hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Care for Baby arrow
  • డైపర్ ఎలా మార్చాలి? తొలిసారి చేసే వారికి గైడ్ ఇదిగో arrow

In this Article

    డైపర్ ఎలా మార్చాలి? తొలిసారి చేసే వారికి గైడ్ ఇదిగో

    Care for Baby

    డైపర్ ఎలా మార్చాలి? తొలిసారి చేసే వారికి గైడ్ ఇదిగో

    3 November 2023 న నవీకరించబడింది

    తన బేబీకి డిస్పోజల్ (వాడిపడేసేవి) డైపర్లను ఉపయోగించాలా? లేదా క్లాత్ డైపర్లను ఉపయోగించాలా? అనేది పేరెంట్స్ తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి. డైపర్ ఎలా మార్చాలో దశల వారీగా తెలుసుకోండి. ఈ సలహాలు మీ పనిని మరింత సులభతరం చేస్తాయి.

    ఓవర్ వ్యూ (Overview of Cloth diaper & Cloth diapers)

    డిస్పోజల్ డైపర్లు, రీయూజబుల్ డైపర్ల లో ఏది ఎంపిక చేసుకోవాలనేది తల్లిదండ్రుల ఇష్టం. కానీ బిడ్డను కనాలని ప్లాన్ చేసే ముందు డైపర్ ఎలా చేంజ్ చేయాలనే విషయంపై మంచి అవగాహనను కలిగి ఉండాలి. ఇది మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది. మీరు ఇంతకు ముందెన్నడూ బేబీ డైపర్లను మార్చకపోతే.. ఈ పని కొంచెం కఠినంగా అనిపించొచ్చు. మీరు కొన్ని సార్లు ఈ పనిని చేసిన తర్వాత ఇది నిమిషాల వ్యవధిలో చేసే పని అవుతుంది. మీరు కనుక కొత్త తల్లిదండ్రులు అయితే మీ బిడ్డ మీకు పుష్కలమైన ప్రాక్టీస్​ అందజేస్తుంది. సాధారణంగా శిశువులకు రోజుకు 6 నుంచి 10 సార్లు డైపర్ మార్చాల్సి ఉంటుంది. శిశువు మొదటి ఏడాది ముగిసే సరికి 3,000 కంటే ఎక్కువ సార్లు డైపర్లు మార్చాలి. బేబీ డైపర్లను మార్చేందుకు ఎటువంటి పద్ధతులు ఉన్నాయో చదవండి.

    డిస్పోజల్ (ఒకసారి వాడి పడేసేవి) డైపర్లను ఎలా మార్చాలి? (How to change disposable diapers)

    మీరు ప్రారంభించే ముందు మీకు అవసరమైనవన్నీ ఉండేలా చూసుకోవాలి. కింది వాటిని మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.

