Pregnancy Precautions
1 January 2024 న నవీకరించబడింది
ఫర్నీచర్ అయినా, కాన్వాస్ అయినా, మహిళలు పెయింటింగ్‌ని ఇష్టపడతారు. మరి మీరు గర్భవతిగా ఉన్నప్పుడు పెయింట్ చేస్తే ఏం జరుగుతుంది? మీ సృజనాత్మకతను పక్కన పెట్టేస్తారా? మీ పెయింటింగ్‌ను వాయిదా వేస్తారా? గర్భవతిగా ఉన్నప్పుడు పెయింటింగ్‌పై మీకున్న సందేహాలు తీరుస్తే అనేక విషయాలను ఈ బ్లాగ్‌లో చర్చించాం.
ఈ రోజుల్లో, మోడర్న్ హౌజ్ పెయింట్స్ అన్నీ మంచి క్వాలిటీతోనే వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా పొగలు రాని, కడుపులోని మీ బిడ్డకు హాని కలిగించని పెయింట్స్ ఉపయోగించవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు పెయింటింగ్ వల్ల కడుపులోని మీ బిడ్డకు ఎలాంటి హాని కలగదు. అయితే మీరు తక్కువ క్వాలిటీ ఉన్న సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్ లేదా సీసం ఉన్న పెయింట్స్ ఉపయోగిస్తే ప్రమాదమే. సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్, సీసం ఉన్న పెయింట్స్ వల్ల మీ బిడ్డకు హాని పెరగవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు పెయింటింగ్ వేయడం సురక్షితమే. అయితే పెయింట్స్‌లో వేర్వేరు రకాల గురించి తెలుసుకొని, గర్భవతులు పెయింట్స్‌ని పరిమితంగా ఉపయోగించాలి.
పలురకాల కథనాల ప్రకారం, మొదటి ట్రైమిస్టర్‌లో పెయింట్స్‌కు, పెయింట్ పొగలకు కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే, పెయింట్‌లో ఉండే రసాయనాలు ఉంటాయి. వాటిని గర్భవతులు పీల్చకూడదు. వీటిని పీల్చితే కడుపులో బిడ్డ అభివృద్ధికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. ఇక రెండో ట్రైమిస్టర్ సమయంలో పెయింట్ చేయడంలో ఇబ్బందేమీ లేదు. అయితే హానికారక పెయింట్ పొగల్ని, కెమికల్స్‌ని పీల్చకుండా జాగ్రత్తపడాలి.
ఇక మూడో ట్రైమిస్టర్‌లో, రెండో ట్రైమిస్టర్ లాగానే పెయింట్ చేయడంలో ఇబ్బందేమీ ఉండదు. అయితే ఇక్కడ కూడా జాగ్రత్తలు తప్పనిసరి. తక్కువ VOCs లేదా హై సాల్వెంట్స్ లేని పెయింట్స్ ఉపయోగించాలి. ఇక పెయింట్ చేసేప్పుడు గది వెంటిలేషన్ కూడా బాగుండాలి. దీని వల్ల పెయింట్ వాసన కాస్త తక్కువగా ఉంటుంది.
గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ట్రైమిస్టర్‌లో పెయింట్ పొగలు తీవ్రంగా హాని చేస్తాయి. గర్భంలో పిండం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటి వల్ల శిశువు నాడీ వ్యవస్థ, మూత్రనాళాలు, చెవి, ముక్కు, గొంతుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు వీలైతే పెయింటింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే పెయింట్ పొగలకు దూరంగా ఉండాలి. కొత్తగా పెయింట్ వేసిన గదుల్లో పెయింటింగ్ పూర్తైన రెండు రోజుల వరకు పెయింట్ పొగలు వస్తుంటాయి. గర్భవతిగా ఉన్న మహిళలు అలాంటి గదులకు కొన్ని రోజుల వరకు దూరంగా ఉండాలి.
