Vaccinations
1 January 2024 న నవీకరించబడింది
గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలు ఫ్లూ లేదా ఇన్‌ఫ్లుయెంజా సంబంధిత సమస్యల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే, ఫ్లూ కారణంగా గర్భస్థ శిశువుకు కూడా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. వైద్యుల సమాచారం ప్రకారం, ఇతర మహిళలతో పోలిస్తే గర్భిణీలకు ఎక్కువగా ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నాయి. వారి ఫ్లూ లక్షణాలు మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే వారిని దగ్గరగా పర్యవేక్షిస్తూ, వారి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఫ్లూ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భిణీల్లో ఇన్‌ఫ్లుయెంజా కారణంగా మరణాలు, ఆస్పత్రుల్లో చేరిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయని సీడీసీ తెలిపింది. ఫ్లూ గురించి తెలుసుకొని గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత అది సోకకుండా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఫ్లూ బారిన పడకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమైన మార్గం. గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? అన్న సందేహం మీకు కూడా ఉందా? అయితే గర్భవతిగా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. పేషెంట్‌ను బట్టి వైద్యుల సూచనలు ఉండొచ్చు. ఫ్లూ నివారణలో ఫ్లూ వాక్సిన్ తీసుకోవడం మొదటి, కీలకమైన నిర్ణయం. ఇక రెండో రక్షణ శ్రేణిగా ఫ్లూ యాంటీవైరల్ డ్రగ్స్ ఉపయోగించవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది. గర్భధారణ సమయంలో టీకాలు: గర్భధారణ సమయంలో TT ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి
వైద్య సమాచారం ప్రకారం, గర్భిణీలు వారి శరీరంలో తరచూ మార్పులు జరుగుతుంటాయి కాబట్టి, ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. అందుకే సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉండాలి. గర్భిణీల్లో రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తులు, గుండెలో మార్పులు ఉంటాయి. అలాంటివారు ఫ్లూబారిన సులువుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చుట్టూ గాలిలో ఉండే ఫ్లూతో వారికి రిస్క్ ఉంటుంది. దీంతో పాటు, ఫ్లూ సోకిన తర్వాత దానితో పోరాడి బయటపడటం కష్టంగా మారుతుంది. అదే వయస్సులో ఉన్న ఇతర మహిళలతో పోలిస్తే, గర్భిణీలు ఫ్లూతో పోరాడటం కష్టం. అందుకే ఫ్లూ సోకకుండా గర్భవతులు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలి. గర్భవతులు వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్లూ సోకే అవకాశాలను బాగా తగ్గించవచ్చు. ఒకవేళ సోకినా, ఆస్పత్రులో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి రాకపోవచ్చు.
గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తమను కాపాడుకోవడం మాత్రమే కాదు, కడుపులో పెరుగుతున్న తమ బిడ్డను కూడా వైరల్ ఇన్‌ఫ్లుయెంజా నుంచి కాపాడినట్టవుతుంది. కడుపులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు వారిని కాపాడవచ్చు. ఎందుకంటే పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు వారికి ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వరు కాబట్టి.
ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం. హెల్త్‌లైన్ సమాచారం ప్రకారం గర్భవతులు ప్రతీ ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. సీజనల్ ఫ్లూ షాట్ తీసుకోవడానికి నిర్ణీత సమయం అంటూ ఏమీ లేదని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ చెబుతోంది. అయినా.. గర్భవతులు ఫ్లూ షాట్ తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించి, వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రభావాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ షాట్స్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకోండి. -
మీకు ఇది కూడా నచ్చుతుంది. శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
ఇక ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు లేవు. అయితే సమస్యల్ని, రిస్కుల్ని నిరోధించడానికి వ్యాక్సిన్ తీసుకునే ముందు వైద్యులతో మాట్లాడాలి. ప్రత్యేకించి, మీరు ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టైతే, ఆలస్యంగా గర్భం దాలిస్తే వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫ్లూ వ్యాక్సిన్లకు, గర్భస్రావాలకు సంబంధం ఉండొచ్చని అంటుంటారు. అయితే ఇది నిరూపించబడలేదు. అందుకే మీ శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి.
గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉండొచ్చు. అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సాధారణమే కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అసరం లేదు. నిజానికి, ఈ దుష్ప్రభావాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అయితే ఏదైనా అత్యవసరం అయినా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కాలం ఉన్నా వైద్యులను కలవాలి.
తీసుకోవచ్చు. CDC, ACOG ప్రకారం గర్భవతిగా ఉన్నప్పుడు మూడో ట్రమిస్టర్‌లో ఫ్లూ షాట్ తీసుకోవడం సురక్షితమే.
అవును. గర్భవతిగా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితం మాత్రమే కాదు, వైద్యులు వద్దంటే తప్ప వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత సిఫార్సు చేయబడిన అంశం.
References
1. SteelFisher GK, Caporello HL, Broussard CS, Schafer TJ, Ben-Porath EN, Blendon RJ. (2021). Seasonal Influenza Vaccine in Pregnant Women: Views and Experiences of Obstetrician-Gynecologists. J Womens Health (Larchmt).
2. Mother To Baby | Fact Sheets [Internet]. (1994). Brentwood (TN): Organization of Teratology Information Specialists. Seasonal Influenza Vaccine (Flu Shot)
Tags
How many injection during pregnancy in Telugu, Vaccines during Pregnancy in Telugu, Vaccines for Pregnant women in Telugu, Should Pregnant Women Get Flu Shots in English, Should Pregnant Women Get Flu Shots in Tamil
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
Vaginal Delivery - మీరు వెగైనల్ డెలివరీనే ఎందుకు ఎంచుకోవాలి? ఇందులోని అనుకూలతలు మరియు ప్రతికూలతల గురించి తెలుసుకోండి.
గర్భవతులు పెయింటింగ్ వేయొచ్చా? | Can pregnant women paint in Telugu
గర్భం దాల్చినప్పుడు కీలక పాత్ర పోషించే మాయ (ప్లాసెంటా) ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?
గర్భధారణలో పనీర్ తీసుకోవడం మంచిదేనా? దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు & తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు
గర్భధారణలో BPD అంటే ఏమిటి? | What is BPD in Pregnancy in Telugu
టీ ట్రీ వలన మీ చర్మానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు (Five excellent tea tree benefits for your skin in Telegu)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |