back search
Browse faster in app
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
 • Home arrow
 • Teething arrow
 • శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu) arrow

In this Article

  శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)

  Teething

  శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)

  12 September 2023 న నవీకరించబడింది

  పసిపిల్లల పెరుగుదల & అభివృద్ధిలో దంతాలు రావడం అనేది ఒక ముఖ్యమైన దశ. దానితో సంబంధం ఉన్న అనేక అపోహలు మరియు మూఢనమ్మకాలు చాలా మంది తల్లిదండ్రులను తమ పిల్లల గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. అపోహలు మరియు వాస్తవాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం పరిస్థితిని చక్కదిద్దటంలో మీకు సహాయపడుతుంది.

  దంతాలకు సంబంధించిన అపోహలు మరియు వాస్తవాలు (Myths and Facts related to Teething in Telugu)

  1. అపోహ: శిశువు దంతాలు అంత క్లిష్టమైనవి కావు ( Myth: Baby Teeth are Not That Critical)

  వాస్తవం: మీ శిశువు దంతాలు తాత్కాలికమైనవే అయినా, తినడానికి మరియు వయోజన దంతాలు బయటకు రావడానికి ఆధారాన్ని అందించడానికి ఇవి చాలా ముఖ్యము. సరైన సంరక్షణ లేకపోవడం వల్ల శిశువు దంతాలు రాకుండా అడ్డుపడినట్లైతే, ఇతర దంతాలు వయోజన దంతాలు పెరగడానికి ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి వచ్చి వయోజన దంతాల పెరుగుదలకు అడ్డు పడవచ్చు. దీనితో పాటు చిన్ని దంతాలు ముఖ నిర్మాణంలోనూ మరియు మీ శిశువు యొక్క ప్రసంగ అభివృద్ధిలో సహాయపడతాయి.

  2. అపోహ: శిశువుకు కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించకూడదు. ( Myth: A Fluoride Toothpaste Should Not be Used Until a Baby is at Least 2 Years Old)

  వాస్తవం: ఈ ఆలోచన ఒకప్పుడు ప్రబలంగా ఉన్నప్పటికీ, శిశువు దంతాలు బయటకు వచ్చిన వెంటనే ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ని ఉపయోగించమని నిపుణులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఫ్లోరైడ్ దంత క్షయం యొక్క అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది మరియు గరుకైన ఉపరితలాలు కనిపించకుండా చేస్తుంది. మీ శిశువు టూత్‌పేస్ట్‌ను ఉమ్మివేయడానికి బదులు దాన్ని మింగడాన్ని నిరోధించడానికి, బియ్యం గింజ పరిమాణంలో ఉన్న టూత్‌పేస్ట్‌ను మాత్రమే ఉపయోగించండి.

  3. అపోహ: శిశువులకు క్యావిటీ రాదు (క్రిములు పట్టవు) ( Myth: Babies Will Not Get Cavity)

  వాస్తవం: దంతాలు ఉన్న ఎవరికైనా క్యావిటీ ఏర్పడవచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఒక క్యావిటీ పంటి ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు మరియు ఫలితంగా నొప్పి & వాపు వస్తుంది. అంతే కాకుండా, ఇది శాశ్వత దంతానికి కూడా హాని కలిగిస్తుంది. ఎలాంటి క్యావిటీ ఏర్పడకుండా నిరోధించడానికి, ఎలాంటి చక్కెర ఉత్పత్తులను తినకుండా ఉండండి మరియు దంతాలను శుభ్రంగా ఉంచండి.

  4. అపోహ: దంతాల వల్ల అనారోగ్యం వస్తుంది ( Myth: Teething Result in Sickness)

  వాస్తవం: ఇటీవలి పరిశోధనల ప్రకారం, దంతాలు విరేచనాలు, జ్వరం మరియు ఉష్ణోగ్రత పెరుగుదలతో సహా ఇతర సమస్యలకి దారితీస్తాయి.

  టీతింగ్ ప్రక్రియ సమయంలో మీ శిశువు అనారోగ్యం యొక్క తీవ్రమైన సంకేతాలను చూపిస్తే, సరైన చికిత్స కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.

  5. అపోహ: మీరు రోజుకు ఒకసారి మాత్రమే వారి దంతాలను శుభ్రం చెయ్యాలి (Myth:You Should Brush Their Teeth Once in a Day)

  వాస్తవం: దంతాల నిర్మాణం దెబ్బతినడానికి బ్యాక్టీరియా నిర్మాణానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది కాబట్టి ప్లేక్ తొలగింపును నిర్ధారించడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం సిఫార్సు చేయబడింది. మీ శిశువు పళ్లను చిన్న సర్కిల్‌లలో బ్రష్ చేయడానికి బియ్యం గింజల పరిమాణంలో టూత్‌పేస్ట్‌నుమరియు మృదువైన బ్రిసిల్స్ తో కూడిన టూత్ బ్రష్ ఎంచుకోవడం ద్వారా ప్రారంభించండి.

  Tags:

  First tooth in babies in telugu, facts about teething in babies in English , Myths behind the teething in babies in Bengali, Tips to maintain clean tooth for your babies in Tamil.

  Is this helpful?

  thumbs_upYes

  thumb_downNo

  Written by

  nayanamukkamala

  nayanamukkamala

  Read from 5000+ Articles, topics, verified by MYLO.

  Download MyloLogotoday!
  Download Mylo App

  Related Topics

  RECENTLY PUBLISHED ARTICLES

  our most recent articles

  100% Secure Payment Using

  Stay safe | Secure Checkout | Safe delivery

  Have any Queries or Concerns?

  CONTACT US
  +91-8047190745
  shop@mylofamily.com
  certificate

  Made Safe

  certificate

  Cruelty Free

  certificate

  Vegan Certified

  certificate

  Toxic Free

  About Us
  Mylo_logo

  At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

  All trademarks are properties of their respective owners.2017-2023©Blupin Technologies Pvt Ltd. All rights reserved.