ఇక స్ప్రే పెయింట్ విషయానికి వస్తే, మైకం, వికారం, తలనొప్పి లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. గర్భవతులు స్ప్రే పెయింట్‌కు లేదా వాటి వల్ల వచ్చే పొగలకు దూరంగా ఉండాలి. తద్వారా గర్భవతులు తమకు జరిగే హాని తప్పించుకోవడంతోపాటు వారి కడుపులో పెరుగుతున్న బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధికి నష్టం కలగకుండా చూడొచ్చు.
యాక్రిలిక్ లేదా ల్యాటెక్స్ లాంటి వాటర్ బేస్డ్ పెయింట్స్‌లో గర్భిణులకు హానిచేసే కొన్ని ద్రావకాలు ఉండొచ్చు. యాక్రిలిక్ పెయింట్స్‌లో బయోసైడ్స్ లాంటి కొన్ని పదార్థాలు కాబోయే తల్లులకు తీవ్రమైన హాని చేయొచ్చు. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు యాక్రిలిక్ పెయింట్ ఉపయోగించకపోవడం మంచిది.
2. గర్భవతిగా ఉన్నప్పుడు ఆయిల్ పెయింటింగ్ (Oil Painting While Pregnant)
ఆయిల్ పెయింట్స్‌లో ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. ఆయిల్ పెయింట్స్ కూడా VOCs రూపంలో ఆవిర్లను వదుల్తాయి. దీనివల్ల మైకం, అలసట, వికారం, తలనొప్పి లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే గర్భవతులు అయిల్ పెయింట్స్‌కి కూడా దూరంగా ఉండాలి.
3. గర్భవతిగా ఉన్నప్పుడు వాటర్ కలర్ పెయింటింగ్ (Watercolour Painting While Pregnant)
గర్భవతిగా ఉన్నప్పుడు వాటర్ బేస్డ్ పెయింట్స్ ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇందులో సాల్వెంట్స్, కెమికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పాటు చాక్ పెయింట్స్, ఇళ్లల్లో ఉపయోగించే ఎమల్షన్ పెయింట్స్ లాంటివి సురక్షితమైన పెయింట్స్‌గా చెప్పుకోవచ్చు.
(Disclaimer)
గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ఏవైనా పెయింట్స్ కొనాలనుకుంటే వాటి గురించి బాగా తెలుసుకోవాలి. చిక్కులు ఎదురుకాకుండా వైద్యుల్ని లేదా హెల్త్ ఎక్స్‌పర్ట్‌ని సంప్రదించాలి.
1. గర్భవతిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించి నేను పెయింట్ వేయొచ్చా? (Can I Paint While Pregnant If I Wear a Mask)
గర్భవతిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించి పెయింటింగ్ వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పెయింట్ పొగల నుంచి కాబోయే తల్లుల్ని కొంతవరకైనా మాస్క్ రక్షిస్తుంది. అయితే ఈ కెమికల్స్‌ని దూరంగా ఉంచడంతో పాటు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు మంచి క్వాలిటీ మెటీరియల్స్‌తో తయారు చేసిన మాస్క్ ఉపయోగించాలి.
మంచి వెంటిలేషన్ ఉన్న గదిలో అయితే యాక్రిలిక్ పెయింట్ ఉపయోగించడం సురక్షితమే. అయితే హై క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించి తయారు చేసిన పెయింట్ వాడాలి.
Tags
Painting during Pregnancy in Telugu, Which paint affect during Pregnancy in Telugu, Is painting safe during Pregnancy in Telugu, How to Choose the Right Materials for Painting During Pregnancy in Telugu, Precautions to Take When Painting While Pregnant in Telugu, Can pregnant women paint in English, Can pregnant women paint in Tamil, Can pregnant women paint in Bengali
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips
గర్భం దాల్చినప్పుడు కీలక పాత్ర పోషించే మాయ (ప్లాసెంటా) ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?
గర్భధారణలో పనీర్ తీసుకోవడం మంచిదేనా? దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు & తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు
గర్భధారణలో BPD అంటే ఏమిటి? | What is BPD in Pregnancy in Telugu
టీ ట్రీ వలన మీ చర్మానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు (Five excellent tea tree benefits for your skin in Telegu)
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu
స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |