hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గైడ్ మీ మొదటి త్రైమాసికపు ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యకరమైన డైట్‌ని పాటించడం (Guide: Following A Healthy Diet During Your First Trimester Of Pregnancy in Telugu) arrow

In this Article

    గైడ్ మీ మొదటి త్రైమాసికపు ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యకరమైన డైట్‌ని పాటించడం (Guide: Following A Healthy Diet During Your First Trimester Of Pregnancy in Telugu)

    Pregnancy Journey

    గైడ్ మీ మొదటి త్రైమాసికపు ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యకరమైన డైట్‌ని పాటించడం (Guide: Following A Healthy Diet During Your First Trimester Of Pregnancy in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    మొదటి నెల ప్రెగ్నెన్సీ కోసం డైట్ చార్ట్ గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి. మొత్తం ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తీసుకొనే ఆహారం పుట్టబోయే శిశువుపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ బిడ్డ కడుపులో ఉన్న సమయంలో ఎదగడానికి ఇంకా తన వికాసానికి తోడ్పడుతుంది. అందువల్ల వివిధ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు ఇటీవలే కొత్తగా తల్లి అయినట్లయితే లేదా మీరు ప్రెగ్నెన్సీలో మొదటి నెలలో ఉన్నట్లయితే, మొదటి నెల ప్రెగ్నెన్సీ కోసం డైట్ చార్ట్‌ను అనుసరించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    మీరు ఇప్పటికే మందులు తీసుకుంటుంటే, మందులు తీసుకునేటప్పుడు ఏ ఆహారాలను తినాలి, ఇంకా వేటిని తినకూడదు అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చాలా సరైన సమయం. ఎందుకంటే మందులు కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిస్తే అవి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. అందువల్ల ఇది మీ పిల్లల ఎదుగుదలను పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ప్రభావితం చేస్తుంది.

    ప్రెగ్నెన్సీలో మొదటి త్రైమాసికపు డైట్ ప్లాన్‌ను ఎలా అనుసరించాలి (How To Follow A First Trimester Pregnancy Diet Plan in Telugu)

    మీ మొదటి నెల ప్రెగ్నెన్సీ డైట్ చార్ట్‌కు కట్టుబడి ఉన్నప్పుడు మీరు వారానికి ఒకసారి ఒక చీట్ డే (చార్ట్ లో లేనిది తినడం)ని కలిగి ఉండవచ్చు. అయితే మీరు కొన్నిరకాల జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఏదైనా అతిగా తీసుకోవడం వల్ల మీ బిడ్డకు హాని కలగవచ్చు.

    మీ శిశువు మెదడు చక్కగా ఎదిగేందుకు మంచి-పోషక ఆహారం సహాయపడుతుంది. ఇంకా ఇది ఆరోగ్యకరమైన గర్బస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది అలాగే డెలివరీ సమయంలో తలెత్తే ఇతర సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి మీకు రక్తహీనత లేదా ఇతర విపత్కర ప్రెగ్నెన్సీ రుగ్మతలు ఉన్నట్లయితే, మీరు మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం గురించి ఆలోచించాలి. అలసట ఇంకా మార్నింగ్ సిక్నెస్ ఈ రెండూ మీకిది ఉందని తెలిపే లక్షణాలు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది : 1 వ వారంలో ప్రెగ్నెన్సీ లక్షణాలు

    Article continues below advertisment

    మొదటి నెల ప్రెగ్నెన్సీకి ఒక బేసిక్ డైట్ ప్లాన్ (A Basic First Month Pregnancy Diet Plan in Telugu)

    మీ సౌలభ్యం కోసం మొదటి నెల బేసిక్ డైట్ చార్ట్ కింద ఇవ్వబడింది. ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ మెయింటెన్ చేయడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. మొదట మీరు ఏవి తీసుకుంటున్నారో గమనించగలుగుతారు. మీ అద్భుతమైన ఆరోగ్యానికి ఇంకా మీ శిశువుకు అందే పోషణ గురించి నమ్మకంగా తెలుసుకుంటారు. ఇంకా మీకు ఇష్టమైన భోజనాన్ని ఒక భాగంగా చేర్చడం వలన మీరు మీ ప్రెగ్నెన్సీ డైట్ చార్ట్‌ని కూడా మీకిష్టమైన రీతిలో మార్చుకోవచ్చు. మీరు మీ డైట్ స్థితిని ట్రాక్ చేయాలనుకుంటే ఈ ఫుడ్ చార్ట్‌ని అనుసరించడం ముఖ్యమని మీరు గుర్తుంచుకోవాలి. క్రింద ఇవ్వబడ్డది దక్షిణ భారతదేశపు మాంసాహార డైట్.

