెలివరి ప్రక్రియను ఎదుర్కోవడమే.

    Tags

    Normal Delivery in telugu, Normal Delivery tips in telugu, Tips for normal and safe delivery in telugu, Caesarian delivery in telugu, Problems in Normal delivery in telugu, Diet for normal delivery

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Shwetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.