hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • Growth & Development arrow
  • గ్రోయింగ్ పెయిన్స్: అర్థం, కారణాలు, లక్షణాలు, చికిత్స మార్గాలు arrow

In this Article

    గ్రోయింగ్ పెయిన్స్: అర్థం, కారణాలు, లక్షణాలు, చికిత్స మార్గాలు

    Growth & Development

    గ్రోయింగ్ పెయిన్స్: అర్థం, కారణాలు, లక్షణాలు, చికిత్స మార్గాలు

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    పిల్లలు ఎదుగుతున్న సమయంలో కొద్దిగా అసౌకర్యానికి గురవుతుంటారు. దానికి గ్రోయింగ్ పెయిన్ కూడా కారణం కావచ్చు. మూడేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లలకు సాధారణంగా ఇలాంటి నొప్పి వస్తుంటుంది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదు. రోజులు గడుస్తున్నకొద్దీ నొప్పి తగ్గిపోతుంది.

    గ్రోయింగ్ పెయిన్ అంటే ఏంటీ?

    పిల్లలు పెరుగుతున్న సమయంలో వారి కాళ్లల్లో నొప్పులు రావడం, దడపుట్టినట్టు అనిపించడాన్నే గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. ఈ నొప్పి ప్రధానంగా తొడలు, పిక్కలు, మోకాళ్లలో నొప్పులు వస్తుంగి. పిల్లల్లో కాళ్ల నొప్పులు సాధారణంగా రాత్రి సమయంలో వస్తాయి. ఈ నొప్పితో ఒక్కోసారి వాళ్లు నిద్ర నుంచి కూడా లేవొచ్చు. అయితే పిల్లల్లో ప్రతీ ఒక్కరికీ ఇలాంటి నొప్పి ఉండదు. కొందరికి మాత్రమే ఈ నొప్పులు వస్తుంటాయి. దీనికి మానసిక సమస్యలతో సంబంధం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇతర నొప్పుల్ని కూడా గ్రోయింగ్ పెయిన్స్ అనుకొని తల్లిదండ్రులు అయోమయానికి గురవుతుంటారు. అందుకే గ్రోయింగ్ పెయిన్ అంటే ఏంటీ, లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం అవసరం.

    గ్రోయింగ్ పెయిన్స్ లక్షణాలు, సంకేతాలు ఎలా ఉంటాయి?

    గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏంటీ, మిగతా నొప్పుల కన్నా భిన్నంగా ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే లక్షణాలను గుర్తించాలి. లక్షణాలు తెలుసుకుంటే గ్రోయింగ్ పెయిన్స్‌ని చాలా సులువుగా గుర్తించవచ్చు. గ్రోయింగ్ పెయిన్స్ లక్షణాలు ప్రధానంగా ఇలా ఉంటాయి:

    • పిక్క, తొడలు, మోకాలి వెనుక కండరాల నొప్పి
    • కీళ్లల్లో నొప్పి లేకపోవడం
    • నొప్పి తరచూ ఉండకపోవడం
    • నొప్పి సాధారణంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం ప్రారంభం కావడం
    • రాత్రి పిల్లలు నిద్రపోతున్న సమయంలో నొప్పి కారణంగా మేల్కొనడం
    • పగలు ఎలాంటి నొప్పి లేకపోవడం
    • గ్రోయింగ్ పెయిన్ కుంటడానికి కారణం కాదు కాబట్టి పరిగెత్తడంలో, ఆడుకోవడంలో సమస్య లేకపోవడం
    • నొప్పితో పాటు తలనొప్పి కూడా రావడం

    గ్రోయింగ్ పెయిన్స్ రావడానికి కారణాలేంటీ?

    పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇది వారి కౌమార దశ మొత్తం కొనసాగుతుంది. ఈ నొప్పికి సరైన కారణం తెలియదు. అయితే ఈ కింది కారణాల వల్ల గ్రోయింగ్ పెయిన్స్ రావొచ్చు.

    1. కండరాల అలసట

    పగటివేళలో ఎక్కువగా శారీరక శ్రమ చేయడం పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్‌కు దారితీయవచ్చు. అయితే రోజంతా పనిచేసిన పిల్లల్లందరికీ ఈ నొప్పి రాకపోవచ్చు. కొందరు వీటి నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇంకొందరికి రాత్రి సమయంలో కూడా నొప్పులు ఉండొచ్చు.

    2. భంగిమ సరిగ్గా లేకపోవడం

    తప్పుడు భంగిమలో కూర్చోవడం, నడవడం, నిలబడటం వల్ల పిల్లల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. పాదం చదునుగా ఉన్న పిల్లల్లో ఎక్కువగా గ్రోయింగ్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది.