    ఆదివారం (Sunday)

    టిఫిన్ కోసం, మీరు కొబ్బరి చట్నీతో భారతీయ పాన్‌కేక్‌లు లేదా ఇడ్లీలను తీసుకోవచ్చు. మీ ఉదయపు అల్పాహారం కోసం, పెరుగుతో అరటిపండ్లు తీసుకోవడం గుర్తుంచుకోండి. మధ్యాహ్న భోజనానికి కరివేపాకు చట్నీ, అన్నంతో పాటు సోయా బీన్స్ కూడా తీసుకోవచ్చు. మీ మధ్యాహ్నం స్నాక్స్ టైములో లైట్‌గా ఉన్న ఆహారం తీసుకోండి. మీరు బంగాళాదుంప సలాడ్ లేదా మొక్కజొన్న తీసుకోవచ్చు. అంతే కాకుండా మీ డిన్నర్‌లో అన్నం ఇంకా సలాడ్‌తో పాటు చికెన్ బ్రెస్ట్‌ని కూడా చేర్చుకోవచ్చు.

    సోమవారం (Monday)

    ప్రశాంతమైన ఉదయపు సమయంలో నిమ్మరసం, కొత్తిమీర చట్నీ ఇంకా రోటీ లాంటివి అద్భుతమైన అల్పాహారం అవుతుంది. మీరు బెరి పళ్ళని చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో చపాతీతో పాటు దానిమ్మ కర్రీ ఇంకా చికెన్ ఫ్రైని తీసుకోవచ్చు.

    మీరు మీ తర్వాతి భోజన సమయంలో కొంచెం సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అందువల్ల మీరు మీకు కావలసిన ఏదైనా తినవచ్చు. కానీ ఒక నిర్దిష్ట పరిమితిలో మాత్రమే. మీరు కోరుకుంటే కొన్ని జంక్ ఫుడ్‌లను కూడా తీసుకోవచ్చు. అయితే, మీరు తీసుకునే పరిమాణంపై ఖచ్చితమైన పరిమితిని విధించుకోండి. కాకరకాయ, అలాగే మటన్‌తో పాటు అన్నం తీసుకుంటే, ఇవి మీ డిన్నర్‌ని సంపూర్ణం చేస్తాయి.

    మంగళవారం (Tuesday)

    ఉదయం టిఫిన్‌లోకి మంచి పోషకాహారం తీసుకొనేందుకు ప్రయత్నించండి. దీనికి మీరు బంగాళదుంపలు, మామిడి పండ్లు ఇంకా తృణధాన్యాలు చేర్చవచ్చు. మీరు యాపిల్ పండ్లను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలోకి పెసలు, చపాతీ చేర్చవచ్చు. ఆ సాయంత్రం, మీ స్నాక్స్ కోసం వేరే ఏవైనా ప్రయత్నించవచ్చు. మీ మెనూలో మొక్కజొన్న లేదా సలాడ్‌ని జోడించెందుకు ప్రయతించండి. రాత్రి భోజనంగా నాన్ వెజ్ బిర్యానీ కూడా తీసుకోవచ్చు.

    Article continues below advertisment

    బుధవారం (Wednesday)

    శనివారాల్లో టిఫిన్‌గా కాఫీతో పాటు ఓట్ మీల్ తీసుకొనేందుకు ప్రయత్నించండి. మీకు వీలైతే బయటకు వెళ్లి కోకో క్యాండీని తినవచ్చు లేదా మీకు ఇష్టమైనవి ఎంచుకొని మజా చేసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలోకి గోధుమలతో పాటు వంకాయల కూరను తీసుకొనేందుకు సిద్ధపడండి. మీరు మీ తర్వాతి భోజన సమయంలో తాజా పళ్లరసం లేదా పానీయాన్ని కూడా చేర్చుకోవచ్చు. డిన్నర్‌లోకి ఉల్లికాడలు, రొయ్యలు ఇంకా క్వినోవా ఉంటాయి.

    గురువారం (Thursday)

    టిఫిన్‌తో పాటు కొబ్బరి నీళ్లను తీసుకుంటే అది శరీరంలోని హానిచేసే వ్యర్థాలను తొలగించే పని డిటాక్సిఫికేషన్‌గా పనిచేస్తుంది. మీరు బ్రంచ్ కోసం మింటీ కర్రీతో రవ్వ దోస కూడా తీసుకోవచ్చు. పండిన అవోకాడోను అల్పాహారంగా తీసుకోండి. మధ్యాహ్న భోజనంలో పాలకూర ఇంకా చెడ్డార్ చీజ్ తీసుకోవచ్చు. ఆ తరువాత, మీరు మీ తదుపరి భోజనానికి వోట్ పాలు తీసుకోవచ్చు. డిన్నర్ ఆప్షన్‌లలో అలసందలు (బొబ్బర్లు), మ్యాంగో కర్రీ ఇంకా చేపలను తీసుకోవచ్చు.