    • శిశువు డైపర్ చేంజ్ చేసేందుకు క్లీన్ ప్లేస్: చాలా మంది పేరెంట్స్ నేల మీద లేదా మంచం మీద డైపర్​ను మార్చుతూ ఉంటారు. మీరు పైన డైపర్​ను చేంజ్ చేస్తే.. సేఫ్టీ స్ట్రాప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. దానిని టేబుల్‌పై ఎలా అమర్చాలో ప్యాడ్‌పై ఉన్న సూచనలు పాటించాలి. 4 నెలల వయసు వచ్చే వరకు బేబీ ఎక్కువగా కదలదు. అయితే ఆ సమయంలో మీ బేబీకి ఎలా రోల్ కావాలో తెలుస్తుంది. మొదటి నుంచీ భద్రతను పాటించడం వల్ల మీ శిశువు కదిలే నాటికి అది అలవాటుగా మారి సేఫ్‌గా ఉంటుంది.
    • డైపర్లు క్లాత్​వి అయినా డిస్పోజల్ అయినా, సరైన సైజ్​లో ఉండేలా చూసుకోండి.
    • శిశువును తుడిచేందుకు ఉపయోగించేవి: డైపర్ వేసిన ఏరియాలో తుడిచేందుకు (క్లీన్ చేసేందుకు) ఎక్కువ మంది వైప్స్ ఉపయోగిస్తారు. కానీ అప్పుడే పుట్టిన బేబీ చర్మం సెన్సిటివ్​గా ఉంటుంది. డైపర్ వేసిన ఏరియాను క్లీన్ చేసేందుకు తొలి వారాల్లో గోరు వెచ్చని నీళ్లు మరియు గుడ్డ, లేదా కాటన్ బాల్స్ వాడాలని చాలా మంది పిల్లల వైద్య నిపుణులు సూచిస్తారు. (కేవలం నీటి తేమను మాత్రమే కలిగి ఉండే వైప్స్ మరొక ఎంపిక). సాంప్రదాయ బేబీ వైప్స్, ముఖ్యంగా ఆల్కహాల్​ను కలిగి ఉన్నవి పిల్లలకు 2 నెలల వయసు వచ్చే వరకు దద్దుర్లు, స్కిన్ ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి.
    • డైపర్ క్రీమ్ లేదా ఆయింట్​మెంట్​ (అవసరమైతే)
    • "అత్యవసర" సరఫరా: ఒకవేళ నీళ్లలా విరేచనమై డైపర్ నుంచి లీకైతే మీ బేబీ బట్టలను చేంజ్ చేసేందుకు చేతిలో బ్యాగ్ ఉండడం సహాయకారిగా ఉంటుంది.

    డిస్పోజల్ డైపర్ మార్చడం: స్టెప్ బై స్టెప్ ఇలా..! (Step By Step Procedure )

    1. మీ చేతులను శుభ్రం చేసుకొని.. మీకు కావాల్సిన వస్తువులన్నీ మీకు అందేలా ఉంచుకోండి.

    2. మీ బిడ్డను బోర్లా(తలకిందులుగా) పడుకోపెట్టండి.

    3. డైపర్ ట్యాబ్స్ విప్పండి. మీ శిశువు చీలమండలను పట్టుకుని నెమ్మదిగా పైకి లేపండి. ఇప్పుడు డైపర్ దిగువ భాగాన్ని పైకి లేపండి. డైపర్​లో కనుక చాలా మలం ఉన్నట్లయితే డైపర్ ఎగువ భాగాన్ని ఉపయోగించి కింది భాగాన్ని తుడవొచ్చు.

    4. డైపర్​ను శిశువు నుంచి వేరు చేయండి. శిశువుకు అందకుండా అక్కడే పెట్టండి.

    5. శిశువును శుభ్రంగా తుడవండి. ఒకవేళ బాలిక అయితే, తుడిచేటపుడు ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ప్రతిసారి ముందు నుంచి వెనకకు తుడవండి. శిశువుకు దద్దుర్లు రాకుండా ఉండేందుకు పరిశుభ్రంగా తుడవండి.

    6. డిస్పోజబుల్ క్లీనింగ్ సామగ్రిని పాడైన డైపర్ మీద ఉంచండి.

    7. మీ శిశువు దిగువ భాగంలో శుభ్రమైన డైపర్​ను స్లైడ్ చేయండి. ట్యాబ్​లను బేబీకి దిగువన ఉండేలా చూసుకోవాలి. ఈ రోజుల్లో చాలా డైపర్​లు ముందు భాగంలో రంగు రంగుల గుర్తులను కలిగి ఉంటున్నాయి.

    8. కొత్త డైపర్ వేస్తూ దానిని క్లోజ్ చేసే ముందు దద్దుర్ల నివారణ కోసం మీ వైద్యుడు సూచించిన క్రీమ్స్ లేదా ఆయింట్​మెంట్స్ పూయండి. ఇలా చేస్తే క్రీమ్ రాయడం వలన అవి కిందపడకుండా ఉంటాయి. లేదంటే అది కొన్ని సార్లు కష్టంగా అనిపించొచ్చు.

