Travel & Holidays
9 February 2024 న నవీకరించబడింది
మీరు వర్కింగ్ విమెన్ అయితే ప్రయాణాలు చేయడం తప్పనిసరి. ఆఫీసుకెళ్లడం, బయటికెళ్లడం అప్పుడు చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఇది దుర్భరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాదు ఎగుడుదిగుడుగా ఉండే రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్, ర్యాష్ డ్రైవర్లు వర్కింగ్ మామ్స్ కు తమ రోజు వారి పనుల కోసం ఆఫీసుకు వెళ్లేందుకు, మరియు తిరిగి వచ్చేందుకు పీడకలగా మారవచ్చు. మీరు గర్భం దాల్చారని మీకు ఇటీవలే తెలిసిందా? అయితే మీకు మొదలయ్యే మొదటి ప్రశ్న గర్భం దాల్చిన సమయంలో ప్రయాణాలు చేయవచ్చా? అని. మీ సందేహాలను తొలగించుకోవడం కోసం ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.
మీరు ప్రయాణం కోసం ప్రజారవాణాను ఉపయోగించే వ్యక్తి అయితే మీరు బస్టాప్‌లో ఎక్కువ గంటలు నిలబడాల్సి రావొచ్చు. బస్టాండ్‌లో బస్సు కోసం అనేక గంటలు వేచి ఉండడాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. మీరు కొన్ని అఫీషియల్ మీటింగ్స్‌కు హాజరుకావాల్సివచ్చినపుడు మీరు అనేక గంటల పాటు ట్రాఫిక్‌లో గడపాల్సి రావొచ్చు. నిరంతరం ప్రయాణించడం అనేది మీకు మరియు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ ఆఫీసు నుంచి ఇంటికి రావడం మీ ప్రెగ్నన్సీ పై ఏమీ ప్రభావం చూపదు.
కొన్ని కొన్ని సార్లు ఒక తల్లి ప్రయాణం చేసేటపుడు చాలా ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే నిరంతరంగా ఒత్తిడి కలగడం వలన పెరుగుతున్న బిడ్డతో పాటుగా తల్లి శరీరం మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. సాధారణంగా చాలా మంది గర్భిణీ స్త్రీలు ఈ కింది ప్రశ్నను కలిగి ఉంటారు.: గతుకుల రోడ్లు గర్భాన్ని ప్రభావితం చేస్తాయా? దీనికి కొంత వరకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చాలా మంది తల్లులు జాయింట్ పెయిన్ లేదా వెన్నునొప్పితో కూడి ఉన్న ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ సమస్యలతో బాధపడవచ్చు. మీరు పని చేసే తల్లి అయితే ఇంకా మీరు ప్రతి రోజు ఇంటికి ఆఫీసుకు వెళ్లాల్సి వస్తే.. ప్రతి రోజు ప్రయాణం వలన వచ్చే అనేక ఇబ్బందులను మీరు ఎదుర్కొని ఉండవచ్చు.
అంతే కాకుండా ప్రయాణం చేయడానికి వెచ్చించిన సమయాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే ఆఫీస్ లొకేషన్ అనేది వర్కింగ్ మథర్ ఇంటి లొకేషన్‌కు దూరంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నపుడు ప్రయాణానికి సంబంధించి ఒత్తిడి కలిగించే మరో విషయమేమిటంటే.. త్వరగా నిద్ర లేచి ట్రాఫిక్ సమయానికి ముందే వారి ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఇది ఊహించని విధంగా ప్రయాణం వలన కలిగే ఒత్తిడికి కారణం అవుతుంది. అయితే దిగువ పేర్కొన్న కొన్ని చిట్కాలను అనుసరించడం వలన ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఈ ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చు.
మీరు రవాణా పద్ధతిని ఎంచుకునే ముందు మీ గమ్యస్థానం ఎంత దూరంలో ఉందనే విషయం గురించి ఆలోచించడం ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు ఎక్కువ దూర ప్రయాణాలు మీ విశ్రాంతి సమయాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల మీ ఆఫీస్ రొటీన్స్ను తదనుగుణంగా ఆర్గనైజ్ చేసుకోవడం ఉత్తమం. చాలా మంది గర్భిణీ స్త్రీలు కారులో ప్రయాణించడం వలన చాలా సౌకర్యవంతంగా మరియు సులభంగా ఉన్నట్లు భావిస్తారు. రద్దీ సమయానికి ముందే మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి.
2. కొన్ని సార్లు కార్‌పూలింగ్ (ఎవరికి వారు సొంత కారులో కాకుండా ఒకే కారులో ఎక్కువ మంది వెళ్లడం) లేదా ప్రజారవణా అనేది ఎంతో మంచి ఎంపికవుతుంది (Car Pooling Or Public Mode Of Transport Could Definitely Be An Ideal Option)
కొన్ని సార్లు కార్ పూల్ రవాణా విధానాన్ని ఎంచుకోవడం వలన కూడా సొంత కారును డ్రైవ్ చేసే ఒత్తిడి తగ్గుతుంది. మీరు ప్రయాణ సమయంలో కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. మరియు మీరు గమ్యస్థానానికి చేరుకునే ముందు ఫ్రెష్ అప్ కూడా కావొచ్చు. మీరు బస్ లేదా రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నపుడు దేని ద్వారా వెళ్తే తొందరగా మీ ఆఫీసుకు చేరుకుంటారో అని తెలుసుకోవాలి. అంతే కాకుండా మీరు చాలా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను కూడా ధరించాలని అనుకోవచ్చు.
అంతే కాకుండా మీరు ద్విచక్రవాహనంలో ప్రయాణించాలని అనుకుంటే మీరు మరియు మీ బిడ్డ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉన్నారని నిర్దారించుకునేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ బిడ్డ కడుపులో పెరుగుతున్నపుడు స్కూటర్‌పై ప్రయాణం చేయడం మీకు కష్టంగా అనిపించవచ్చు. వాస్తవం చెప్పాలంటే ఓవరాల్ కంట్రోల్స్, స్టీరింగ్, మరియు రోడ్లపై చర్చల వంటివి మీపై పడుతున్న ఒత్తిడిని పెంచేదుకు దోహదం చేస్తాయి. అంతే కాకుండా ర్యాష్ డ్రైవర్లు అంతే కాకుండా రోడ్లపై ఉన్న గుంతలు కూడా మీ ప్రయాణాన్ని ఏదైనా ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించడం కంటే కారులో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. కాబట్టి మీరు ప్రయాణం కోసం ప్లాన్ చేసే ముందు ప్రజారవాణా వ్యవస్థ గురించి మీ వైద్యుడితో మాట్లాడడం ఉత్తమం. ప్రత్యేకించి మీరు మీ గర్భధారణ సమయంలో ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఇది చాలా ముఖ్యం.
బస్సు, మెట్రో, లేదా రైలులో ప్రయాణిస్తున్నపుడు సంగీతాన్ని వినండి. మ్యూజిక్ వినడమే కాకుండా పుస్తకం చదవడం లేదా ఒక చిన్న కునుకు తీయడం కూడా చేయొచ్చు. ప్రశాంతమైన సంగీతాన్ని వినడం వలన మీరు చాలా వేగవంతంగా రిలాక్స్ కావొచ్చు. అంతే కాకుండా స్వచ్ఛమైన గాలి కోసం మీరు మీ కిటికీలను కిందికి దించాలని కూడా అనుకోవచ్చు. అయితే ట్రాఫిక్ శబ్దాలు మీకు ఇబ్బంది కలిగిస్తే మీరు విండోలను ఎత్తుకోవచ్చు. ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని..
మీ ఆఫీస్ లొకేషన్ బాగా దూరంగా ఉన్నట్లయితే మీరు ఎక్కువ గంటలు నిల్చోవాల్సి రావొచ్చు. అలాంటి సమయంలో మీకు సీటు ఇవ్వమని పక్కన కూర్చున్న వ్యక్తులను అడగవచ్చు. ఎందుకంటే మీ శరీరానికి తక్కువ సమయం విశ్రాంతి ఇచ్చినా కానీ.. మీరు శక్తిని తిరిగి పొందవచ్చు. అంతే కాకుండా మీరు మీ గమ్యస్థానానికి చేరుకునే సమయానికి మీరు మరింత యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడైనా అనుకోకుండా మీరు బస్సులో నిల్చోవాల్సి వస్తే.. ఆఫీసుకు వెళ్లిన వెంటనే మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు పని లేదా ఇంటిపనిని ప్రారంభించే ముందు కొద్ది సేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని అనుకోవచ్చు. మీ మనసును ఒత్తిడి నుంచి తేలికగా చేసుకునేందుకు మంచి సంగీతం, లేదా నిశ్శబ్దంగా ధ్యానం కూడా చేయొచ్చు.
గర్భవతిగా ఉన్నపుడు చాలా దూరం కారు ప్రయాణాలు చేయడం మంచిదేనా? అని చాలా మంది సందేహపడతారు. సుదీర్ఘప్రయాణాలు సురక్షితమైనవే. కానీ ప్రయాణం చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు గర్భవతి అయినందున ఎక్కువ దూరం కూర్చోవడం కొన్ని సార్లు కష్టమవుతుంది. ఇలా ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చోవడం వలన మీ పాదాలలో మరియు మీ చీలమండలలో వాపును కలగజేస్తుంది. అంతే కాకుండా
ఇది మీ కాళ్లలో యాసిడిటీ లేదా తిమ్మిరిని కలగజేస్తుంది. మీరు మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయడం (కాళ్లు చాపి రిలాక్స్‌గా కూర్చోవడం) వలన ఈ సమస్యలను తగ్గించవచ్చు. మీరు ప్రయాణం చేసేటపుడు స్మాల్ మరియు సింపుల్ స్ట్రెచస్ మీ శరీరానికి రక్తప్రసరణను పెంచుతాయి. అంతే కాకుండా దీర్ఘకాలం నుంచి ఏదైనా అసౌకర్యం ఉంటే తగ్గిస్తాయి.
మీరు పని చేసే సంస్థ మీకు ఇష్టమైన పని గంటలను ఎంచుకోమని ఆఫర్ చేస్తే.. రద్దీ సమయాల్లో ప్రయాణాలు లేకుండా సాధారణ సమయంలో వెళ్లేలా చూసుకోండి. వాస్తవం చెప్పాలంటే ఈ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మీ సాధారణ (ఆక్చువల్) వర్కింగ్ అవర్స్‌ను ప్రభావితం చేయకుండా ఉండేలా చూసుకోండి. కేవలం మీరు పనిని ప్రారంభించే మరియు ముగించే సమయంలో మాత్రమే తేడా ఉంటుంది. మీరు ప్రయాణం కోసం ప్రజారవాణాను ఉపయోగిస్తున్నపుడు సీటు పొందేలా చూసుకోండి. ఇలా చేయడం వలన మీరు ట్రాఫిక్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రత్యేకించి మీరు కనుక సొంత కారును ఉపయోగిస్తుంటే..
మీరు గర్భవతిగా ఉన్నపుడు వర్క్‌ఫ్రం హోం విధులను నిర్వర్తించే ముందు మీ యజమానితో మాట్లాడాలని అనుకోవచ్చు. మీరు గర్భవతిగా ఉన్నపుడు ఇంటి నుంచి పనులు చేయాలని అనుకోవడం మీకు చాలా ప్రయోజనాలను కలగజేస్తుంది. చాలా కంపెనీలు సాధారణంగా ప్రస్తుతం ఉద్యోగస్తులకు ఉన్న పరిస్థితులు మరియు అతడు చేసే పనిని బట్టి వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కలుగజేస్తాయి. మీకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కనుక లేకపోతే వేరే ప్రత్యామ్నాయాలు, పరిష్కారాల గురించి ఆలోచించాలి.
అందువల్ల మీరు మీ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారితో చెక్ చేసుకోవడం ఉత్తమం. తద్వారా మీరు గర్భవతిగా ఉన్నపుడు కూడా సంపాదించడం కొనసాగించవచ్చు. అయితే మీకు అనుకూలంగా కనుక నిర్ణయాలు లేకపోతే మీరు అదే కంపెనీలో టెంపరరీ రోల్‌ను అభ్యర్థించవచ్చు. కొన్ని రోజుల పాటు మీ విధులను మీ సహోద్యోగికి ఇవ్వడం వలన కూడా మీరు మీ వర్క్‌లైఫ్‌ను మరియు మదర్‌హుడ్‌ను (మాతృత్వం) సమతుల్యం చేసుకోవచ్చు.