    3. మానసికంగా కలత చెందడం

    మానసికంగా కలత చెందే పిల్లలు, ఒత్తిడికి గురయ్యేవారు త్వరగా ఈ నొప్పుల బారినపడతారు. అలాగని నొప్పిని అనుభవిస్తున్న పిల్లలందరికీ ఇలా ఉంటుందని కాదు.

    గ్రోయింగ్ పెయిన్స్ ప్రమాద కారకాలు

    కౌమార దశలోని పిల్లల్లో సాధారణంగా గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి. ఈ వయస్సులోని పిల్లలందరు చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ అలసిపోకుండా చూసుకోవాలి. వారిలో గ్రోయింగ్ పెయిన్స్ ఉన్నట్టైతే సరైన విశ్రాంతి లభించేలా చూడాలి. పగటివేళలో పరుగెత్తడం, ఎగరడం, క్లైంబింగ్ లాంటివి చేసే పిల్లల్లో రాత్రి సమయంలో కండరాల నొప్పులు వస్తుంటాయి.

    గ్రోయింగ్ పెయిన్స్‌ని ఎలా గుర్తించాలి?

    గ్రోయింగ్ పెయిన్స్ గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు లేవు. వైద్యులు లక్షణాల ఆధారంగా గ్రోయింగ్ పెయిన్స్‌ని గుర్తిస్తారు. గ్రోయింగ్ పెయిన్ కాకుండా.. కండరాల నొప్పులకు కారణమయ్యే ఇతర ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని గ్రోయింగ్ పెయిన్‌ను నిర్థారిస్తారు. వైద్యులు సాధారణంగా పరిగణించే అంశాలు ఇవే.

    • పిల్లలకు నొప్పి ఎక్కువగా ఉంటే శారీరక పరీక్ష చేస్తారు.
    • రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉంటూ, పగటి వేళలో నొప్పి ఉండకపోవడం.
    • మర్దన చేసిన తర్వాత లేదా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాక నొప్పి తగ్గడం.

    గ్రోయింగ్ పెయిన్స్‌కు చికిత్స

    ఇలాంటి నొప్పి ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పిల్లల కాళ్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ తగ్గించడానికి ఏం చేయాలి అన్న విషయాన్ని వైద్యులు తల్లిదండ్రులకు వివరిస్తారు. వైద్యుల సూచనలు ఈ కింది విధంగా ఉంటాయి.

    • ఈ నొప్పి రానురాను తగ్గిపోతుందని తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వడం ద్వారా వారి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేలా చేయడం.
    • నొప్పి ఉన్న ప్రాంతంలో ప్రత్యేకమైన నూనెలతో మృదువుగా మర్దన చేసి నొప్పి నుంచి ఉపశమనం కలిగించడం.
    • నొప్పి ఉన్నచోట హీట్ ప్యాక్స్‌తో కాపడం.
    • ఓరల్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ద్వారా కూడా పిల్లలకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడం. ఇబుప్రోఫెన్ లేదా ఎసిటమైనోఫెన్ లాంటి మందులు ఉపయోగపడతాయి.
    • పిల్లలకు సరైన శరీర భంగిమ రావడం కోసం చిరోప్రాక్టర్ లేదా పీడియాట్రీషియన్‌ను సంప్రదించడం.
    • కండరాల నొప్పిని తగ్గించడం కోసం స్ట్రెచింగ్ చేయమని పిల్లల్ని కోరడం.

    వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

    ప్రతీ కండరాల నొప్పి గ్రోయింగ్ పెయిన్‌గా భావించకూడదు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లాలో తెలుసుకోవాలి. పిల్లల్లో నొప్పి ఈ కింది విధంగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి:

    • నొప్పి నిరంతరంగా ఉండటం
    • పగటి వేళలో కూడా నొప్పి ఉండటం.
    • పిల్లలు తమ రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడేంత తీవ్రంగా నొప్పి ఉండటం.
    • కీళ్లల్లో కూడా నొప్పి ఉండటం.
    • పెద్ద దెబ్బ తగిలినప్పుడు కండరాల్లో నొప్పి ఉండటం
    • కండరాల నొప్పితో పాటు, వాపు, సున్నితత్వం, జ్వరం, దద్దుర్లు, కుంటడం, అలసట, ఆకలిలేకపోవడం లాంటి లక్షణాలు కూడా ఉండటం.
    • ఇవన్నీ గ్రోయింగ్ పెయిన్స్ గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు. పిల్లల్లో ఈ నొప్పిని గుర్తించి, సరైన చికిత్స అందించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.