    9. పిల్లవాడి బొడ్డుపై ఉన్న భాగాన్ని పైకి లాగడం ద్వారా అతడికి కొత్త డైపర్ వేయడం పూర్తి చేయండి. ట్యాబ్​లను తెరిచి చుట్టూ బిగించండి. మీరు కట్​ చేసే న్యూ బార్న్ డైపర్లను ఉపయోగించకపోతే.. బొడ్డు తాడు పడిపోయే వరకు డైపర్​ను కిందికి మడవండి. ఇలా చేయడం ద్వారా చికాకుకు తగ్గించొచ్చు.

    10. ఉపయోగించిన డైపర్​ను రోల్ చేసి దాని చుట్టూ ట్యాబ్​లను చుట్టండి. ఆ డైపర్​ను బ్యాగ్​లో కానీ, బిన్​లో కానీ, చెత్తడబ్బాలో కానీ వేయండి.

    11. మీ చేతులు, మీ శిశువు చేతులను శుభ్రం చేయండి. అంతే కాకుండా మీరు డైపర్ చేంజ్ చేసిన ప్రదేశాన్ని కూడా క్లీన్ చేయండి. మీ శిశువు జబ్బుతో ఉన్నపుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాలుష్యాన్ని నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.

    బేబీ డైపర్ చేంజ్ చేసేందుకు టిప్స్ (Tips to change baby disposable diapers)

    మీకూ, మీ బిడ్డకు ఇదంతా తొందర్లోనే అలవాటైపోతుంది. కానీ ఈ కింది టిప్స్ మీకు ఎంతో సహాయకారిగా ఉంటాయి.

    • మీ శిశువు బొడ్డు తాడు గురించి వైద్యుడి సలహాలు పాటించండి.
    • డైపర్ చాలా బిగుతుగా ఉండకుండా జాగ్రత్త వహించండి. లీక్ కాకుండా నివారించాలని మీరు అనుకుంటున్నప్పటికీ.. డైపర్ బిగుతుగా వేయడం వలన మీ శిశువు కడుపుపై ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పుడు అతడు ఉమ్మివేయడం చేయవచ్చు. పాలు తాగిన తర్వాత ఇలా జరగొచ్చు.
    • మీ బేబీకి కొన్ని రోజుల తర్వాత కూడా దద్దుర్లు తగ్గకపోతే... లేదా ఎరుపు రంగులో, పచ్చిగా కనిపిస్తే వెంటనే మీ శిశు వైద్యుడిని సంప్రదించండి.
    • కొత్త డైపర్ కోసం చూస్తున్నపుడు మీ బిడ్డ మీద ఒక చేతిని వేసి ఉంచడం మంచిది. ఇది హెల్ప్​ఫుల్​గా ఉంటుంది.
    • తినే చోట లేదా ఆహారం తయారు చేసే చోట ఎప్పుడూ మురికి డైపర్​ను మార్చొద్దు. లేదా వదిలేయొద్దు.

    ఉతకగలిగే క్లాత్ డైపర్స్​ను ఎలా మార్చాలి? (How to change reusable cloth diapers)

    తిరిగి ఉపయోగించగలిగే క్లాత్ డైపర్ చేంజ్: స్టెప్ బై స్టెప్: (Step by step procedure to change cloth diapers)

    మురికిగా మారిన డైపర్​ను మార్చాలని చాలా మందికి తెలుసు. కానీ కొంత మంది తల్లులు మూత్ర విసర్జన తర్వాత ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్​ను మార్చకుండా అలాగే ఉంటారు. ఇది చాలా తప్పు. శిశువుకు ఎటువంటి చర్మ సమస్యలు దద్దుర్లు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ పొడిగా ఉంచడం చాలా అవసరం. ఫ్రీ సైజ్ రీయూజబుల్ డైపర్లు బేబీ ఒకసారి చేసిన మూత్రవిసర్జనను మాత్రమే పీల్చుకుంటాయి. కావున ప్రతి మూత్రవిసర్జన తర్వాత మార్చడం అవసరం. చిన్నపిల్లలతో పోల్చుకుంటే అప్పుడే పుట్టిన పిల్లలు చాలా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. కావున ప్రతి 2 గంటలకోసారి మీరు వారికి డైపర్లను చేంజ్ చేయాల్సి ఉంటుంది. డైపర్ ఎక్కువ తడిగా లేకపోతే మీరు దానిని 2 నుంచి 4 గంటల వరకు ఉంచొచ్చు. మీరు మీ బిడ్డకు రోజుకు సగటున 7 నుంచి 10 సార్లు డైపర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది.

    ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్ తడిగా ఉందని తెలుసుకోవడం ఎలా? (How to know that reusable cloth diaper is wet?)

    డిస్పోజల్ డైపర్ల లాగ ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్లు మార్చే సమయం ఆసన్నమైందని మీకు వివిధ సంకేతాలను అందజేయవు. డైపర్ తడిగా అయితే ఇవి కలర్ చేంజ్ కావు. లేదా డైపర్ మీద చిన్న రంగు మారే గీతను కూడా కలిగి ఉండవు. కానీ మీ బేబీ ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్ ఎప్పుడు చేంజ్ చేయాలో తెలుసుకునేందుకు కింది చిట్కాలు ఉపయోగపడతాయి.

    • ఫ్రీ సైజ్ క్లాత్ డైపర్స్ ఎక్కువగా తడిని పీల్చుకునే సోకర్స్​తో వస్తాయి. ఇవి సాధారణంగా 2-3 గంటల వరకు ఉంటాయి. కానీ క్లాత్ డైపర్ వేలాడుతున్నపుడు మీరు ఖచ్చితంగా మార్చాలి.
    • మీరు వాటర్​ప్రూఫ్ లైనింగ్​లను ఉపయోగించకపోతే డైపర్ తడిగా మారిందో లేదో తెలుసుకునేందుకు డైపర్​ను తాకి చూడాలి. అది తడిగా మారితే దానిని చేంజ్ చేయాలి.
    • క్లాత్ డైపర్లు కాటన్ లేదా సారూప్యంగా ఉండే ఇతర ఫ్యాబ్రిక్​తో తయారవుతాయి. ఇవి తడిగా ఉన్నపుడు గట్టిపడతాయి. జనపనార లేదా బాంబూ (వెదురు) ఇన్వర్టర్​లు ఒకదానికొకటి గుత్తిగా ఉంటే డైపర్ మార్చేందుకు సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి.
    • రీయూజబుల్ డైపర్స్ కాళ్ల చుట్టూ ఫిట్​గా ఉంటాయి. ఇవి వదులుగా ఉండవు. మలం జారిపోయేందుకు ఎటువంటి చాన్స్ ఇవ్వవు. డైపర్ తడిగా ఉందో లేదో చెక్ చేసేందుకు దానిని వేలితో పొడవడం కంటే వెనకాల నుంచి చూడడం మంచిది.

    డైపర్ చేంజ్ చేయడం ఎందుకు ముఖ్యం? (How it is important to change diaper)

    డైపర్ తరచుగా చేంజ్ చేయడాన్ని మీరు ఇష్టపడకపోవచ్చు. కానీ దద్దుర్లు, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు డైపర్ చేంజ్ చాలా ముఖ్యమైనది.

    చివరగా

    పిల్లలకు తరచూ డైపర్లు వేయడం తగ్గించండి. పాత డైపర్ మార్చి కొత్త డైపర్ వేసే మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వండి. పిల్లల స్కిన్ రిలాక్స్ అయ్యేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది.

    మయిలో ఎసెన్షియల్ ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్స్ చాలా బాగుంటాయి. ఇవి అన్ని పదార్థాలను ఇట్టే పీల్చుకుంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. మీ శిశువు ఇంటిలో సౌఖ్యంగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. ఇవి అడ్జస్ట్ చేసుకునేందుకు తగినవి. స్కిన్ –ఫ్రెండ్లీ, మరియు సులభంగా వాష్ చేయొచ్చు. మీకు ప్రింట్ చేసిన సాలిడ్ కలర్ ఆప్షన్ల ఉన్నవి కూడా దొరుకుతాయి. ఇంతకంటే ఏం అడగగలరు? ఇప్పుడే మయిలో స్టోర్​ని అన్వేషించండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.