    శుక్రవారం (Friday)

    గింజలతో కూడిన ఓట్స్‌ను బ్రంచ్ కోసం ఎంచుకోవచ్చు. పండిన మామిడి లేదా సపోటా వంటి వాటిని మీ ఆకలి పెంచుకొనేందుకు చేర్చండి. మధ్యాహ్న భోజనంలో స్పైసీ బీన్స్ లేదా రొయ్యలు ఉండవచ్చు. మీ తర్వాతి స్నాక్ సమయానికి క్యారెట్ డిష్ లేదా ఏదైనా తీపిపదార్థం తినవచ్చు. రాత్రి భోజనం కోసం వంకాయతో పాటు సాల్మొన్‌ చేపను తీసుకోవచ్చు!

    శనివారం (Saturday)

    ఉదయం పూట సోయా ప్రోటీన్ బిట్స్, జీరా డ్రింక్, అల్పాహారానికి బాదం, మధ్యాహ్న భోజనం కోసం రొయ్యలు అలాగే ధాన్యాలు, స్నాక్స్ కోసం బెర్రీలు మరియు రాత్రి భోజనంలో చికెన్ బ్రెస్ట్‌తో బీట్‌రూట్ కర్రీ చాలా రిఫ్రెష్‌ని కలిగిస్తాయి. మీ భోజనాన్ని వీలైనంత సరళంగా ఉండేలా చూసుకోండి, దానివల్ల మీరు దానికి కట్టుబడి ఉండొచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది : ప్రెగ్నెన్సీలో 4వ నెల కోసం డైట్ ఛార్టు

    Article continues below advertisment

    మొదటి త్రైమాసికంలో మీ డైట్ ప్లాన్‌ను మీకు నచ్చిన రీతిలో తయారుచేసుకోవడం (Customizing Your Diet Plan For First Trimester in Telugu)

    అంతే కాకుండా శనివారాన్ని మీకిష్టమైనవి ఏవైనా తీసుకొనే వీలున్న చీట్ డే గా మార్చుకోవచ్చు. అందువల్ల మీకు కావలసినది తినవచ్చు. దీనివల్ల ఈ విధంగానైనా, మీరు మీరేమైనా తినాలనే కోరికలను మరింత మెరుగైన మార్గంలో సంతృప్తి పరచగలరు. చాలా మంది సాధారణంగా వారి మొదటి త్రైమాసిక డైట్ ప్లాన్‌కు కట్టుబడి ఉండటం కష్టమని అంటుంటారు. అది వారు తమకిష్టమైన జంక్‌ఫుడ్‌ని తొలి విడతలోనే మానుకోవలసి రావడం వల్ల కావచ్చు. అందువల్ల తమపై తాము కొంచెం కఠినంగా ఉండాల్సి రావడం వల్ల కావచ్చు.

    మీరు మీ మొదటి త్రైమాసిక ప్రెగ్నెన్సీ ఫుడ్ చార్ట్‌ని మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే, ముందుగా మీ డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. మీరు సులువుగా మీ డైట్‌లో చేర్చుకోగల కొన్ని ఆహార పదార్థాలను మీ డైటీషియన్ సిఫార్సు చేస్తారు.

    ముగింపు (Conclusion)

    మీ ప్రెగ్నెన్సీ మొదటి నెలలో మీ మొత్తం డైట్ ప్లాన్‌ను ట్రాక్ చేయడం వల్ల మీ ప్రెగ్నెన్సీలోని మొదటి త్రైమాసిక డైట్ చార్ట్‌ను పాటించడం చాలా సులభం అవుతుంది. ఇంకా ఇది రోజంతా మిమ్మల్ని దీనిపై నిమగ్నమయ్యేలా చేస్తుంది. మీకు నచ్చిన ఆహారాలను కూడా జోడించవచ్చు మరియు తదనుగుణంగా మీ భోజన ప్రణాళికను రూపొందించవచ్చు. అంతేకాకుండా శాకాహారులు మాంసాహారానికి దూరంగా ఉన్నప్పుడు పైన పేర్కొన్న టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండవచ్చు.

    ఇంకా మీరు మరియు మీ బిడ్డ ఇద్దరి ఆరోగ్య పర్యవేక్షణ కోసం ప్రతినెలా మీ గైనకాలజిస్టుని సంప్రదించడం చాలా ముఖ్యం. మీరు మీ ఆహారంలో ఇంకేదైనా విలక్షణమైనవి చేర్చాలనుకుంటే, మీ డాక్టరు గారిని సంప్రదించడం చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు. అతను లేదా ఆమె మీరు ఉదయం సమయంలో ఆస్వాదించడానికి కొన్ని అదనపు పోషకవిలువలున్న స్నాక్స్‌లను సిఫారసు చేయవచ్చు!

    Tags:

    Diet during pregnancy in telugu, first trimester diet during pregnancy in telugu, Guide: Following A Healthy Diet During Your First Trimester Of Pregnancy in English, Guide: Following A Healthy Diet During Your First Trimester Of Pregnancy in Hindi, Guide: Following A Healthy Diet During Your First Trimester Of Pregnancy in Tamil, Guide: Following A Healthy Diet During Your First Trimester Of Pregnancy in Bengali.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Mylo Editor

    Official account of Mylo Editor

    Read More

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.