మీరు ఓట్ కుకీస్, ఫ్రూట్ కేక్స్, లేదా ప్రొటీన్ బార్స్ వంటివి వెంట తీసుకెళ్లడం వలన మీరు మరింత ఉత్సాహంగా ఉండొచ్చు. ఇవి మార్నింగ్ సిక్నెస్తో పాటుగా మైకాన్ని కూడా కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయి. ఇవి మాత్రమే కాకుండా మీరు కొన్ని ఆరోగ్యవంతమైన పండ్లను కూడా తీసుకెళ్లవచ్చు. ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలనే విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
చాలా మంది తల్లులు గర్భధారణ సమయంలో తగిన మొత్తంలో ద్రవాలను తీసుకోవడం మర్చిపోతుంటారు. ఈ పరిమాణం మీ పిల్లలతో పాటుగా మీపై కూడా దుష్ప్రభావాలను చూపుతుంది. మీరు మీ వెంట సులభంగా వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లండి. తరచూ వాటర్ తాగుతూ ఉండండి. మీరు మీ శరీరం, మీ బిడ్డ తగినంత హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు.
మీరు ప్రయాణం చేస్తున్నపుడు అనేక వస్తువులను అనుకోకుండా తాకవచ్చు. అప్పుడు మీ చేతుల్లోకి బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంటుంది. మీ చేతుల్లో ఉండే బ్యాక్టీరియా మీ నోటిలోకి చేరుకోవడాన్ని మీరు ఇష్టపడకపోవచ్చు. మరీ ముఖ్యంగా అది మీ బిడ్డకు మంచిది కాదు. అందుకే మీరు ఆఫీసుకు లేదా మీరు పని చేసే ప్రదేశానికి చేరుకున్న వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. అదీ కాకుండా క్రిములను నాశనం చేసే హ్యాండ్ సానిటైజర్‌ను తీసుకెళ్లడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహమ్మారి తర్వాతి ఈ కాలంలో మరింత సంరక్షణ కోసం మీరు ఫేస్ మాస్క్ కూడా ధరించవచ్చు.
మీకు దుమ్ము లేదా వేరే ఇతర పదార్థాల వల్ల ఎలర్జీ కలిగే అవకాశం ఉంటే.. లక్షణాలు మరియు వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణాలు చేస్తున్నపుడు సంభవించే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు మహిళల వద్ద తగినన్ని మందులు (రెమిడీస్) లేకుండా ఉంటారు. మీరు అకస్మాతుగా జలుబు లేదా డస్ట్ ఎలర్జీత బాధపడుతూ ఉంటే.. కోసిన ఉల్లిపాయను వాసన చూడడం వల్ల మీకు త్వరిత ఉపశమనం కలుగుతుంది. అలా చేయడం వలన ముక్కు పట్టేయడం నుంచి ఉపశమనం పొందుతారు.
మీరు ప్రయాణం చేస్తున్నపుడు మీ శరీర భంగిమ ఏ విధంగా ఉందనే విషయాన్ని చూసుకోవాలి. ఇష్టం వచ్చిన విధంగా కూర్చోవడం కలిగే ఒత్తిడి మీ శిశువు శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీ భుజాలను వెనకకు ఉంచి కూర్చోవడానికి ప్రయత్నించండి. మీ శరీర మొత్తం బరువును మీ రెండు కాళ్లు మరియు మీ తుంటిపై వేయండి. మీరు చేసే ప్రయాణం కనుక చాలా దూరం ఉంటే.. మంచి రక్తప్రసరణ కోసం ప్రయాణం మధ్యలో మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. డ్రైవింగ్ చేస్తున్నపుడు మీరు యాక్టివ్‌గా ఉండేందుకు మరలా మిమ్మల్ని మీరు పునరుత్తేజపరిచుకునేందుకు మధ్యలో కొన్ని విరామాలు తీసుకోండి.
ప్రయాణాలు చేసేటపుడు చెడు భంగిమలో కూర్చోవడం వలన అది మిమ్మల్ని మరియు మీ బిడ్డ ఆరోగ్యాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అది మాత్రమే కాకుండా మీ కీళ్లు మరియు మీ కాళ్లలో నొప్పి డెవలప్ కావొచ్చు. మీరు మీ గర్భధారణ సమయం మొత్తం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటే అది ఇతర సమస్యలను అభివృద్ధి చేయొచ్చు. అందువల్ల మీరు ప్రయాణం చేసేటపుడు మంచి భంగిమలో కూర్చోవడం ఉత్తమం.
మీరు గర్భవతిగా ఉన్నపుడు ప్రయాణం చేయడం మంచిదే. మీకు మరియు మీ శిశువుకు ప్రయాణం వలన ఎటువంటి అపాయం కలగదని నిర్దారణ జరిగినపుడు ప్రయాణాలు మంచివే. చాలా మంది మహిళలు గర్భధారణ చివరి నెలల్లో ఎక్కువగా ఎటూ ప్రయాణాలు చేయరు. ఎందుకంటే లేబర్ పెయిన్ ఎప్పుడు వస్తుందో అస్సలు ఊహించలేం. కనుక ప్రయాణాలు మానుకుంటారు. వాస్తవం చెప్పాలంటే మూడో త్రైమాసికంలో గర్భవతులకు విమాన ప్రయాణాలు చేసేందుకు అనుమతించరు. అంతేకాకుండా మూడో త్రైమాసికంలో గర్భవతులు ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. ప్రయాణం చేసేటపుడు మీరు మీ కోసం మరియు మీ బిడ్డ కోసం అన్ని రకాల జాగ్రత్త చర్యలను తీసుకుంటే మీరు సరైన ట్రాక్‌లోనే ఉన్నారని అర్థం.
ప్రయాణించేటపుడు కలిగే రోజూవారీ ఒత్తిడిని హ్యాండిల్ చేయడం మీకు కష్టమైతే అప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించడానికి మీకు ఉత్తమ సమయం. నేను గర్భవతిగా ఉన్నపుడు వర్క్ చేయడం ఎప్పుడు ఆపేయాలి? ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్న వివిధ రకాల ప్రత్యామ్నాయాల గురించి మరింత తెలుసుకునేందుకు మీ వైద్యుడితో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అంతే కాకుండా మీరు మీ యజమానితో మాట్లాడి.. సమస్యకు సాధ్యమయ్యే పరిష్కారాల గురించి కనుక్కోండి. మీ కార్యాలయ సమయాన్ని మార్చుకోవడం లేదా వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మీరు గర్భవతిగా ఉన్నపుడు ఎంతో మేలు చేస్తాయి.
రాకపోకల ఒత్తిడిని ఎదుర్కోవడం మీకు ఇప్పటికీ కష్టంగా అనిపిస్తే మీరు మీ డాక్టర్‌తో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. రోజూ ప్రయాణాలు చేయడం వలన మీరు మీ బిడ్డ ఇద్దరూ ప్రభావితం అయినట్లు మీకు అనిపిస్తే మీరు సిక్ లీవ్ పెట్టొచ్చు. మీ డ్యూ డేట్ కనుక దగ్గరగా ఉంటే.. మీరు పనిని తిరిగి ప్రారంభించే ముందు మీ యజమానితో మాట్లాడడం ఉత్తమం. మీరు ప్రయాణాలు చేస్తున్నపుడు మీరు మరియు మీ బిడ్డ సురక్షితంగా ఉండడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి మీకు బాగా తెలుసు కాబట్టి మీరు, మీ బిడ్డ ఇంటికి, బయటికి సురక్షితంగా ప్రయాణించవచ్చు. మరో పక్క మీ డాక్టర్‌తో తరచూ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడం వల్ల మీ గర్భధారణలో ఏవైనా సమస్యలుంటే వాటిని నివారించేందుకు సహాయపడుతుంది. ఇప్పుడు సురక్షితంగా ఉంటూ ప్రయాణం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
Tags
Travel During Pregnancy in Telugu, Is Travel Safe During Pregnancy in Telugu, Tips for Travel During Pregnancy in Telugu, Risks for Travel Duing Pregnancy in Telugu, Is It Okay To Commute While Pregnant in Tamil, Is It Okay To Commute While Pregnant in Bengali
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? | Should Pregnant Women Get Flu Shots in Telugu
Vaginal Delivery - మీరు వెగైనల్ డెలివరీనే ఎందుకు ఎంచుకోవాలి? ఇందులోని అనుకూలతలు మరియు ప్రతికూలతల గురించి తెలుసుకోండి.
గర్భవతులు పెయింటింగ్ వేయొచ్చా? | Can pregnant women paint in Telugu
గర్భం దాల్చినప్పుడు కీలక పాత్ర పోషించే మాయ (ప్లాసెంటా) ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?
గర్భధారణలో పనీర్ తీసుకోవడం మంచిదేనా? దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు & తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు
గర్భధారణలో BPD అంటే ఏమిటి? | What is BPD in Pregnancy in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |