hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Baby Care arrow
  • కవాసాకి వ్యాధి (ధమనుల వాపు): అంటే ఏమిటి, దాని లక్షణాలు, చికిత్స arrow

In this Article

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు): అంటే ఏమిటి, దాని లక్షణాలు, చికిత్స

    Baby Care

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు): అంటే ఏమిటి, దాని లక్షణాలు, చికిత్స

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    పిల్లలు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. వారు తరచూ చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొంత మంది పిల్లల్లో కొన్ని రకాలైన జన్యుపరమైన వ్యాధులు కూడా సాధారణమే. అలాంటి ఒక వ్యాధే కవాసాకి వ్యాధి (ధమనుల వాపు). ఈ వ్యాధి వల్ల చిన్న పిల్లల ధమనుల్లో వాపు వస్తుంది. ఇటువంటపుడు వారు జ్వరం మరియు కవాసాకి దద్దుర్లతో బాధపడతారు. ఈ వ్యాధి వస్తే ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా ఏర్పడేదే. కొన్ని రోజులు వైద్య పర్యవేక్షణలో ఉంటే తగ్గిపోతుంది.

    అసలు కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) అంటే ఏమిటి?

    ఒకవేళ కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) నిర్దారణ అయి పిల్లలు బాధపడుతుంటే.. ఆ వ్యాధిబారి నుంచి పిల్లల్ని త్వరగా బయటపడేసేందుకు అసలు కవాసాకి వ్యాధి(ధమనుల వాపు) అంటే ఏమిటో ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వైద్య పరిభాషలో కవాసాకి వ్యాధి లేదా కవాసాకి సిండ్రోమ్​ను మ్యూకోక్యుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్​ అని పిలుస్తారు. ఇది పిల్లల్లో ఉండే చిన్న మరియు మీడియం సైజు ఉండే రక్తనాళాల్లో వాపును కలుగజేస్తుంది.

    అంతే కాక ఇది కరోనరీ ధమనుల్లో మంటకు కారణం అవుతుంది. గుండెకు ఆక్సిజన్​తో నిండిన రక్తాన్ని ధమనులు తీసుకెళ్తాయి. ఇది గ్రంథులు మరియు శ్లేష్మపొరల్లో కూడా వాపుకు దారి తీస్తుంది.

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) లక్షణాలు ఏమిటి

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) లక్షణాలు కొన్ని ఇలా ఉన్నాయి -

    • 102.2ఫారన్​హీట్ లేదా 39 సెల్సియస్ కంటే ఎక్కువ జ్వరం
    • కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) పిల్లల చర్మంపై దద్దుర్లు పుట్టిస్తుంది
    • లింఫ్​నోడ్ వాపు (శోషరస గ్రంథి వద్ద ఉండే నోడ్)
    • ఎరుపుగా మారిన కళ్లు లేదా కండ్లకలక ఇంజెక్షన్
    • పగిలిపోయిన లేదా ఎండిపోయి తెల్లగా మారిన పెదాలు మరియు చాలా ఎర్రగా ఉండే నాలుక. లేదా కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) నాలుక
    • చేతులు మరియు కాళ్లలో వాపు.. చివరికి అవి ఎరుపు రంగులోకి మారతాయి.
    • పొత్తికడుపులో నొప్పి
    • అతిసారం (విరోచనాలు)
    • నిద్ర వచ్చినట్లు అనిపించడం మరియు వాంతులు
    • కాళ్ల నొప్పులు
    • జాండిస్ (కామెర్లు)
    • చేతులు మరియు కాళ్ల ప్రాంతంలో చర్మం మీది పొర ఊడిపోవడం

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వచ్చేందుకు కారణాలు ఏమిటి

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వచ్చేందుకు నిర్ధిష్ట కారణాలేంటో ఇంకా ఎవరికీ సరైన అవగాహన లేదు. అయితే కొన్ని కారకాలు ఈ వ్యాధి రావడానికి కారణమని భావిస్తారు. ఈ కింది కొన్ని కారణాల వల్ల కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వస్తుంది.

    Article continues below advertisment

    1. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్​

    దద్దుర్ల వలన ఏర్పడే కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వంటి కొన్ని కవాసాకి లక్షణాలు వైరస్​లు లేదా బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను పోలి ఉంటాయి. అయితే వైరస్ లేదా బ్యాక్టీరియా దీనికి కారణమా? కాదా? అనేది ఇంకా నిర్దారించబడలేదు.

    2. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ (రోగనిరోధక వ్యవస్థలో లోపం)

    ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా కవాసాకి వ్యాధి (ధమనుల వాపు)కి కారణం కావొచ్చు. ఈ స్థితిలో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ పాతోజెన్ (వ్యాధి కారకం)గా మారుతుంది. మరియు ఆరోగ్యకరమైన కణజాలాల మీద దాడి చేసి ఈ వ్యాధికి కారణం అవుతుంది.

    3. జన్యువులు

    Article continues below advertisment

    ఎవరైతే తల్లిదండ్రులకు కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) ఉంటుందో వారి పిల్లలకు కూడా ఈ వ్యాధి జన్యువుల ద్వారా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది.

    కవాసాకి వ్యాధిని (ధమనుల వాపు) నిర్దారించడం ఎలా

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) నిర్దారణ అనేది పిల్లలలో కనిపించే కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. గుండె మరియు రక్తం పనితీరును గమనించేందుకు కొన్ని సాధారణ టెస్టులు చేస్తారు. అవి

    • మూత్ర పరీక్ష – ఏవైనా ఇతర వ్యాధుల వల్ల లక్షణాలు ఉన్నాయేమోనని తనిఖీ చేసేందుకు..
    • ప్లేట్​లెట్ కౌంట్ టెస్ట్ – కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వస్తే ప్లేట్​లెట్స్ (రక్తఫలకికలు) సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
    • ఎరిథ్రోసైట్ సెడిమినేషన్ రేట్ టెస్ట్ – శరీరంలో మంటను కలిగించే పరిస్థితిని గురించి ఈ పరీక్ష తనిఖీ చేస్తుంది.
    • సోడియం టెస్ట్ – పిల్లలకు ఒక వేళ కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వస్తే వారి శరీరంలో సోడియం స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి.
    • CRP టెస్ట్ – మంటకు కారణమయ్యే కారకాలు మన శరీరంలో ఏవైనా ఉన్నాయా అని ఈ పరీక్ష చేస్తారు.
    • ఆల్బుమిన్ పరీక్ష – పిల్లల రక్తంలో తక్కువ స్థాయిలో ఆల్బూమిన్ ఉంటే వారిలో కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) ఉన్నట్లు అర్థం. గుండె ఆరోగ్యాన్ని తనిఖీ చేసేందుకు చేసే పరీక్షలు ఈ కింది విధంగా ఉన్నాయి.
    • ECG పరీక్ష- గుండె సరిగ్గా కొట్టుకుంటుందో లేదో తనిఖీ చేసేందుకు మరియు అన్నీ సరిగ్గా ఉన్నాయో చూసేందుకు ఈ పరీక్ష చేయబడుతుంది. చర్మానికి ఎలక్ట్రోడ్లు అతికించబడతాయి. మరియు గుండె ఆరోగ్యాన్ని తనిఖీ చేసేందుకు గుండె ఎలా కొట్టుకుంటుందో గమనిస్తారు.
    • ఎకోకార్డియోగ్రాఫ్ – ఇది ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష. ధ్వని తరంగాలను ఉపయోగించి గుండె పంపింగ్ విధానం ఎలా ఉందో తనిఖీ చేస్తారు.

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు)కి చికిత్స ఏమిటి

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు)కి నోటి ద్వారా తీసుకునే కొన్ని మందులను ఉపయోగించి చికిత్స చేస్తారు. అవి-

    • ఆస్ప్రిన్
    • ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్
    • కార్టికోస్టెరాయిడ్స్ మరియు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఇన్​హిబిటర్స్
    • ప్రతిస్కందకాలు (రక్తం గడ్డకట్టే ప్రక్రియలో అంతరాయం కలిగిస్తాయి)

    ఒక వేళ ఈ మందులు ఎటువంటి ప్రభావం చూపకపోతే.. మూసుకుపోయిన ధమనిని తెరిచేందుకు కరోనరీ ఆర్టరీ ఆంజియోప్లాస్టీ అని పిలువబడే శస్త్రచికిత్సను చేస్తారు. అంతే కాకుండా భవిష్యత్​లో మళ్లీ ధమని గోడ మూసుకుపోకుండా ఉండేందుకు ఒక స్టెంట్ కూడా ఉంచబడుతుంది.

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వల్ల వచ్చే సమస్యలు

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు)కి సరైన విధంగా చికిత్స చేయకపోతే అది అనూరిజం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అంతే కాకుండా ఇది పిల్లలలో గుండెపోటు లేదా అంతర్ఘత రక్తస్రావం వంటి ప్రమాదాలను పెంచుతుంది. దీని వల్ల వచ్చే ఇతర సమస్యలు

    Article continues below advertisment

    • మయొకార్డిటిస్
    • పెరికార్డిటిస్
    • గుండె కండరాలు మరియు గుండె కవాటాలు సరిగ్గా పని చేయకపోవడం
    • గుండె కొట్టుకోవడం ఆగిపోవుట

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) ఎవరికి సోకుతుంది

    కవాసాకి సిండ్రోమ్ లేదా కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. అబ్బాయిలకు ఈ వ్యాధి నిర్దారణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆసియన్ లేదా పసిఫిక్ ప్రాంతాలకు చెందిన వారి పిల్లలకు కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    ఎప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లాలి

    కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) లక్షణాలు ఏవైనా సరే వారి పిల్లలలో కనిపించిన వెంటనే తల్లిదండ్రులు సాధారణ వైద్యుడు లేదా GP (జనరల్ ప్రాక్టీషనర్​)ని కలవాలి. పిల్లల్లో జ్వరం తగ్గకుండా అలాగే ఉంటే మరియు పిల్లల చర్మంపై ఎర్రటి దద్దుర్లను తల్లిదండ్రులు గమనిస్తే ఇక ఏ మాత్రం సమయం వృథా చేయకుండా వైద్యుడిని కలవాలి. పిల్లలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించేందుకు కవాసాకి వ్యాధికి (ధమనుల వాపు) వెంటనే చికిత్స చేయాలి. సరైన చికిత్స పొందిన పిల్లలు ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటారు. కాబట్టి కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) దాని లక్షణాలకు సంబంధించిన ఈ విషయాల గురించి తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరియు పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా లక్షణాలు వారి పిల్లలలో కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.