
నవజాత శిశువుల్లో బేబీ ఆక్నే (మొటిమలు) అనేది ఒక చర్మ వ్యాధి. ఇది సంభవించినపుడు చర్మం మీద చిన్నగా ఎరుపు రంగులో గడ్డలు లేదా వైట్ బంప్స్ ఏర్పడతాయి. ఇది చాలా మంది శిశువులలో మొదటి నుంచి నాలుగు వారాల మధ్య ఏర్పడుతుంది. కానీ కొంత మందికి ఇది పుట్టినపుడే సంభవిస్తుంది. శిశువులలో మొటిమలు సాధారణం అయినప్పటికీ, చిన్న పిల్లాడి లేత ముఖం మీద ఆ మచ్చలు ఏర్పడడం చూస్తే మనకు విపరీతమైన బాధ కలుగుతుంది.
వైద్య పరంగా శిశువుల్లో ఆక్నేను ఎరిథీమా టాక్సికమ్ నియోనటోరమ్ (ETN) అని పిలుస్తారు. దాదాపు 10 మంది శిశువుల్లో 4.5 మంది ఈ పరిస్థితితో బాధపడుతున్నారు. ఇది పిల్లల్లో వచ్చే అత్యంత సాధారణ వ్యాధి.
నియోనాటల్ ఆక్నే ను సెఫాలిక్ పస్టులోసిస్, లేదా న్యూ బార్న్ ఆక్నే అని కూడా పిలుస్తారు. 2 నుంచి 4 వారాల వయస్సున్న పిల్లల ముఖం మరియు తల మీద అక్కడక్కడ మొటిమలు మరియు గడ్డలు కనిపిస్తాయి.
శిశువులలో ఆక్నే అనేది ఇన్ఫనైటల్ ఆక్నే నుంచి వేరుగా ఉంటుంది. ఇది సాధారణంగా 3 నుంచి 6 నెలల వయస్సు మధ్యలో కనిపిస్తుంది. అడల్ట్ ఆక్నే కూడా. మీకు దీని గురించి ఏవైనా సందేహాలుంటే మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించండి.
చిన్నారిలో మొటిమలు రావడం అంటే ఏమిటి (What is Baby Acne in Telegu)
బేబీ ఆక్నేను నియోనాటల్ ఆక్నే అని కూడా పిలుస్తారు. దాదాపు 20 శాతం మంది పిల్లల్లో పుట్టినపుడే ఇది సంభవిస్తుంది.
శిశువులలో ఆక్నే అనేది ఇన్ఫాన్టైల్ ఆక్నే నుంచి వేరుగా ఉంటుంది. సాధారణంగా ఇది సంభవించినపుడు బ్లాక్‌హెడ్స్ లేదా ఓపెన్ కమ్ డోన్స్ (బ్లాక్ హెడ్స్) ఉండవు. పిల్లలకు యాక్నే ఉన్నపుడు ఈ లక్షణాలు సాధారణం. శిశువులలో ఆక్నే సంభవించినపుడు తిత్తులు లేదా నోడ్యూల్స్ (చర్మం కింద కణజాల పెరుగుదల) ఏర్పడతాయి. చికిత్స చేయకుండా ఉంటే కొన్ని సార్లు ఇవి మచ్చలను వదిలేయొచ్చు.
శిశువులలో మొటిమలు పుట్టిన తర్వాత కొన్ని నెలల్లో మాత్రమే సంభవిస్తాయి. పిల్లల్లో మొటిమలు రెండు సంవత్సరాల వయసు వరకు ఉంటాయి. పిల్లలలో మొటిమల కంటే బేబీ ఆక్నే సాధారణం.
చిన్నారుల్లో మొటిమలు వచ్చినపుడు కనిపించే లక్షణాలు(Symptoms of Infant Acne in Telegu)
శిశువులకు సంభవించే మొటిమలు చూసేందుకు ఎరుపు రంగులో ఉండే గడ్డలుగా లేదా మొటిమల్లాగా కనిపిస్తాయి. యుక్తవయస్కులు మరియు పెద్దల్లో మొటిమల్లాగా వైట్ హెడ్స్ మరియు గడ్డ చుట్టూ చర్మం ఎర్రగా ఉండవచ్చు.
మొటిమలు అనేవి శిశువు ముఖం మీద ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ ఇవి ఎక్కువగా చెంపల మీద ప్రారంభం అవుతుంది. కొంత మంది శిశువులకు మెడ కింద మరియు వీపు పై భాగంలో కూడా మొటిమలు ఉండవచ్చు.
శిశువు గందరగోళంగా ఉండి ఏడుస్తూ ఉంటే మొటిమలు మరింత తీవ్రమవుతాయి. శిశువు రఫ్ క్లాత్స్ (మృదువుగా లేని బట్టలు) వేసుకున్నా కానీ వాంతి లేదా లాలాజలం శిశువు ముఖం మీద ఉన్నా కానీ మొటిమలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
పిల్లలు మొటిమలతో పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ మంది శిశువుల్లో పుట్టిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల వ్యవధిలో మొటిమలు సంభవిస్తాయి. ఇవి కొన్ని రోజులు లేదా వారాల వరకు ఉంటాయి. కొంతమందిలో ఇవి నెలల తరబడి ఉండిపోతాయి.
కొత్తగా జన్మించిన వారిలో మొటిమలు వచ్చేందుకు గల కారణాలు (Causes of Newborn Acne in Telegu)
కొత్తగా పుట్టిన శిశువులలో మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని నిపుణులు మాత్రమే సరిగ్గా అంచనా వేయగలరు.
1. శిశువు చర్మంపై ఈస్ట్ వల్ల దద్దుర్లు
2. ప్లాసెంటాలో గర్భధారణ సంబంధిత హార్మోన్ల మార్పులు శిశువు బాహ్య చర్మంలో నూనె అధిక ఉత్పత్తికి కారణం కావచ్చు.
తల్లి మరియు బిడ్డలో ఉన్న జన్యువులు, హార్మోన్ల కారణాల వల్లే ఈ పరిస్థితులు సంభవిస్తాయని కొంత మంది పరిశోధకులు నమ్ముతున్నారు. లేదా వాతావరణంలోని కారకాలు చర్మానికి చికాకు పుట్టిండం వల్ల ఇది సంభవిస్తుంది. శిశువుల్లో మొటిమలు సాధారణం. కానీ ఇవి త్వరగా తగ్గిపోతాయి.
యుక్తవయస్కులు, మరియు పెద్దల్లో తరచూ హార్మోన్ల వల్ల మొటిమలు సంభవిస్తాయి. తల్లి నుంచి వచ్చిన కొన్ని హార్మోన్లు పుట్టిన తర్వాత కొన్ని వారాల వరకు కూడా శిశువు శరీరంలో ఉంటాయి. పిల్లల శరీరంలో అలా మిగిలిపోయిన హార్మోన్లు హార్మోనల్ ఆక్నే అని పిలువబడే ఒక రకమైన మొటిమలకు కారణం అవుతాయని అంతా నమ్ముతారు. గర్భధారణ సమయంలో ప్లాసెంటాలో ఉండే హార్మోన్లు కూడా శిశువు చర్మంపై ఉండే తైల గ్రంథుల పనిని కూడా చాలా కష్టతరం చేస్తాయి. ఇది తర్వాతి కాలంలో మొటిమలు సంభవించేందుకు దారి తీస్తుంది.
శిశువు యొక్క చర్మం మీద రంద్రాలు (స్వేదగ్రంథులు) పుట్టిన తర్వాత వరకు పూర్తిగా ఏర్పడవు. కాబట్టి బయటి ప్రపంచంలోని ఇరిటేషన్ల ద్వారా వారికి మొటిమలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిశువుకు వచ్చే మొటిమలకు యువకులకు వచ్చే మొటిమలకు ఎటువంటి సంబంధం లేదు.
శిశువుల్లో మొటిమలు రావడం అనేది కామన్ అయినప్పటికీ.. మొటిమల వ్యాప్తి మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. శిశువుల మొటిమల కోసం ప్రస్తుతం ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. ఎవరైతే ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఉంటారో వారు.. తమ బిడ్డ పరిస్థితి గురించి శిశు వైద్యుడితో మాట్లాడాలి. జనరల్ విజిట్ సమయంలో చిన్నారి మొటిమలు మరియు ఇతర ఆరోగ్యపరిస్థితుల గురించి చర్చించేందుకు ఉత్తమ సమయం.
నల్లమచ్చలు, మరియు వాపు లాంటివి చిన్నారి యొక్క మొటిమలకు వైద్య సహాయం అవసరమని సూచిస్తాయి. శిశువుకు ఏదైనా అసౌకర్యం తలెత్తినా లేదా ఏదైనా అనారోగ్యం కలిగినా వారు కూడా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
కొన్ని రోజుల తర్వాత ఇంట్లో చికిత్స చేసిన తర్వాత కూడా.. శిశువు మొటిమలు తగ్గకపోతే.. 2.5 శాతం బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్న లోషన్‌ను డాక్టర్ సిఫారసు చేస్తాడు.
మచ్చలు త్వరగా కనిపించకుండా పోయేందుకు యాంటీబయాటిక్స్ అయిన ఎరిత్రోమైసిన్ లేదా ఐసోట్రిటినోయిన్ వంటి మందులు సూచించబడతాయి. వైద్యపరంగా ప్రేరేపిత మొటిమలు కలిగిన శిశువులకు మాత్రమే ఇది అవసరం పడుతుంది.
పిల్లలకు యుక్తవయస్సు రాకముందే వారికి మళ్లీ మొటిమలు వస్తే అది తీవ్రమైన సమస్యను సూచిస్తుంది. వారు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
1. Godínez-Chaparro JA, Cruz HV.(2021). Acne in the Newborn
2. Herane MI, Ando I.(2003).Acne in infancy and acne genetics. Dermatology
Baby Acne in English, Baby Acne in Tamil, Baby Acne in Bengali, Baby Acne in Hindi
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |